క్రీ॥ శకం 15వ శతాబ్ధం, పెనుగొండ సామ్రాజ్యానికి కుడి భుజంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ (మర్రిమాను)కు భర్త బలిజ వీరునిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ బాల వీరయ్య నాయకుడి గాథే తిమ్మమ్మ మఱిమాను కథ.శ్రీ గంగరాజు బాల వీరయ్య నాయకుడు 1380 ప్రాంతాలలో జన్మించాడు. వీరి స్వగ్రామం గూటి బయలు, వీరు ఎద్దుల వాండ్ల కోటకు పాలకుడు. వీరి ఆధీనంలో కమ్మల వాండ్ల బురుజు, బలిజ పల్లె, బురుజు పల్లె, మేకల చెఱువు కోట ప్రాంతాలు ఉండేవి. శ్రీ వీరయ్య నాయకుడు పెనుగొండ సామ్రాజ్యధీశుడు శ్రీ వీరభల్లాలునికి అత్యంత విశ్వాసపాత్రుడైన సామంతుడు.
బుక్కరాయలతో యుద్ధం 1336లో హంపీ విజయ నగరం స్థాపించబడింది. శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదుగుతున్న హంపీరాజుల కన్ను పెనుగొండపై పడింది. హెూయసాల సామ్రాజ్యానికి రాజధాని పెనుగొండ, దానికి రాజు వీరభల్లాలుడు. విజయనగర సైన్యానికి బుక్కరాయలే స్వయంగా నాయకత్వం వహించగా, ఆయన కుమారుడు విరూపన్న వడియాలు పెనుగొండ దక్షిణ బురుజు వద్ద యుద్ధం చేయసాగారు. సైనిక సంపత్తిలో మెరుగైన విజయనగరం ముందు పెనుగొండ నిలువలేకపోయింది. యుద్ధం తీవ్రమయ్యే కొలది, పెనుగొండ కోట ద్వారాలు ఒక్కొక్కటిగా కూలి తెరువబడ్డాయి. ఈ యుద్ధంలో వీరభల్లాలుడు వధించబడగ గోపినాయుడు, వెంకటపతి రాయలు, విజయనగరం సైన్యంచే బంధింపబడ్డారు. వీరయ్య నాయకుడు తనతో ద్వంద యుద్ధం చేసి ఓడిన బుక్కరాయలు కుమారుడు విరూపన్న వడియాల్ని బంధించి రహస్య ప్రదేశానికి తీసుకుపోయాడు.తన కుమారున్ని క్షేమంగా అప్పగించినందుకు తను జయించిన సామ్రాజ్యాన్ని బుక్కరాయలు వీరయ్యనాయకుడికి ఇవబోగా దాన్ని తిరస్కరించిన వీరయ్య నాయకుడు, తన తమ్ముడు గంగరాజుకు ఎద్దుల వాండ్ల కోటకు అధిపతిని చేసి, తన ప్రభువు వీరభల్లాలుని స్మరిస్తూ వైరాగ్యంతో జీవితాంతం తన తమ్మునికి సలహాదారుగా అవసరం వచ్చినప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు తప్ప రాజ్యం మాత్రం చేయలేదు.పిండారీల పీచ మణించిన వీరయ్య నాయకుడు : మధ్య యుగాలలో, ధగ్గులు, పిండారీలు, దారి దోపిడీలు చేసేవారు. పిండారీలకు చిన్న, చిన్న రాజులు సైతం తలవంచేవారు. పిండారీలు, ప్రధానంగా దేశాటనం చేసేవారిని, వర్తకుల్ని దోచేవారు. ఓమారు, తన కోటకు సమీపంలో ఇతర రాజ్యాల నుండి బండ్లపై సరుకులతో వ్యాపార నిమిత్తం వచ్చిన THIMMAVINA MARRIMANU WORLD'S BIGGEST BANYAN TREE GUINNESS BOOK OF WORLD RECORDS) KADIRI A వారిని మాధవరావు పిండారి అనే దొంగల నాయకుడు అటకాయించి దోపిడీ చేయుచుండగా, వీరయ్య నాయకుడు అది గమనించి పిండారీలుతో తలపడ్డారు. ఆ వణిజులు వీర బలిజ వర్తక సంఘం. ఆ సంఘ నాయకుడు హెగిడేసెట్టి తాము అడగకనే పిండారీలతో తలపడి, మాధవరావు పిండారీని చంపిన వీరయ్య నాయకుడికి ఆ వర్తక బలిజ సంఘం కృతజ్ఞత తెల్పి, తమతో బుక్కపట్నం రావలసిందిగా కోరింది.
బీద దేశాలైన ఆఫ్రికా, ఆసియా దేశాలలో అశాంతి, పేదరికం, నిత్యయుద్ధాలు మొదలగునవి పాశ్చాత్య అభివృద్ధి చెందిన దేశాలలో కన్పించడం అరుదు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కూడా కోస్తా ప్రాంతంలో లేని ఫ్యాక్షనిజం, ముఠాలు, రాయలసీమలో పురివిప్పడానికి, ఆయా ప్రాంతాల వెనుకబాటుతనం, పేదరికం, ప్రజల్లో విజ్ఞానం లేకపోవడమే ప్రధాన కారణాలు. వర్షలేమితో ఎడారులుగా మారిన రాయలసీమ ప్రాంతం, ధగ్గులకు, పిండారీలకు, దారిదోపిడీలకు శతాబ్ధాల తరబడి ఆలవాలమైనది. ఆధిపత్యపోరు, ముఠాలు సర్వసభ్యసమాజానికి తలవంపులుగా నేటికి రాయలసీమలో కొనసాగడం, నాటి పాలేగాళ్ళు, దగ్గులు, పిండారీల సంస్కృతులకు ఆనవాళ్ళే.
తిమ్మమ్మ మర్రిమాను పై ఎందుకీ వివక్ష : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మఱిమాను ఏనాడు తగిన ప్రాచుర్యం పొందలేదు. ఈ మఱిమాను ఇప్పటివరకు జిల్లా వార్తలకే పరిమితం కావడం దురదృష్టకరం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ అంశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు ప్రచారాన్ని కల్పించవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం.