Fill the form, we are preserving balija surnames and their history.

కృష్ణదేవరాయులు నూటికి నూరు శాతం బలిజ కులస్థుడే.

SRI KRISHNADEVARA RAYALU BELONG TO BALIJA CASTE

కృష్ణదేవరాయులు నూటికి నూరు శాతం బలిజ కులస్థుడే. కులం విషయంలో ఆయన చుట్టూ అల్లుకున్న మాయా వలయాన్ని తమ వాడన్న వాదనలు వినిపించగా, ఇక దానిని సమర్థించేందుకు ఏ మాత్రం సంబంధం లేని ఇతర కులాల పెద్దలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో రాయల నిఖార్సయిన బలిజ కులస్థుడేనని అనేక వాదనలు, చరిత్రక వాస్తవాలు సమర్థిస్తున్నాయి. ఓ గొప్ప పాలకుడ్ని తమ వాడంటే తమ వాడంటూ ప్రచారం చేసుకుంటూ తెరపైకి వస్తున్న వాదనలు పరిశీలించిన తరువాత రాయలవారు బలిజ కులరత్నమేనని చెప్పక తప్పదు. ఈ మాయా వలయం అల్లుకున్నది రాయల చుట్టూ కాదు. రాయల వారి తల్లిదండ్రుల చుట్టూ రాయల తల్లి బలిజ కులస్తురాలని, కాగా ఆయన తండ్రి మాత్రం గొల్ల కులస్థుడన్న అసంబద్ధమైన వాదన ఒకటి ఏళ్లుగా వినబడుతోంది. అయితే ఈ వివాదంలో ఎంతమాత్రం నిజం లేదని.. రాయల వారి తండ్రి నరస నాయకుడు నిఖార్సయిన బలిజ వంశస్తుడేనన్న వాదనల సారంశం చెబుతోంది.

తొలుత తుళువ నరస నాయకుడు అన్న పేరు కూడా వివాదైంది. అయితే ఆయన కర్నాటక లోని తుళు ప్రాంతం లో నివశించారు. కాబట్టి తుళువ నరస నాయకుడు అన్న పేరు వచ్చిందన్న వాదనతో వివాదం సద్దుమణిగింది. ఇక ఆ తరువాత ఆయన కులం వివాదాస్పదం అయ్యింది. అయితే ఆయన బలిజ కులస్తుడేనని, కాగా, బలిజ కులస్తులలో కోటబలిజలు, పేటబలిజలు అని రెండు విభాగాలు వున్నాయని.. కోటబలిజలు ద్విజులు అంటే కేవలం రాచరికం చేయువారని.. వీరు జంధ్యం కూడా ధరిస్తారన్న వాదనలతో రమారమి ఆయన కులానికి సంబంధించిన వాదనలు చెక్ పడ్డాయి. అదెలా అంటే ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సిన అంశం మరోకటి వుంది. భారత దేశంలో చాలా మంది కులం, వర్ణం ఒకటే అని భావిస్తుంటారు. కానీ కులం వేరు వర్ణం వేరు. జననం ద్వారా అందరూ శూద్రులే. కర్మలు చేయడం ద్వారా ద్విజులగా పరిగణింపబడతారు. వేదాలు పఠించిన వారు విప్రులు, బ్రహ్మజ్ఞానం సంపాదించిన వారు బ్రహ్మాణులుగా పరిగణించబడ్డారు. బ్రహ్మాణులలో నంబి బ్రహ్మణులు, తంబలి బ్రహ్మణులు అన్న రెండు కులాలవారు వున్నారు. వీరిద్దరి వృత్తి దేవాలయాలలో పూజాదికాలు నిర్వహించడమే మొదటివారు వైష్ణవ పూజారులు, రెండవ వారు శైవ పూజారులు. అదేవిధంగా క్షత్రియులతో పాటు వైశ్యులు, శ్రూదులలోనూ అనేక కులాలు, ఉపకులాలు వున్నాయి. ఇది కులాలకు, వర్ణాలకు మధ్య తేడా. అలాగే బలిజ కులస్థులలో కోట బలిజలకు, పేట బలిజలకు తేడా అర్థం చేసుకోవచ్చు.

