సంగీతం, నృత్యం, చిత్రకళా, చారిత్రిక కావ్యాలు, ప్రబంధ రచనకు నిలయమైన సంస్థానాలు వల్లూరు, పంగిడిగూడెం. వల్లూరును ”తోట్ల వల్లూరు” అంటారు. ఉయ్యూరుకు అయిదు కిలో మీటర్ల దూరంలో కృష్ణా నది ఒడ్డున వుంది. అరవై గ్రామాలతో విలసిల్లింది. మచిలీపట్నం విజయవాడ తాలూకాలలోను, పశ్చిమ గోదావరి లోని ఏలూరు తాలూకాలోను ఈ జమీందారి విస్తరించి వుంది. పచ్చని పంటలకు నిలయం. ఈ సంస్థానానికి వల్లూరే రాజధాని. కృష్ణకు తూర్పు గట్టున వుంది. కొబ్బరి, మామిడి తోటలతో కళ కళ లాడుతూ వుండటంతో తోట్ల వల్లూరు అయింది. కొంత కాలమ్ నూజివీడు, చల్లపల్లి జమీందారిలో వుంది. 1900లో అన్నదమ్ముల పంపకాల వల్ల ఉత్తర దక్షిణ వల్లూరులుగా మారింది. పట్నాల వంశీకులైన బొమ్మ దేవర వంశం వారు వల్లూరు పాలకులైనారు. 300 ఏళ్ళు వీరి పాలనలో వుంది. పంగిడిగూడెం పశ్చిమగోదావరి గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది. ఆ కాలంలో నిర్మించబడిన వేణు గోపాలస్వామి ఆలయం అప్పట్నించి ఇప్పటి వరకు భక్తులను ఆకర్షిస్తూనే వుంది.
సంస్ధానము చరిత్ర
వీరి ఇంటిపేరు "ఎడ్ల" వీరికి కొన్ని వేల ఎద్దుల సంపద ఉండడంతో వీరిని ఎద్దులవారు అనేవారు , వీరు ఎద్దులమీద సరుకు రవాణా చేయడం , ఎద్దులమీద సరుకులు వర్తనముకు తీసుకెళ్లేవారట.ఐతే ఈ ఎడ్ల వారిలో నాగన్న అనే అతను అదృష్ట జాతకుడు , ఇతడు బలిజ శాఖలోని పెరికె బలిజ( పురగిరి క్షత్రియ ) కులస్ధుడు ఎడ్ల నాగన్న గారిది వల్లూరు గ్రామము. అపారమైన పశుసంపద ఉండేది. వేలాది జతల ఎడ్లు ఉండేవి. గోల్కొండ నవాబులకు అవసరమైన ఆహార పదార్ధాలను ఎడ్ల బండ్ల మీద, హైదరాబాద్ తీసుకొని వెళ్లి అందజేసేవారు.
బొమ్మదేవర ఇంటిపేరు ఎలా వచ్చింది
1978 - 1789 మైసూర్ రాజ్యాన్ని ఏలుతున్న టిప్పు సుల్తానుతో బ్రిటిషుదొరల మధ్య భయంకరమైన యుద్ధము చోటుచేసుకుంది. ఇంగ్లీషు కుంఫిణీ వారు టిప్పు సుల్తానుతో సతమతమౌతున్న కాలంలో బందరు నుండి కుంఫిణీ సేనను శ్రీరంగపట్టణముకు పంపవలసిందని British General Harris బందరులోని Martin దొరను కోరాడు.
పదిహేను వందల మంది సర్దారులు , నాలుగు వేలమంది నాటు సిఫాయిలు , ఇరవై ఫిరంగులు అలానే తుపాకులు , తూటాలు మందుగుండు సామాగ్రి వీటన్నినీ బందరు నుండి శ్రీరంగపట్టణముకు తరలించడానికి ఎంత వాహనం కావాలో ఊహకు కూడా అందని విషయం.ఐతే ఆనాడు బందరు కోటలో కుంఫిణీ వారికీ దుబాసీ ( అనేక భాషలు తెలిసినవారు, ఒక భాషను మరొక భాషలోకి అనువదించి ఎదుటి వారికీ అర్ధం అయ్యేలా వివరించేవారిని దుబాసీ అంటారు)గా సుంకర గురవయ్య శెట్టి గారు ఉండేవారు , శ్రేష్టి కార్యకర్త రావిపాటి బ్రహ్మన్న. బ్రహ్మన్న గారి అనుచరుడు ఎడ్ల నాగన్న.
