Fill the form, we are preserving balija surnames and their history.

ద్వారబంధాల చంద్రయ్య ( Dwarabandhala chandrayya ) - మన్యం పులి

ఏజన్సీ ప్రాంతములో అల్లూరి సీతారామరాజుకంటే ముందు బ్రిటీష్ వారికి వ్యతిరేకముగా గిరిజన, దళిత, పీడిత వర్గాలనుసంఘటితం చేసి పోరాటం జరిపిన విప్లవ యోధుడు మన్యం పులి. శ్రీద్వార బందాలరామచంద్రయ్యనాయుడు. అయితేపాలకుల, పెత్తందార్ల, చరిత్రకారుల నిర్లక్ష్యం ఫలితముగా ఆయన చరిత్ర మరుగునపడింది.రామచంద్రయ్యనాయుడు క్రీ॥శ॥10-9-1853లో ప్రస్తుత విజయనగరం జిల్లా “బొబ్బిలి” తెలగవీదిలో సెప్టెంబరునెలదశమిఘడియలకు ముందు మూలానక్షత్రంలో "తెలగదొర”ల కుటుంబములో జన్మించాడు.

ఆరోజుల్లో మూలానక్షత్రంలో జన్మించిన ఆడమగశిశువులను గొంతులో ధాన్యపుగింజవేసి చంపి పూడ్చేసేవారుఒకవేళబ్రతికినా నష్టజాతకుడిగా చూసేవారు.


చంద్రయ్యనాయుడు జన్మించడానికి కొన్నిరోజులకుముందే అతని తండ్రి లక్ష్మయ్యనాయుడుబొబ్బిలి సంస్థానము ద్వారాసైనికాధికారిగా బ్రిటీష్ వారి తరపున 'ఆఫ్ఘనిస్థాన్లో తిరుగుబాటును అణచడానికి “కాబూల్” వెళ్లాడుతల్లి లక్ష్మమ్మచంద్రయ్యను కన్న కొద్దికాలానికే మరణించిందియుద్ధానికి వెళ్లిన తండ్రి ఎంతకాలానికి తిరిగిరాలేదు.


చంద్రయ్యనాయుడు తల్లిగారి జన్మస్థలం తూర్పుగోదావరిజిల్లా శంఖవరం మండలం “నెల్లిపూడి” గ్రామంఇతనిమేనమామలు రవణంరామయ్యలక్ష్మయ్యగార్లు పురిటికందయిన చంద్రయ్య నాయుడిని “నెల్లిపూడి” గ్రామంచేర్చుకున్నారు. (నేటికి నెల్లిపూడి గ్రామములో “రవణంఅనే ఇంటిపేరు గలవారి బందువులున్నారునాయుడు పెరిగిపెద్దవాడయి విద్యాబుద్ధులు నేర్చుకున్నాడుఆయనకు చదువు మీదకంటే కర్రసాముకుస్తితుపాకివేట అంటే చాలాఇష్టపడేవాడుమేనమామ రవణం రామయ్య తన కుమారై సీతమ్మనిచ్చి బాల్య వివాహం చేశాడు. 1926 వరకుఉభయగోదావరి జిల్లాలు గోదావరి జిల్లాగానే పిలువబడుతుండేవి.


క్రీశ1841 తర్వాత పెద్దాపురం సంస్థానము ఉచ్చస్థితిలో ఉండి పెద్దాపురం సంస్థానాధీశులకు సంతానంలేని కారణంగాబ్రిటీష్ సామ్రాజ్యంలో కలిపివేయబడింది అనగా విక్టోరియా మహారాణి పాలనలోకి వచ్చింది. ఆ సంస్థానం పతనం తర్వాతకాట్రావులపల్లి, కిర్లంపూడి, కోలంక, పోలవరం, మొగల్తూరు, పెరూరు, కాట్రానికోట, పటవులి, కోటిపల్లి, కపిలేశ్వరంపంగెడిగూడెం, కొత్తపల్లి . ఆ సంస్థానం క్రిందికి వెళ్లగా ఇవిగాక మరికొన్ని ఎస్టేటులు ఉండేవి.


