పూర్వము బహుళ విఖ్యాతమైన కుంతల దేశమునకు చెందిన మానవ్యస గోత్ర చాళుక్య కుల చంద్రవంశ క్షత్రియులైయుండి అయ్యావళి పురవరాదీశ్వర, వాతాపీ పురవరాదీశ్వరులై, సత్యాశ్రయ పులకేశి మహారాజ వంశోద్భవులై వజ్ర, వైడూర్య, మరకత, ముత్యం, నీలం, గోమేధిక, పుష్యరాగ, కెంపు, పగడం వంటి నవరత్న వ్యాపారాలలో నిష్ణాతులై ప్రఖ్యాతి గాంచి రత్నబలిజలని జగతిన విఖ్యాతులై వుండి. మిక్కిలి క్షాత్రావంతులై, బహుసంపన్నులై యుండి అయ్యావళీపుర ముఖ్యమై తలరారుచుండు వీరబలంజ్య సమయానికి చెందిన వారైయుండి స్వస్తి సమస్త భువన జన విఖ్యాతులైన శ్రీమద్వీర బలలజ్య సమయ ధర్మప్రతిపాలకులై యుండి యాబయ్యారు దేశాలలోనూ 8 వ శతాబ్దము నుండి వాణిజ్యము నిర్వహిస్తూ వుండిన వీరు దరిమిలాను కళ్యాణిపట్టణము, ద్వారసముద్రము రేవతీద్వీపము వంటిచోట్ల వాణిజ్యము చేయుచూ క్రీ॥శ॥ 12వ శతాబ్దములోని కళ్యాణి చాళుక్య సింహాసనాన్ని ఆక్రమించి పాలిస్తున్న కాలాసూర్య బిజ్జలు మహారాజు పరిపాలనా కాలములో వచ్చిన గొప్ప వీరశైవమత ఉ ద్యమంలో ఆయన మంత్రియైన బసవేశ్వరుని సిద్ధాంతాలకు ఆకర్షితులై అప్పటి వరకు జైన క్షత్రియ, బనిజ గార్లుగా జైనమతాన్ని అవలంబిస్తూ వస్తున్న వీరి వంశీయులు ఆనాటి నుండి వీర శైవ లింగాయిత బలిజలయి (వీరిని కర్ణాటక దేవములో జలిజ గార్లు బణ గార్లు, బణజగశెట్టి అనేవారు) తదుపరి కాలములో తెలింగదేశమున ఓరుగల్లుకు చేరి (దాక్షారామము, శ్రీశైలము, కాళేశ్వరము వంటి పురాతన త్రిలింగ శైవక్షేత్రాల నడుమ గల దేశము యావత్తు త్రిలింగ దేశము అని పిలువబడుచుండెను. ఈ త్రిలింగదేశమే వాడుకలలో తెలింగదేశమని అందు నివసించు ప్రధాన జాతివారు తెలింగాలని తర్వాత తెలంగాలని, తెలగాలని పిలువబడుతూ వస్తూవున్నారు.)
ద్వార సముద్రము వైపు పయనము :
ఈ కుటుంబీకులు క్రీ॥శ॥ 12వ శతాబ్దములో తెలింగదేశములోని ఒరుగల్లు నుండి వర్తక వాణిజ్యాలు నెరుపుతూ యుండి, దరిమిలా హెూయసల బళ్లాలరాజుల పాలనలోని మంగళూరు వెళ్ళి వారి కొలువులో వుంటూ వారిలో బాంధవ్యము నెరపి ఆ సామ్రాజ్యానికి చెందిన ద్వారసముమ్రు నందు పట్టణస్వామిగా నున్న ఈ చాళుక్య వంశ శాఖలోని 23వ తరం వారైన శ్రీ శెట్టిపాల గోత్రీకులు శ్రీ పోలిశెట్టి వీర బల్లాలరాయశెట్టిగారు దరిమిలా శ్రీ పోలిశెట్టి సోమదేవశెట్టి గారు ద్వారసముద్ర పట్టణ స్వాములుగా వుంటూ ప్రభువుకు ముఖ్యలై అష్టాదశవర్ణాల ప్రజలపై ధర్మం, న్యాయం, చెప్పు అధికారము కలిగి కఠినమైన ఆచారాలను పాటిస్తూ రథ, గజ, తురగ, పదాతి మొదలైన అసంఖ్యాకమైన “వీరబలంజ్య సమయ” సైన్యములో దేశదేశాలలో వాణిజ్యము చేయుచుండెను. ఈ శ్రీపోలిశెట్టి సోమిదేవశెట్టి గారికి గౌరిశెట్టి, మారిశెట్టి యని ఇరువురు కుమారులు గలరు. వీరిలో మారిశెట్టిగారు ద్వారసముద్ర పట్టణస్వాములై వుండి వ్యాపారము చేసేవారు. ఇతనికి బ్రహ్మిశెట్టి, ఇతనికి వెంగలశెట్టి, ఇతనికి కృష్ణరాయనాయక, ఇతనికి రంగనాథస్వామి నాయక యను పరంపర గలదు. వీరెల్లరు ద్వారసముమ్రు, కాంచీపురం వంటి చోట్ల విస్తారముగా వాణజ్యము చేశారు.
