Fill the form, we are preserving balija surnames and their history.

మధురై నాయక రాజులు

 మధురై నాయక రాజులు బలిజ వంశీయులు

విజయనగర సంస్థానమును అచ్యుత దేవరాయలువారు పాలించే కాలంలో (క్రీ-పు-1559) పాండ్యనాడు( మధుర దేశము ) నరపతి స్వాధీనమైనది.మగమ నాయకుడు తంజాఊరును రక్షించడానికి వెళ్ళి శతృవులను పారద్రోలిన తరువాత స్వతంత్రించుకుంటాడు. రాయల కుటుంబానికి బంధువులైనందున అచ్యుతరాయలను ధిక్కరిస్తాడు. నాగమనాయకుడిని  బంధించి ఎవరు తీసుకు వస్తారు అంటే అంత సాహసం చేయడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు నాగమనాయకుని కుమారుడు విశ్వనాథనాయకుడు ముందుకు వస్తాడు. తండ్రిపై దండెత్తుతాడు అక్రమంగా సంపాదించిన రాజ్యం తనకు వద్దని తండ్రిని తెచ్చి అచ్యుతరాయలుకు అప్పచెబుతాడు. దానికి మెచ్చిన   అచ్యుతరాయలు నువ్వు అడిగి వుంటే రాజ్యాన్ని ఈచ్చే వాడిని అంటూ నాగమనాయకుడిని మందలించి విశ్వనాథ నాయకుడిని పాండ్య రాజ్యానికి విజయనగరం లోనే పట్టభిషేకం చేస్తాడు.ఈ సందర్భం లో రాసి ఇచ్చిన అనుభవ హక్కు పత్రం”కొటికం వారి కైఫీయత్” లో విశ్వనాథ నాయకుడి ఇంటిపేరు గరికిపాటి , కులము గాజుల బలిజ 


కొటికం వారి కైఫీయత్



1. నాగమనాయడు - 1554


2. విశ్వనాథనాయడు - 1559 - 1563


3. కుమారకృష్ణప్పనాయడు - 1563 - 1573


4. పెద్దవీరప్పనాయడు, 2- విశ్వనాథనాయడు - 1573 - 1595


5. లింగప్పనాయడు, 3- విశ్వనాథనాయడు - 1595 - 1602


6. ముద్దుకృష్ణప్పనాయడు - 1602-1600


7. ముద్దు వీరప్పనాయుడు - 1600 - 1623


8. తిరుమలనాయడు - 1623-1659


9. ముద్దు అశగసింగరినాయడు - 1659-1662


10. చొక్కనాథనాయడు - 1662 - 1682


11. రంగకృష్ణ ముద్దువీరప్పనాయడు - 1682 1686


12., మంగమ్మగారు - 1686-1699


13. విజయరఘునాథచొక్క లింగనాయఁడు - 1704 - 1741


విశ్వనాథనాయడు ( 1559 - 1563 )