ఇక రాయల రాసిన ఆముక్తమాల్యద ఒకసారి పరిశీలిస్తే.. యమునాచార్యుడు రంగనాథస్వామి పాదాలు చూసిన తరువాత పూర్వజ్ఞానం కలుగుతుంది. అప్పుడు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి రాజనీతి గురించి చెబుతాడు. ఇక్కడ రాజనీతి గురించి చెబుతున్నది యమునాచార్యుడనే పాత్ర అయినా ఆ రాజనీతి రాయలవారి స్వంత రాజనీతి అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆటవిక జాతుల వారు రాక్షస నీతి అవలంబిస్తారు. రాజు ఆజ్ఞకు అటువంటివారు వణుకుతూ బద్ధులై వుండేటట్లు చూడాలి. కోట కాపలా, రక్షణ భారాలను ఆప్త బంధువులకే అప్పగించాలి. ఎవరిని బడితే వారిని నమ్మి ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తే వారు కోటకే ప్రమాదం తీసుకు వచ్చి రాజ్యవిచ్చిత్తికి కారణం కాగలరు. అంటే రాయలవారి కాలంలో తమ కులంవారికి పెద్దపీట లభించింది. మరొక చోట అల్పబుద్ధి గలవారిని, హీనకులస్తులను దూరం చేసుకుంటే వారు తొందరగా అలుగుతారు కనుక వారిని పరాయి వారికి భారం కాకుండా తృప్తిపరుస్తూ వుందు. భార్యల పతిభక్తి, స్త్రీ పురుషులు వావి వరుసలు పాటించడం, దిగువ జాతులు అగ్రజాతులను అనుసరించుట, అధికారి పనికి సేవకులు ఒప్పుకొనుట ఇవన్నీ రాజు దండిస్తాడనే భయంతోనే సుమా! అంటాడు రాయల వారు. చివరి రెండు పేరాలను గమనిస్తే రాయలు అగ్రకులానికి చెందిన వాడనే అర్థం అవుతోంది కదా. ఎందుకంటే ఏ రచయిత కూడా తన జాతిని తప్పుగా చెప్పుకోడు. మరి ఆంధ్ర దేశ చరిత్రలో ఎప్పుడైనా ఏ కాలం లోనైనా గొల్లకులస్తులు అగ్రకులస్తులు చలామణి కాలేదు.

రాయల వారి తండ్రి సంపెట నరస నాయకుడు. ఈయన విజయనగర చక్రవర్తి సాళువ నరసిం హ దేవరాయల వద్ద సర్వ సేనాధిపతిగా వుండేవాడు. వీరు ఇద్దరూ వియ్యపు కుటుంబాలకు చెందిన వారు. ఈదే సాళువ వంశానికి చెందిన తిమ్మరాజు (కన్నడం లో అరుసు అంటే రాజు అని అర్థం) మంత్రిగా వుండేవాడు. నరస నాయకుని పెద్ద భార్య తిప్పాదేవి లేదా తిప్పాంబ. సాళువ నరసిం హ రాయలుకు సోదరి. ఈమె కుమారుడే వీర నరసిం హ రాయలు. సాళువ నరసిం హదేవరాయల తదనంతరం ఆయన కుమారుడు రెండవ నరసిం హరాయలు పిల్లవాడు కావడం తో ఆయనను సిం హాసనం పై కూర్చోబెట్టి నరసనాయకుడు రాజ్యపాలన చేశాడు.

నరసనాయకుని అనంతరం ఆయన పెద్దకుమారుడు వీరనరసిం హరాయలు రెండవ నరసిం హరాయలుకు ప్రతినిధిగా వుండి రాజ్య పాలన సాగించాల్సి వుండగా అతడిని చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇతని కౄరత్వానికి ప్రజలంతా అసహ్యించుకున్నారు. కానీ బలవంతుడు కావడం తో ఎవరూ నోరు మెదపలేదు తిమ్మరుసు తో సహా. కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే ఈయన రాజ్యం చేశాడు. అనారోగ్యం తొ చనిపొయిన తరువాత ఆయన సవతి సోదరుడు శ్రీకృష్ణదేవరాయలును తిమ్మరుసు చక్రవర్తిని చేశాడు.