పెనుగొండ (అనంతపురం జిల్లా) రాజ్యంవైపు పయనం : దరిమిలా శ్రీపోలిశెట్టి స్వామిదేవశెట్టి గారి జ్యేష్ఠ కుమారుడగు గౌరిశెట్టిగారు వ్యాపారాల నిమిత్తమై తమ వీరబలింజ్య సమయ సైన్యముతో పెనుగొండకు క్రీ॥శ॥ 1400 నాటికి చేరి అచటనుండి అఖిలదేశాలలోనూ విశేషమయిన వర్తక వాణిజ్యాదులు చేయుచూ వీరబలంజ్య సమయధర్మ ప్రతిపాలకులై శెట్టిపాలకుల విఖ్యాతులై విలసిల్లుచుండెను. దరిమిలా తమకుగల శెట్టిసమయ సైన్యమునకై జీతముపై వివిధ బలంజ్య సమయాల వారికిన్ని, వివిధ రాజ్యపాలకులకు, విజయనగర పాలకులకు యుద్ధ సమయములందు, అవసరమయినప్పుడు ఏర్పాటు చేయుచూ వుండేవారు. నాటి విజయనగరపాలకులకు ప్రభువులకు ముఖ్యులై, విశ్వాస పాత్రులై ముఖ్య అంతరంగీకులై వ్యవహరించు చుండిరి. వీరికి సదాశివరాయశెట్టి, నాగిశెట్టి అను కుమారులు గలరు. ఈ పోలిశెట్టి నాగిశెట్టి గారు పెనుగొండలో స్థిరపడెను.
రాజమహేంద్ర రాజ్యంవైపు పయనము :
శ్రీ పోలిశెట్టి సదాశివరాయశెట్టిగారు
ఈ పోలిశెట్టి గౌరిశెట్టి గారి జ్యేష్ఠ కుమారుడు శ్రీ పోలిశెట్టి సదాశివరాయశెట్టిగారు వర్తక వాణిజ్యములు చేసికొనుచూ విజయనగర మహాసామ్రాజ్యాదీశులైన చంద్రవంశ యదువంశ క్షత్రియులు సంగమ వంశీయులగు ప్రౌడదేవరాయలు అను ఇమ్మడిదేవరాయ, మహాదేవరాయలయ్యగారు (క్రీ॥శ॥ 1424-1446) విద్యానగరమున రాయసింహాస నాధీశులై పృద్వీరాజ్యమేలుచుండగాను. ఓండ్ర జగపతులు రాజమహేంద్ర వరరాజ్యమును నష్టపరుస్తున్నపుడు ఈ రాజమహేంద్రపుర రాజ్యము నేలుచున్న తన మిత్రుడైన వీరభద్రారెడ్డి (క్రీ॥శ॥ 1434 - 1467) పై కలింగ దేశ దిగ్విజయ యాత్రలలో భాగంగానూ, వారి వద్ద వర్తక ప్రముఖులుగా “రాజశ్రేష్టిగా” వుండి పెనుగొండ నుండి అఖిల దేశాలలోనూ వాణిజ్యం నిర్వహించుచూ నాటి కొండవీడు, రాజమహేంద్ర వరదేశాలలో వర్తక వాణిజ్యాలను చేయునిమిత్తమై కొన్ని ప్రత్యేక హక్కులు, అధికారాలు, అనుమతులు, రాయితీలమీద పొందే నిమిత్తంబై నాటి విజయ నగర మహాసామ్రాజ్య సైన్యముతో బాటు ఇమ్మడి దేవరాయ మహారాయలయ్య వారి మంత్రి పుంగవుడు. జలిజకుల ధీరుడు అయిన మల్లప్ప వడయల్ గారి నాయకత్వంలో ఈ విజయ నగర సామ్రాజ్య అంతర్భాగమయిన పెనుగొండ రాజ్యము నుండి తమకుగల వందలాది ఏనుగులు, గుర్రాలు, ఎడ్లబండ్లలో రథ, గజ, తురగ, పదాతి దళాలను వారికి వలయు సకల అవసరంబైన సామాగ్రిని చేరవేయుటకు ఇమ్మడి దేవరాయలు నుండి అనుమతులను బొంది