బ్రిటీష్ వారి దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచిన జెండా వీరుడు
September 20 , 1964 - Andhrajyothi Article
శ్రీ తోట నరసయ్య నాయుడు గారి నిర్యాణముతో ఆంధ్ర దేశం ఒక సుప్రసిద్ధ దేశ భక్తుని, స్వార్థ మెరుగని త్యాగమూర్తిని. స్వాతంత్య్ర సమరయోధుని, రాజకీయ ప్రచారకుని, ఒక మహా వ్యక్తిని కోల్పోయింది. జీవిత మంతా దేశ సేవకు, స్వాతంత్ర్య సముపార్జనకు అంకితంచేసి. ఆంధ్రదేశంలో రాజకీయ చైతన్యం ప్రబలడానికి అనేక సత్యాగ్రహోద్యమాలలో పాల్గొని ఫలితాలు సాధించి వానిని అనుభవించకుండా కన్ను మూసిన కర్మయోగి.ఆయనకు వయస్సు పఁడకపోయినా ఆరోగ్యం శిథిలమైపోయింది. జీవసత్వాలు క్షీణించిపోయాయి. ఆర్థిక స్థితిగతులు అనుకూలించ లేదు. కాలంతోపాటు కాలు ఆడిస్తూ కాలాన్నే తోడుచేసుకొని తన జీవితాన్ని కొనసాగించి, హృద్రోగంతో బాధ పడుతూ, తన 65 వ ఏట మృత్యువుకు స్వాగతమిచ్చారు.
కృష్ణాజిల్లా దివి తాలూకా పొగోలు గ్రామంలో తోట లక్ష్మయ్య, లక్ష్మమ్మ అనే పుణ్యదంపతులకు నరసయ్య, భాస్కరరావు అనే కుమా రులు జన్మించారు.శ్రీ తోట నరసయ్యకు విధ్యాభ్యాసం లేదు. అక్షరం ముక్కరాదు. బాల్యమంతా ఆటపాటలతో గడిపి వ్యవసాయపు పనులు చేసుకుంటూ జీవించేవారు. చిన్నతనం నుంచి కుస్తీలు , పోట్లాడడంమీద మక్కువ ఎక్కువై మల్లయోధుడైనాడు. కారు డ్రైవింగ్ చేయడం కూడా నేర్చుకున్నాడు.
వల్లూరు రాజావారు తోట నరసయ్య కుస్తీలను చూచి ఆనందపడి 1924 లో ఆయనను బందరు తీసుకువచ్చి తనవద్ద కారు డ్రైవర్గా పెట్టుకున్నారు. డ్రైవర్గా పెట్టుకున్నారేగాని అతనిచేత డ్రైవింగ్ చేయించే వారు కాదు. ఆయనకు కూడా కుస్తీని మీద సరదా ఉండడంచేత నరసయ్య చేత కుస్తీలు పట్టిస్తూ తరిఖీదు ఇప్పించారు. మల్లయోధుడుగా శ్రీ నరసయ్య పేరుపొందారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, గుంటూరు , రాజమండ్రి,విజయనగరం మొదలగు పట్టణాలలో అనేక మండి మల్లయోధులను జయించి బందరు వచ్చారు.అప్పుడు కొంత మంది శిష్యులను చేరదీసి వల్లూరు రాజావారి యాజమాన్యం క్రిందే తాలింఖానాలను నెలకొల్పి వ్యాయామ శిక్షణ ఇచ్చారు. అప్పటి యువకులకు నాయకత్వం చలాయించారు.
స్వతంత్ర సమరం ఉధృతంగా సాగు తున్న రోజులవి. గాంధిజీ పిలుపునందుకొని శ్రీ తోట నరసయ్య ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. చిన్నాపురం నుంచి బండరుకు ఉప్పు తీసుకువచ్చారు. ఆయన గుప్పిటిలోని ఉప్పును తీయడానికి 16 మంది పోలీసు కానిస్టేబుల్స్ తన్నుకున్నారు. కాని శ్రీ నరసయ్య పిడికిలి విప్పలేక పోయారు. ఆ కోపంతో ఆయనను కింద పడగొట్టి లాఠీలతో బాదారు.
ఆ రోజులలో బియ్యానికి కటకట ఏర్పడినది. పేద ప్రజలకు బియ్యం సులభంగా లభ్యం కావడంలేదు. అప్పుడు శ్రీ నరనయ్య బియ్యం దుకాణాలను దోచి పేదలకు పంచి పెట్టారు. కలెక్టర్ తో మాట్లాడి చౌక దుకాణాలు ఏర్పాటు చేసి తాను దగ్గరవుండి పేదలకు బియ్యం తక్కువ వెలకు ఇప్పించారు.
