Fill the form, we are preserving balija surnames and their history.

రావు బహదూర్ కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తి నాయుడు ( kommireddy naidu )

రావు బహదూర్ నాయుడు గారు


FIRST ANDHRA CHAMBER OF COMMERCE

సంస్కృతి సాంప్రదాయాల పరిపోషణా నిబద్దత గల వంశీయులు కొమ్మి రెడ్డి సూర్యనారాయణ మూర్తి నాయుడు గారు. వీరి జన్మస్థలము ఫ్రెంచ్ యానంకు సమీపానగల జార్జిపేట, వీరి పూర్వీకుల స్వస్థలము రాయలసీమ నుండి. గుంటూరు జిల్లా బాపట్ల తర్వాత కృష్ణ జిల్లా మచిలీపట్నం (బందరు) ఒక ఫ్రెంచి కంపెనీలో ఉద్యోగిగా పని చేసిన వీరి ముత్తాత బుచ్చయ్య నాయుడు గారు 1760 సం॥లో బదిలీ పై బందరు వదలి యానాం చేరి అక్కడ స్థిరపడ్డారు. ఆయన కుమారుడు కొమ్మిరెడ్డి వెంకన్న నాయుడు కుమార్తె వెంకట సుబ్బాయమ్మ. వీరు బలిజ కులస్థులు.

వెంకన్న నాయుడుకు ఫ్రెంచి భాషలో ప్రవేశముండడంతో "నీలపల్లి”లో స్థాపించబడిన “లెనారస్” అనే ఒక ఫ్రెంచి కంపెనీలో కమీషన్ ఏజంటుగా చేరారు. వెంకన్ననాయుడు గారి సోదరి వెంకట సుబ్బాయమ్మ పిన్నవయస్సులోనే భర్తను కోల్పోయి సహగమనానిని సిద్ధపడింది. అందుకు నిషేదము విధిస్తూ అప్పటి ఫ్రెంచి అడ్మినిస్ట్రేటర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా ఆయనకు దృష్టిపోయిందని అప్పుడు సహోద్యోగులు ఒత్తిడి వలన తన నిషేదపు ఉత్తర్వులను ఉపసంహరించుకున్న అడ్మినిస్ట్రేటరు దృష్టిని తిరిగి పొందగలిగాడని చెబుతూ ఉంటారు. సతీసహగమనాన్ని పాటించి పతిదేవునితో పుణ్యలోకాల కేగిన పరమ పతివ్రతా శిరోమణి సుబ్బాయమ్మ గారి ఆత్మాహుతి స్మారకంగా “యానాం”లోని ఆప్రదేశం ఇప్పటికి "సుబ్బాయమ్మ గద్దె” గా పిలువబడుతోంది. కొమ్మిరెడ్డి వంశీకులామెను తమ కులదేవగా ఆరాధిస్తున్నారు. సహగమనం సమయములో అశ్రు నయానలతో తనకు పసుపు కుంకుమలు సమర్పిస్తున్న సోదరుడు వెంకన్న నాయుడుని ఉద్దేశించి సుబ్బాయమ్మ నీ వంశం పాలపొంగులా అభివృద్ధి చెందుతుంది. తులసీవనంలా పరిమళాలుతో విస్తరిస్తుంది అని దీవించిందని ఆ దేవత ఆశీస్సులు ప్రభావమే తమ వంశాభివృద్ధికి మూలమని ఆ వంశీకులు ప్రగాడ విశ్వాసంతో చెబుతారు. (లక్ష్మిస్పిన్నింగ్ మిల్సు వెనుక) సుబ్బాయమ్మ గద్దె ఉంది.