1559 పాండ్య రాజ్యమునకు ప్రధమ నాయకరాజు విజయనగర సామ్రాజ్యములో మహా వీరుడని ప్రఖ్యాతి గలదు. కావుననే అచ్యుత దేవరాయలు ఇతనిని తన తండ్రియగు నాగమనాయుకుని మీదికి యుద్ధానికి పంపాడు. విజయనగర సేనానాయకులలో నాగమ నాయకుడు మిక్కిలి సాహసి అతనిని పట్టి తెచ్చే వీరుడు ఈ సభయందుండెననీ ముందుకు రండని వచ్చి ఈ చంద్రహాసం తీసుకోండని అచ్యుత దేవరాయలు తన ఆస్తానమున పలికినపుడు అందరు యోధులవెరూ ముందుకు రాను సాహసించలేకపోయారు. వీరాగ్రేసరుడగు విశ్వనాథనాయకుడే ఖడ్గమును తీసుకొన్నాడు. ఈ నాయక రాజు ప్రభుత్వమునకు వచ్చిన వెంటనే హరినాయక మొదలియార్ను మంత్రిగా తీసుకొని రాజధానిలోని అంత:కలములు చక్కబర్చెను. ఆయన రాజ్యమును 72 సంస్థానములుగా విభజించి ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క నాయకుని నియమించి రాజ్యాంగ సులభతరం చేశాడు. మంత్రి హరినాయక ముదిలియార్ను సైన్యాధిపతి రాజబంధువు అయిన బిసపాకం కేశవప్పనాయుడుని ఇద్దరిని పిలిపించి ఈ కోటలో మాకు ఉండడానికి అనుకూలం కాదు. మధుర చుట్టూ భైరవుడి బురుజులున్ను, ఎనిమిది ద్వారాలు కలిగిన కోట పెట్టి మీనాక్షి దేవి దేవాలయము కట్టించమన్నాడు. మంత్రి హరినాయక మొదలియార్ బొక్కసంలో ధనము లేదన్నాడు. వెంటనే తన తండ్రి నాగమనాయకుడి వద్ద ఉన్న అనేక ద్రవ్యరాశులు తెప్పించి తామ్రపర్ణి నది, చిత్రానది, వేగవతి, అమరావతి నదులకు కాలువలు తవ్వించాడు. మరికొన్ని పెద్ద నదులకు ఆనకట్టలు రాతికట్టడాన్ని కట్టించి అడవి యావత్తు నరికించి, మిట్టభూములన్నియు పల్లపు భూములు చేయించి అనేక అగ్రహారాలు చేయించి ఉత్తర ప్రాంతమునుండి బ్రాహ్మణులను పిలిపించి అడవులను అగ్రహారాలుగా, విద్యాకేంద్రాలుగా చేయించాడు. కొద్దిగా ఉన్న మీనాక్షి దేవి దేవాలయము అనేక మంటపాలు కట్టించాడు. సుందరేశ్వరస్వామి సన్నిధిలో వెయ్యి కాళ్ల మండపం కట్టించారు.

అళ్వారు తిర్నమల్ల, వైకుంఠం, శ్రీవిల్లి పుత్తూరు, శ్రీరంగం మొదలగు 24. దేవాలయాలకు భూములు కేటాయించి నిత్య నైవేద్యం పూజలు జరిగేటట్లు చేయించాడు. తిర్నివెల్లిలో వెయ్యికాళ్ళ మండపం కట్టించాడు. తిశిరపురం కోటను మరమత్తులు చేయించి అనేక వసతులతోటి నిర్మించాడు. కావేరి నదికి అనేక కాలువలు త్రవ్వించాడు, హరినాయక మొదలియార్ స్వయంగా దగ్గరుండి అన్ని పర్యవేక్షించాడు. శ్రీరంగం, జంబుకేశ్వరాలయములలో వెయ్యికాళ్ల మండపాలు కట్టించారు. మూడువేల గుర్రాలు రెండువేల కర్నాటక తుపాకులతో పంచపాండ్యులను బిసపాకం కేశవప్పనాయుడు వీరవిహారం చేసి తరిమివేశాడు. తర్వాత రాజ్యములో 72 పాలెములుగా ఏర్పాటు చేశాడు.


కృష్ణప్పనాయడు ( 1563 - 1573 )

1563-1573 వరకు పాలించెను. విశ్వనాథనాయకుని కుమారుడు విశ్వనాధుని అనంతరం మధుర రాజ్యపట్టాభిషిక్తుడయ్యెను. ఇతని ఆస్థానమునగూడా హరినాయక ముదిలియార్ మంత్రిగావున్నాడు. దళవాయి చినకేశవప్ప నాయుడు సైన్యాధిపతిగా నుండెను. పరమగుడి ప్రాంతము నేలుచున్న తంబచ్చినాయకర్ అనే చోళబలిజరాజు పన్ను చెల్లించుటకు నిరాకరించెను. క్రిష్ణప్పనాయుడు బిసపాకం కేశవప్పనాయుడిని పిలిపించి నీవు మా తాత, తండ్రి కాలమునుండి ఉన్నావు. మహా వీరుడవు. తంబుచ్చి నాయుడు తలకొట్టి తేవాలన్నాడు. నాకు తొంబయి సంవత్సరాలు యుద్ధం మీ ఆజ్ఞ ప్రకారం చేస్తానని చెప్పి వెళ్ళినాడు. 

