ఆలూరి క్రిష్ణభూపతిగారిది దేవకీపురం (ఈనాటి తమిళనాడు) బలిజ వంశీయుడు. విజయనగర రాజుల సైన్యాధిపతిగా వుండెను. తర్వాత వారి వంశీయులు విజయనగర సంస్థానములో సైనికాధికారులుగా వున్నారు. తిమ్మానాయకుడు శ్రీకృష్ణ దేవరాయలు వద్ద సైన్యాధిపతిగా వున్నాడు. తర్వాత అతని కుమారుడు చిన చెవ్వప్పనాయడు చిత్తూరు జిల్లా నాగలాపురం (క్రిష్ణరాయలు వారి తల్లి నాగలాంబ జన్మించిన గ్రామం) నకు సైన్యాధిపతిగా ఉన్నాడు.పైన చెప్పిన చెవ్వప్పనాయుడు కాలములోనే తంజావూరు నాయకరాజ్య స్థాపన జరిగింది. అతడే ప్రధమ నాయకరాజుగా నియమింపబడెను. ఈ చెవ్వ భూపతి భార్య సకలం తిమ్మరాజు రెండవ కుమార్తె మూర్తెమ్మ, అచ్యుతదేవరాయలు మరదలు విజయనగరాధీశుడు శ్రీ అచ్యుత దేవరాయలు మొదటి భార్య మహారాణి వరదాంబిక. ఈమె సూర్యవంశ (బానుకుల భూషణ) సలకం రఘుపతి రాజయ్య దేవ మహారాజు కుమార్తె (బలిజ వంశీయులు) శ్రీరంగం శ్రీరంగనాధ స్వామి దేవాలయ శాసనములు ఆధారము.అచ్చుత దేవరాయలు రెండవ భార్య తిరుమలాంబ (వరదాంబికా పరిణయం సంస్కృత కావ్యము గ్రంథ రచయిత్రి), ఆస్థాన కవియిత్రి (చదువరి), వదువ (విజ్ఞాని) ఈమె సోదరి మూర్తిమాంబ. వీరి తండ్రి సలకం తిమ్మరాజు (విజయనగర సంస్థాన కోశాధికారి).
అల్లూరు చిన చెవ్వప్పనాయకుడు (1532 - 1580 )
తంజావూరు నాయక రాజులలో మొదటివాడు. వీరు విజయనగర రాజులు తుళు వ వంశీయులతోటి, ఆరవీటి వంశీయులతోటి బంధుత్వము కలిగియున్నారు. ఇతని మంత్రి గోవింద దీక్షితులు మంచి రాజనీతిజ్ఞుడు, చెవ్వప్ప నాయకుడు పరమత సహనము కలవాడు. ఇతడు ముస్లీములను, క్రైస్తవులను తన రాజ్యములో నివసించుటకు స్వేచ్ఛ నిచ్చాడు. విజయనగర సామ్రాజ్యాధీశులకు పూర్తి సహాయకారిగా వున్నాడు. 13వ శతాబ్దము సంగమ వంశీయుల పాలనాకాలమునకు పూర్వమే తెలుగువారు దక్షిణమునకు వలస వచ్చుటకు ప్రారంభమయినను ఇతని కాలములోనూ, మధురరాజు విశ్వనాధ నాయకుని కాలములోనూ చాలామంది తెలుగువారు వచ్చి చేరిరి. అప్పటి వారే ఈనాటికి కొన్నికోట్లమంది దక్షిణ భారతములో నివసిస్తున్నారు. చిన చెవ్వభూపాలుడు విజనయగర రాజభందువు అగుటచే అచ్చటి మర్యాదలు, అక్కడి పాలన తన సంస్థానమునందు నిలిపాడు. అప్పటికి చోళ మండలము దొంగలకు, బందిపోట్లకు ప్రసిద్ధియై యుండెను ఇతను తన పరిపాలనలో అట్టి దొంగలను రూపుమాపుటకై అచటి దొంగల నాయకులలో ఎక్కువ పలుకుబడిగల వారికే జాగీర్లనిచ్చి వారి దురంతములు సాగనివ్వకుండా చేసి తన రాజ్యములో శాంతిని చేకూర్చాడు.ఇతని రాజ్యపాలనను గూర్చి సంగీత సుధ (22, 33 పేజి) గ్రంథము, రఘు నాదాభ్యుదయ కావ్యములో రచయిత్రి, రామబంద్రాంబ తన కావ్యములో ప్రశంసించెను.