వెంకన్న నాయుడు గారి కనిష్ట కుమారుడు నరసింగరావు గారికి తెలుగు సంస్క దేశీయ భాషలలో పాండిత్యంతో పాటు ఆంగ్లము, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలలో ృతాది. కూడా చక్కని ప్రవేశముండేది. అంతేగాక ఆయుర్వేదం జోతిష్యం, మంత్ర శాస్త్రాలలో సైతం ప్రావీణ్యముండేది. ఇక సంగీతము ఆయనకు ఆరోప్రాణం, ఆ అభిరుచులనే పుణికి పుచ్చుకున్నాడు ఆయన జ్యేష్ట కుమారుడు శ్రీ సూర్య నారాయణమూర్తి నాయుడు.సూర్యనారాయణ మూర్తి నాయడు జన్మించే సమయములో తండ్రి నరసింగరావుగారు పొలం దగ్గర మకాంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సూర్యభగవానుడు కమండలధారియైన ఒక వృద్ధుని రూపంలో వచ్చి తనపై నీళ్లు చల్లి “నీకు ఒక మహాపురుషుడు జన్మిస్తాడు. వెళ్లి నీ కుమారుని చూచుకో” అని చెప్పినట్లు అనిపించిందని అందువలననే తన మొదటి సంతానమైన సూర్య నారాయణమూర్తి నాయుడు పేరు పెట్టడం జరిగిందని ఆయన చెబుతుండేవాడు. ఆయన కుమారులు మిగతా వారికి కూడా వరుసగా భాస్కర మూర్తి, ప్రభాకర మూర్తి, మార్తండరామూర్తి అను పేర్లు పెట్టాడు. కాని కనిష్ట కుమారునికి మాత్రం కేశవ మూర్తి అనుపేరు పెట్టడం వలన సూర్యభగవానుడు మరలా వృద్ధమానవుని రూపంలో వచ్చి దర్శనమిచ్చి అప్పుడే నన్ను మరచిపోయావా అని అడిగినట్లు తానుక్షమాపణ కోరినట్లు ఆయన చెబుతుండేవాడు ఆకారణం చేతనే అటు తర్వాత తమ వంశంలో ఎవరో ఒకరికి సూర్య నామం ఉంటుందని ఆ వంశీకులు చెబుతారు నరసింగరావుకి నలుగురు కుమార్తెలు.


సూర్యనారాయణ మూర్తి, స్పురద్రూపి, ఆజానుబాహుడు. మేలిమి బంగారు ఛాయగల మేనిపై లాంగ్ కోటు లేదా పుల్ సూటు, తలపై టోపీ లేదా తలపాగాను ధరించి రాజఠీవితో చూపరులకు ముచ్చట గొలుపుతుండేవాడు.
క్రీ॥శ॥ 1887 సం॥లో మన నాయుడు గారు కాకినాడలోని పిఠాపురం రాజా వారి కళాశాలలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణతపొంది. ఎఫ్.ఎ.లో చేరారు. ఆ సమయంలో కోనసీమలోని “అద్దంకి వారి లంక” గ్రామవాస్తవ్యులైన పెద్దయ్య నాయుడు గారి కుమార్తె వెంకట మహాలక్ష్మీతో వివాహం జరిగింది తర్వాత విద్యాభ్యాసం సజావుగా కొనసాగలేదు కుటుంబ బాధ్యతలు మీద పడడం అందుకు కారణం.నాయుడు గారి తండ్రి నరసింగరావు గారు యానాం నుండి మకాం మార్చి కాకినాడ చేరి లెనారస్ అనే ఒక ప్రాచ్యాత్య వ్యాపారితో భాగస్వామిగా చేరి విదేశీ వ్యాపారము చేయనారంబించాడు. తర్వాత లెనారస్ తన మేనల్లుడైన ఇన్నీసును వ్యాపారంలో చేర్చుకొని ఇన్నీసు కంపెనీ అని స్థాపించాడు. అలా ఉండగా 1895 ఏప్రిల్ నరసింగరావు గారు. స్వర్గస్థులయ్యారు. కుటుంబం, వ్యాపార నిర్వహణ పిన్నవయస్కుడైన నాయుడు గారి భుజస్కందాలపై పడ్డాయి. వాటిని సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఇన్నీను కంపెనీ భాగస్వామిగా చేరి 13 సం॥ కొనసాగారు. తర్వాత ఇన్సీసు తన వ్యాపారానికి స్వస్తి పలికి తన స్వదేశానికి వెళ్లేటపుడు అతని సగభాగం నాయుడు గారు కొన్నారు. ఇన్నీసు కంపెని పూర్తిగా నాయుడు గారి వశమయింది. ఆయన వ్యాపారం మూడు పువ్వులు అభివృద్ధి చెందింది. ఒకసారి ఆయన “బిలియర్డ్స" ఆట ఆడుతుండగా ఒక టెలిగ్రాం వచ్చింది. చదివి జేబులో పెట్టుకున్నాడు. తర్వాత ఆట కొనసాగించాడు. ఆసక్తిగా మిత్రులు టెలిగ్రాం చదివి, ఆయన కంపెనీకి చెందిన ఒక “ఓడ” మునిగిపోయిన వార్తను గూర్చి తెలుసుకొని నిబ్బరంగా ఉండగలిగిన నాయుడు మనోస్థైర్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ దుర్ఘటన తర్వాత మరింత పట్టుదలతో వ్యాపారం నడిపించి అభివృద్ధి పదంలో పయనించాడు. 1914-1918 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో ఆయన కంపెనీకి చెందిన పద్నాలుగు ఓడలు మునిగిపోయి అపారనష్టం వాటిల్లినా ఆచంచల దీక్షాయుతచిత్తులై నాయుడు గారు తన వ్యాపారాన్ని కొనసాగించి. ఎన్నో ప్యాక్టరీలు, కొత్త కంపెనీలను నెలకొల్పడంతోబాటు 3000 వేల ఎకరాల విస్తీర్ణం భూమిని సంపాదించారు.

కాకినాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా నాలుగు సార్లు ఎన్నికయి, వీరు చరిత్ర సృష్టించారు. తన పాలనా కాలంలో కాకినాడ పట్టణాన్ని సకల సౌకర్య భరితమైన సుందర నందనవనంలా తీర్చి దిద్దారు. తన అనంతర ఆపదవి చేపట్టిన వారికి ఆదర్శప్రాయులయ్యారు. పురాతన కాకినాడలోని ఒక ప్రాంతానికి సూర్యనారాయణపుర" మనే పేరు పెట్టారు.1923 సం||లో కాకినాడ ప్రధమ పౌరుడిగా ఉన్నపుడు అక్కడ అఖిలభారత కాంగ్రెసు మహాసభలు నిర్వహించబడినవి. 1916లో నాయుడుగారు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు పరిశ్రమల ప్రతినిధి సభ్యునిగా నియమితులయ్యారు. 1920 నుండి 1926 వరకు మద్రాసు రాష్ట్ర లెజెస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పని చేశారు. కొంతకాలం ఇంగ్లీషు చాంబర్ ఆఫ్ కామర్సు సభ్యునిగా సేవలందించారు. 1928 లో ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్సు కు వ్యవస్థాపక అధ్యక్షులు. బ్రిటీష్వారు ఆయన సేవను గుర్తించి 1910లో “రావుబహుదూర్” బిరుదముతోనూ, 1918లో దివాన్ బహుదూర్ బిరుదుతో సత్కరించారు.

1905లో తనకు చెందిన భవనాన్ని (కాకినాడ పట్టణ ప్రధానవీధిలో) ఉచిత వైద్య సేవల నిర్వహణార్ధం పురపాలక సంఘానికి నాయుడు గారు దానంగా సమర్పించారు. కాకినాడలో అన్నదాన సమాజము, అనాధశరణాలయము వంటి సేవా సంస్థలకు పెద్ద దిక్కుగా ఉండి చైతన్య దీప్తినందించారు. 1917లో కరువు కాటకాలకు నాయుడుగారు, శ్రీయుతులు మూత్తా మాణిక్యం, నాళం పద్మనాభం వంటి వారి సహచర్యంతో బీదలకు అన్నదానం చేయించి, చౌకధరలకు బియ్యం సరఫరా అయ్యేటట్లు చేశారు. ఆయుర్వేద మందులు తయారు చేయించి ఉచితంగా పంపిణి చేసేవారు. ఎన్నోగుప్త దానాలు, ఎందరినో చదివించారు. కళాశాలపాలక వర్గంలో కీలక పాత్ర పోషించడం ఆంధ్ర సాహిత్య పరిషత్ గ్రంథాలయమును నడిపించడం ద్వారా విద్యారంగానికి పెద్ద పీటవేశాడు. కాకినాడలో కస్మోపాలిటన్ క్లబ్ స్థాపించి (క్రీడాభిమానిగా దానికి జీవితాంతం అధ్యక్షులుగా ఉన్నారు.

భారతీయ సంస్కృతి పరిరక్షణకు తన జీవితకాలంలో అనేక విధాలైన సాంస్క ృతిక కార్యక్రమాలు మహాద్భుతంగా నిర్వహించి సంస్కృత పరిపోషణోద్యమ స్ఫూర్తి తరతరాల కందించాడు. 1904 సం||లో కాకినాడలో సరస్వతీ గానసభను ప్రారంభించి అప్పటి నుండి ప్రతి సంవత్సరం శారదా నవరాత్రులులలో సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయించి సంగీత సరస్వతిని నియమ నిష్టలతో అర్పించారు.

