Fill the form, we are preserving balija surnames and their history.

చౌదరి అంటే ఎవరు ?

 చౌదరి అంటే ఏంటి ?

చౌత్ అనగా భూమి పై పన్ను రూపంలో ఇంత పన్ను వస్తుంది అని లెక్కించబడినదానిలో నాలుగవంతు పన్ను (The Asiatic Annual Register, Volume 5, page 48, 1804 AD, upsc civil services exams, advanced general studies, page 3,2008) ఆ పన్నులను వసూలు చేసుకొని నాలుగవవంతు ప్రభుత్వానికి చెల్లించుకొను అధికారిని చౌదరి అంటారు.యీ పదవి మహమ్మదీయుల పరిపాలనాకాలంలో భారతదేశము, పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్ వంటి చోట్ల వ్యాప్తి చెందినది. ఆ కాలంలో పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాలను సుభాలని, సర్కారులని, జిల్లాలని, జమీందారీలని, తాలూకాలనీ, సముతులనీ అనేక విభాగాలుగా విభజించి పరిపాలించేవారు. సుభా పాలకుణ్ణి సుబేదారు అనీ, జిల్లా పాలకుణ్ణి జిల్లాదారు అనీ, జమీందారీ పాలకుణ్ణి జమీందారు అనీ, తాలూకా పాలకుణ్ణి తాలూకాదారు అనీ, సముతు పాలకుణ్ణి సమత్ దారు అనీ పిలిచేవారు. అయా విభాగాలలో పన్నులను వసూలు చేసుకొనుటకు చౌదరి అనే అధికారిని కూడా నియమించేవారు. యీ చౌదరి పదవిలోనున్న వ్యక్తి హిందువు లేదా ముస్లీం లేదా మరేయితర మతస్తుడైన కావచ్చు.

 యీ పదవి భారతదేశములో మహమ్మదీయ పాలకులద్వారా క్రీ.శ 10వ శతాబ్దమునాటికే ప్రవేశ పెట్టబడినట్టు ఆధారాలు కనిపిస్తున్నవి. క్రీ॥శ॥ 1136 నాటి “వీర బలిజ సమయమువారి” కొల్హపూరు దాన శాసనమున (ఎపిగ్రాఫియా ఇండికా 19, పేజి 30 - 35) చౌదరి బొప్పసెట్టి గారిని గొరివిసెట్టి గారని పేర్కొనబడెను. (యీ శాసనములో చౌదొరె అని లిఖించబడినది) అనగా నాటికే బలిజ వంశజులు చౌదరులుగా వ్యవహారాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. క్రీ.శ 1245 నాటి “వీర బలిజ సమయము” వారి దాన శాసనమును (ఎపిగ్రాఫియా కర్నాటిక 8, పేజి 44, 88-89) చౌదరి పదము గలదు (యీ శాసనమున సౌదరె అని లిఖించబడినది) ఢిల్లీ నుండి పరిపాలన చేసిన మొగలు చక్రవర్తులు కాలంలో చౌదరి అనగా వ్యాపార సమయాల పెద్ద అని అర్ధము ఉన్నట్లు తెలుస్తుంది. ("chowdary - head man of trades or professions" = parlimentary papers, house of commons and command, vol 18, page 5, 1859AD, selections from the records of the government of the punjab and its dependencies, vol 7, 1870 AD) నేటి కర్నాటక మహారాష్ట్ర ప్రాంతాలలోని (బ్రిటీషు పాలనాకాలంలో బొంబే ప్రెసిడెన్సీలో భాగము) వీర శైవ లింగాయత మతములోనున్న బలిజవారి కుల పంచాయతీ పెద్దలను సెట్టి అంటారని, వీరిని తమ లింగ బలిజ కులజులైన బెడనూరు రాజులు నియమించేవారని (కర్నాటకలోని పశ్చిమ తీరమునగల కేలడి, ఇక్కెర, బెడనూరు పట్టణాలను కేంద్రాలుగా చేసుకొని కేలడి రాజ్యాన్ని 300 సంవత్సరాలు పరిపాలించిన రాజవంశీయులు) bombay judicial section, page 280, 1820AD నందు వివరింపబడెను. మరియు దీనిలోనే పేజి. 276 నందు యీ బలిజవారి కుల పెద్దలను సెట్టి అని చౌదరి అని అంటారని వివరించడం జరిగింది.