అచ్యుతప్ప నాయుడు (1580 - 1614 )
ఇతని పరిపాలన సుఖ సంతోషాలతో సాగెను. ఇతను మంచి పరిపాలనాదక్షుడు. రాజనీతిజ్ఞుడు, యుద్ధవీరుడు, దైవభక్తి గలవాడు. మధుర రాజులతో కలిసి నాగపట్నం ప్రాంతములలో పోర్చుగీసు వారు కుట్రలు పన్నుతుండగా వారిని తరిమేశాడు. ఇతర రాజులు ఇతని రాజ్యంపై దొంగలను ఉసిగొల్పారు. ఇతని మిత్రుడు శ్రీలంకలోని జాఫ్నా రాజును పోర్చుగీసువారు తొలగించారు. పెనుగొండ విజయనగర చక్రవర్తి ఆరవీటి శ్రీరంగ రాయలు-2ను గొబ్బూరు జగ్గరాయలు, కలమటి (వెంకటగిరి సంస్థానాధీశు డు చంపించి పెనుగొండను గొబ్బూరి జగ్గరాయలు పాలించసాగాడు. దీనికి ఇతర రాజ్యాల నాయక రాజులందరూ సంతోషించారు. ఇటువంటి విషమ పరిస్థితులలో అచ్యుతప్ప నాయుడు కుమారుడు రఘునాధ నాయకుని మధురరాజు కుమార్తె కళావతమ్మతో వివాహం జరిపించి యువరాజు పట్టాభిషేకం జరిపించెను. తర్వాత అచ్యుతప్ప నాయుడు కొంతకాలమునకు రాజ్యభారమప్పగించి శ్రీరంగమున శ్రీరంగనాథస్వామి దేవాలయములో భగవంతుని సన్నిధిలో ఐక్యమాయెను. అచ్యుతప్ప నాయకుడు తన తండ్రి చెవ్వప్ప నాయకుడు రాజ్యమునకు వచ్చిన తర్వాత జన్మించెను. ఇతను 25 సం॥ల వయస్సులో / రాజ్యపాలకు డాయెను. అచ్యుతప్పనాయకుని కాలములో కర్ణాటక విజయనగర సామ్రాజ్యమును తుళువ సదాశివరాయలు తర్వాత ఆరవీటి తిరుమలదేవరాయ, శ్రీరంగ దేవరాయలు, ఆరవీటి వెంకటపతి రాయలు అను ప్రభువులు నలుగురు పరిపాలించిరి.అచ్యుతప్ప వారికి విధేయుడైన సామంతుడిగా ఆపద్సమయములో వారికి సహాయకుడిగా నిలిచాడు. అచ్యుతప్ప ఎన్నో దానధర్మాలు చేశాడు. కుంభకోణము, చంపకారణ్యము, శ్రీరంగమునందు గుడులు, గోపురములు, మండపములు నిర్మించెను. షోడచ మహాదానములు చేశాడు. కావేరి నదికి ఆనకట్టని నిర్మించి రైతు బాంధవుడుగా కీర్తింపబడినాడు. ఆయన గొప్ప కవి, పండిత పోషకుడుగా కీర్తింపబడినాడు. రాజ చూడామణి కృతక, రుక్మిణీపరిణయ కావ్యము, సంగీత సుధ, సాహిత్య రత్నాకరములు గ్రంథములలో ఆయన రాజ్యపాలనను కీర్చించబడినవి.
