రాజా శ్రీ కంచుమర్తి వెంకట సీత రామచంద్ర రావు ( ధర్మవరం జమిందారు )
STANDING : KANCHUMARTHY VENKATA SEETHARAMA CHANDRAYYA |
రాజమహేంద్రవంలో అతి ప్రాచీనమైన యుద్ధ నేపథ్యంగల దాదాపు 30 కుటుంబాలు మెరక వీధిలో నివసిస్తుండేవాడు వీరు తొలినాళ్లలో చంద్రగిరి బలిజలుగా తరువాత మెరక వీధి నివసిస్తున్నందున తెలగాలుగా పిలువబడ్డారు. ఈ కుటుంబాలు రాయల సామంతులుగా , సర్వసైనాధ్యక్షులుగా పనులు చేపట్టారు.ఐతే చంద్రగిరిలో సంపూర్ణ పతనానంతరం ఈ కుటుంబాలు వివిధ ప్రాంతాల్లో స్ధిరపడ్డారు , కొన్ని కుటుంబాలు మరాఠా సైన్యంలో చేరి దాదాపు 100 సంవత్సరాల పాటు సైనిక పదవులు చేపట్టినట్టు చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి.మరాఠా సైన్యము నుండి బయటకు వచ్చి 1757 లో రాజమహేంద్రవరం చేరి అప్పటి రాజమహేంద్రవరం నవాబు కోట ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకున్నారు అవే ఈరోజు మెయిన్ రోడ్ , మెరక వీధి , కంచుమర్తి వీధి , కే వి ర్ స్వామి వీధి మరెన్నో..మొదలైనవి.వీరికి ఆ స్ధలాలు ఫ్రెంచివారు ఇచ్చినట్టు , తరువాత బ్రిటీషువారు రాజముండ్రికి నవాబును నియమించినప్పుడు ఆ నవాబు ఇచ్చినట్టు చెబుతారు.ఆయా కుటుంబాలవారు రాజముండ్రి నవాబు సైన్యంలో హజారీదారులుగా , ముఖ్యమైన పదవులు చేపట్టి ఎంతో కీర్తివంతులైనారు , వీరు చేసిన యుద్ధాల గురించి , దానధర్మాల గురించి , సిరి సంపదల గురించి ఎందరో కవులు కవితల రూపంలో వ్రాసారు.
1766లో బ్రిటిషు వారు తిరిగి ఉత్తర సర్కారులు హస్తగతం చేసుకొన్న సిదప, రాజమండ్రి నవాబు హస్సేన్ ఆలీ భేగ్ సైన్యం నుండి ప్రాబల్యం కలిగి, యుద్ధం. నేపథ్యం కలిగిన కుటుంబాల నుండి వచ్చిన వారిని సర్కారు రెజిమెంట్గా నియమించారు. నాటి నుండి ఈ మెరక వీధి తెలగ కుటుంబాలు బ్రిటీష సైన్యంలో సేవలందిస్తూ నేటివ్ ఆర్మిలో అత్యున్నతమైన పదవులు అధిష్టించి వారి పూర్వ వైభవాన్ని చాటుకున్నారు.ఈ మెరకవధి తెలగ కుటుంబాలు స్వాతంత్య్రం వచ్చేవరకూ వారిలో వారు మినహాయించి కుటుంబాల వేరే కుటుంబాలతో సంబంధాలు అందుకోలేదు.గురించి ప్రస్తావించారు. వీరు వంశపారంపర్యంగా ఉండిన ఖడ్గంను ప్రతి దసరానాడు పూజిస్తారు. రాజమహేంద్రవరంలో రెండు శతాబ్దాలు వారి ప్రాబల్యాన్ని, రాజకీయంగా, ఆర్ధిరంగా అన్ని విధాలా శాశించినట్లు ఎందరో చరిత్రకారులు రచించారు. మరియు రావు బహద్దూరు కందుకూరి వీరేశలింగం పంతులుగారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, టంగుటారి విరేశలింగం గారు తదితరుల జీవిత బయోగ్రఫీలో కూడా ఈ కుటుంబాల గురించి ప్రస్తావించారు.గృహాలష్మి , ప్రబుద్ధం, సవారి వారి చరిత్ర లాంటి 1950 నాటి పత్రికల్లో , పుస్తకాలలో కూడా వారి గురించి వ్రాయబడింది. గెజిటీలో కూడా వారి గురించి చదరవచ్చు.అంతటి ప్రాభల్యం కుటుంబాలో కొందరు జమిందారులుగా కూడా ఎదిగారు. అందులో ఒకరు కంచుమర్తివారు. కంచుమర్తి నరసయ్య ధర్మవరం జమిందారు. కంచుమర్తి సుబ్బయ్య గారు కాలవాల పల్లి జమిందారు. కంచుమర్తి నరసియ్యగారు 1870లలోనే గోదావరి డిస్ట్రిక్ట్ ఎండ్ కెషన్ కోర్టులో చిత్రపు కామరాజు, సరిపల్లి సత్తెన, అదుర్తి బుచ్చి వెంకప్ప కంచుకొలను లక్ష్మినారాయణ గార్లతో కలిసి లాయర్గా పని చేసారు. ఆయనకి చాలా కాలం పిల్లలు లేనందున ఆయన భార్య తమ్ముడిని దత్తతకు తీసుకున్నారు. ఆయనే తరువాత రాజమహేంద్రము. గర్వించదగ్గ ధర్మాత్ముడిగా ఎదిగిన కంచుమర్తి రామచంద్ర రావు గారు.
