వెంకయ్య ఒకవైపు భూస్వామిగా ఎదుగుతూనే మరోవైపు ప్రజాహిత కార్యాలలో పాల్పంచుకునేవారు. పెనుగొండ నియన్ బోర్డు అధ్యక్షులుగా రెండు పర్యాయాలు ఎన్నికై 1904 నుండి 1910 వరకు బాధ్యతలు నిర్వర్తించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. వెంకయ్య గొప్ప దైవభక్తుడు. నర్సాపురం సమీపంలోని అంతర్వేది పుణ్యక్షేత్రంలో వెలిసిన నరసింహస్వామి వారికి నిత్యనైవేద్య పూజాది సేవలు శాశ్వతంగా జరిపించేందుకు కొంత భూమిని సమర్పించుకున్నారు. ప్రతి సంవత్సరం మానంలో ఈ పుణ్యక్షేత్రంలో జరిగే ఉత్సవాలను మొగల్తూరు రాజా వంశీయులు దగ్గర ఉంది. జరిగిస్తారు. పెనుగొండలో రామాలయమును కట్టించి వెంకయ్య ధన్యుడైనాడు. మాణిక్యం అనే వైశ్య మిత్రునితో కలిసి 'జనార్జన కన్యకా మోడల్ స్కూల్ పేరున ఆనాడే పాఠశాల కట్టించి విద్యాభివృద్ధికి కృషిచేశారు.
అమలాపురం తాలూకా, కొత్తపేట దగ్గర గల మందపల్లి గ్రామానికి చెందిన గంధం మారయ్య పుత్రిక శ్రీమతి సుబ్బమ్మను వెంకయ్య వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నరసింహమూర్తి, లక్ష్మయ్య, ఇద్దరు కుమార్తెలు వీరమ్మ, నూరమ్మలు జన్మించారు. ప్రథమ పుత్రికను రాజోలు తాలూకా, యీదరాలకు చెందిన ఏరుబండి గంగన్నకు, రెండవ కుమార్తెను తణుకు తాలూకా కాకిలేరు గ్రామవాస్తవ్యుడైన ఆసు బ్రహ్మనకిచ్చి వివాహం జరిపించారు. పంచాయితీ కోర్టు అధ్యక్షులుగా ఆరు సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించారు. తండ్రి స్థాపించిన పాఠశాలకు కార్యదర్శిగా వుండి అభివృద్ధి చేశారు. వెంకయ్య రెండవ కుమారుడు మన జవ్వాధి లక్ష్మయ్య నాయుడు 1901లో జన్మించారు. స్వగ్రామం పెనుగొండలో మూడవఫారం వరకు చదివి తణుకులో స్కూల్ ఫైనల్ పూర్తి చేశారు. స్కూల్లో 'స్కౌట్ కెప్టెన్'గా ఎన్నికై సేవాదృక్పథాన్ని అలవరచుకున్నారు. 1923లో పంచాయితీ కోర్టు మెంబర్ పదవికి రాజీనామా చేసి యూనియన్ బోర్డు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. లక్ష్మయ్య నాయుడు అధికారం చేపట్టేనాటికి బోర్డు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. అప్పటి మండలాధికారి డా దొర (కలెక్టర్), బోర్డు __మాజీ అధ్యక్షుడు మీర్జాపురం రాజావారు. బోర్డును రద్దు చేయాలని పాలకులకు సిఫారసు చేశారు. అయితే లక్ష్మయ్య అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత బోర్డు పరిస్థితులు చక్కబడటంతో రద్దు ప్రతిపాదనను విరమించారు. 1928లో రెండవసారి జిల్లా బోర్డు అధ్యక్షులుగా లక్ష్మయ్య నాయుడు ఎన్నిక కావడం మరో గొప్ప విషయం.
Javvadi laxmayya naidu - vice chancellor of yn college , narasapur |
జిల్లాల విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా బోర్డు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పేరున సంస్థను స్థాపించి పేద రైతులకు రుణాలు అందించి రైతు బాంధవునిగా ప్రశంసలందుకొన్నారు. బోర్డు అభివృద్ధి లక్ష్యంగా తన సొంత సొమ్ముతో పశువుల సంతను ఏర్పాటు చేశారు. ఈ సంత వలన సాలుకు వెయ్యి రూపాయల ఆదాయం బోర్డుకు లభించింది. ప్రజాసేవలో తరించిన లక్ష్మయ్య గ్రంథాలయాన్ని నెలకొల్పి భాషాభివృద్ధికి కృషి చేశారు. 'శ్రీకృష్ణ దేవరాయలు' అనే గ్రంథాన్ని రచయిత లక్ష్మయ్యకు అంకితమిచ్చారు. అలాగే చాలామంది గ్రంథ రచయితలకు ఆర్ధిక సహాయం చేసి ప్రోత్సహించారు. రైతుల శ్రేయస్సు కోరి ఆనాడే 20 వేల రూపాయల వ్యయంతో బియ్యపు మిల్లును స్థాపించారు. పరిపాలనా దక్షులుగా, దాతగా, సేవాతత్పరునిగా, రైతు బాంధవునిగా, సాహితీపోషకునిగా సకల గుణశీలిగా విలసిల్లిన జవ్వాది లక్ష్మయ్య కాపుజాతిలో జన్మించడం గర్వకారణం.