మహారాజ కవి రఘునాథ నాయకుడు (1614-1633)
బలిజ నాయక చక్రవర్తులలో అత్యంత కీర్తిగాంచిన వారిలో శ్రీకృష్ణ దేవరాయలు వంటివారిని గురించి తెలుసుకున్నాము. అంతటి పేరుగాంచి చరిత్రలో ఘనకీర్తి నార్జించిన మరో సాహస చక్రవర్తి ఆలూరి రఘునాద నాయకుడు. శత్రువులకు విషజ్వాలాఫణి కవులలో కవితా శిరోమణి, గాన కళా గంధర్వ సార్వభౌమ, నిరతన్నదాన చూడామణి, దైవభక్తి చింతామణి, బలిజ కుల రత్నాన్వయమణి రఘునాధ నాయక రాజామణి.“ఈ చరిత్రమునకు రఘునాధుడు నాయకమణి ఈయనను క్రిష్ణరాయలుతో అన్ని విషయములలో పోల్చవచ్చును. లక్ష్మీ సరస్వతులిరువురును తంజానగరము రాజధానిగా చేసుకొని నిరంతర నృత్యములుగావించిరి. ఆంధ్ర భాషామతల్లికి ముద్దుల కుమారుడై ఆంధ్ర కవితా వధూటికి ప్రేమాస్పదుడైన నాయకుడై ఈయన వరలెను. విద్యానగరమున కృష్ణరాయ భోజుని కాలమున ఆంధ్ర కవితా వదూటి యెట్లు పల్లకీలో ఊరేగెనో అట్లే రఘునాధుని కాలమున శారదా ధ్వజాది రాజ చిహ్నములతో వరలెను. క్రీ.శ. 1614 సం|| తంజావూరులో పట్టాభిషిక్తుడై 1633 సం॥ వరకు అనగా 19 సం॥లు శత్రువులకు సింహ స్వప్నంగా రాజ్యాన్ని పాలించాడు. ఎంత సాహసవీరు అంతటి విద్యా వివేక సంపన్నుడు. ఈ రాజశేఖరుడు సంగీత, సాహిత్యములలో ప్రవీణుడై సంస్కృతాంధ్రములలో పండితుడై విలసిల్లెను. ఇతని ఆస్థానమున సంగీత విశారదులు శాస్త్ర పారంగతులు సాహిత్య సామ్రాట్టులగు పండితోత్తములను, ఉభయ భాషా విశారదులగు కవిశ్రేష్ఠులను, సరస్వతీ సమానులగు కవయిత్రులు విరాజిల్లుచుండిరి. శ్రీకృష్ణ దేవరాయలు, భోజరాజు సంస్థానములు జ్ఞప్తికి తెచ్చుచుండెను. రఘునాధునికి మంత్రిగా వృద్ధుడైన గోవిందదీక్షుతులే ఉండెడివాడు. రఘునాధుడు సంస్కృతములో "రామాయణ కథా సంగ్రహణము, భారత కథా సంగ్రహణములు” | వ్రాశారు. తెలుగులో రామాయణము, పారిజాతాపహరణము, నళాభ్యుదయము, అచ్యుతాభ్యుదయము వ్రాశారు. పారిజాతాపహరణము గ్రంధాన్ని ఆశువుగా అంటే అప్పటికప్పుడే నోటితే చెబుతూ వ్రాశాడట. ఇతని మంత్రి గోవింద దీక్షితులు కుమారుడు యజ్ఞ నారాయణ దీక్షితులు, గొప్ప పండితులు, అంతటి పండితుడే రఘునాధ నాయకుడు. తన గురువని చెప్పుకున్నాడట. ఆనాటి పండితులకే గురువు మన బలిజ పండిత చక్రవర్తి. యుగానికి చెందినవాడు. కంకంటి పాపరాజు “విష్ణుమయా విలాపము” అనే యక్షగానమును “ఉత్తర రామాయణము” అనే గ్రంథమును రచించాడు.