రామచంద్రరావుగారి తల్లి తండ్రి ఆ శ్రీ సర్దార్ బహద్దూర్ కందుల అప్పయ్యగారు, సుబేదారు మేజర్ (అత్యున్నత నీటివ్ ఆర్మీ స్థాయి) O B I(ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా) మరియు మేనమామ శ్రీ సుబేదారు మేజర్ కందుల భద్రస్వామిగారు. ఆయన మేనమామ కందుల బయ్యపునీడి వెంకున్న గారు కూడా సుబేదారుగా పని చేసారు. అటువంటి సీతారామచంద్రరావు గారు అక్కకి, అక్క భర్తకి దత్తతగా వెళ్లారు.రాజా కంచుమర్తి నరసయ్య నాయుడు గారు 1878లో కన్ను మూసారు. 1890లో జన్మించిన రామచంద్రరావు గారికి అప్పటికి సరిగ్గా 8 సంవత్సరాలు. ఆరోగ్యం క్షీణిస్తుంది అని తెలిసిన నరసయ్య నాయుడు గారు,ఆయన మేనత్త కొడుకు, తన చిరకాల స్నేహితుడు అయిన రాజా ఓగేటి రామకృష్ణయ్య గారు, జమిందారీ ల్యాండ్ హోల్డర్ , 1978 నాటికి గోదావరి జిల్లాలో అతి ఎక్కువ రాయత్వారి భూమి కలిగిన సుప్రసిధ భూస్వామి, 37 సంవత్సరాలు రాజమండ్రి మునిసిపల్ కౌన్సిలర్ గా, మరియు ఒక సంవత్సరాలు హానరరీ మెజిస్ట్రేటుగా వ్యవహరించి, వేల ఎకరాల భూమి, 16 వ్యాపారాలు కలిగిన శ్రీమంతుడుకు రామచంద్రరావు గారి బాధ్యత మరియు ఎస్టేట్ భాధ్యతను అప్పగించారు. మిత్రుడు నరసయ్య గారి పై ఉన్న ఇష్టంతో రామకృష్ణయ్యగారు కూడా ఆ బాధ్యతను స్వీకరించి 12 సంవత్సరాలు ఎస్టేటను మరియు రామచంద్రరావు గారిని జాగ్రత్తగా చూసుకున్నారు.
రామచంద్రరావు గారు పిన్న వయస్సు నుండి మేనమామ దగ్గర పెరుగుతూ ఎన్నో వ్యాపార రంగ క్షేత్రాలు స్థాపించాలి అని కోరికలో ఉండే వారు. 1890లో మేనమామ మీద ఉన్న ప్రేమతో రామకృష్ణయ్యగారి ఇంటి హవేలి వద్దనే రామచంద్రరావు గారు ఒక హవేలీ నిర్మించుకుని నివసించేవారు. అయిదు పర్యాయాలు రాజమండ్రి మునిసిపల్ కౌన్సిలర్, రాజమండ్రి తాలుకా బోర్డు మెంబరుగా పనిచేస్తూ, జిల్లాబోర్డు మెంబరుగా ప్రజలకు ఎంతో సహాయం చేస్తూ ఉండేవారు.రాజమండ్రిలో శ్రీ రామచంద్ర రైస్ మిల్ -శ్రీ సత్యనారాయణ రైస్ మిల్, శ్రీ వేణుగోపాల రైస్ మిల్, ద్వారపూడిలో సీతారామచంద్ర రైస్ మిల్, పెనుగొండలో పార్థసారధి రైస్ మిల్, కౌలవరంలో ఆంధ్రలక్ష్మి రైస్మెల్ మరియు ఇంకెన్నో వ్యాపార క్షేత్రాలు స్థాపించారు. కాలవరం ఆంధ్రలక్ష్మీ రైస్ మిల్ వ్యవస్థాపన రోజు Nr.H.E Scott, అప్పటి జిల్లా కలెక్టర్ రామచంద్రరావు గారికి ఒక బంగారు పథకాన్ని అందజేస్తారు.