తంబిచ్చి నాయకర్ బలపరాక్రమములు గలవాడు. అతనికి ఇద్దరు కుమారులు, మొదటి భార్య కుమారుడు ఇంద్రజిత్లాంటి శౌర్యవంతుడు. రెండవ భార్య కుమారుడు అతికాయుడు సమయమువస్తే రావణాసురుడంతటివాడు. పరమ కుటిలిడు అయినా కొంత సైన్యము తీసుకొని యుద్ధానికి వెళ్లాడు. బీసపాకంచిన కేశవప్ప నాయుడు ఏనుగు అంబారిపై ఉండగా తుపాకి గుండ్లు దిగి చనిపోయాడు. కాని అతను బ్రతికే వున్నట్లు అంబారిపై కూర్చోబెట్టి సైన్యము కాకవికలంగాకుండా యుద్ధం చేశారు. వారి సైన్యము పారిపోయింది. క్రిష్టప్ప నాయుడు ఎక్కువ సైన్యము కూర్చి హరినాయక ముదలియార్ ముందుండి సైన్యాన్ని నడిపించాడు. కేశవప్పనాయుడు కుమారుడు మీనాక్షి నాయుడు పరాక్రమముతో వీరవిహారం చేశాడు. తంబచ్చి నాయుడు పెద్ద కుమారుడు చనిపోయాడు. మిగిలినవారు అడవులలోకి పారిపోయారు. కోటలోని స్త్రీలు భయపడుతుండగా క్రిష్టప్ప నాయుడు వారికి అభయమిచ్చి భయపడవలదని చెప్పెను. అడవులలో వెదకి తంబ నాయకర్ను చంపారు.మిగిలిన కుమారుడు వారి పిల్లలు రాజు కాళ్లమీద పడ్డారు.

రాజు వారికి రెండు గ్రామాలు ఇచ్చి పంపినాడు. పరమగుడి, రామనాధపురం శీమలోనిది. అక్కడనుండి రామేశ్వరంపోయి రామనాధస్వామి దర్శనము చేసుకొని రామేశ్వరం దేవస్థానానికి కొన్ని గ్రామాలు దానం చేశాడు. కోటపట్నం, కొడికుళం, వనితం, వుప్పూత్తు వనితం, పల్లిమండలం తాలూకాలో శెట్టికుర్చివనితం, తామ్రపర్ణి తీరంలో జొన్న పళంకర, శేతు వాక్యాలున్ను, గ్రామాలు ఇచ్చాడు. రామేశ్వరం స్వామికి, గుళ్లు గోపురాలు, ప్రాకారాలు కట్టించినారు. సింహళద్వీపానికి రాజు ప్రతాప లంకేశ్వరుడు, అతనికి క్రిష్టప్ప నాయుడు మీరు పన్ను కట్టాలి, ముత్యాలు కొన్ని ఏనుగులు కావాలని లేఖ వ్రాసి మనిషిని పంపాడు. దానికి అతను నిరాకరించి నాపేరే ప్రతాప లంకేశ్వరుడు నేను స్వతంత్రుడను నేనెవరికి పన్ను చెల్లించవలసిన అవసరంలేదు. మరలా ఈ ప్రస్థావన ఎప్పుడైనా తెస్తే లంకదాటి వెళ్ళరు జాగ్రత్త అని మీ రాజులతో చెప్పుమన్నాడు.