శ్రీయుతులు పుష్ప వనం అయ్యంగార్, రామాడు శ్రీనివాస అయ్యంగార్, నైనాపిళై, గోవింద స్వామి పిళై, అలహనంబి పిళై, దక్షిణా మూర్తి పిళై శ్రీమతి ఎం. ఎస్. సుబ్బలక్ష్మి వి.వి. శఠకోపన్, చెంబై వైద్యనాథ భాగవతార్, విల్యాద్రి అయ్యర్, రామ్నాడు సుందరమ్మ, వంటి లబ్ధ ప్రతిష్టులైన కర్నాటక సంగీత విద్వాంసులందరూ సరస్వతీగా నసభా వేదికపై తమ ప్రదర్శనలిచ్చి నాయుడుగారి చేత సన్మానించబడినవారే. ఈ సంస్థరజత్సోవాల సందర్భంగా 1930 సం॥ నాయుడుగారు గోవింద స్వామి పిళైను సువర్ణ కంకణధారిని చేసి సన్మానించారు. శ్రీయుతులు అశ్వధాభిరామమూర్తి, ద్వారం వెంకట స్వామినాయుడు వంటి సంగీత దిగ్గజాలను సన్మానించారు. ప్రతి సంవత్సరం శ్రీ ఆది భట్ల నారాయణ దాసుగారి హరికధా గానంతో సంగాత సభలు ప్రారంభించేవారు. ఆంధ్రా ప్రాంత శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, తుమర సంగమేశ్వర శాస్త్రీ, ద్వారం వెంకటస్వామి నాయుడు, ద్వారం నరసింగరావు, అశ్వదాభిరామమూర్తి, కోలంక వెంకట రాజు, మున్నగు ప్రసిద్ధ వాద్య కళాకారులు “సరస్వతి గాన సభ" ను రంజింప చేసి కె.సి. నాయుడు గారింట్లో ఓ విలక్షణమైన పండుగ వాతావరణం నెలకొని ఉండేది. కళాకారులందరి అక్కడే ఆ తిద్యమిచ్చేవారు.

సూర్యనారాయణ మూర్తి నాయుడు గారి నివాసం సిరిసంపదలకు, సంగీత సాహిత్యాలకు విలాసం, వారిల్లు. ఓ వంక వైకుంఠపురాన్ని, మరొకవంక సత్యలోకాన్ని తలపింపజేసేది. అత్తాకోడళ్లయిన లక్ష్మీ సరస్వతులు ఈ యింటిలో సఖ్యతగా ఉండేవారు తరతరాలకు తరగని సిరిసంపద ఒక వైపు సత్కళాపోషణం మరోవైపు సరస్వతి గాన సభలో కచేరి చేయబోయే కళాకారులు ముందు రోజు నాయుడు గారింటిలో తమ కచేరి చేయడం ఆనవాయితీగా ఉండేదంటే వారి సంగీత రసపిపాస ఎంతటిదో వారిపై కళాకారులేర్పరుచుకున్న గౌరవాభిమాన మింకెంతటిదో అవగతమవుతుంది.

చెంబెవైద్యనాధ భాగవతార్, వి.వి. శఠగోపన్ వంటి సంగీత దిగ్గజాలు కూడా సభ కంటే ముందు నాయుడు గారింట తమ గళాన్ని వినిపించినవారే ! నాయుడుగారి కళాపోషణకు గుర్తుగా కాకినాడ పట్టణము నడి బొడ్డున సూర్యకళామందిరము అను పేరు ఒక సాంస్కృతిక ప్రదర్శనశాల నిర్మింపబడినది. సకల కళారూపాలకు నెలవైన నాయుడుగారి హృదయానికి ప్రతిరూపమే ఈ మందిరం. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విధిగా దసరా పండుగ దినాలలో సంగీత కచేరీలు ఈ మందిరంలో నిర్వహించబడుతున్నాయి. నాయుడు బలిజ కాపు కులములో వెలసిన కల్పతరువుగా మన్ననలందారు. వెంకన్ననాయుడు కనిష్ట కుమారుడు నరసింగ రాయుడు ఈయనకు ఐదుగురు కుమారులు నలుగురు కుమార్తెలు. 1) దివాన్ బహుదూర్ సూర్యనారాయణ మూర్తి నాయుడు 2) భాస్కర మూర్తి నాయుడు 3) ప్రభాకర మూర్తి నాయుడు 4) మార్తాండ రామూర్తి నాయుడు 5) కేశవ రామూర్తి నాయుడు. నలుగురు కుమార్తెలు 1) తోట వెంకట సుబ్యాయమ్మ W/o నరసింహరావు 2) శీరం బానమ్మ W/o శీరం రామదాసు నాయుడు 3) ఆరట్ల సావిత్రిమ్మ 4) శీరం అనంత రత్నాయమ్మ

