Fill the form, we are preserving balija surnames and their history.

బలిజ కులస్తుల చరిత్ర - మైసూరు రాజ్యం ( Balijas in mysore kingdom )

కల్నల్ కోలిన్ మెకంజీ (1754-1821) అనే ప్రముఖ ఆంగ్లేయ అధికారి భారతదేశపు మొదటి సర్వేయర్ జనరల్ గ చేసెను.ఈతను భారతదేశంలో అనేక ప్రాంతాలనుండి చాలా విలువైన అనేక వేల తాళపత్రాలను, కైఫీయతులను, కడితీలను, శాసనాలను సేఖరించెను. ఆయన సేఖరించిన వాటిలో బలిజ కులస్తుల చరిత్రలకు సంబందించిన అనేక కైఫీయతులు గలవు.

"బనిజగారు పూర్వోత్తరం" - చరిత్ర గ్రంధం

komatis and also Balija people followed Vysya Varnam


మైసూరు రాజ్యంలో నివసిస్తు తరతరాలుగా వర్తక వ్యాపారస్తులుగా ఉన్న బలిజ కులస్తుల పురాతన చరిత్రలను గురించి ఉన్న పురాతన కడితీలను రెండు కాపీలను 200 సంవత్సరాలక్రితం కల్నల్ మెకంజీ దొరగారు సేకరించెను. ఒక ప్రతి పూర్తిగా ఉన్నది. మరోటి పూర్తిగా లేదు. అప్పటికి సాధారణంగా ఉన్న వాడుక ప్రకారం బనిజగారులు అంటే శూద్రులు లేదా మిశ్రమ కులం అనీ, కానీ ఈ మైసూరు రాజ్యంలో నివసిస్తున్న బణజిగారు కులస్తుల వద్ద ఉన్న ఆధారాల ప్రకారం వీరి పూర్వీకులు పెనుకొండకు చెందిన వైశ్య సామజిక వర్గం అనీ, తమ వర్గపు కన్యను విష్ణువర్ధన రాజు అడిగినప్పుడు అక్కడినుండి వలస వచ్చేసారు అని అని ఉన్న పురాతన చరిత్రను గురించి మెకంజీ మానుస్క్రిప్టు డిస్క్రిప్షన్ బుక్ లో పేర్కొన్నారు.
--------------------------------------------------------------------------------
నేడు ఆర్యవైశ్యులు అని చెప్పుకుంటున్న 102 గోత్రాల వారి వివరాలు మాత్రమే ఆర్యవైశ్యులు గ్రంధస్తం చేసారు. మిగిలిన 612 గోత్రాల వివరాలు వైశ్య పురాణ గ్రంధాలలో లేవు.
10వ శతాబ్దం నాటికీ వైశ్యులు మొత్తం 714 గోత్రాలవారు పశ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ కేంద్రంగా 18 నగరాలలో నగరస్వాములుగా వ్యాపారాలు చేసేవారు. 18పట్టణాలు లేదా నగరాలూ అనే ప్రస్తావన బలిజల శాసనాల్లో విస్తృతంగా కనిపిస్తుంది. వేంగి మండలాన్ని 9 - 10 శతాబ్ద కాలంలో పరిపాలించే చాళుక్య విష్ణువర్ధనునితో జరిగిన కలహం మూలంగా వీరి వర్గం స్త్రీ కన్యకాపరమేశ్వరి అగ్నిప్రవేశాన్ని సమర్ధించి 102 గోత్రాలవారు అగ్నిప్రవేశం చేయగా, దానిని సమర్ధించని మిగిలిన 612 గోత్రాలవాళ్ళు ఈ ప్రాంతాలను వదిలి అక్కడ ఉండలేక అక్కడినుండి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దేశాలకు వలస వెళ్లిపోయారు అని వైశ్య పురాణాలు తెలియజెబుతున్నాయి. 102గోత్రాలకు చెందిన కోమట్లను ఇప్పటికి గవరకోమట్లు అని అంటారు. గవర అనే పేరు గౌరీ దేవి పేరుమీదుగా వచ్చింది. వీరబలిజ శాసనాల్లో గవరలు, బలిజలు, సెట్లు, సెట్టిగుప్తలు, ముమ్మరిదండులు, నగరాలూ కలిసే వ్యాపారాలు చేసేవారు. నగరాలు నగరేశ్వరస్వామిని ప్రతిష్టించి ఆరాధిస్తారు. గవరలు గవరేశ్వర స్వామిని ప్రతిష్టించి ఆరాధించేవారు. వీరి ఇరువురి మూలాలు చాలా దగ్గరిగా ఉన్నాయి. బలిజలు కుబేరుని వంశంలో భద్రుని వంశీయులుగా జైనమతంలోని బలదేవ, వాసుదేవలను ఆరాదించేవారుగా శాసనాలలో చెప్పుకోగా, నగరాలూ కుబేరుని సంతతిలో నలకుబేరుని వంశీయులుగా శాసనాలలో తెలుపుకున్నారు. కుబేరుడు బ్రహ్మ వంశీయుడు. కాబట్టి బలిజలు తమ శాసనాల్లో బలదేవ వాసుదేవ ఖండలి మూల భద్ర బ్రహ్మ వంశీయులము అని చెప్పుకున్నారు. బలిజలు జైనులుగా దక్షిణాది అంత చాలా జైన దేవాలయాలు నిర్మిచెను. బలిజలు, కోమట్లు ఇండ్లపేర్లు నేటికీ అత్యధికంగా సరిపోవడానికి కారణం రెండువర్గాలూ చాలా దగ్గర వారిగా ఉండడమే.
గవర, బలిజ వర్గాలు కుడిచేయి వర్గంలోని వ్యాపారులుగా విడిపోతే, నగర, బేరి వర్గాలు ఎడమచేయి వర్గంలోని వ్యాపారులుగా ఉంటూ 10వ శతాబ్దం చోళుల కాలం నుండి ఆధిపత్య ధోరణితో దక్షిణాది, ఆగ్నేయాసియా దేశాలు అంతా వ్యాపారాలు చేసేవాళ్ళు. ఈ కుడిచేయి ఎడమచేయి వర్గాల ఆధిపత్యం 18వ శతాబ్దంవరకు కొనసాగేను.