రాజా పెద్ద క్రిష్ణమ నాయుడు కోపించి సింహళద్వీపం మీద యుద్ధం ప్రకటించి స్వయంగా తాను ముందుండి సైన్యాన్ని పడవలమీద సముద్రం దాటించి యుద్ధం చేశారు. ఆ యుద్ధములో లంకేశ్వరుడి సైన్యముతో సహా రాజు అడవుల పాలయ్యాడు. కోట మధుర రాజుల వశమయింది. ప్రతాప లంకేశ్వరుడు సంధి చేసుకొని కప్పము కట్టు లాగున ఏర్పాటు చేసుకున్నాడు. ఖండి రాజ్యమునకు మధురరాజు పెద క్రిష్ణమ నాయుడు బావమర్ది చింతలపురి విజయభూపాలుని తమ ప్రతినిధిగా నియమించి సంవత్సరానికి 12 లక్షల రూపాయులు కప్పము కట్టేటట్లు నిర్ణయించారు. మిగిలిన రాజ్యం ప్రతాప లంకేశ్వరునకు ఇచ్చివేశారు. తర్వాత మళయాళ దేశ రాజులకు వర్తమానం పంపాడు. మీరు కప్పము చెల్లించక మీరే అనుభవిస్తున్నారు. జమాబంది కొన్ని ఏనుగులను పంపమని ఉత్తర్వు చేశాడు. కాని వాళ్ళు నిరాకరించారు. మళయాళ రామరాజును కోళికూడు రాజు, పాలక్కాడు, కోయముత్తూరులో కోటగట్టించి, ఈరోడ్లో కోటగట్టించి, సేలం తాలూకాలో తలమల రామచంద్ర నాయుడుకి "శాదుమంగళం" గ్రామం ఇచ్చి దారాపురంలో కోట కట్టించి, తర్వాత త్రిశరపురంలో మాతృ భూతేశ్వరస్వామి, శకుంతలాంబాదేవి, జెంబుకేశ్వరం, జంబునాధ స్వామి అఖిలాండేశ్వరికి, శ్రీరంగనాయకులు అమ్మవారికి ఎన్నో ఆభరణాలు, వస్త్ర భూషణాదులు సమర్పించుకున్నారు. అరయలూరు, తొరయూరు రెడ్డి వారు తిరుగుబాటు చేయగా బీసపాకం మీనాక్షీ నాయుడు కుమారుడు విజయ కేశప్పనాయుడు వెళ్లి వారిని అణచివేశాడు.

పెద కేశప్పనాయుడు, బంగారు నాగులు నాయుడు, తోరం నరసింహనాయుడు, మిట్టపాలెం అయ్యనాయుడు, గొజ్జం కోసలనాయుడు, అమరగంటి ముద్దులనాయుడు, సుబ్బానాయకుడు, తుపాకుల రామక్రిష్ణనాయుడు, నారగంటి నరసానాయక నర్రావుల వెంకట్రామ నాయకుడు, మల్లిపూడి మంగపతిరావు ఆ యుద్ధములో పాల్గొన్నారు. పెద క్రిష్ణమ నాయుడు శత్రువులకు సింహ స్వప్నంగా ఉన్నాడు. ఇతనికి పాండ్యకుల స్థాపనాచార్య కాంచిపురవరాదీశ్వర, అయ్యావళి పురవరాదీశ్వర, తిరువడి మోకాలి పట్ట వర్ధన, సమయ దోహరగండ దక్షిణ మహాసముద్రాదీశ్వర బిరుదులు కలవు.


పెద్దవీరప్పనాయడు ( 2-వ విశ్వనాథనాయడు 1573-1595 )

క్రిష్ణమనాయుడు కుమారుడు ఈ పెద్ద వీరప్ప ఇతనిని రెండవ విశ్వనాధు ఉంటారు. 1573-1595 వరకు మధుర రాజ్యాన్ని పాలించాడు. ఇతను తన తాత తండ్రులవలె గాక విజయనగర సామ్రాజ్యాధిపతులతో విభేదించాడు. తోవూరు యుద్దములో గొబ్బూరు జగ్గరాయలు పక్షము వహించెను. తంజావూరు రాజు రఘునాధ నాయకుడు, జింజి క్రిష్ణప్ప నాయకుని, మధుర పెద్ద వీరప్పను ఓడించి క్షమించి వదిలి వేసెను. గొబ్బూరి జగ్గరాయలను సంహరించెను. లింగప్ప నాయుడు (కుమార కృష్ణప్ప నాయుడు) 1595-1602 వరకు తర్వాత ముద్దు కృష్ణమనాయుడు 1602-1609. వరకు, తర్వాత అతని కుమారుడు ముత్తు వీరప్పనాయుడు 1609-1623 వరకు పాలించెను.