తమకుగల అసంఖ్యాకమైన సుశిక్షుతులయిన వీరబలంజ్య సమయ సైన్యమునకై జీతముపై ఇమ్మడి దేవరాయలుకు వారికి ఏర్పాటు చేసి ఆ సైన్యములో కొండవీడు రాజ్యం, రాజమహేంద్రవర రాజ్యము మీదుగా ఓండ్ర గజపతులను జయించిన పిమ్మట దానికి ప్రతి ఫలంగా ఆ రాజమహేంద్ర రాజ్యములోని పన్నులు వసూలు చేయు అధికారమున్నూ వినియోగించబడినకై జీత సైన్యమునకు ప్రతిఫలము ధనరూపేణా పొంది వ్యాపారాదులు చేసుకొనుటకు పన్నులు లేని ప్రత్యేక రాయితీలు, అధికారము పొందెను. దరిమిలా వీరున్నూ శ్రీ మద్వీర బలిజ సమయము వారున్నూ, రాజమహేంద్ర రాజ్య పరిధిలోన, త్రిలింగ మహాపుణ్య క్షేత్రాలలో ఒకటిగానూ, అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటిగాను విలసిల్లుచుండిన ద్రాక్షారామమున స్థిరపడి వర్తక వాణిజ్యము దేశదేశాలు చేసుకొనుచూ తమకుగల శెట్టి సమయసైన్యమును అవసరమయిన పాలకులకు “కై జీతము” పై ఏర్పాటుగావిస్తూ వుండెను.
ఈ"పోలిశెట్టి సదాశివరాయశెట్టి” గారికి అయ్యప్ప, భైరవరాయశెట్టి నాగప్ప, నరస్పనాయక యని నలుగురు కుమారులుగలరు. వీరిలో భైరవరాయ శెట్టి గారికి సదాశివరాయశెట్టి, నాగిశెట్టి, రాయప్ప, మల్లికార్జునశెట్టి, పాపిశెట్టి, భీమేశ్వర మహాదేవశెట్టి, వెంకటప్ప నాయక అని ఏడుగురు కుమారులు కలిగిరి, నరసప్ప నాయకునికి లింగయ్య అను కుమారుడు కలిగెను. ఈ పెదరాయప్ప గారును, సదాశివరాయలు శెట్టి గారి భార్య పగడాల భసవప్ప గారి కుమార్తె మల్లమ్మగారు, ఈ నాగిశెట్టి గారిభార్య అడపా వీరపరాజు గారి కుమార్తె నాగేశ్వరీదేవిగారు, ఈ రాయప్ప దళవాయిగారి మొదటి భార్య పగడాల మల్లప్ప గారి కుమార్తె తిరుమలమ్మగారు, రెండవభార్య కంచి కేతిశెట్టి గారి కుమార్తె నాగమాంబగారు ఈ కంచయి కేతిశెట్టి గారి భార్య ఓబులాంబ గారునూ, పట్టపు రామరాజు భార్య తిరుమలాంబగారును, పెనుగొండ యందుండు సకల అశ్వర్యాలతో, భోగభాగాలతో విలసిల్లుచుండిన కాశ్యపగోత్రీకులు, కరికలాన్వయ, ఓరయూరు పురాదీశ్వర (అనగా తెలుగు చోళవంశీయులు) శ్రీ పగడాల మల్లప్ప రాజు గారి కుమారులు పగడాల శివప్ప రాజుగారి కుమార్తెలు ఈ పట్టపు రామరాజు గారి కుమార్తెయగు వెంగమాంబను భజబలరాయలను బిరుదుగల విద్యానగర రాయ సింహాసనాధీశులైన శ్రీ మన్మహా రాజాధిరాజ రాజ పరమేశ్వర శ్రీ తుళువ వీర నరసింహరాయలు మహారాయలయ్యవారు క్రీ॥శ॥ 1503-1509) అను తుళువ ఇమ్మడి నరసనాయకలయ్య వారు పెండ్లాడెను.
