Fill the form, we are preserving balija surnames and their history.

Meraka veedhi Telaga

మెరకవీధి తెలగ అనేవారు రాజ కుటుంభీకులు, వీరు మెరకవీధి రాజమండ్రిలో నివసించేవారు, మరియు వారు 'తెలగ' కులస్థులు కాబట్టి వారిని "మెరకవీధి తెలగ" అని పిలుస్తారు, గతంలో చంద్రగిరి బలిజలు అని పిలిచేవారు, ఎందుకంటే వారు 1757 కాలంలో చంద్రగిరి నుండి రాజమండ్రికి వలస వచ్చిన బలిజ కులస్థులు గనుక.ఫ్రెంచ్ పాలనలో ఈ తెలగాలు రాజామండ్రి యొక్క నవాబ్ కోటను ఆక్రమించారు .రాజమండ్రిలోని మెరకవీధి ఎగువ ప్రాంతం సరిగ్గా వేణుగోపాల స్వామి ఆలయం యొక్క ప్రధాన తలుపు నుండి మొదలవుతుంది. మొదట వీరు చంద్రగిరి సేనాతిపతులుగా వ్యవహరించినవారు. ఎప్పుడైతే 1649లో షాజీ భోస్లే చంద్రగిరి కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు శ్రీరంగ రాయలుతో పాటు అక్కడున్న చంద్రగిరి బలిజలను(మెరకవీధి తెలగ బీజాపూర్కు ఖైదీలుగా తీసుకునివెళ్ళారు. తరువాత వారు మరాఠా సైన్యంలో చేరారు సుమారు 1754 వరకు దాదాపు వంద సంవత్సరాలు అక్కడ పనిచేశారు.

రాజమండ్రి నవాబు-“జాఫర్ అలీఖాన్” తన ఎస్టేట్ను స్వాధీనం చేసుకున్న కారణంగా ఫ్రెంచ్ వారికీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు అలీ ఖాన్ నాగపూర్ పరిపాలిస్తున్న రాఘోజీ భోంస్లే సహాయం అడిగాడు. ఈ ఫ్రెచ్ వారిపై తిరుబాటులో సహాయం చేసిన రాఘోజీ భోస్లే సైన్యంలో, అప్పుడు షాజీ భోస్లే బందించి తీసుకువెళ్లిన చంద్రగిరి బలిజలను, అతని సైన్యంలో చెర్కుకున్నాడు, వారే ఈ రాజముండ్రిలో ఫ్రెంచ్ వారిపై వీరోచితంగా పోరాటం చేసినవారు, కానీ ఆ పోరాటంలో ఓడిపోయిన కారణంగా చాల మంది చంద్రగిరి బలిజలు(మెరకవీధి తెలగ) యుద్ధం ముగిసాకా రాజముండ్రి వదిలిపోయారు.

తరువాత కొన్ని కుటుంబాలు 1757 లో మళ్ళీ రాజమండ్రి ప్రావిన్స్ లోకి వచ్చారు, ప్రస్తుత మెరకవీధి అని పిలిచే ఒకప్పటి నవాబ్ కోట ప్రాంతానికి చేరి కోటను స్వాధీనం చేసుకున్నారు, ఇప్పటికీ పాత నవాబ్ కోటకు చెందిన ఖాజీ వీది సమీపంలో ఉన్న మసీదు కూలిపోయే స్థితిలో ఉంది. తరువాత ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధాలలో ఫ్రెంచ్ వారికీ సహాయం చేసారు. మరియు తరువాత బ్రిటిష్ సైన్యంలో భారతీయ అత్యధిక సైనిక పదవులను కలిగి ఉన్నారు. వారు వేణుగోపాల స్వామిని తమ కుటుంబ దైవంగా ఆరాధిస్తారు. ఇప్పటికీ మెరక వీధుల్లో విగ్రహం ఊరేగిస్తారు. వీరు యుద్ధ వీరులు, యుద్ధం చేయడానికే పుట్టినట్టు చెబుతారు మరియు తరువాతి కాలంలో కూడా వీరు చాలా యుద్దాలు చేసారు. ఒకే నగరంలో ఉన్న ఇతర తెలగాలతో పోల్చినప్పుడు ఈ కుటుంబాలకు భిన్నమైన ఆచారాలు ఉన్నాయి.వారితో పెద్దగా పెళ్లి సంబంధాలు కూడా ఉండేవి కాదు.ఇప్పటిటికి చంద్రగిరిలో ఉన్న బలిజవారి గోత్రాలుతో అలానే వారి ఇంటిపేర్లు కూడా వీరికి సరిపోతాయి."మెరక వీధి తెలగా" అనే పదాన్ని ప్రత్యేకంగా రాజమండ్రిలోని తెలగా కుటుంబాలను సూచిస్తుంది.

Post a Comment

Previous Post Next Post