లింగప్పనాయడు, 3విశ్వనాథనాయుడు ( 1595 - 1602 )

పెద్దకృష్ణ ప్ప నాయడుగారి కుమారులైన లింగప్పనాయడుగారును, విశ్వనాథనాయడుగారును, పట్టమునకువచ్చిన కొంత కాలమునకు, మధు రలో వేయికాళ్లమంటపమును, చోళవందాను గ్రామములో కోటను కోటను దేవాలయమును అగ్రహారమును కట్టించిన వారును, మహామేధావంతు వాలయమును దునై న హరినాయక మొదలారు క్రీ - పు - 1600 లో గతించిరి. ఇందు చేత ఈ యిర్వురునాయడుగార్ల కంటె ముందు రాజ్యము నేలిన వారివంటి కీర్తి ప్రతిష్ఠలు వీరికికలుగక సామాన్యులవలెనుండవలసివచ్చెను. అయి నను వీరును పూర్వవాసన ననుసరించి మంచివారుగనే ప్రజల పట్ల వర్తిం న చుచుండి పరమపదము జేరిరి.


ముద్దుకృష్ణప్పనాయడు ( 1602 - 1609 )

లింగప్ప నాయనికుమారుఁడు ముద్దుకృష్ణప్ప నాయడు పట్టమునకు వచ్చెను. ఇతని పినతండ్రియైన కస్తూరిరంగప్పనాయడుగారు ధనాశ 'చేత ముద్దుకృష్ణప్ప నాయనిని చెఱయందుంచి తానే మధురకు రాజని చాటించెను. తోడనే ముద్దుకృష్ణప్పనాయని మిత్రులు కస్తూరిరంగప్ప.నాయనిని శిరచ్ఛేదము చేసివేసి ముద్దుకృష్ణప్పనాయుడుగారినే పట్టము నకు అధిపతులనుగా జేసిరి. ఇతఁడును ధర్మముతప్పక రాజ్యము నేలి గతించెను.


ముద్దు వీరప్ప నాయుడు ( 1609 - 1628 )

ముద్దుకృష్ణప్ప నాయడుగారికిత ర్వాత వారి జ్యేష్ఠపుత్రుఁడు ముద్దు వీరప్పనాయడుగారు పట్టాభిపి. క్తులైరి. ఇతడు తంజావూరు, మైసూరు మొదలగు రాజులతో యుద్ధము చేసి జయమొందెను. ఇతనికాలము లో నే మధురలో క్రీస్తుగుడి కట్టబడెను.


తిరుమలనాయడు ( 1623 - 1659 )


ఇతను ముద్దు వీరప్ప నాయకుని సోదరుడు. ఇతను మధుర నాయకరాజులందరి కంటే గొప్పవాడు. రాజనీతి చతురుడు. ఇతని జీవిత కాలమంతా యుద్ధములతోనే గడిచెను. ఇతడు పోర్చుగీసు వారితో స్నేహము చేసెను. రఘునాధ సేతుపతిని పుదుక్కోట రాజుగా నియమించెను. విజయనగర చక్రవర్తుల అధికారం త్రోచిపుచ్చి వైరము తెచ్చుకొనెను. దానిపై పెనుగొండ విజయనగరాధీశుడు కోపించి తంజావూరు నాయక రాజులతో కలిసి దండెత్తిరాగా గోల్కొండ సుల్తానులతో సంధి చేసుకొని శ్రీరంగరాయలును రాయవేలూరుకు తరిమివేసెను. తర్వాత గోల్కొండ సైన్యము వేలూరును వశపర్చుకొని హిందూ రాజ్యాలకు తలనొప్పి కలిగించగా బీజాపూర్ సుల్తానులు.

సహకారముతో తిరుమల నాయుడు గోల్కొండ సుల్తానులను తరిమివేశెను. బీజాపూర్ సుల్తానుల దృష్టి మైసూరుపై బడి పీడించసాగిరి. దీనితో విసిగిన కంఠీరవ నరసరాజు క్రీ.శ. 1656లో తన సైన్యాధిపతి దళవాయి హంపయ్యను మధురపైకి పంపెను. ఇతడు చేసిన యుద్దములో ఎంతోమంది మరణించారు. విచిత్రముగా ఈయుద్ధంలో తెలుగు వీరుల ముక్కులు, చెవులు కోసి అవమానించారు.