చంద్రయ్యనాయుడు నివసించిన గ్రామం నెల్లిపూడికోటిపల్లి ఎస్టేటులో ఉండేదితోటపల్లి ఎస్టేటును పిఠాపురంరాజావారు పెద్దాపురం సంస్థానం నుండి వేలంపాటలో బ్రిటీష్ వారి నుండి కైవశము చేసుకున్నారు తోటపల్లితోపాటుజడ్డంగి ముఠాదశ్చర్తిముఠారంపయర్రంపాలెం ముఠాలు కూడా ఉండేవి మూడు ముఠాలు బ్రిటీష్వారి ఆధీనంలోఉండేవిచంద్రయ్యనాయుడు తుపాకి కాల్చడంవిలువిద్యకర్రసాముగుర్రపుస్వారీలందు మంచి ప్రవీణుడుతనకంటెగురికాడెవరైనా ఉన్నాడని తెలిస్తే సాధనచేసి అతనిని ఓడించే వరకు నిద్రపోడుమంచిపట్టుదలగలవాడు నెల్లిపూడిప్రాంతములో వారి మేనమామలు “రవణంవారు పెత్తందార్లుగా ఉండేవారుపన్నులువసూలు చేయు అధికారంతీర్పుచెప్పే అధికారం కలిగి పిఠాపురం జమీందార్లకు జవాబుదార్లుగా ఉండేవారునాయుడికి యుక్తవయస్సు వచ్చేనాటికివానలు లేక పంటలు పండక కరువు పరిస్థితులేర్పడినవి.

సర్.ఆర్ధర్ కాటన్ దవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టినప్పటికీ  నీరు దిగువ ప్రాంతాలకు పారుదల ఉండేదిఎగువప్రాంతమెట్టప్రాంతానికి వర్షాభావమేర్పడినదిపెద్దాపురం నుండి మెట్టప్రాంతమంతా తీవ్రకరువు ప్రాంతంగా మారిపోయిందికలరామశూచిప్లేగువిషజ్వరాలు వంటి వ్యాధులు ప్రబలిసరైనవైద్యము లేక చాలామంది మృత్యువాత పడ్డారుకాకినాడ ప్రాంతములో పెను తుఫాను సంభవించి పంటలుజననష్టం సంభవించిందిఇంతటి కరువు పరిస్థితులలోఆయా సంస్థానాదీశులు ప్రజలపై పన్నులువేస్తూపుల్లరి పేరుతో పశువులకు పన్నులు విధించి వీడించసాగారుపన్నులుకట్టనివారి ఆస్థులుపశువులనువ్యవసాయపనిముట్లను వేలం వేసేవారుజప్తులకుచాటింపులకు గురైనవారుఅవమానంగా భావించిగ్రామాలను విడిచి కుటుంబముతో సహా వేరే గ్రామాలకు వెళ్లేవారుకొందరు సన్నకారు రైతులుఆత్మహత్య చేసుకొనేవారు విధంగా మన్యంప్రాంత గ్రామాలన్నీ వలసలతో నిండిపోయిందిస్త్రీల మానప్రాణాలకువిలువలేకుండాపోయిందిబ్రిటీష్ పాలకుల తొత్తులయిన సంస్థానాదీశులుజమీందారులుపాలెగాళ్లుముఠాదారులుభోగలాలసులయ్యారువిలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారుస్త్రీలపైనపేదవారిపైన అత్యాచారాలకుఅంతులేదుతెల్లదొరలు వీరి మాటలనే నమ్మేవారు తప్ప ప్రజల యోగక్షేమాలను స్వయంగా చూసి ఎరుగరుఈవిధంగాప్రజలలో తీవ్ర నిరాశభయాందోళనలు ఏర్పడ్డాయి.


రైలుమార్గాలు వేసిస్టీమర్ల ద్వారామన ఖనిజసంపదనుఇంగ్లాండుకు తరలిస్తున్నారనే బాధమనమీదపరాయిదేశస్థుల పెత్తనమేమిటనిమన పాలకులు వారి అడుగులకు మడుగు లొత్తుతున్నారని ఆవేదన కలిసియువకులలో కదలిక వచ్చిందిబ్రిటీష్ పాలకులపై ఏవగింపు కలిగింది.