క్రీ.శ. 1578లో గోలుకొండ సుల్తాను ఇబ్రహీం కులీ కుతుబ్షా తన రాజ్యాన్ని విస్తరిస్తూ విజయనగర మహాసామ్రాజ్యములోని భాగమైన కొండవీడు రాజ్యాన్ని (ప్రస్తుత గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతాలు) జయించి ఆ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసము 14 సముతులుగా (సమితి అనగా నేటి మండలం స్థాయి ప్రాంతంగా చెప్పుకోవచ్చు) విభజించి అసముతులకు చౌదరి, దేశముఖ్, దేశపాండ్యా వంటి 12 రకాలు అధికారులను నియమించడం జరిగింది. అసముతులలో 44 గ్రామాలతో యేర్పడిన కూచిపూడి సముతుకి బలిజవంశీయులగు అంబటివారిని చౌదరులుగా నియమించినట్టు కూచిపూడి కైఫియతులో వివరించడం జరిగినది. (గుంటూరు జిల్లా కైఫియతులు, కూచిపూడి కైఫియత, బ్రౌను లోకలు రికార్డులు మద్రాసు, M, 313, L.R. VOL 5 Pages 409412)

ఒరిస్సాలోని కటకమునుండి పరిపాలించిన గజపతులు పరిపాలనలో చౌదరి, పాత్రుడు బిరుదులు ధరించిన బలిజవంశాలవారు చాలామంది గలరు.ఈ గజపతుల పరిపాలనలోగల రాజమహేంద్రవరం రాజ్యమును (ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా ప్రాంతము) స్వాధీన పరచుకోవడానికి గోలుకొండ సుల్తాను ఇబ్రహిం కులీ కుతుబ్షా” తెలగ సర్దారులగు జూపల్లె సామంతరావు, కఠారి వీరమరావు, ముత్యాల యెల్లప్ప ఆశ్వారావు, సెట్టిపల్లె బల్లేరావు, మేదరమెట్ట గోపాలనీడు, భల్లమ చిన్నారావు, వల్లంకి రామారావులను, తురక సర్దారులగు సయ్యద్ బడేఖాన్ హవాల్దార్ సవారానే, సలాబట ఖాన్ హవాల్దార్ తోపుఖానే, సయ్యదు మీరా, షాహా మహమ్మదు ఖాన్ వజీరు వంటి సేనానాయకులను పంపినప్పుడు నల్లూరి ప్రాంతానికి (తూర్పు గోదావరిజిల్లా కపిలేశ్వరపురం మండలంలో గలదు) చౌదరిగా గజపతుల అధికారి అయిన గంధం తిమ్మయ మహాపాత్రుడు గారు ఉన్నట్టు జయంతి పత్రిక 1 సంపుటి, 1వ సంచిక లో రాజమహేంద్రవరం సర్కారు రచన ద్వారా తెలియుచున్నది. యీ గంధంవారు తెలగాలని పిలువబడే బలిజవంశీయులు నేటికి పోలిశెట్టివారికి బంధువులుగా ఉన్నవారు. క్రీ.శ. 1573లో యీ రాజమహేంద్రవరం రాజ్యం గోలుకొండ సులతాను వశమయ్యేను.