దీనికి తిరుమలనాయుడు ఎంతో బాధపడి రఘునాధ సేతుపతికి 25వేల సైన్యాన్నిచ్చి మైసూరు రాజ్యంమీదకు పంపెను. వారిని ఓడించి విజయోత్సాహంతో రఘునాధ సేతుపతి, జంగన్న నాయకుడు, ముద్దుకుమార నాయకుడు ముగ్గురూ శత్రు సైన్యమును భీకరులై తరుముతూ చిక్కినవారిని చిక్కినట్లు ముక్కులు, చెవులు ఖండించిరి. ఈ విచిత్ర యుద్ధానికి ముక్కుల యుద్ధం (Ware of the noses) అని పేరుపడింది.తిరుమల నాయుడు మధుర మీనాక్షి దేవాలయము బహు సుందరముగా పునర్నిర్మించెను. రాజా ప్యాలస్ అద్భుతంగా నిర్మించాడు. శ్రీరంగం, తిరుమల క్షేత్రములను గూడా అభివృద్ధి చేశాడు. తంజావూరి రాజు రఘునాధ నాయకుని కుమార్తె రఘునాధ అచ్యుతమ్మను వివాహమాడాడు. పరమత సహనము గలవాడు. ఇతనిని క్రైస్తవ మత రక్షకుడిగా వర్ణించారు. ఇతని ఆస్థాన కవి పిల్లా పెరుమాళ్లయ్య అనే ద్రవిడ పండితుడు. ఆయన రచించిన "అష్ట ప్రబంధములు" అను ద్రవిడ గ్రంథము నేటిని మిగుల ప్రశస్థముగా యున్నది. ఇతను 36 సం॥లు రాజ్యం పాలించి 1659లో పరమపదించెను. మీనాక్షి దేవాలయం ముస్లిం రాజుల చేతిలో ధ్వంసమయ్యింది. మధుర నాయకరాజు లందరూ పునర్మించారు. తిరుమల నాయకుడు పునరుద్దరించి తీర్చిదిద్దారు. మీనాక్షి దేవాలయం వెయ్యి స్థంభాల మండపం అష్ట శక్తి మండపం, పుదు మండపం, వంజియార్ తెప్పకుళు మ్. నాయకర్ మహల్, దివ్య మండపాలు, శిల్ప కళావైభవంగా తీర్చిదిద్దారు. తిరుమల నాయకుడు జన్మదినోత్సవం రోజు ఆయనను చూడటానికి మధురమీనాక్షీ దేవి అమ్మవారు స్వయంగా వస్తుంది.


ముద్దుఅశగ సింగరి నాయడుగారు ( 1659 - 1662 )

ఇతడు తిరుమల నాయుడు కుమారుడు. 1659 నుండి 1682 వరకు పాలించాడు.1682లో మరణించాడు. ఇతనికి 200 మంది ఉంపుడు కత్తెలు కలరని చెప్తారు.


చొక్కనాథనాయడు ( 1662 - 1682 )