కోరుకొండ దేవస్థానం ట్రస్టుగా , 1911 కరొనేషన్ సెలబ్రేషన్ కొమిటీ రాజమండ్రి జాయింట్ సెక్రటరీగా మరియు 1915 నుండి 1983 వరకూ రాజమండ్రి మరియు కొంతకాలం కాకినాడ హోరోనరీ మేజిస్ట్రేటుగా సేవలందించారు.
కంచుమర్తి రామచంద్రరావు గారికి నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు.
కుమారులు :- కంచుమర్తి పార్థసారధి , కంచుమర్తి కేశవ , కంచుమర్తి వాబి
కుమార్తెలలో పెద్దామె బాబాయమ్మ గారు. అవిడ రాజమహేంద్రవరంలోనే మిర్టిక్యూలేషన్ పూర్తి చేసిన తొలి మహిళ. మద్రాసు ప్రెసిడెన్సీలో తొలి మహిళా మునిసిపల్ కౌన్సిలర్. కానీ అతి పిన్న వయస్సులోనే 1921లో మరణించారు. అవిడ జ్ఞాప్రకార్ధం రాజమండ్రిలో ఒక భవంతిని కూడా నిర్మించారు.
విద్యాభిమాని సంఘాన్ని స్థాపించి ఎందరికో విద్యాసహాయం చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఎన్నో సార్లు ధన సహాయం చేసి ఆయన బారిష్టరు చదువుకి కూడు డబ్బు అప్పగా ఇచ్చారు. ప్రకాశం గారు చెన్నయిలో 2.5 ఎకరాలలో ఇల్లు కట్టుకోడానికి కూడా 6,000 రూపాయలు ఇచ్చారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారికి కూడా అనేక సందర్భాలలో తోడుగా ఉన్నారు. విరేశలింగం గారు కట్టించే స్కూలులో కూడా రామచంద్రరావు గారికి భాగస్వామ్యం ఉంది. తరువాత ఎనో కారణాల చేత భయటకి వచ్చేసారు. అయినా విరేశలింగం గారు స్థాపించిన రాజమండ్రి టవును హాలు తొలి ట్రస్ట్ బోర్డులో రాజాశ్రీ కంచుమర్తి రామచంద్రరావు కారి పేరును కూడా చేర్చారు.
దివాన్ బహద్దుర్ చిత్రపు వెంకటాచలం గారితో కలిసి రాజమండ్రి, కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ స్థాపించారు. 9-12-99 న ఆ బ్యాంకును రిజిస్టర్ చేయించారు. గౌతమ గ్రంథాలయానికి 6,000/- ధానం చేసి ఒక స్థలం. కూడా. ఇచ్చారు. బిపిన్ చంద్రపాల్ 1907 లో రాజమండ్రి వచ్చినప్పుడు శ్రీ రామచంద్రరావు గారు వారికి సభ ఏర్పాటుకు ధనకు ఏ సహాయం చేసారు. దేశ స్వాతంత్య్ర సంగారం సభల్లో కూడా ఎంతో బాకచక్యంగా పాల్గొనేవారు. ఆనాటి గవర్నర్ గారి తల్లి పేరు మీద సంవత్సరానికి కొంత డబ్బు వచ్చే భూమి ధానం చేసారు. మహాభారత, భాగవతాలపై స్పష్టమైన అవగాహన ఉండేది. దానికి బహుమతులు కూడా గెలుచుకున్నారు. అనేక సందర్భాలలో ఔన్నత్యం చాటుకుని, తండ్రి, మానుల పేరు కుటుంబ పరువు మానవత్వ విలువలు నిలబెట్టిన శ్రీ రాజ కంచుమర్తి రామచంద్రరావు గారు ఎవరికీ తెలియక పోవడం, పైగా తెలిసినా జమిందారుగా, ప్రకాశంగారికి ధన సహాయం చేసిన వారిగా మాత్రమే తెలియడం శోచనీయం
పత్రికలు, సన్మానాలు, సభలు, జనానికి మేలు తప్ప కీడు చేయని కంచుమర్తి రామచంద్రరావుగారు 1934 లో మరణించారు.ఆయన ఇంటిలో భాగాన్ని స్కూలుకి ఇచ్చారు. దానిని ప్రకాశం పంతులుగారు. మెడు ప్రెసిడెన్సీ చీఫ్ మినిస్టరుగా అవుట్లో (టైమ్ మినిస్టర్) ఉన్న రోజుల్లో వచ్చి శ్రీ సీతారామచంద్రరావు హైస్కూలుని ప్రారంభించారు.
ఆయన జీవితం కొన్ని కాగితాలలో రచించగలిగేది కాదు. ఆ అందుకే ఆయన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను జీవిత చరిత్రలా రూపొందిస్తున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ.
భవధాయుడు
శ్రీ ఓగేటి వెంకట రామ రషి
9573149759.
రాజమండ్రి.