ఈ రాయప్ప దళవాయిగారు శ్రీ తుళువ వీరనరసింహరాయలు విద్యానగర రాయసింహా సనాదీశులయినపుడు విలువైన మేలురకపు ఎరుపు వజ్రమును మరియు రెండు తెలుపు వజ్రములను అతని కిరీటమున పొదిగించెను. మరియు పది లక్షల వరాహాల విలువ చేసేటి పదిమేలు రకపు వజ్రములను బహూకరించెను. ఏ బదివేల వరహాలు విలువ కలిగిన “ఉత్తమ శ్వేత భద్రాశ్వము” (తెల్లగుర్రము) నొకదానిని బహూకరించెను. రాయలు కవసరంబగు రాణువును (సైన్యమును) కైజీతముపై (రోజువారీ జీతముపై) ఏర్పాటు చేయుచుండెను. తుళువ వీరనరసింహరాయలు వద్ద రౌతు రాణువ (గుర్రపుదళం)కు అధిపతి అయిఉండెను.
ఈ మల్లి కార్జునశెట్టి గారి భార్య రామిశెట్టి సూరప్ప గారి కుమార్తె పాపమ్మగారు. ఈ పాపిశెట్టి గారిభార్య పట్టపు మాణిక్యాలశెట్టి గారి కుమార్తె ఓబులమ్మగారు, ఈ భీమేశ్వర మహాదేవశెట్టి గారి భార్య అడపా వీరయ్యగారి కుమార్తె సూరమ్మగారు. ఈ వెంకటప్ప గారి భార్య కంచి కామిశెట్టిగారి కుమార్తె రత్నమ్మగారు. వీరెల్లరూ ద్రాక్షారామము, గోలుకొండ, విజయనగరం, బీజాపూరు, పెనుగొండ, చంద్రగిరి, కాంచీపురం, మంగుళూరు, వంటి చోట్ల విస్తారముగా రత్నాల వ్యాపారాలు చేస్తూ “రాచబలిజలని” పిలువబడుతూ గొప్ప సంపన్నులుగా కీర్తి మంతులుగా యున్నారు.
శ్రీ పోలిశెట్టి రాయప్ప దళవాయిగారు :
దరిమిలా తుళువదేశ ప్రాంతమును జయించి నాయకులుగా పరిపాలించి తుళువ వారిగా, తుళవ దొరలుగా, తుళువబలిజలుగా పిలువబడిరి.