క్రీ.శ. 1682-1706 వరకు పరిపాలించాడు. ఇతను ముద్దు అళగ సింగరి నాయుడు కుమారుడు. 16 సం॥ వయస్సులో రాజ్యపాలకుడయ్యెను. అతనికి ప్రధానిగా లేఖకుడిగా ఇద్దరు బ్రాహ్మణులుండేవారు. వీరిరువురు అత్యాశకు లోనై కంఠ కారణంగా శత్రువులకు సహాయము చేయుచుండిరి. రాజును ప్రజలను కలవకుండా చేసిరి. యుక్తిశాలియైన చొక్కనాదుడు తన స్నేహితులవల్ల ఈ విషయం గమనించి తన సంస్థానమునకు చెడ్డ పేరు వస్తుందని ఆలోచించి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చిత్రవధ చేసి చంపించాడు. తర్వాత చిన్నతంబి మొదలియార్ను మంత్రిగా నియమించాడు. మధుర చొక్కనాధ నాయుడు, మహ్మదీయ రాజులనోడించెను. వారు తంజావూరు రాజుతో స్నేహం చేశారు. మధురరాజు తంజావూరు నోడించి మహమ్మదీయులను తరిమివేసెను. తంజావూరు రాజు భయపడి లొంగిపోయెను. కొన్నాళ్ళ తర్వాత మధురరాజు బంధువులు చొక్కనాదుడికి వివాహం చేయాలని తలంచిరి. కాని అతడు తంజావూరు రాజకుమార్తె సౌందర్యవతియని తెలిసి పెద్దలతో రాయబారం పంపెను. కాని తంజావూరు విజయ రాఘవనాయకుడు దానికి అంగీకరించలేదు. చొక్కనాథుడు యుద్ధమునకు బయలుదేరెను. అది తెలిసిన తంజావూరు రాజకుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దానికి మదురరాజు ఎంతో బాధపడ్డాడు. ఆ తంజావూరు రాకుమార్తె మోహనాంగి ఆత్మహత్య చేసుకుంది. చొక్కనాద నాయకుడు తుపాకులు రామలింగ నాయకుడు అనే దళవాయి కుమార్తె మంగమ్మను వివాహమాడాడు. వారికి ఒక కుమారుడు జన్మించాడు.

ఇట్లుండగా కొందరు రాజోద్యోగులు రాజును చంపి అతని తమ్ముడు అళగసింగరి నాయుడుని రాజ్యపాలకుని చేయాలని ప్రయత్నించారు. అది కొనసాగలేదు. తర్వాత వారి తమ్ముడు, రాజోద్యోగి గోవిందయ్య అనే బ్రాహ్మణుడు ఇద్దరు కుట్రచేసి కొందరిని ప్రోత్సహించి అక్రమములు చేయుచుండిరి. ఇవన్నియు గమనించిన చొక్కనాధ నాయకుడు మనోవ్యాధితో మరణించెను. తర్వాత అతని తమ్ముడు రాజ్యానికి వచ్చి తన దుష్ట చతుష్టయాలతో చేరి ప్రజలను హింసించ సాగిరి. ప్రజలు తిరుగుబాటు చేసి చొక్కనాద నాయుడి కుమారుడు 16 సం||ల వయస్సుగల రంగ క్రిష్ణముద్దు వీరప్ప నాయుడుని రాజుని చేశారు.


రంగకృష్ణముద్దు వీరప్ప నాయడు ( 1682 - 1686 )

క్రీ.శ. 1682-86 వరకు పాలించెను. ఇతనికి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి మహాబుద్ధిశాలిగా పేరుగాంచెను. రాజ్యము సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. ప్రజలందరూ సంతోషించారు. ఆయన పాలనా కాలములో ఢిల్లీ పాదుషా కొత్తగా రాజ్యమునకు వచ్చెను. ఆయన తన చెప్పులను ఒక పల్లకిలో పెట్టి బోయీలు ప్రతి సంస్థానానికి తీసుకొచ్చేవారు. . ఆ సంస్థానాధీశులు ఆ చెప్పులను వారి సింహాసనము మీద ఉంచుకొని [ పూజించి అవి తెచ్చినవారికి మర్యాదచేసి పంపవలెను. ఆవిధంగా మధురరాజు వద్దకు ఆ చెప్పుల పల్లకి వచ్చినది. అది తెలిసిన నాయుడుగారు దానిని తెచ్చిన వారిని సంస్థానములోనికి తీసుకురమ్మని ఆ చెప్పులను తాను వేసుకొని వచ్చిన వారినందరిని • కొట్టి పంపి పాదుషాకు లేఖ వ్రాసి పంపాడు. ఇది ఎంత అక్రమమో ఎంత అవమాన బాగా కరమో ఆలోచించండి. మదుర రాజులు పౌరుషవంతులు ప్రాణాలివ్వడానికైనా, తీయడానికైనా సిద్ధం అని వ్రాశాడు. అది తెలిసిన ఢిల్లీ పాదుషా మంత్రిమండలి ఆ పద్ధతి రద్దు చేసింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత స్పోటికం వ్యాధి (అమ్మవారు) తో మరణించాడు. అతని భార్య ముద్దమ్మ గర్భవతిగా ఉన్నది ఆమె మగశిశువుకు జన్మ నిచ్చింది. అతని పేరు విజయ రఘునాధ చొక్కలింగనాయుడు.


