భరతమాత నుదుట 'సింధూ'రం
పి.వి.సింధు... ప్రస్తుతం భారత దేశంలో మారుమోగుతున్న పేరు. రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఆమె క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఐకాన్ అయింది. భాగ్యనగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు గురించి ఆసక్తికర సంగతులు.
పి.వి. సింధు పూర్తి పేరు పూనర్ల వెంకట సింధు. జులై 5, 1995న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. ఆ దంపతులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. ఈ ఆట వారిద్దరినీ ఏకం చేసింది. సింధు తల్లిదండ్రులది కులాంతర వివాహం. తల్లి విజయ కమ్మవారి ఆడపడుచు. ఆమె స్వస్థలం విజయవాడ. రమణ కాపు. ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు. అయితే, రమణ తండ్రి ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్లో స్థిరపడ్డారు. రమణ కూడా నిర్మల్లోనే జన్మించారు. తర్వాత ఉద్యోగరీత్యా గుంటూరుకు తరలి వెళ్లారు. రమణ తన వాలీబాల్ కెరీర్ కోసం. రైల్వేలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్లో స్థిరపడ్డారు. 2000 లో రమణకు అర్జున పురస్కారం లభించింది. తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ ఆటగ్బానా సింధు మాత్రం బ్యాడ్మింటన్ ఎంచుకుంది. సింధు కి ఒక అక్క ఉన్నారు. ఆమె పేరు దివ్య. ఆమె ప్రస్తుతం నెల్లూరులో వైద్యవిద్య చదువుతున్నారు.
సింధు ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. మహీంద్రా హిల్స్ లో ని ఆక్సీలియం స్కూల్ లో సింధు ప్రాధమిక విద్య సాగింది. మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కళాశాలలో బికాం డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది.సింధు చిన్నప్పుడు సికింద్రాబాద్లో ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ కోర్టుల్లో కోచ్ మహబూబ్ అలీ వద్ద శిక్షణ పొందింది. అనంతరం గచ్చిబౌలి లోని గోపీచంద్ అకాడమీలో గురువు వుల్లెల గోపీచంద్ వద్ద పదేళ్ల నుంచి శిక్షణ కోచ్ చెప్పిన డైట్ మాత్రమే సింధు తీసుకుంటుంది. కూతురు కోసం తల్లిదండ్రులు కూడాఆ ఆహారాన్నే తినడం అలవాటు చేసుకున్నారు.. సింధు చిన్నపటి నుంచి ప్రాక్టీసి కి డుమ్మా కొట్టలేదు. తెల్లవారు జామున 4 నుంచే ఆమె సాధన మొదలయ్యేది. ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ కావాలన్నదే ఆమె లక్ష్యం.2013లో సింధు అర్జున అవార్డు అందు కుంది. 18 ఏళ్లకే అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారిణిగా రికార్డ్ల్లోకి ఎక్కింది.
సింధు అతి చిన్న వయసు 20 ఏళ్లు) లోనే పద్మశ్రీ పురస్కారం (2015) అందుకుని చరిత్ర ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భారత మహిళ కరణం మల్లీశ్వరి ఆమె తర్వాత విశ్వ క్రీడల్లో పతకం గెలిచిన తెలుగమ్మాయి పి.వి.సింధు మాత్రమే. అంతేకాదు ఇప్పటి వరకు ఏ భారత నారి.. కాంస్యం దాటి ముందు కెళ్లలేదు. 2012 లండన్ ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలవడమే ఇప్పటిదాకా బ్యాడ్మింటన్లో భారత షట్లర్ల అత్యున్నత ప్రదర్శన. కానీ సింధు ఒక అడుగు ముందుకేసింది.2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో రజత పతకంతో చరిత్ర సృష్టించి కోట్ల భారతీయుల కలల్ని నిజం చేసింది మన తెలుగు తేజం పి.వి.సింధు.
2013 ప్రపంచ ఛాంపియన్షిప్ 2013 లో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్ షిప్ లో ఆడిన తెలుగు అమ్మాయి. ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి. సింధు సంచలనం నమోదు చేసింది. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న చైనా క్రీడాకారిణిని ఓడించి కార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆగస్టు 8, 2013న జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ యిహాన్ వాంగ్ను 21-18, 23-21తో సింధు ఓడించింది. 55 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించింది. కవోరి ఇమబెపు (జపాన్)తో ఆగస్టు జరిగిన రెండో రౌండ్లో సింధు 21 19, 19-21, 21-17తో విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధుకు గట్టిపోటీనే లభించింది. నిర్ణాయక మూడో గేమ్ సింధు ఒక దశలో 10-13తో వెనుకబడింది. దశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సింధు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14-13తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది.2016 రియో ఒలింపిక్స్ పతకాల కోసం భారత్ తల్లడిల్లుతున్న సమయంలో పి.వి.సింధు భారత్ కు రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఈ ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఎంలో కెనడాకు చెందిన మిషెల్లీ లీ ను 2-1 తేడాతో, హంగరీకి చెందిన లారా సరోసీని 2-0 తేడాతో ఓడించి 16వ రౌండులో చైనీస్ తాయ్ జూ యింగ్ పై 2-0 తో గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.
క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ ఇహాన్ను 2-0 తో ఓడించి సెమీ ఫైనల్కు చేరుకుంది. 2016, ఆగస్టు 18వ తేదీ జరిగిన సెమీ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహరాతో వీరోచితంగా పోరాడి 2-0తో ఆమె పై విజయం సాధించి ఫైనల్స్క చేరింది. నోజోమీ ఒకుహరా ను ఓడించడం ద్వారా ఒలంపిక్స్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.