చంద్రయ్యనాయుడు ఇవన్నీ చూస్తూ ఉండలేకపోయాడుఅసలే పౌరుషవంతుడుతిరగబడ్డాడుమన తెలగబిడ్డఅప్పటికి ఆయన వయస్సు సంవత్సరాలుపశ్చిమతూర్పు గోదావరి జిల్లాఖమ్మం జిల్లావిశాఖ జిల్లాలలో విస్తరించినమన్యం అటవీ ప్రాంతములో సాగుచేసుకుంటున్న రైతులను అక్కడి బ్రిటీష్ అధికారులు ముఠాదార్లుభూస్వాములుజమీందారులు దౌర్జన్యంగా అణగద్రొక్కుచుండెడివారువారి పంటలను దోచుకునేవారు. 1879లో చంద్రయ్యనాయుడుతిరుగుబాటు లేవనెత్తాడు తిరుగుబాటునే బ్రిటీష్ అధికారులు. “రంపపితూరీ” అనిపేరు పెట్టారునాయుడునేతృత్వములోని నాటి బ్రిటీష్ అధికారులుజమీందార్లు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రారంభమయిన  "పితూరీ” నేటిఖమ్మంజిల్లాలోని భద్రాచలంరేకపల్లి నుండి విశాఖపట్నం జిల్లాలోని గోలుకొండ ప్రాంతాల వరకు విస్తరించిందిబ్రిటీష్వారిపాలనపై ఎంతో ఉధృతంగా జరిగిన  తిరుగుబాటుకు ద్వారబందాల రామచంద్రయ్య నాయుడుగారుపులిచింసాంబయ్యగారుబొద్దులూరు అంబులు రెడ్డిగారు నాయకులుగా వ్యవహరించారుఅనేక విధాలుగా బ్రిటిష్ అధికారులనుఅడ్డగించి ఎదుర్కొన్నారుచింతలూరుపెద్దిపాలెంకిర్లంపూడిచిల్లంగిజగ్గంపేటవంటిచోట్ల తిరుగుబాట్లను నిర్వహించినాటి భూస్వాములువ్యాపారులు ప్రభుత్వాధికారులపై తిరుగు జరిపారుబ్రిటీష్ అధికారులు చాలామంది గిరిజనఆడపిల్లలను అత్యాచారము చేసేవారు అటువంటి సైనికులను పట్టుకొని తన గండ్ర గొడ్డలితో వారిని నరికివేసేవారుబ్రిటీషు వారికి దొరక్కుండా వారిని ముప్పతిప్పలు పెడుతూ అటవీ ప్రాంతాలలో దాక్కునేవారు. 1879 ఏప్రిల్లో అడ్డతీగలపోలీసు స్టేషనును ధ్వంసం అక్కడ ఉన్న అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.


ధళితగిరిజనవెనుకబడినవర్గాలువ్యవసాయ కూలీ రైతువర్గాలలో యువకులను కూడగట్టారుశిధిలమైన పెద్దాపురంకోటలో వున్న ఫిరంగులనునెల్లిపూడి గ్రామ సమీపంలోని “బురదకోటకుతరలించారుఫిరంగులను  పయోగించేనిపుణులను పిఠాపురం నుండి తోడ్కొని వచ్చి తాను నేర్చుకుంటూ యువకులకు నేర్పించాడువిలువిద్య గిరిజనయువకులకు వెన్నతో పెట్టిన విద్యయువకులందరూ అన్నీ విద్యలలో ఆరితేరారుఒక దళంగా ఏర్పడ్డారుబాణాలుకత్తులుగండ్రగొడ్డళ్లుకర్రలుఫిరంగి మందు తయారుచేసుకున్నారుకొందరు స్వదేశీ అభిమానులైన రైతులు వారికిసహకరించారుగుర్రాలను కొనుగోలు చేశారు.