రాణి మంగమ్మగారు ( 1886 - 1899 )



మంగమ్మగారి మనుమడు రంగక్రిష్ణ ముద్దు వీరప్ప నాయుడు కుమారుడు చిన్న వాడయిన కారణంగా ఆయన పేరుమీద మంగమ్మ గారు పాలనా పగ్గాలు చేపట్టారు. తన మనుమడికి రెండు సంవత్సరాల వయస్సులో పట్టాభిషేకం చేసి ఈమెయే పాలించినది. ఈమె హిందూ, ముస్లిం, క్రైస్తవులందరికి హితురాలయి, సాహసవంతురాలిగా పేరు తెచ్చుకుంది.


విజయరఘునాథచొక్క లింగ నాయడు ( 1704 - 1741 ) 

క్రీ.శ. 1704-1741 వరకు పాలించాడు. రాణి మంగమ్మగారు గతించిన మీదట ఆమె మనుమడు విజయ రఘనాధ చొక్కలింగనాయుడు పాలింప నారంభించెను. అతనికి విజయ చొక్కనాదుడు అను పేరు గూడా కలదు. ఆయన దేవాలయ జీర్ణోద్ధరణ, మండపాలు కట్టించుటలో దైవభక్తిలోనే గడిపాడు. రాజ్యం సుభిక్షంగా వున్నది. ఆయన శ్రీరంగంలోని రంగనాధుని సన్నిధిలోనే శేష జీవితము గడిపాడు. ఆయనకు సంతానము లేదు. ఆయన భార్య మీనాక్షమ్మ తుపాకుల రామలింగ నాయుడి కుమార్తె) ఆయన త వంశీయుడైన తిరుమల నాయుడు వంశములోని బంగారు తిరుమలయ్య (బంగారు తిమ్మరాజు కుమారుని దత్తత తీసుకొని రాజుగా ప్రకటించాడు.

మధుర నేలిన ప్రభువులలో విజయరంగ చొక్కనాథుడు గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. ఇతడు శ్రీరంగమున శ్రీరంగనాధస్వామి దేవాలయమునకు ఎన్నో | ప్రాకారములు శిల్పములు నిర్మించాడు. స్వామికి ఎన్నో వజ్ర వైఢూర్యములు కనక వస్తు వాహనములు సమర్పించుకున్నాడు. ఇతడు ఇదే దేవాలయ ప్రాంగణములో తన కుల బంధువులైన బలిజ నాయుడిగారిని సమావేశ పరిచి ఆనాటికి హాజరైన బంధువులను ఇంటిపేర్లు నాలుగు భాగములుగా ప్రకటించెను.

రంగనాధస్వామి దేవాలయం ప్రాంగణములో రాజబంధువుల సభ జరిపి ప్రకటించాడు. దానిని "విజయరంగ చొక్కనాడుని కుల బంధువుల ప్రకటనలు అని పేరు గల్గెను. దానిని ఆనాడు వారి 'స్థానాపతి' శ్రీవంశ ప్రకాశిక గ్రంథముగా ప్రకటించి వ్రాయించాడు. ఆ రాజు గొప్ప పండితుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, శ్రీ రంగ మహత్మ్యం, శ్రీ తులసీ కావేరి మహాత్మ్యము అని రెండు గ్రంథములు వ్రాశారు.1890వ సం॥లో సేలం పగడాల నరసింహులు నాయుడుగారు వ్రాసిన "బలిజ వంశ పురాణము” తమిళ, తెలుగు గ్రంథాలలో చతుర్విద రాజబంధువుల ఇండ్లపేర్లు వివరంగా వ్రాశారు.


Post a Comment

Previous Post Next Post