ఐతే ఆ యుద్ధ సామాగ్రి శ్రీరంగపట్నం తరలించడానికి ఎడ్ల నాగన్న అతనికి ఉన్న కొన్ని వేల ఎద్దుల సహాయంతో రవాణా చేయడానికి సిద్ధం అయ్యాడు.ఈ ఎడ్ల సిబ్బందికి నాయకుడిగా శ్రీరంగపట్టణం వెళ్లిన నాగన్న యుద్ధానంతరం నాగన్న బందరు చేరుకునే సమయానికి గురవయ్య బ్రహ్మన్నలు కాలముచేసారు.విశ్వసపాత్రుడైన నాగన్న తన దేవరగు బ్రహ్మన్న పేరిట బ్రహ్మన్నదేవరగా అతని ఇంటిపేరుగా మార్చుకున్నాడు.అదే జనాలవాడుకలో బొమ్మదేవరాగా మారింది..ఎడ్ల నాగన్న నాయుడు కాస్త బొమ్మదేవర నాగన్న నాయుడు అయ్యాడు.
బొమ్మదేవర వారి చరిత మొదలైంది
1798-99 లో టిప్పుసుల్తానుకెదురుగా కుంఫిణీవారు సాగించిన యుద్ధములలో కుంఫిణీపటాలములకు ఎద్దులబండ్ల మీద రవాణా చేసే కాంట్రాక్టుదారుడు బొమ్మ దేవరనాగన్న నిమమింపబడ్డాడు. యుద్ధానంతరం నాగన్నకు శ్రీరంగ కోటాలో వజ్ర , వైడూర్యాలు దొరికాయి , చప్పుడుచెయ్యకుండా ఆ వజ్రమూటతో మచిలీపట్టణం చేరుకున్నాడు, ఆ డబ్బుతో కుంఫిణీ వారి నుండి 1803 లో హవేలీ ఎస్టేటైన వల్లూరును కొని కోటను కట్టాడు. కోట ప్రాకారముపై రెండెడ్ల బండి సులువుగా తిరుగగలిగినంత వెడల్పు ఉండేదట : 1807లో రాజా నాగన్ననాయడు మచిలీపట్టణము - హైద్రాబాదులమధ్య సైనికసామగ్రి రవాణాచేయుటకు ఏజెంటుగా నియమింపడ్డారు. శ్రీరంగ పట్టణము ముట్టడిలో రాజా నాగన్న నాయడుగారు చేసిన సేవలను కుంఫిణీవారు కొనియాడి రాజా బిరుదమునిచ్చి గౌరవించిరి. ఆరోజు అతని బ్రిటీషువారికి సహాయం చేసి టిప్పు సుల్తాన్ వంటి నీచుడి చావుకి కారణం అయ్యాడు.