ఈ రాజ కవియైన రఘునాధ నాయకుడు కుమారుడు విజయరాఘవ నాయకుడు. కూడా గొప్ప రసిక హృదయుడు. ఇతని ఆస్థానములోనే పసుపులేటి రంగాజమ్మ “ఉషా పరిణయం" అనే కావ్యాన్ని రచించెను. అంతేగాక చెంగళ్వకాళ కవి గొప్ప గ్రంథాలను వ్రాశారు. విజయరాఘవ నాయుడు స్వయంగా కాళీయ మర్ధనము, ప్రహ్లాద చరిత్ర అనే గ్రంధాలను రచించాడు. విజయ రాఘవ నాయుడు కుమారుడు మన్నారు దేవనాయుడు హేమాబ్జ నాయకా స్వయంవరం అనే యక్షగానాన్ని రచించాడు. మధుర రాజు విజయ రంగ చొక్కనాధుడు (బలిజరాజు) శ్రీ రంగ మహాత్మ్యము తులకావేరి మహాత్మ్యము గ్రంథములు వ్రాశారు.న్యాయ చూడామణి, దర్పణము, ఆత్మపరీక్ష మొదలగు అనేక గ్రంథాలు ఈ రాజుల కాలములో పండితులచే వ్రాయబడి వెలుగు చూశాయి. ఇతని కాలములో నట, నృత్య, గేయ కళాకారులెందరో పోషించబడినారు. అనేక నాటకశాలలు కట్టించి కళాకారులకు జీవనోపాధిని కల్పించి లలిత కళామతల్లికి కళాహారతులుపట్టిన కళారాధకుడు రఘునాధ నాయకుడు.రఘునాధ నాయకుని వద్ద అనేకమంది ఆస్థాన కవులుండేవారు వారిలో ముఖ్యులు (1) గోవింద దీక్షితులు, (2) యజ్ఞనారాయణ దీక్షితులు, (3) వెంకటేశ్వర ముఖి దీక్షితులు, (4) రాజ చూడామణి దీక్షితులు, (5) కుమార తాతాచార్యులు, (6) భాస్కర దీక్షితులు. వీరు వ్రాసిన గ్రంథములు : హరివంశ సారాంశ చరిత్రము, సంగీత సుధానిధి, సాహిత్య రత్నాకరము, రఘునాధ భూపతి విజయము, రఘునాధ విలాసము, అలంకార రత్నాకర వార్తికాభరణము, చతుర్థుండి ప్రకాశిక రుక్మిణి పరిణయ కావ్యము, కంసధ్వంసము, కాంతిమత్యు పాక్యానం, రతఖేట విజయము, చిత్రమంజరి, శృంగార సర్వస్వం, కావ్య దర్పణం, అలంకార చూడామణి.తంజావూరు రాజు ఆలూరి రఘునాధ నాయకుడు “సంగీత సుధ" అనే సంగీత శాస్త్రాన్ని “జయంత సేన” అనే నూతన రాగాన్ని రామానందమనే నూతన తాళాన్ని “రఘునాధ మేళ” అనే విశిష్ట మేళను రచించెను. ఇతడి సాహిత్య సభా మంటపాలను, “ఇందిర మందిరము” అని పిలిచెడివారు. ఇతడు రామాయణము, వాల్మీకి చరిత్ర గ్రంథములు వ్రాశాడు. ఇతని ఆస్థాన కవియిత్రి రామబద్రాంబ “రఘునాదాభ్యుదయం” అనే సంస్కృత కావ్యాన్ని రచించెను. మధురవాణి అనే కవయిత్రి “రామాయణము" ను సంస్కృత భాషలో వ్రాసెను. ఇతని రాజ్యములోని చేమకూర వెంకట కవి "సారంగధర చరిత్ర, విజయ విలాసము అనే గ్రంథములు రచించెను. ఇతడు (బలిజ కవి) ప్రభంద యుగంలో ఏ కవిని తీసిపోనివిధంగా కమ్మని పద్యాలు రచించెను. కవి చౌడప్ప, క్షేత్రయ్యలుగూడా వీరి ఆస్థానమునందుండి వీరి పాలన గొప్పతనాన్ని కలిగించిరి. "సమీర విజయము" అనే గ్రంథమును రచించిన "పుష్పగిరి తిమ్మన" నాయకరాజుల యుగానికి చెందినవాడు. కంకంటి పాపరాజు “విష్ణుమయా విలాపము” అనే యక్షగానమును “ఉత్తర రామాయణము” అనే గ్రంథమును రచించాడు.ఈ రాజ కవియైన రఘునాధ నాయకుడు కుమారుడు విజయరాఘవ నాయకుడు. కూడా గొప్ప రసిక హృదయుడు. ఇతని ఆస్థానములోనే పసుపులేటి రంగాజమ్మ “ఉషా పరిణయం" అనే కావ్యాన్ని రచించెను. అంతేగాక చెంగళ్వకాళ కవి గొప్ప గ్రంథాలను వ్రాశారు. విజయరాఘవ నాయుడు స్వయంగా కాళీయ మర్ధనము, ప్రహ్లాద చరిత్ర అనే గ్రంధాలను రచించాడు. విజయ రాఘవ నాయుడు కుమారుడు మన్నారు దేవనాయుడు హేమాబ్జ నాయకా స్వయంవరం అనే యక్షగానాన్ని రచించాడు. మధుర రాజు విజయ రంగ చొక్కనాధుడు (బలిజరాజు) శ్రీ రంగ మహాత్మ్యము తులకావేరి మహాత్మ్యము గ్రంథములు వ్రాశారు.న్యాయ చూడామణి, దర్పణము, ఆత్మపరీక్ష మొదలగు అనేక గ్రంథాలు ఈ రాజుల కాలములో పండితులచే వ్రాయబడి వెలుగు చూశాయి. ఇతని కాలములో నట, నృత్య, గేయ కళాకారులెందరో పోషించబడినారు. అనేక నాటకశాలలు కట్టించి కళాకారులకు జీవనోపాధిని కల్పించి లలిత కళామతల్లికి కళాహారతులుపట్టిన కళారాధకుడు రఘునాధ నాయకుడు.
