నిరంతర కృషీవలుడు, భావితరాలకు మారదర్శకులు, నవతరానికి స్ఫూర్తి ప్రదాత, సూర్యమిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యర్రింకి సూర్యారావు గారి కుటుంబం గురించి ఆయన సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం..
మరో సూర్యుడిలా ప్రకాశిస్తున్న డాక్టర్ యిద్రింకి సూర్యారావు.. సూర్యమిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు గత 20 సంవత్సరాలుగా మేనేజింగ్ డైరెక్టరుగా సేవలందిస్తున్నారు. వందల మందికి పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేసే సంస్థలలో దేశంలోనే మొదటి 10 కంపెనీలలో ఒకటిగా 500 కోట్ల టర్నోవర్ తో అభివృద్ధి పథంలో తమ కంపెనీని నడిపిస్తున్నారు. ఈ రంగంలో ఆయనకు మూడు పదుల ఏళ్ల అనుభవం ఉంది. రొయ్యల పెంపకం, రోయ్య పిల్లల అభివృద్ధి చేయడం ఈయనకు తెలుసు. రొయ్యలు, చేపలు ప్రాసెస్ చేయడం, వాటిని ఎగుమతి చేయడం వంటి అన్నింలోనూ అపార అనుభవం గడించారు. సూర్యారావు గారు.
వీరిది బి.ఆర్.సి ఇష్యూ-7 సర్టిఫికెట్స్ పొందిన సంస్థ.కెనరా బ్యాంకు భీమవరం బ్రాంచ్ ఆర్థిక సహకారంతో వీరు 2002లో ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా నిర్విరామంగా చేస్తున్న వ్యాపార కృష్టిని పరిశీలించిన భారతీయ స్టేట్ బ్యాంక్ వీరి వ్యాపారం మరింత విస్తరణకు రుణం మంజూరు చేసింది. దీంతో అక్వాసాగులో రైతులకు మరిన్ని మెలకువలు తెలియజేయడానికి సూర్యారావు గారు అనేక సెమినార్లు నిర్వహించారు.
ఈయన తన వ్యాపారాభివృద్ధి కోసం చైనా, థాయిలాండ్, వియత్నాం వంటి పలు దేశాలలో పలు ఆక్వా ఫ్యాక్టరీలను పరిశీలించారు. బ్రెజల్, బోస్టన్, చైనా, దుబాయ్ వంటి ప్రాంతాలలో సముద్ర ఉత్పత్తులపై జరిగిన ప్రదర్శనలలో పాల్గోన్నారు. 2016, 2017లలో కొచ్చిన్ లో జరిగిన ప్రదర్శనలలో తమ సిబ్బందితో సహఆ అక్కడ సముద్ర ఉత్పత్తులపై స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రశంసలు పొందడమే కాకుండా రెండో ఉత్తమ స్టాల్ గా అవార్డును కూడా అందుకున్నారు. రాజీవ్ నగర బాట సందర్భంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డీ వీరు ఎగుమతులు చేస్తున్న ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్ ను ప్రత్యేకంగా సందర్శించారు. అలానే 2020 ఫిబ్రవరిలో కొచ్చిన్ లో జరిగిన ప్రదర్శనలలో కూడా పాల్గోన్నారు.
అక్వా అభివృద్ధి కోసం చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి వెస్ట్ బ్రూక్ యూనివర్సింటీ శ్రీ సూర్యారావు గారికి గౌరవ డాక్టరేట్ ను 2009లో ఇచ్చి సత్కరించింది. తమ పరిశ్రమ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈయన 1300 టన్నుల కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం కలిగిన అత్యంత అధునాతనమైన రెండవ యూనిట్ ను 2012లో మరియు 2000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ దానిని ఎక్స్ టెన్షన్ గా 2019లో ప్రారంభించారు. వీరు నేడు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.రాబోయే ఐదేళ్ల కాలంలో 500 కోట్ల టర్నోవర్ లో వున్న తమ కంపెనీని 1000 కోట్ల టర్నోవర్ దిశగా తీసుకువెళ్లేందుకు సూర్యారావు గారు కృషి చేస్తున్నారు. వీరి కంపెనీ నుండి ఎగుమతి చేసే రొయ్యలు భారతదేశంలో అందరూ కూడా తినాలనే ఉద్దేశ్యంతో భీమవంలో అక్వాడైట్ షాప్ ను ప్రారంభించి రెడీ టు ఈట్ ఎక్స్ పోర్ట్ క్వాలిటీ రోయ్యలను అందిస్తున్నారు. అదే విధంగా వాల్ మార్ట్, బార్బిక్యూ వంటి సంస్థలకు కూడా ఎగుమతులు చేస్తున్నారు. సముద్ర ఉత్పత్తులలో మట్టి వాసన, యాంటిబయాటిక్ లను నిర్మూలించడం కోసం ఎంపెడా ఏర్పాటు చేసిప నిఘా కమిటీలో ఆయన సభ్యుడు.
భీమవరం కే.జి.ఆర్.ఎల్ కళాశాలకు గవర్నింగ్ బాడీ సభ్యులుగా మరియు డి.ఎన్.ఆర్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్న వీరు ప్రస్తుతం వాకర్స్ పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ గవర్నర్ గా నియమితులైనారు. సూర్యారావు గారు ఎప్పుడూ కూడా ప్రజలందరూ అభివృద్ధి సాధించాలనే అలోచిస్తుంటారు. వారు తెలగ కాపు కులంలో జన్మించినప్పటికీ కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, సహాయం అంటూ వారి దగ్గరికి వచ్చిన వారికి తన వంతు సహాయం అందజేస్తుంటారు.కాగా యిద్రింకి గంగారామ్ గారి మగ సంతానమైన ముగ్గురు వ్యాపార రంగంలో బాగా రాణించి స్థిరపడ్డారు.
1. యర్రింకి సూర్యారావు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ -సూర్యమిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్
2. యింకి వెంకన్న- అనంత్ అగ్రో కెమికల్ పంపిణీదారులు
3. యిద్రింకి లీలా ప్రసాద్ కరూర్ వైశ్యా బ్యాంక్ లో విధులు నిర్వహిస్తున్నార
4. యిద్రింకి భానుప్రసాద్ గ్లోబల్ ఆటో ఫ్లీట్ సిస్టమ్స్ స్పేర్ ఫా ఎక్స్ పోర్ట్ వ్యాపారం
వ్యాపార రంగంలో క్షణం తీరకలేని వ్యక్తే అయినా.. యిద్రింకి సూర్యారావు గారు చేపట్టిన సామాజిక కార్యక్రమాలకు కొదవ లేదు. ప్రజల అవసరాలు తీర్చడంలో తనవంతు సాయం అందించడంలోనూ ఆయన అగ్రగన్యులే. సూర్యమిత్ర కంపెనీకి సమీపంలో వున్న యనమదుర్రు గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొరకు బస్ షెల్ట్బరు నిర్మించారు. బర్రివాని పేట గ్రామంలో స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ కట్టించారు. రామాయణపురంలో స్కూల్ పిల్లలకు పుస్తకాలు మరియు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు, దిరుసుమర్రు గ్రామంలో వున్న హైస్కూల్ పిల్లలకు కంప్యూటర్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసి ఉచితంగా కంప్యూటర్లను స్కూల్ లో ఏర్పాటు చేసిన దానగుణ సంపన్నుడు ఆయన.