నరస నాయకునికి ముగ్గురు భార్యలు ఒకరు తిప్పాంబ సాళువ నరసిం హ దేవరాయలకు సోదరి వరుస అవుతుంది. రెండవ భార్య నాగంబ నరసిమ్హ దేవరాయలు సోదరుడు తిమ్మరాజు బంధువులు అరిగండాపురం(దీనినే ఆ తరువాత తల్లి పేరుమీద నతులపురం గ పేరు మార్చరు) గాజుల వారి ఆడపదుచు, ఇక మూడవ భార్య ఓబులాంబ. రెండవ భార్య నాగాంబ ఎకైక కుమారుడే మన హీరో కృష్ణరాయలు. ఈమెనే పెమ్మసాని వారి ఆడపడుచు అని కమ్మ వారు పొరపాటు పడుతుంటారు. ఎందుకంటే గండికోట లో వున్న పెమ్మసాని కుమార్తె పేరు కూడా నాగమ్మే కావడం ఈ పొరపాటుకు కారణం. గండికోట నాగమ్మను దీపాల నాగి అంటారు. నాగాంబను చంద్రగిరి ప్రాంతానికి వచ్చినప్పుడు నరసనాయకుడు మోహీంచి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే విజయనగర రాజులందరూ తెలుగు వారేనన్న సంగతి. నాగాంబ సొంత ఊరు నాగులాపురం, ఈ గ్రామం పేరు అరిగండాపురం. రాయలు ఈక్కడే జన్మించారు. తాను పుట్టిన ఊరు కొరకు వేదనారాయణ స్వామి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాడు. నేటికీ ఈ దేవాలయాన్ని నిర్వహించేది రాయల వారి బంధువులే.

అందువల్లనే తిరుమలదేవి కుమార్తెలను పెళ్ళి చేసుకున్న ఆరవీటి వంశస్తులు రామరాయలు, తిరుమలదెవరాయలులకే రాజ్యం దక్కింది. మిగిలిన రాణులకు పిల్లలున్నప్పటికీ వారికి రాజ్యార్హత దక్కలేదు. కనుక కులకాంతలనే రాజమాతలు గా అంగీకరించేవారు. దీన్నిబట్టి రాయల తల్లిదండ్రుల కులాలు వేరు వేరు కాదన్నది స్పష్టమౌతోంది. అయినా శ్రీకృష్ణదేవరాయలు గొల్ల కులస్థుడన్న వాదనలు ఇప్పటికీ తెరపైకి వస్తున్నాయి. గొల్లలు యాదవులు ఒకటే అనుకోవడం వల్ల ఈ పొరపాట్లను ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి చరిత్రలో గొల్లలు వేరు యాదవులు వేరు. సంస్కృత గ్రంధాలను తెలుగులోనికి తర్జుమా చేసేటప్పుడు తెలుగు కవులు యాదవులను గొల్లలుగా పరిచయం చేశారు. వాస్తవానికి "యాదవ" శబ్దం కుల సూచకం కాదు. అది వంశ సూచకం మాత్రమే. యదు వంశీకులను యాదవులు అంటారు. వీరు గొర్రెలు కానీ ఆవులు కానీ మేపుకునే గొల్లలు కాదు. వీరు క్షత్రియ ధర్మాన్ని పాటించే వారు. వీరు చంద్రవంశ క్షత్రియులు. వీరి దగ్గరి బంధువులే కురు వంశీయులైన పాండవులు, కౌరవులు. వీరిని కురు వంశీకులైనందువల్ల కౌరవులు అని యదు వంశీకులైన వారిని యాదవులు అని పిలిచారు. యాదవ అనేది వంశ సూచకమే కానీ కుల సూచకం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వసుదేవుడు యదు వంశీయుడు. ఈయన ఎప్పుడు కూడా ఆవులను మేపలేదు. శ్రీ కృష్ణుడు వసుదేవుని మిత్రుడైన నందుని ఇంట పెరిగాడు. నందుడు గొల్ల పల్లె అయిన వ్రేపల్లె కు పెద్ద. అంతే కానీ వసుదేవునికి కానీ పాండవులకు కాని బంధువు కాదు. కృష్ణుడు యాదవ వంశీకుడే కానీ నందుడు యాదవ వంశీకుడు కాడు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. గొల్ల పల్లెలో కృష్ణుడు పెరిగాడు, గొల్ల బాలకులతో ఆటలాడుకున్నాడు అంత మాత్రాన గొల్లవాడెలా అవుతాడు? ఈ ఒక్క విషయం లో సరైన క్లారిటీ కి వస్తే అసలైన చరిత్ర మీ కళ్ళకు సాక్షాత్కరిస్తుంది.