శత్రువులకు సింహస్వప్నం
యుద్ధ కళలలో ఆరితేరిన యుద్ధ విశారదుడు అశ్వ (గుర్రం) గజ (ఏనుగు) విద్యలు తెలిసిన జ్ఞాని, ఆనాడు “దేవికోట” ను పాలిస్తున్న చోళ రాజును సముద్రములో ఏనుగులపై వెళ్ళి జయించాడట సముద్రముపైన పడవలతో వంతెన కట్టించి శ్రీలంక జాఫ్నా దీవిని ముట్టడించి పరాయి దేశీయులైన పోర్చుగీసువారిని గెలిచిన ఆంధ్ర తెలుగు బలిజబిడ్డ. చోళ, పాండ్యులతో అనేక యుద్ధాలు చేసి విజయము సాధించారు. ఆయన ధైర్య సాహసాలు, యుద్ధ నైపుణ్యాలను గురించి రఘునాధాభ్యుదయ కావ్యము, విజయ విలాపము, రఘునాధ నాటకము, మన్నారుదాస విలాసము, ఉషా పరిణయము, మొదలగు గ్రంథాలలో ఇతని కీర్తిని ఎంతో గొప్పగా వ్రాశారు. కుంభకోణము, విజయ రాఘవ పురం, శ్రీరంగం, రామసేతువు ప్రాంతములలో రామాలయాలు కట్టించిన గొప్ప భక్తుడు. అంతేగాకుండా శిధిల దేవాలయములను జీర్ణోద్ధరణ గావించాడు. పండితులకు, బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలిచ్చాడు. ప్రతిరోజు ఐదువేలమంది ప్రజలకు, బ్రాహ్మణులకు భోజనము పెట్టి కానుక లిచ్చిన నియమవ్రతుడు, నిర దాత, మన రఘునాధ నాయకుడు. రఘునాధ నాయకునికి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన యుద్ధము “తోపూరు | యుద్ధము” (Topur) విజయనగర సామ్రాజ్యాధీశుడు పెనుగొండ ఆరవీటి వెంకటపతి రాయలకు తన అన్న తర్వాత రాజయినందున అన్నగారి మీద భక్తితో తన అన్న కుమారుడైన శ్రీరంగరాయలు-2ను చక్రవర్తిగా నిర్ణయించాడు. దానికి శ్రీ వెంకటపతి రాయలు మామగారైన గొబ్బూరు జగ్గరాయలు తన చెల్లెలు బయ్యమ్మ (వెంకటపతి రాయలు భార్య) కుమారుడిని (రెండు సంవత్సరాలు) చక్రవర్తిని చేయాలని పంతము పట్టెను. దీనితో పెనుగొండ సంస్థానము రెండుగా చీలినది. ఒక వర్గానికి బలిజ నాయకుడు వెంకటగిరి సంస్థానాధీశుడు గొబ్బూరు జగ్గరాయలు నాయకత్వం వహించగా రెండవ వర్గమునకు పెనుగొండ సైన్యాధిపతియైన వెలమ నాయకుడు యాచమ నాయకుడు నాయకత్వం వహించాడు. గొబ్బూరి జగ్గరాయలు ఆరవీటి శ్రీరంగనాయకులు కుంటుంబము నంతటిని జైలులో వేసి చంపివేసి (తన అల్లుడు వెంకటపతి రాయలుకు ఆరోగ్యము సరిగా లేని కారణంగా తనే రాజ్యపాలన చేయసాగెను. ఇతనిని జింజి పాలకుడు తుపాకుల క్రిష్ణమ నాయుడు, మధురరాజు ముద్దువీరప్ప నాయుడు సమర్థించిరి.