చంద్రవంశములోని యయాతి మహారాజు ద్వితీయ కుమారుడగు తుర్వసుని వంశీయులగు శ్రీతుళువ ఈశ్వరనాయకుని మనుమడు తుళువ నరసానాయకుని కుమారుడగు శ్రీమన్మహారాజాధిరాజ రాజ పరమేశ్వర శ్రీ వీర ప్రతాప శ్రీకృష్ణదేవరాయ మహారాయలయ్య వారు (క్రీ॥శ॥1509-1529) తమ అన్నగారయిన వీరనరసింహరాయలు (క్రీ॥శ॥ 1503-1509) తర్వాత విద్యానగరంన రాయసింహాసనాదీశులై పృద్వీసామ్రాజ్యము ఏలుచూ కలింగ దేశ జైత్ర యాత్రలలో ఉ న్నపుడు శెట్టిపాల గోత్రోద్భవులు శ్రీ మద్వీర బలిజ ధర్మప్రతిపాలకులు చాళుక్య కులజులగు ఈ పోలిశెట్టి భైరవరాయవెట్టిగారి కుమారుడగు పోలిశెట్టి రాయప్పగారు కృష్ణరాయలుచే దళవాయిగా తాంబూలాది సత్కారములు గ్రహించి తమకుగల శ్రీమద్వీరబలిజ సమయ సైన్యమును కైజీతముపై కూర్చుకొని కరవాల భైరవులై ప్రతిమ మార్కోలుగండ బేరందులై దళనాయకులై అశేషమయిన విజయనగర సేనావాహినితో బాటు తన సోదరులగు వెంకటప్ప, నాగిశెట్టి, మల్లికార్జునశెట్టి, పాపిశెట్టి, భృమేశ్వర మహాదేవశెట్టిలతో కూడుకొని పోట్నూరు, సింహాచలం, దుర్గాలను జయించి ప్రతాపరుద్ర గజపతి (1497-1538) పై దండు మీదకు పోయిరి. ఈ యుద్దములలో నాగిశెట్టి పాపిశెట్టి, భీమేశ్వర మహాదేవశెట్టి గార్లు వీర మరణం పొందెను. క్రీ॥శ॥ 1518లో శ్రీమాన్ క్రిష్ణదేవమహారాయలయ్య వారు ఓండ్ర గజపతిని జయించి అతనిరాజ్యములో గయ (బీహార్) వద్ద పల్గుణానది ఒడ్డున, విష్ణుగదాధర దేవాలయమువద్ద జయ స్థంభము ప్రతిష్టాపన గావించి వారిచే కప్పములను గైకొనెను. నాటినుండి ఈ “కటకం" రాజమహేంద్రవరం బలిజసమయాలవారు. కటకంబునేలిన గజపతులను జయించి కప్పంబులు గైకొనినవారు. అనే వీరశాసనము కలిగి ప్రసిద్ధికెక్కారు. ఈ పోలిశెట్టి రాయప్ప దళవాయి గారు భజబలరాయలని ప్రసిద్ధికెక్కిన శ్రీ వీరనరసింహరాయల భందువర్గములోని వారుగా గౌరవించబడిరి.
ఈ "పోలిశెట్టి రాయప్ప దళవాయి” గారికి వీరభసప్ప, తిమ్మప్ప నర్సప్పశెట్టి నాయక మహాపాత్రుడు, బైరిశెట్టి, వీరిశెట్టి అను సంతానము కలిగిరి. వీరు గజపతులు, గోలుకొండ సుల్తాన్ “మల్కిభారమ" అను పేరు గలిగిన ఇబ్రహీం కలీకుతుబ్షా క్రీ॥శ॥ 1550-1580) కాలంలో గొప్పవర్తకులుగా పేరునొందెను.
శ్రీ పోలిశెట్టి నర్సప్పశెట్టి నాయకుడు :
శ్రీ మద్వీరబలిజ ధర్మప్రతిపాలకులై వర్తక వాణిజ్యాలు కొనసాగిస్తూయుండి వివిధ ఆయుద ప్రయోగవిద్యానిపుణుడై యుండెను. తూర్పు చాళుక్యవంశీయులగు శ్రీ తెలంగ వీర ముకుంద గజపతి దేవ మహారాజులుంగారు (క్రీ॥శ॥ 1559-1568) గౌడ దేశముపై విజయం సాధించి కటక సింహాసనాదీశులవుటలో సహాయ మొనరించిన రాజు మహేంద్ర వర “దండపాట” రాజ్యములోన ఇరువది ఒక్క స్థలాలయందు గల బలిజవారు మరియు నానాజనులపై విధించుచుండిన పెండ్లి సుంకము, పాను సంకము లేకుండా చేయించెను. ఈ రాజ మహేంద్ర పురరాజ్యము నందు ఉంటూ అఖిల దేశాలలోనూ వాణిజ్యము నెరుపుతూ ఉన్న ఇరువది ఒక్క స్థలాల బలిజ పెక్కుండ్రు కున్నూ రాజ మహేంద్ర వర బలిజలనే పేరు గలదు.
