స్వాతంత్య్ర సమరయోధుడు కోట నారాయణ దొర (1897-1984) విశాఖజిల్లా, రావికమంతం(మం)చోడవరం దగ్గర కొత్తకోట గ్రామములో జన్మించారు. స్వాతంత్య్ర సమరములో చురుకుగా పాల్గొన్నారు. జైలుకెళ్లారు. పంచాయితీ ప్రెసిడెంటుగా సుదీర్ఘకాలము చేశారు. 1962నం॥లో ఎం.ఎల్.ఎ.గా గెలిచారు. సామాజికం సేవలో భాగంగా భూములను పేదలకు ఉచితంగా పంచిపెట్టారు. అనాధశవాలకు భూములను పేదలకు ఉచితంగా పంచెపెట్టారు. అనాధ శవాలకు దహనకార్యాలు జరిపించేవారు. వి.వి.గిరి (రాష్ట్రపతి) పి.వి.జి.రాజు (విజయనగరం) కొమ్మూరు అప్పడుదొర (భోగాపురం ఎం.ఎల్.ఎ.) సాగి సీతారామరాజు, సాగి సూర్యనారాయణరాజు (తంగేడురాజులు) లకు ఆప్తమిత్రులు మహాత్మాగాంధీగారితో కలకత్తాలోనూ, నక్కపల్లి పోరాటాలకు నాయకత్వం వహించిన స్వాతంత్య్ర సమర యోధుడు. జిల్లా పోలీసు కమిటీ డైరెక్టరుగానూ, కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టరుగాను, జిల్లా గ్రంథాలయ డైరెక్టరుగా పని చేసిన సమయంలో చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. కుస్తీ పోటీలలో, కోడిరామమూర్తికి సమానుడు.