అది తెలిసిన యాచమనాయుడు అర్థరాత్రి కొందరు అనుచరులతో ఆరవీటి శ్రీరంగ రాయలు-2ను తీసుకొని పెనుగొండ రాజ్యము వదిలి తంజావూరు రాజ్యములో ప్రవేశించి జరిగిన విషయమంతా తంజావూరు రాజు రఘునాధ నాయకునికి విన్నవించి ఆయన సహాయము అర్థించెను. రఘునాధ నాయకుడు రక్షిస్తానని విజయనగర సంస్థాన పెనుగొండ సింహాసనముపై శ్రీరంగ రాయులను కూర్చుండబెడతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది తెలిసి కోపోద్రిక్తులైన జగ్గరాయలు, తుపాకుల క్రిష్ణమనాయుడు, మధుర పాలకుడు ముద్దు వీరప్ప, పోర్చుగీసు సైన్యముతో కూడి తంజావూరు రఘనాధ నాయకునితో “తోపూరు” గ్రామమువద్ద ఎదుర్కొన్నారు. రఘునాధుడు వీర విహారము చేసి జగ్గరాయులు సైన్యాన్ని ఓడించి జగ్గరాయలను సంహరించాడు. పోర్చుగీసు సైన్యాలను తరిమేశాడు. మధుర, జింజి నాయక రాజులుకున్న బంధుత్వం కారణంగా క్షమాభిక్ష పెట్టి వదిలేశాడు. ఫలితంగా బాలుడైన శ్రీరామ దేవరాయలు (శ్రీరంగ రాయలు-2) ను సింహాసనముపై కూర్చుండబెట్టెను. రఘునాధ నాయకుడు తమిళనాడు ప్రజలను భయకంపితులను చేయు బందిపోటు నాయకుడు “సోలోగా” అనేవాడిని పట్టి బంధించి చంపివేశాడు. ఆయాచమ నాయుడును వెంకటగిరి సంస్థానానికి రాజును చేశాడు. రఘునాధ నాయకుని కుమార్తె అచ్యుత రఘునాధమ్మను మధుర రాజు గరికపాటి తిరుమలనాయకునికిచ్చి వివాహం చేశాడు.
విజయరాఘవ నాయకుడు 1633-1673:
ఆలూరి రఘునాధ నాయకుని తర్వాత అతని కుమారుడు విజయ రాఘవ నాయకుడు తంజావూరు సింహాసనమాక్రమించెను. ఇతను ఎందరో పండితులను ఆదరించెను. శ్రీ మహావిష్ణువు భక్తుడు ప్రతి నిత్యము పండ్రెండు వేలమంది పేదలు భోజనము చేసిన తర్వాత భార్యభర్తలు భోజనము చేసెడివారు.ఒకప్పుడు విశేష వర్షాల వలన భోజనము తయారు చేయుటకు వంట చెరకు అయిపోయినది. రాజమందిరములు పగులగొట్టించి భోజనము తయారుచేయించాడు ద్వాపరయుగంలో కర్ణుడు చేశాడు). తర్వాత గూడా వర్షాలు తగ్గలేదు. ఇంకొక రాజభవవము పగులగొట్టి దూలములు, స్తంభములు తర్వాత వస్త్రాలు వేసిరి. పొగ ధరించలేక వంటవాళ్ళు పారిపోయిరి. శ్రీరంగమునుండి “రంగనాయకిదేవి” బ్రాహ్మణ స్త్రీగా వచ్చి వంటచేసి వెళ్ళినది. మరుసటి రోజు దేవాలయములో రంగనాయకీ దేవి ముక్కుపుడక కనిపించలేదు. ఆ దినము దేవాలయ పరిచర్య చేసిన బ్రాహ్మణుడిని పట్టుకొని కొట్టారు. బ్రాహ్మణుడు తంజావూరు వచ్చి విజయరాఘవ నాయుడికి విన్నవించుకున్నాడు. తర్వాత ఒక స్త్రీ వేషంలో “రంగ నాయకిదేవి” వచ్చి నేను భోజనం తయారు చేస్తుండగా గంజి తొట్టిలో పడినదని చెప్పగా ఆ తొట్టిలో చూడగా ముక్కుపుడక కనిపించింది. అదిమొదలు తంజావూరు రాజులను “అమ్మ కుమారులు” అని పిలిచెడివారు.