బ్రిటీషు ప్రభుత్వము అన్నీ గ్రామాలలో సారాయి నల్లమందుగంజాయిపాటలను ప్రవేశపెట్టిందిఅంతకుముందుగిరిజనులు సాంప్రదాయంగా సారాయికల్లు తయారు చేసుకొని త్రాగేవారు. “ఇజారుదారు” (కాంట్రాక్టరు పరిస్థితినిసాగనివ్వలేదుదాంతో గిరిజనులు చంద్రయ్యనాయుడు నాయకత్వంలో తిరుగుబాటు చేశారుగిరిజనుల గుండెల్లోకుదురుకున్నారువారి నాయకుడు చంద్రన్నగా పిలువబడ్డాడు.


మొట్టమొదటిగా ఇప్పటి పత్తిపాడు మండలం చింతలూరు నూకాలమ్మ తీర్థంలో తగవు ప్రారంభమయిందిచిలికిచిలికిగాలివానగా మారి పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.వోజోక్యం చేసుకోవలసి వచ్చిందిఅప్పటికదిసద్దుమణిగిన తర్వాత చంద్రన్న నాయకత్వంలో గిరిజన దళ సభ్యులు పెద్దిపాలెం మీద దాడిచేశాడుఅక్కడ చింతాడులఅక్కయ్య అనే వడ్డీ వ్యాపారి ప్రజల వద్ద తీవ్రంగా ముక్కుపిండి వసూలు చేస్తు బాధిస్తున్నాడుగిరిజన భూములనుఅసలుకు , చక్రవడ్డీ కలిపి నిరక్షరాస్యులైన గిరిజనుల చేత వేలిముద్రలు వేయించుకొని వడ్డీ వారిని బెదిరిస్తూబాధిస్తున్నాడుచంద్రన్న  వ్యాపారి ఇంటిపై దాడి చేసి శ్రీ వెండిరూపాయలు మూటలుబంగారంవడ్లుమిర్చిఇతరవెచ్చాలు బండ్లకెత్తించి


తండాలకు తరలించి పేదలకు పంచమన్నాడుప్రామిసరీ నోట్లు తగలబెట్టాడుబ్రిటీషు అధికారులకు చెబితేచంపేస్తామని బెదిరించాడు బంగారం డబ్బు ఆయుధాలు సమకూర్చుకున్నారుతర్వాత కొంతకాలానికి కిర్లంపూడిగ్రామం పైకి దాడిచేశాడుకిర్లంపూడిలో  కాలంలో "రమణాయమ్మ” అనే జమీందారిణి వారి సోదరులునరసింహరాయుడుప్రకాశరాయుడు అనువారు కిర్లంపూడి ఎస్టేటును చక్కపెట్టేవారు.


కిర్లంపూడి ప్రక్కనే వున్న “చిల్లంగిగ్రామములో కిర్లంపూడి ఎస్టేటులో పనిచేస్తున్న పండితులుకవులుగాయకులునౌకర్లుఇతర ఉద్యోగులు నివసించేవారు గ్రామం సుభిక్షంగా ఉండి దళితులను అంటరానివారిగా చూస్తూ వీధిలోనడవాలన్నా చెప్పులు చేత్తో పట్టుకొని నడవాల్చి వచ్చేది గ్రామంపై దాడిచేసి అక్కడ వున్న సంపదనంతా ఎడ్లబండ్లపైబురద కోటకు తరలించాడుమూడుసార్లు “చిల్లంగి” గ్రామంపై దాడి జరిగిందినేటి కిర్లంపూడి అగ్రహారం  విధంగానిర్మించినదేపూర్వం కిర్లంపూడి జమీందారు ప్యాలెస్ ఆనుకొని కవులకుగాయకులకు ఇతర ఉన్నతాధికారులకుజమీందారుకు ఇళ్లు నిర్మించారు.