మరో నాగన్న జన్మించాడు
1808 లో 70 యేండ్ల వయసున నాగన్ననాయడుగారు ఖమ్మంమెట్టు నుండి తిరిగి వచ్చుచునడిదారిలో జబ్బుపడి మరణించారు.ఈతనిభార్య శేషమాంబిక ఈతని మొదటి ముగ్గురు కొడుకులు ముందే మరణించారు. నాల్గవకుమారుడైన రాజా వెంకట నరసింహనాయడు తండ్రి మరణించునాటికి మైనరు. మైనరునకు బదులుగా తల్లి కొంత కాలము సంస్థానవ్యవహారములు చూసుకునేది. నరసింహనాయుడు కూడ కుంఫిణీవారికి తలలోనాలుకగా ప్రవర్తించి కుంఫిణీవారి సేనలకూ రస్తు సామగ్రిని రవాణాచేయడంలో దిట్టయని పేరుపొంది, ఎస్టేటును బాగా అభివృద్ధి చేసాడు. ఈయనభార్య రాజ్యలక్ష్మి. 1842 లో నరసింహనాయడు మరణించునాటికి ఇతవి కుమారుడు ఇమ్మడినాగన్ననాయడు అయిదేండ్ల పసివాడు. తల్లిగారైన రాజ్యలక్ష్మి కొద్ది కాలం జీవించి మరణించారు.వెంకటనరసింహనాయని సోదరుడగు రాజా వెంకయ్యనాయడుగారి భార్య వెంకమ్మగారు నాగన్నకు మేజరు అయ్యేదాకా జమీవ్యవహారములను పర్యవేక్షించిరి. 1842లో ఇమ్మడి నాగన్న జమీకివచ్చెను. తాతగారగు రాజా నాగన్ననాయడువలె ఈనాగన్నయును అదృష్టజాతకుడు. రాజ్యవ్యవహారము లందు అత్యంత నైపుణ్యముకలవాడు. గోదావరిమండలములోని వసంతవాడ, కొప్పాక, నారాయణపురము, దుద్దేపూఁడి మొదలైన ఎస్టేటులను ఖరీదు చేసి తన సంస్థానమును విస్తరింపఁజేపెను. కొప్పాకపుర వేణుగోపాల దేవాలయాగ్ర భాగమున ధ్వజప్రతిష్ఠసరిపెను. వసంతవాడలో వేంకటేశ్వరస్వామి దేవాలయమును నిర్మించెను. 1857నాటి సిపాయీలపితూరీ గొడవలలో బడి కుంఫిణీ వారు కిందుమీదులగుచున్న గడ్డుగడియలలో ఇమ్మడినాగన్న రస్తురవాణా విషయములలో బహుచాకచక్యముతో ప్రవర్తించి వారిమన్ననలను పొందెను.
నాగన్నగారు శిథిలమగుచున్న వేణుగోపాలస్వామి ఆలయవిమాదమంటప ప్ర్రాకారాదులను, అయిదంతస్తుల గోపురమును కట్టించి ధ్వజస్తంభ శిఖరప్రతిష్ఠలు గావించిరి.ఇతని పెద్ద కొడుకు రాజా వెంకటనరసింహనాయఁడు బహద్దరు తండ్రి మరణాంతరము April 3rd 1869 లో జమీకి వచ్చెను. ఆనాటికి ఇతని తమ్ముడగు రాజా భాష్యకార్లునాయఁడుబహద్దరు 15 యేండ్ల వాడు. నరసింహనాయడుగారు తన తాత ముత్తాతలవలె బ్రిటిష్ ప్రభుత్వమువారికి రవాణానిమిత్తము ఎడ్లను సప్లయిచేయుచుండెడివారు. ఈయన 'ఢిల్లీశ్వర ప్రసాద సమాసాదిత రాజా బహదరప్రభృతి' బిరుదము లను పొందినవాడు.
7 - ఎడ్వర్డ్ ప్రభువు భారతదేశమునకు పర్యటన...
1875 లో ఏడవ ఎడ్వర్డుపధువు "వెల్వ్ రాకుమారుడు"గారు భారతదేశ పర్యటనమునకు వచ్చి మదరాసును దర్శించినపుడు రాజా వేంకటనరిసింహ నాయడుగారు సుశిక్షితమైన నాలుగు హరిణములు లాగెడు బండిని నజరానాగా వేల్పురాకుమారునకు సమర్పించెనట గిండీపార్కులో ( Guindy Park ) వేల్పురాకుమారునితో పాటు వల్లూరి రాజాగారు చాలసేపు సవారి తిరిగిరట దీనికి చాల ముచ్చటపడి వేల్పురాకుమారుఁడు హరిణములతోగూడ బండిని ఇంగ్లాండునకు తనవెంట తీసుకువెళ్ళడట.ఇందులకు ప్రతిరూపముగా రాజాగారికి ఒక బంగారుపతకము బహకరించారు.