చిన్న కుమారుడు కేశవ మూర్తి నాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, వారి కుటుంబంలో అత్యంత విజ్ఞానవంతులు; ప్రధమ పట్టబద్రులు; కాకినాడ పిఠాపురం రాజా వారి కళాశాలలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత పొంది (వీరు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రియ శిష్యులు) తర్వాత ఎప్.ఎ పూర్తి చేసి. రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి వద్ద డా ॥ మిల్లర్; మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో ఇంగ్లీషు ప్రొఫెసర్ సిపారసులేఖ తీసుకొని కళాశాలలో బి.ఎ. క్లాసులో చేరారు. పట్టభద్రులయ్యారు. ఇంగ్లీషు భాష పై శ్రద్ధ చూపేవారు. షేక్స్ ఫియర్ మిల్టన్, విలయం వర్డ్స్ వర్త్, లార్డు బైరల్ మొ॥ వారు రచించిన గ్రంథాలపై మక్కువ ఎక్కువ. వెంకటరత్నం నాయుడు చదివిన, వ్రాసిన ప్రతిగ్రంధము చదివేవారు పిఠాపురం మహారాజా కాలేజీలో అడ్వైజరి కమిటీలో సభ్యులుగా నియమించారు. ప్రో॥ సచ్చిదానందం పిళ్లైతో ఆంగ్లములో చర్చలు, ఉపన్యాసములు చేసేవారు. 1930 నుండి 1936 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర లెజెస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు (M.L.C) ఉన్నారు. వీరితో చెట్టి నాడి రాజాముత్తయ్య చెట్టియార్ ఉ న్నారు. ముఖ్యమంత్రిగా బొబ్బిలి రాజాగారున్నారు. వారు ప్రతిమీటింగులోనూ, గుత్తనదీవి, పల్లంకూరు భూములకు నీటి పారుదల గురించి ప్రస్థావించి అనుమతి తీసుకున్నారు. కొన్ని వేల ఎకరాలు భీడు భూములు సాగులోకి వచ్చినవి ఆ ప్రాంత రైతులకు అపారమైన నీటి పారుదల సౌకర్యం లభించింది. నాయుడు సోదరులు అక్కడ వెయ్యి ఎకరములు 22 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. 1943 నుండి 1946 జిల్లా బోర్డు వైస్ ప్రిసిడెంటుగా వ్యవహరించారు. 1945 నుండి 1952 వరకు పిఠాపురం రాజా కాలేజికి అడ్వయిజరీ కమిటి మెంబరుగా ఉన్నారు. ఈయన కాలములో మొట్టమొదటి బి.కాం. కోర్సు పెట్టారు వీరు 1955 మార్చి 23వ తేదీ స్వర్గస్తులయ్యారు.


కొమ్మిరెడ్డి కేశవ మూర్తి నాయుడు గారికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 1) పెద్దకుమారుడు నరసింగరావు. ఆకుల జోగయ్య కుమార్తెను వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు వీరు పట్ట బద్రులు. 2) కృష్ణారావు గారి భార్య ముప్పర్తి వెంకటరత్నం కుమార్తె - వీరికి ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు 3) సూర్య నారాయణ మూర్తి గారు వీరు తారాదేవిని వివాహమాడారు. వీరికి ముగ్గురు కుమారులు. 4) వెంకట రమణమూర్తి ఈయన రోళ్ల సీతారామయ్య కుమార్తెను వివాహమాడారు వీరు సెక్రెటరి డిస్ట్రిట్. లైబ్రరి కాకినాడలో పని చేశారు. వీరికి ఒక కుమార్తె. 5) గోపాలకృష్ణ మూర్తి వీరు ఆట్ల సూర్య ప్రకాశరావు కుమార్తెను వివాహమాడారు వీరు విశాఖ కోరమండల్ కంపెనీలో పని చేశారు. కేశవ మూర్తి నాయుడు గారి ఇద్దరు కుమార్తెలను శీరం, బలరామ్ముర్తి గారికిచ్చి వివాహం చేశారు. ఆంధ్ర క్రికెట్కు ఆభరణం కొమ్మిరెడ్డి కజిన్స్. .













Post a Comment

Previous Post Next Post