కిర్లంపూడి జమీందారు “చంద్రన్న” బృందానికి భయపడి కోట చుట్టూ పటిష్టమైన గోడను నిర్మించాడుకోటలోపల నుండితుపాకీతో కాలిస్తే చంద్రన్న మనుషులకు తగిలేటట్లుచంద్రన్న మనుషులు కొలిస్తే కోటలోని వారికి తగలకుండా కోట గోడకురంధ్రాలు ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు నేటికి అట్లాగే వుందిఅప్పట్లో చంద్రన్న ముఠా ఎప్పుడు వచ్చిపడుతుందోనని సుమారు రెండు వందల మంది మనుషులు మారణాయుధాలతో కోటకు రేయిపగలు కాపలా కాసేవారుతరచు చంద్రన్న బృందముపెద్ద రైతుల మీద పెద్ద వ్యాపారుల మీదవారి వారపు సంతలుపెద్దాపురంతునిసంతలకు వెళ్లే ఆహార ధాన్యాలు తోడ్కొని వెళ్లే ఎడ్ల బండ్ల మీద దాడిచేసి ఆహార పదార్థములువస్తువులు దోచుకొనికరువుతో అల్లాడుతున్న పేద ప్రజలకు పంచేవాడుగంజి కేంద్రాలు స్థాపించాడుచింతపిక్క రంగు గుర్రంమీద తుపాకితోవీపు మీద కత్తిమొలలో కత్తిగండ్రగొడ్డలితో తిరుగుతుండేవాడుఆరు అడుగుల ఎత్తు ఎర్రని శరీరఛాయతో ఉండేవాడుతండాలలోగూడెములలోగ్రామాలలో తిరుగుతూ ప్రజల బాగోగులు చూస్తూ వైద్యులను బెదిరించి బలవంతంగాతీసుకెళ్లి పేదలకు వైద్యం చేయించేవాడు సమయములోని “చంద్రయ్యనాయుడు” భార్య సీతమ్మ అనారోగ్యముతోమరణించింది సమయములో గోదావరి జిల్లా కలెక్టరుగా “సర్ ఎస్క్వెర్ పర్విన్ దొర వచ్చాడుచంద్రన్న ముఠాతిరుగుబాట్ల వలన గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఆదాయం సగానికి తగ్గిపోయిందివర్షాలు లేక ప్రజలు వలసబాట పట్టారుకొంతమంది  త్తరాంధ్రదక్షిణ కోస్తా జిల్లాలకు వలసలు వెళ్లారుగౌరవ రైతు కుటుంబాలు గూడా కరువుతో తల్లడిల్లాయిఆడపిల్లలను తెలంగాణా ప్రాంతమువారికి “ఓలి” తీసుకొని కన్యాశుల్కము తీసుకున్న సందర్భాలున్నాయిసర్ ఆర్థర్కాటన్ గారి జీవిత చరిత్రలో  విషయాలన్నీ పొందుపరిచారు పరిస్థితులలో “లార్డ్ పర్విన్ దొర” జగ్గంపేటలోపిఠాపురం రాజావారి ఆధ్వర్యములో ఒక సమావేశము ఏర్పాటు చేశారు సమావేశానికి గోదావరి జిల్లాలోని చిన్న చిన్నఎస్టేటుదారులుమొఖాసాదారులుముఠాదారులు వచ్చారుసమావేశం మూడు రోజులు జరిగిందివిందులతోపొందులతో జరిగిందిసమావేశము చివరి రోజున వారిపై చంద్రన్న ముఠా హఠాత్తుగా దాడిచేసిందిదానికి కలెక్టరుబిత్తరపోయాడు దాడిలో పెద్దగా రక్తపాతము జరగకపోయినా చంద్రన్న ముఠా  జమీందారులందరికి తుపాకులుగురిపెట్టారుకలెక్టరుకు చంద్రన్నకు ముఖాముఖి రసవత్తరంగా చర్చ జరిగిందిఅక్కడ విందులువినోదాలతో వున్నకలెక్టరుజమీందార్ల నుద్దేశించి చంద్రన్న మీరూ ఒక పాలకులా ? మీరు ప్రభుత్వాధికారులా ? ప్రజలు కరువుతోఈతిబాధలతో అల్లాడుతుంటే మీరువిందులుచిందులతో ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో జల్సాలు చేసుకుంటున్నారా2. సిగ్గులేదూమీది ఒక బ్రతుకా ? అంటూ హూంకరించాడుమీరు ప్రజల గురించి వారి బాగోగుల గురించి తక్షణం చర్యతీసుకోకపోతే తర్వాత ఏం జరుగుతుందో నేను మాటల్లో చెప్పను తుపాకి సమాధానం చెబుతుంది అని హెచ్చరించివెళ్లిపోయారు.