ఉత్తర భారతం లో వున్న యాదవులు అంధ్రప్రదేశ్ లో వున్న గొల్ల యాదవులు ఒక్కటి కాదు అన్న విషయం ముందుగా తెలుసుకోవాలి. ఉత్తర భారత యాదవులు మిమ్ములను యాదవులుగా ఒప్పుకోరు ? ఎందుకు. శ్రీకృష్ణ దేవరాయల విషయం లో కూడా పారిజాతపహరణంలో 

యాదవత్వము సిం హాసనస్తుడుగామి 

సిం హాసుడై చెన్ను మెరయ 

నాడునూ నేడునూ యాదవాన్వయమునందు 

జననమందెను వసుదేవ 

మనుజ విభుని కృష్ణుడను పేర

 నరసేంద్రుడు కృష్ణరాయలుగా నాది నారాయణుండు

చేస్తున్నారు. ఈ పద్యం లొని మొదటి పాదం లో యాదవత్వమున కృష్ణుడు సిం హాసనము అధిష్టించలేకపోయాడు అని అర్థం. యదువంశీకులు చంద్రవంశ క్షత్రియులైనప్పుడు రాజ్యాధికారం దక్కకపొవడం ఏంటి? ఇక్కడ తిమ్మనగారి ఆంతర్యంగమనించండి. కృష్ణుడు పసుపాలకుల ఇంట పెరిగినందువల్ల రాజ్యాధికారానికి అర్హత కోల్పోయాడు. అని అర్ధం. రెండవపాదానికి అర్ధం రాజ్యం చేయాలనే కోరికతో మళ్ళీ యదువు సోదరుని(తుర్వసుని) వంశమందు వసుదేవుడు నరసేంద్రునిగా(నరసిం హరాయలుగా) కృష్ణరాయలుగా ఆదినారాయణుండు (శ్రీ మహా విష్ణువు) అని అంటే పశుపాలకుల ఇంట పెరిగితేనే రాజ్యాధికారార్హత కృష్ణుడే కోల్పోయాడు. ఇది నంది తిమ్మన చమత్కారం మాత్రమే. పశుపాలకుల ఇంట పెరిగితేనే కృష్ణుడు రాజ్యార్హత కోల్పోయాడు. మరి పశుపాలకులెలా రాజులవుతారు? ఇక రాయల వారు బలిజ కులస్తుడు అనడానికి చాలా ఆధారాలు వున్నాయి.

చరిత్ర మొత్తం శ్రీకృష్ణదేవరాయలు బలిజకులస్తుడే అని చెబుతొంది. బ్రిటీషు వారి రికార్డులు సైతం విజయనగర రాజులు బలిజ కులస్తులే అని చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యం పైన పరిశోధన చేసిన అతి గొప్ప పరిశోధకుడు పుట్టపర్తి నారాయణాచార్యులు సైతం శ్రీ రాయలు బలిజ కులస్తుడని తన స్వంత దస్తూరితొ ధృవీకరించారు.

ఇన్ని సాక్షాలు అన్నీ రాయలు బలిజ కులస్తుడు అని నిర్ధారిస్తున్నాయి. దీంతో రాయలవారి తండ్రి నరన నాయకుడు నిఖార్సయిన బలిజ కులస్థుడేనని తేటతెల్లం అవుతోంది.


Post a Comment

Previous Post Next Post