బలిజలు, కోమట్ల కులాలకు తరతరాలుగా ఆశ్రిత కులాలు - విరముష్టులు, మైలారభటులు. తమ పోషక కులాలలోని వారి వంశ చరిత్రలు, కుల చరిత్రలు, కుల పురాణాలూ కలిగి ఉండేవారు. 15వ శతాబ్దం నాటి శాసనాలద్వారా సాహిత్యం ద్వారా విరముష్టులు బలిజవారికి, కోమట్లకు ఆశ్రిత కులం అని తెలుస్తుంది.

9 Comments

  1. బలిజ కులం.. వైశ్య (కోమటి ) కులం ఒకటి కాదు. వీరి మధ్య న బంధుత్వాలు కూడా లేవు.. పౌరుషం కలిగిన వారు బలిజలు.... పిరికి తనం కలిగిన వారు వైశ్య కులం వారు.

    ReplyDelete
    Replies
    1. Penugonda lo vanijula mundu komatlu veru paddaru, ee kanyaka parameshwari katha chadavandi

      Delete
  2. బలిజ కులస్తుల చరిత్ర -మైసూర్ రాజ్యం తొలిగించండి బలిజ వారు వ్యాపారం చేయటం వలన శెట్టి అని పేరు వచ్చింది..

    ReplyDelete
  3. శెట్టి బలిజ (ఈడిగ ) వారి ఇంటి పేరులో కూడా కొంతమంది కి శెట్టి అని ఉంది.. అలా అని వారు బలిజ వారు కాదు కదా. చాలా కులాల వారు వ్యాపారములు చేశారు. అలా అని వారు వైశ్య కులం అని అనలేము కదా. అలాగే బలిజ... వైశ్య కులాలు ఒకటి కాదు.

    ReplyDelete
    Replies
    1. ఈడిగ వేరు శెట్టి బలిజ వేరు..
      ఈడిగ అంటే చేటలు తయారు చేసి అమ్మేవారు

      Delete
    2. Edigas are toddy tapper caste to increase their social status they changed their caste name to setti balija..
      Original setti balija is called chetty balija which is present in tirupathi region
      Edigas are also called as yatha,srisayana,goud etc..
      Balijas are traders many sub divisions are there bcz of less british records we lost many things..
      Gavaras,perikas present in anaakpalle taluk and arya vaishyas and balijas all had connections in the past
      Few incidents made them lose the connection..

      Delete
  4. ఆర్టికల్ ను తొలిగించండి..

    ReplyDelete
Previous Post Next Post