విజయవాడలో బియ్యం దొరకక పేదలు బాధలు పడుతున్నారని తెలిసి విజయవాడ వెళ్ళి అక్కడ కొన్ని దుకాణాలను దోచి ఆ బియ్యం పేదలకు పంచి పెట్టారు. అప్పుడు బ్రిటిష్ దొరలు నరసయ్యను తుపాకితో కాల్చి చంపాలని అక్కడకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఎవరో ఒక మహనీయుడు శ్రీ నరసయ్యను ఆ రోజుకు దాచివేశాడు. మరుసటి రోజున శ్రీ నరసయ్య తాను స్వయంగా కలెక్టరు దగ్గరకు వెళ్ళితాను చేసిన నేరం స్వయంగా ఒప్పుకున్నారు. శ్రీ నరసయ్యను పోలీసులు పట్టుకొని కేసుపెట్టారు. దుకాణాలు దోచి పేదలకు బియ్యం పంచి పెట్టి నేరానికి శ్రీ నరసయ్యకు తొమ్మిది మాసాల కఠిన శిక్ష విధించారు. ఆయన ఆ తొమ్మిది మాసాలు రాజమండ్రి జైలులో వుండివచ్చారు.
బందరు కోనేరు పై కాంగ్రెసు జండాజైలు నుంచి వచ్చిన తరువాత జాతీయ భావాలు మరింత ఎక్కువై మిల్లు బట్టలను నడి బజారులో తగులబెట్టి ఖద్దరు వస్త్రాలను ధరించి బందరు కోనేరు సెంటరుపై వున్న స్తంభం ఎక్కి కాంగ్రేసు జండాను ఎగురు వేయాలని ప్రయత్నించారు. పోలీసులు హెచ్చరికలు చేసినా వినలేదు. కోనేరు స్తంభం ఎక్కుతుండగా పోలీసులు లాఠీలతో పొడిచారు. చావబాదారు. కాని ఆయన దెబ్బలను లెక్కచేయకుండా కాంగ్రెసు జండాను కోనేరు స్తంభంపై కట్టి ఆ పతాకము నకు జై హింద్" అని కేక వేస్తూ ప్రణామం చేశారు అప్పుడే ఆయనకు "జండా వీరుడు" అనే పేరు వచ్చింది శ్రీ నరసయ్య స్తంభందిగి రాగానే పోలీసులు కొట్టుకుంటూ స్టేషన్కు తీసుకు వెళ్లి ఆయనపై కేసు పెట్టారు. మిల్లు బట్టలు తగుల బెట్టినందుకు, కోనేరు స్తంభంపై కాంగ్రెసు జెండాను కట్టినందుకు ఆయనకు న్యాయస్థానం 18 నెలలు కఠినశిక్ష విధించింది. ఆయన చిరునవ్వుతో ఆ శిక్షను అనుభవించి వస్తానని కోరాపుట్ జైలుకు వెళ్ళారు.
పులుసులో పురుగులుకోరాపుట్ జైలులో ఒక రోజు ఒక యుగంగా గడిపారు. అప్పటి రాజకీయవాదులకు జైలులో సరియైన తిండిలేదు. పార వేసిన మామిడి టెంకలను ఎరించి వాటితో పులుసువండి పోసేవారట. ఆ పులుసులో పురుగులు, మేకులు, చెత్తపుల్లలు వుండేవట. ఆ తిండి తినలేక కొన్నాళ్ళు నిరాహారదీక్ష సాగించారు. అప్పుడు ఆయన మలేరియాజ్వరంతో బాధపడ్డారు.18 నెలలు ఆ నరకం అనుభవించలేక తన మసును వేరు ధ్యాసల మీదకు మళ్ళించుకునేం దుకు అక్షరం ముక్కరాని ఆయన తన జైలు స్నేహితుల వద్ద అక్షరాలు నేర్చుకుని భగద్గీత చదవడం ప్రారంభించారు.జైలునుంచి తిరిగి రాగానే ఆయన స్నేహితులు రెండు వేల రూపాయలమేరకు చందాలు వసూలుచేసి సన్మానించి ఆయనకు అంద జేశారు.కాంగ్రెసు ప్రచారం
కాంగ్రెసు ప్రచారం
శ్రీయుతులు అయ్యదేవర కాళేశ్వరరావు. డాక్టర్ పట్టాభి, టంగుటూరి ప్రకాశం వంతులు, ముట్నూరి కృష్ణారావు గార్లతో కలసి ఆయన కాంగ్రెసు ఆశలను, ఆశయాలను ప్రచారం చేశారు.ఒకరోజు పామర్రులో శ్రీ నరసయ్య కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా పోలీసులు ఆయన తలపైనున్న గాంధీ టోపీని ఊడబీకారు. వారు అలా వెళ్ళగానే జేబులో నుంచి మరొక టోపీని తీసి పెట్టుకొని" బ్రిటిషు వారు భారతదేశం విడిచిపెట్టి వెళ్ళాలి" అనే నినాదం చేస్తుండగా మళ్ళీ పోలీసులు తిరిగి వచ్చి నరసయ్యను లారీలలో కొట్టి బట్టలు చింపి చెయ్యి విరగదీశారు, ఆయన నేలకు 'ఒరిగి ఆఖరి క్షణంలో వుండగా పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అక్కడున్న కాంగ్రెసు భావాలు గల వ్యక్తులు నరసయ్య గారిని వారి యిఁటికి చేతుల పై తీసుకు వెళ్ళి వారం రోజులలో మనిషిగా చేసి రహస్యంగా బందరు పంపించారు.
