Fill the form, we are preserving balija surnames and their history.

Kunisetty Venkata Narayana Dora - 1st MLA Of salur

భారతదేశ స్వాతంత్య్రం కోసం తెల్లదొరలతో పోరాడిన సాలూరు స్వాతంత్య్ర యోధుడు.శ్రీ కూనిశెట్టివెంకటనారాయణదొరను పాలకులు విస్మరిస్తున్నారుతెల్లదొరలను గడగడలాడించిన యోధుడు కూనిశెట్టిదొరస్వాతంత్య్ర ఉద్యమం కాలంలో నేనుసైతం అంటూ ఆయన పోరాడారు.


1907జూలై 4 వెంకటనారాయణదొర జన్మించారుతన 15 ఏట నుంచే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారువిలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన వనరులు ఉన్న వాటిని వదులుకుని స్వాతంత్య్ర ఉద్యమం పట్లఆకర్షితులయ్యారు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమంలో సారా వేలంపాటలు జరగకుండా ఆయన అడ్డుకున్నారువిదేశీ వస్తు బహిష్కరణకు సహకరించారు. 1930లో విశాఖపట్టణంలో మహాత్మగాంధీ అధ్యక్షతన జరిగిన ఉప్పుసత్యాగ్రహం పోరాటంలో పాల్గొన్నందుకు ఆయన 6నెలల కఠిన కారాగారశిక్షను అనుభవించారు. 1932లో గాంధీజీశిష్యురాలు వేదాంతం కమలాదేవి అధ్యక్షతన స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించినందుకు బ్రిటీష్ వారుఆయన్ను అరెస్టు చేశారు. 1937లో స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తూప్రజలు దేశభక్తి వైపు ప్రభావితులయ్యేలా చేసినందుకు అప్పటి పార్వతీపురం డీఎస్పీ హోలండన్ దొర ఆయన్ను కొట్టిబరంపురం జైల్‌కు తరలించారుదేశానికి స్వాతంత్య్రం రాకముందే పట్టణానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోసంఅనుమతులు తెప్పించారుస్వాతంత్య్రం అనంతరం జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో ఆయన ఎన్‌జిరంగా స్థాపించినకృషికార్‌లోక్ పార్టీ తరుపున పోటీచేసి ప్రథమ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారురెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగాతెల్లదొరలు బొబ్బిలి-సాలూరుమధ్య రైలుమార్గాన్ని నిర్మించారుబ్రిటీస్‌వారు సౌకర్యార్థం రైలుమార్గం నిర్మించి తరువాతరద్దుచేశారునారాయణదొర ఎమ్మెల్యే అయిన తరువాత రైలుమార్గాన్ని పునరుద్దరింపచేశారుఒరిస్సాలోని కొరాపుట్ఆంధ్రాలోని విశాఖకు రైలును నడిపించే ప్రణాళికను రూపొందించగా అప్పట్లో అమలుకాలేదుతొలి ఎమ్మెల్యేగాస్వాతంత్య్రయోధుడుగా ఆయన చేసిన సేవలు ఈప్రాంత ప్రజలు మరువరానిదిఅటువంటి మహనీయుడు విగ్రహాన్నిపట్టణంలో ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతుందితమ సొంతఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామనివిగ్రహస్థాపనకు అనుమతులు ఇవ్వాలని ఆయన కుమారుడు కూనిశెట్టి జెట్టిదొర కోరుతున్నారు.



 30 ఏళ్లుగా దొరకుటుంబసభ్యులు కోరుతున్న పురపాలకులు పట్టించుకోవడం లేదురాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు అడ్డగోలుగాఅనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు దొరలాంటి సమరయోధుని విగ్రహం ఏర్పాటు పట్ల వివక్షత చూపుతున్నారనేవిమర్శలు వినిపిస్తున్నాయిఓటుబ్యాంకు రాజకీయాలకు పాలకులు ప్రాధాన్యత ఇస్తున్నంత కాలం దొర లాంటి నిస్వార్థనాయకుడికి గుర్తింపు లభించదేమోనని విమర్శిస్తున్నారు. 1983లో అప్పటి ఎమ్మెల్యే అధ్యక్షతన విగ్రహా ఏర్పాటుకుకమిటీని కూడా ఏర్పాటు చేశారుకానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదుతహశీల్దార్ కార్యాలయం ఎదురుగామామిడిపల్లికి వెళ్లే రహదారికి కూనిశెట్టి నారాయణదొర మార్గం అనేపేరు పెట్టాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మాణం కూడాజరిగింది.


ELECTION RESULT OF SALUR :



Post a Comment

Previous Post Next Post