ఈ జమీందారులకు పూర్వము రైతులు శిస్తును వస్తురూపమున చెల్లించేవారు. ఈయన నగదు రొక్కము రూపమున శిస్తును వసూలు చేయుటను మొదలు పెట్టినవాఁడు. ఎస్టేటు స్థితిగతులను కడుమెలకువతో పర్యవేక్షించి లోపములను సరిచేయించి నిపుణముగా పరిపాలనము సాగించినందున రాబడి మూడులక్షలకు పెరిగినది. చిన్నచిన్న యినుపవస్తువులు, తాళములు, ఇనుపపెట్టెలు మొదలగువానిని తయారుచేయు నొక కార్ఖానాను రాజాగారు స్థాపించిరి. సంస్థానమునుండి పంగిడిగూడెమునుండి ఏలూరుకాలువమీదుగా భీమడోలు దాక సొంతముగా ఇనుపదారి నిర్మించారు.ఈ కార్ఖానాలో రైలుబండ్ల చక్రములుగూడ తయారుచేయించెవారు.
ఉత్తర వల్లూరు దక్షిణ వల్లూరు
1895 దాక జమీ వ్యవహారములు నిమ్మళముగా నడిచాయి. 1895 లో రాజాగారి తమ్ములు భాష్యకార్లునాయడుగారు ఎస్టేటులో తమకు భాగము కావలయునని కోరాడు. మూలపురుషులనుండి అయిదవుతరమువరకు ఎంతో ఆహ్లాదంగా సాగిన యీ ఎస్టేటు ఆరవుతరమునందుఅన్నదమ్ముల వివాదములవలన పంపకములుపడి రెండుభాగములుగా విడిపోయినది. 1900 లో ఉత్త రవల్లూరు, దక్షిణవల్లూరు అను విభాగములేర్పడినవి. అన్నకు ఉత్తరవల్లూరు, తమ్మునకు(భాష్యకార్లునాయడు) దక్షిణవల్లూరు వచ్చినవి. పంగిడిగూడెము పరగణా ఉత్తరవల్లూరు వారికిని, బందరు గూడూరుపరగణా దక్షిణవల్లూరు వారికిని వంతులయినవి. ఈవిభాగములలో చెఱి ముప్పది గ్రామములు ఒకటిన్నరలక్ష రాబడి గలవి. ఉత్తరవల్లూరునకు పంగిడిగూడెము రాజధాని దక్షిణవల్లూరు వారికి వల్లూరే రాజధాని.
ఉత్తర వల్లూరు
1918 లో వేంకటనరసింహనాయడుగారు మరణించిరి. వీరికుమారులు రాజా నాగన్ననాయఁడు బహద్దరుగారు ఉత్తరవల్లూరు జమీకి పాలకులయిరి. వీరిసోదరులు రాజా వేంకటరాయలునాయఁడు బహద్దరుగారు. వేంకటరాయలు గారి కుమారుఁడు రాజా రామేశ్వరప్రసాదరాయలునాయఁడు బహద్దరుగారు.
దక్షిణ వల్లూరు
శ్రీ రాజా నృసింహరాయడు బహద్దరుగారి తమ్ములగు శ్రీ రాజా భాష్యకార్లునాయడుగారు ఈ జమీకి తొలి పాలకుడు. 1895 నుండి అన్నగారితో వ్యాజ్యమాడి ప్రీవీకౌన్సిలు దాక పోయి జమీలో సగం వాటాను సంపాదించాడు.ఈ వాటాయే దక్షిణవల్లూరను పేర 1900 లో ఏర్పడింది. భాష్యకార్లునాయడుగారు 1906 లో మరణించిరి.వీరి కుమారులు రాజా సత్యనారాయణవరప్రసాదరావుబహద్దరు 1897లో జన్మించి 1917 లో జమీకి వచ్చిరి. వీరితరువాత దక్షిణవల్లూరు దక్షిణవల్లూరు ఎస్టేటు రెండుభాగములయినది. ఒకభాగమునకు ఇనుగంటివారు హక్కుదారులయిరి. రెండవభాగమునకు బొమ్మదేవర వేంకటభాష్యకార్లునాయడు జమీందారు