రాజమహేంద్రవరం రాజ్య దేశాయి శెట్టిగారు ఆగర్భశ్రీమంతులైన బలిజవంశీయులు (వీరు కర్నాటికలోని చాళుక్య వంశపరంపరలోని వారని వీరి వంశచరిత్ర వివరిస్తుంది) పోలిశెట్టి గున్నయ్య శెట్టి నాయక మహాపాత్రుని క్రీ.శ. 1537 - 1633) 8 వియ్యంకులలో ఒకరు బలిజ వంశీయులగు బండారు రాజప్ప చౌదరిగారిని పోలిశెట్టి వారి వంశచరిత్ర ద్వారా తెలుస్తుంది. యీ పోలిశెట్టి గున్నయ్య శెట్టి నాయక మహాపాత్రుని సోదరుడగు పోలిశెట్టి వేంకటాద్రిరాయని కుమారులలో ఒకరు పోలిశెట్టి చౌదరి పాపారాయుడుగారు (యీతని వంశీయులు నేటి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకాలో విస్తరించినారు). యీతని సోదరుడగు పోలిశెట్టి కృష్ణరాయప్పగారి మామగారు దేశంశెట్టి రంగప్ప చౌదరిగారు. యీ రాజమహేంద్రవరం రాజ్యములోని పిలపాక పరగణాకు (ప్రస్తుత కాకినాడకు దిగువ ప్రాంతము), తరువాత బోడసకుర్రు పరగణాకు (ప్రస్తుత అమలాపురం పరిసర ప్రాంతాలు) చౌదరి పెత్తనదార్లుగా పోలిశెట్టి గున్నయ్య నాయుడుగారు (1620 - 1705) మరియు వీరి కుమారుడు పోలిశెట్టి నరసప్పారాయలుగారూ (1640 - 1730) ఉన్నారు. వీరూ వీరి తరువాత తరాలవారూ తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం దగ్గర గల చల్లపల్లికి ముఠాదార్లుగా పెత్తందార్లుగా ఉండెను. యీ పోలిశెట్టి నరసప్పరాయలుగారి కుమారులలో ఒకరగు పోలిశెట్టి గున్నయ్య నాయుడు గారి అల్లుడు అడపా చౌదరి గారు. మరొక కుమారుడగు పోలిశెట్టి కుమార అమ్మన్న నాయడు దొరగారి కుమారులలో ఒకరు పోలిశెట్టి గంగయ్య చౌదరి గారు. యీ పోలిశెట్టి నరసప్పారాయలుగారి (1640 - 1730) సోదరులలో ఒకరగు పోలిశెట్టి వల్లభరాయలుగారి కుమారుడు పోలిశెట్టి దొడ్డప్ప చౌదరిగారు (1700 - 1780). (యీతని వంశీయులు నేటి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి తణుకు ప్రాంతాలలో విస్తరించినారు.

మరియు తూర్పుగోదావరి జిల్లాలో క్రీ.శ. 17, 18 శతాబ్దాలలో తెలగ వంశీయులగు బత్తులవారిలోనూ (వీరు కంభంమెట్టు, కపిలేశ్వరపురం, కడియం, దవళేశ్వరం ప్రాంతాలలో విస్తరించినారు), యెరుబండివారిలోనూ (వీరు గోలుకొండ, చల్లపల్లి, యీ దరాడ, బడుగువానిలంక, జొన్నాడ ప్రాంతాలలో విస్తరించినారు). ఆడపావారిలోనూ (వీరు గంగలకుర్రు, కోటిపల్లి, సజ్జాపురం ప్రాంతాలలో విస్తరించినారు). అడ్డగర్రల లేదా అడ్డగళ్ళవారిలోనూ (వీరు గన్నవరం, నరిసిపూడి, నవాబుపేట, గాడాల ప్రాంతాలలో విస్తరించి ఉన్నారు) చౌదరి పేరు దరించినవారు కనిపిస్తున్నారు. అనగా వీరి వంశీయులు చౌదరి పదవి నిర్వహించినవారని అర్ధము. ఇంకా శోధిస్తే మరిన్ని వంశాలు వివరాలు వెలుగు చూడగలవు.

వీటినిబట్టి ఆటు మహారాష్ట్ర, కర్నాటకల నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించిన బలిజ వంశాల వారు క్రీ.శ. 11వ శతాబ్దము నుండీ చౌదరి అనే పదవిని అనుభవించేవారని తద్వారా తమ పట్టపు పేరుగా గలిగి ఉండేవారని చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు.

4 Comments

  1. It means chowdaries and Balaji are comes under same community . isn't it?

    ReplyDelete
  2. Memu badugu ane lanka family members naku kastha historical proof chupisthara ma history grunchi

    ReplyDelete
  3. Kadiam lo unna banthula varu okaru tho nenu kalisi school chaduvukunnamu,valla history proof esthey valliki theluputhanu

    ReplyDelete
    Replies
    1. evari charitra valla daggare untundi, valla tatala muthala nati charitra neti tararm vallanu adigi telusukondi..

      Delete
Previous Post Next Post