 సంఘటనతో కలెక్టరుగారి ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదిఎలాగైనా చంద్రన్నను పెట్టి బంధించడానికి ప్రయత్నాలుప్రారంభమయినవిపెద్దాపురం మెట్ట ప్రాంతమును కల్లోలిత ప్రాంతముగా ప్రకటించారుచంద్రన్నకు సహకరించేవారెవరైనా శిక్షార్హులేఆయనకు ఆయన ముఠాకు ఆశ్రయమిచ్చినా నేరస్థులే ! అన్నీ గ్రామాలలో చాటింపు వేయించారుకలెక్టరుగారుచంద్రన్నను సజీవంగా పట్టించిన వారికి వెయ్యి రూపాయలు నజరానా ప్రకటించారు రోజుల్లో వస్తుమార్పిడి పద్ధతి ఎక్కువగా ఉండేదిబస్తా ధాన్యం ఒక రూపాయిగా ఉండేదిచంద్రన్న మారువేషములో ప్రజల మధ్యతిరుగుతూ ఉండేవాడుచాలావరకు పేదల ఆకలిని తీర్చుటకు ప్రయత్నించాడుఅతను స్థాపించిన గంజి కేంద్రాలుమూతబడ్డాయిచంద్రన్న దళం ఇంతపరిస్థితులలోనూఎక్కడో ఒక చోట దాడిచేసి అడవిదారులలో వెళ్లే ధాన్యముబండ్లు దారి మళ్లించి పేదలకు పంపేవారుఏది ఏమైనా ప్రజలకు  రోజులు దురదృష్టకరమైనవి.చంద్రయ్యనాయుడికికిర్లంపూడిలో బంధువులున్నారుఏనుగుల వెంకటస్వామి ఏనుగుల కందస్వామి అనువారుకిర్లంపూడి జమీందారిణిరమణాయమ్మ ఆమె సోదరులు అందరూ కలిసి వీరికి డబ్బు ఆశచూపించిబెదిరించి బలవంతంగా చంద్రన్నబంధించడానికి పథకం పన్ని కలెక్టరు అనుమతి తీసుకున్నారువెంకటస్వామికందస్వామి ఇష్టపడకున్నా  కుట్రలోభాగంగా చంద్రన్న ముఠాలో అతని అనుచరుడైన "జంపా పండయ్యఅనే వ్యక్తిని బ్రిటీషు అధికారులు లోబరుచుకునిఅతనికి గొప్ప బహుమతులు ఇస్తామని చెప్పి అతని ద్వారా చంద్రయ్యకు ఆహార ధాన్యములుడబ్బులిస్తామనినీవురహస్యంగా మమ్ములను కలవాలని కబురు పంపారుఅమాయకంగా బంధువులు తన అనుచరుడి మాటలు 