ఈ పోలిశెట్టి నర్సప్పశెట్టి గారికి రంగప్ప, రాయప్ప దేశాయ్ గున్నయ్యశెట్టి నాయక మహాపాత్రుడు, వెంకటాద్రినాయుడు, కేసవప్ప నాయుడు, పాపలింగమశెట్టి మహాపాత్రుడు అని సంతతి కలిగెను. వీరెల్లరూ వాణిజ్యము సాగించి ప్రసిద్ధికెక్కారు. వీరిలో రాయప్పగారు రాజమహేంద్ర వరరాజ్యదేశాయి పదవి నలంకరించెను. వీరి తర్వాత వీరి సహెూదరుడు గున్నయ్యశెట్టి గారు ఈ రాజ మహేంద్ర వరరాజ్య దేశాయిగా ఉండి ద్రాక్షరామము ముఖ్యకేంద్రముగా అఖిలదేశాలలోనూ వాణిజ్యము సాగించెను. శ్రీ పోలిశెట్టి గున్నయ్య శెట్టి నాయక మహాపాత్రుడు గారు (క్రీ॥శ॥ 1537 1633)
ఈ నరసప్పశెట్టి గారి తృతీయకుమారుడును చాళుక్య వంశపరంపరలోని 31వ॥ తరానికి చెందిన శ్రీ పోలిశెట్టి గున్నయశెట్టి నాయక మహాపాత్రుడు గారు క్రీ॥శ॥ 1537-1633 శ్రీ మద్వీర బలంజ్య సమయవంశ తిలకులై రాజమహేంద్ర పురరాజ్యమునకు దేశాయిశెట్టి గారై వర్తకవ్యాపారములున్నూ, న్యాపరిపాలనమునూ, చేయు చుండెను. గోలుకొండ సుల్తాను మహామ్మద్ కలీకుతుబ్షా (కీ॥శ॥1580-1611) గారి వలన మాలిక్-ఉల్-తుజ్జర్ యనియు గుర్తింపుపొంది గొప్ప శాహుకార్లు (షావుకార్లు) గా పేరొంది యున్నారు. వీరు వీరి వంశీయులు, రాజమహేంద్ర వరరాజ్యములో “పొల్నాటి" పొన్నాడ, బిక్కవోలు, కాకినాడ, సెలపాక, బోడసకుర్రు పరగణాలను కౌలుకు. కౌలుకు తీసుకొని ఇజారాదార్లుగా పేరొందారు.
క్రీ॥శ॥ 1603 నుండి మచిలీపట్నము (బందరు) నుండి వచ్చి వర్తకులతో విదేశీ వాణిజ్యము నెరుపుతూ తెలుగు, కన్నడ, అరవం, మరాటా, పారశీ, కొంకణి, ఉ ర్దూ, డచ్చి వంటి బహు బాషా కోవిదులై అఖిలదేశముల యందును. వర్తక వాణిజ్యాదులను గావించుచుండిరి. మిక్కిలిదైవభక్తి పారాయణులై సర్జన సాంగత్యముతో భీదజనోద్దారకులై పంచారామాల్లో అనేక సత్రములను పోషిస్తూ పెక్కు జీర్ణ దేవాలయాలను ఉద్దరించి నిత్యకయింకర్యములను నిర్విఘ్నముగా జరిగేటట్లు ఏర్పాట్లు చేశారు.
46 తరాలు నుండి కొనసాగుతున్న ఈ చాళుక్యక్షత్రియ బలిజ వంశవృక్షములోని ప్రస్తుత తరాల వంశీయులు ప్రదానముగా ఉభయ గోదావరి జిల్లాలలో, రాజమండ్రి, ద్రాక్షారామము, ఏలూరు, కొప్పర్రు, బ్రహ్మపురి, తాళ్ళరేవు, కోరంగి, చల్లపల్లి, గూడాల, అత్తిమితణుకు, పురణాళపాళెం వ్యాఘ్నేశ్వరం, దేవగుప్తం, కార్డినాడవంటి ప్రాంతాలలో స్థిరపడ్డారు.