తర్వాత తంజావూరు రాజు, రాణి ప్రతినిత్యము శ్రీరంగము, పల్లకీమీద పోయి కావేరీలో స్నానముచేసి శ్రీరంగాధుని శ్రీరంగ నాచ్చియారు అమ్మవారిని సేవించి మరలా తంజావూరు వచ్చెడివారు.తంజావూరు సంస్థానమునకు లోబడియున్న మార్గములను, కోట బురుజులను, కావేరి తీరమందలి పుష్ట మండపము, మద్యార్జున మండపం జీర్ణోద్ధరణ చేయించాడు. శ్రీ రాజమన్నారు కోవెలయందు స్వామియొక్క ఆలయమును మరియు అనే ఆలయాలను నిర్మించెను. సమీర కుమార విజయము అనే గొప్ప గ్రంథమును రచించిన పుష్పగిరి తిమ్మన నాయక రాజుల వద్ద కొంతకాలము ఉండెను. కంకంటి పాపరాజు, విష్ణు మాయా విలాసము అనే యక్షగానము, ఉత్తర రామాయణము అనే గ్రంథమును రచించెను. తంజావూరు రాజు విజయ రాఘవనాయుడు గొప్ప రసిక హృదయుడు. అతని ఆస్థానములో పసుపులేటి రంగరాజమ్మ అనే కవియిత్రి 'ఉషా పరిణయం' అనే కావ్యాన్ని రచించెను. అంతేగాక చెంగల్వకాళకవి గొప్ప గ్రంథములు రచించెను. విజయ రాఘవ నాయకుని కుమారుడు మన్నారు దాసు నాయుడు తండ్రివలెనే "హేమాబ్జ నాయకా స్వయంవరం అనే యక్షగానాన్ని రచించెను. వీరి ఆస్థానములో సవరం చిన్నయ నాయుడు అలివి ఉండేవాడు.
ఇతడు గొప్ప భక్తుడైనా, అహింసావాది అయినా, సమయము తప్పి వచ్చినపుడు గౌరవమును కాపాడుకొనుటలో యుద్దానికి కూడా వెనుదీయడు. ఆయనకు ఎనభై సంవత్సరముల వయస్సులో మదురరాజు చొక్కనాధ నాయకుడు తంజావూరు విజయ రాఘవ నాయకుని కుమార్తె మంగమ్మ (మోహనాంగి)ను వివాహమాడదలచి పెద్దలతో రాయబారమంపెను. అంతకుముందు విజయ రఘునాధ నాయకుని చెల్లెలు అచ్యుత రఘునాదమ్మను మధురరాజు తిరుమల నాయకుడు వివాహమాడాడు. కాని కొన్ని సంవత్సరముల తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపాడనే కారణముల వలన మధుర తంజావూరు రాజులకు ఘర్షణలు జరుగుతుండేవి. దానికారణంగా తన కుమార్తె నిచ్చుటకు నిరాకరించాడు. ఆ తర్వాత చొక్కనాధ నాయకుడు, చెంగమల దాసును ససైన్యముగా తంజావూరు మీదికి యుద్ధానికి పంపాడు. ఆ యుద్దములో విజయరాఘవుడు అతని కుమారుడు మన్నారు దాసునాయుడు వీరమరణమొందిరి అంతఃపుర స్త్రీలందరు ఆత్మహత్య చేసుకొనిరి. విజయ రాఘవ నాయుకుడు తన సేనాధిపతి రంగప్ప నాయడు కుమారుడు రంగనాధ నాయుడికి తన కుమార్తె నివ్వాలని నిశ్చయించెను. తంజావూరు రాజ్యము కొంతకాలము చంగమలదాసు పాలించాడు. తర్వాత మరాఠా కాపుల వశమయినది. చత్రపతి శివాజి తమ్ముడు వంశీయులు పాలించిరి.