నమ్మిప్రజలు బాగుపడతారని ఒక ముహూర్తాన కిర్లంపూడి మోదుగుల రేవడిలో తన గుర్రాన్ని అనుచరులను ఉంచి ఏనుగులవెంకటస్వామి ఇంటిలో రాత్రి పూట ఒక్కడే ప్రవేశించాడుకుశల ప్రశ్నల తర్వాత భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారుఅతను మత్తులో ఉండగా బ్రిటీషు సైన్యము బంధించిందిఅతనికి స్పృహ వచ్చేసరికి సైనికుల చేతిలో బందీగా ఉన్నాడు విషయము తెలుసుకున్న అతని అనుచరులు అతనిని విడిపించుటకు ప్రయత్నించి విఫలమయ్యారు సంఘటనలో79 మంది ప్రాణాలు కోల్పోయారుతెల్లవారుజామున ఏనుగుల వీధిరామకోవెలకు దక్షిణదిశ ఉన్న రావిచెట్టుకుకట్టివేయుటకు ప్రయత్నించగా ఒక బ్రిటీషు సైనికుడి తుపాకి లాగుకొని దానితో కాల్చుతూ పరుగెత్తుకుంటూ తన గుర్రంపైఎక్కి పరారయ్యాడుసమయం కోసం వేసి ఉన్న తన అనుచరుడు గండ్రగొడ్డలితో తల నరికాడుకా అది గురి తప్పి వీపులోగుచ్చుకుందితన చేతిలోని తుపాకితో జంపా కాల్చి చంపారుబ్రిటీషు సైనికులు అతనిని వెంబడించి కాకినాడపోయేదారిలో చుట్టు ముట్టిబంధించి కాకినాడ వెళితే ప్రజలు తిరుగుబాటు చేస్తారనిరాజమండ్రికి దారి మళ్లించి అక్కడబ్రిటీషువారి కోర్టులో ఉరి శిక్ష విధించారుకలెక్టరు అనుమతితో శవాన్ని ఖననం చేశారువేలాదిగా మన్యం ప్రాంతగిరిజనులుదళితపీడితరైతు కూలీలుఅభిమానులు దేశభక్తిగల ప్రజలు తరలివచ్చి కన్నీళ్లతో తమ నాయకునికినివాళులర్పించారుక్రీ.. 1880 ఫిబ్రవరి 12 తేదీన వీరమరణం పొంది వీరస్వర్గము అలంకరించిన ద్వారబందాలరామచంద్రయ్యనాయుడుగారి తరువాత | అవతారమే. 1897 జులై 4 అల్లూరు సీతారామరాజుగా జన్మించెనని అతనేతమకోసం మరలా వచ్చెనని మరలా బ్రిటీషు వారి చేతులలో 1924-6-7 తేది వీరమరణం పొందినట్లు ఆనాటి అక్కడిప్రజలు విశ్వసించేవారు.


చంద్రయ్యనాయుడుది ఆరడుగుల విగ్రహమని ఆజానుబాహుడుతేనె రంగు శరీరఛాయఉంగరాల జుట్టు వెనుకజునపాలుచింతపిక్కరంగు గుర్రముతో నంచారము చేసేవాడని ఇతనిని ప్రత్యక్షంగా చూసినవారు కిర్లంపూడి ప్రాంతములో1957 వరకు బ్రతికే వున్నారుతర్వాత కాలంలో సానా సూర్యనారాయణ (కిర్లంపూడిరవణం అప్పారావు (నెల్లిపూడిఇతను చంద్రయ్యనాయుడుకి మేనల్లుడు. 1990లో మరణించాడుఇంకా వీరి బంధువులున్నారు.


చిలకమర్తి మల్లయ్య శాస్త్రిగారు కూడా వీరాధివీరుడైన చంద్రయ్యనాయుడిని గురించి ఎన్నోవిషయాలు ప్రజలకుతన స్నేహితులకు చెప్పేవారు.చంద్రన్నకు బ్రిటీష్వారు బలరాంపురం (రౌతులపూడిముఠాయిస్తామని ఆశచూపిన తిరుగుబాటు విరమించలేదుచంద్రన్న ఈదళంలో చేరిన తర్వాత అతని భార్య సీతమ్మ అనారోగ్యంతో మరణించిందితర్వాత చాపరాయి (బాగరాయిగ్రామములో మరొకామెను వివాహము చేసుకొన్నాడుఆమెకు ఇద్దరు కుమారులుఆనాటికి వారు పేదరికములోనేఉన్నారుతర్వాత వారి కుటుంబీకులు కొందరు శ్రీకాకుళం ప్రాంతానికి వలసవెళ్లారు.చంద్రన్న తర్వాత తన అనుచరులలో కొందరుగరిమెళ్ల మంగన్నపిట్టలభీముడు ఉద్యమాన్ని కొనసాగించారుకానివిఫలమయ్యారు స్వాతంత్య్ర సమరయోధుని విగ్రహము పెట్టి చరిత్రను పాఠ్యాంశముగా పెట్టాలని ప్రభుత్వాన్నికోరుతున్నాము.

3 Comments

  1. Kindly send the English Version of details. It will help many who don't read Telugu. Thank you.

    ReplyDelete
Previous Post Next Post