ఆయన బందరు రాగానే అప్పుడు వుటున్న ఇల్ల గలవారు నరసయ్యను ఇలు కాళీ చేయమని బలవంతంగా తమను ఖాళీ చేయించారు. భార్యా పిల్లలలో నరసయ్య అనేక యిళ్లు తిరిగారు. కాని ఎవరు వారికి యిల్లు అద్దెకు ఇవ్వలేదు. తలుపుతీసి సమాధానం కూడా చెప్పలేదు. చివరకు శ్రీ నరసయ్య సత్రంలో తలదాచుకున్నారు. పోలీసులు వచ్చి సత్రంకూడా ఖాళీ, చేయించారు. కొన్నాళ్లు చెట్టుక్రింద కాపురం వున్నారు. కాని పోలీసులు ఆ చెట్టునీడ కూడా దూరం చేయాలని ఆ చెట్టెను కొట్టివేశారు. ఆ రోజులలో భార్యా పిల్లలను తీసుకొని ఆయన కర్మ ఆదేశించిన చోటుకల్లా తిరిగారు. విధి చూపించిన మార్గాన నడిచారు. తన మనోధైర్యమును విడనాడలేదు. మరింత వికాసాన్ని పొందారు.
అఖిల భారత కాంగ్రెసు మహాసభలు, స్వాతంత్ర ఉద్యమాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఆ మహాసభలకు బందరు నుంచి డాక్టర్ పట్టాభి హాజరవడానికి బయలుదేరారు, వారితో పాటు శ్రీ తోట నరసస్యకూడా బయలుదేరి, వెళ్ళి మహాసభలో పాల్గొన్నారు. డాక్టర్ పట్టాభి శ్రీ తోట నరసయ్యను గాంధీజీ దగ్గరకు తీసుకు వెళ్ళి శ్రీ నరసయ్య చేసిన త్యాగాలను గాంధీజీతో వివరించి చెప్పారు. శ్రీ నరసయ్య గాంధీజీ పాదాల పైబడి నమస్కరించారు.ఆయన శిషయాలను విన్న గాంధీజీ శ్రీ నరసయ్యను వీపుతట్టిలేపి ఆశీర్వదించారు. సర్దార్ వల్లభాయి పటేల్ అప్పటికే శ్రీ నరసయ్య త్యాగాలు విని తనంతట తానే పరిచయం చేసు - కుని చాలాసేపు సంభాషించారు. నేతాజీ సుభాన్ చంద్రబోస్ శ్రీ నరసయ్యను అభినం గించి, ఆంధ్ర ప్రాంతంలో తాలింఖన ఏర్పాటు చేసి యువకులకు శిక్షణ యిచ్చి వారి ప్రయోజకులుగ తయారు చేయమని ఆదేశించారు. నరసయ్య బందరు వచ్చి తాలిఁ ఖానాలు పెట్టి వందలాది యువకులకు వ్యాయామ శిక్షణ యిచ్చారు. వారికి కాంగ్రెసు ఆశయాలు బోధించారు. వారికి "విప్లవం" అనే మందును నూరిపోసి విప్లవకారులుగా తయారుచేశారు.
కార్మికోద్యమంస్వతంత్రం సిద్ధించిన తరువాత ఆయనకు కాంగ్రెసు అనుసరిస్తున్న పద్దతులు నచ్చక ప్రక్క ప్రక్కగా తిరగడం మొదలు పెట్టారు. రాజకీయ బాధితునిగా పది ఎకరాల పొలం యిస్తామంటే అక్కర్లేదని నిరాకరించారు. బస్సు రూట్ యిస్తామంటే కూడా నిరాకరించారు. ఈ స్వార్గాలకోసం నేను త్యాగంచేయలేదు అని సమాధానం చెప్పారు. అలాటి స్వార్థమెగని త్యాగమూర్తి ఇక మనకు లేడు. తిరిగి రాదు. చరమ దశలో ఆర్థిక ఇబ్బందులు .ఆయన సహనాన్ని పరీక్షించి రెచ్చగొట్టాయి అయినా చలించలేదు. ఆయన భార్య శ్రీమతి మాధవమ్మ మహాసాధ్వి, ఉత్తమ యిల్లాలు. తన భర్తతోపాటే ఆమె కూడా అనేక కష్టాలకు తట్టుకొని భర్తకు ధైర్యం చెబుతూ వుండేది. లేని కాపురాన్ని చక్కదిద్దకోడం లోనే ఆమె సహనం , నిబ్బరం యిమిడివున్నవి. తోట నరసయ్య ప్రస్తుత కాంగ్రెసుకు ప్రక్కగా వున్నా అయన అ సంస్థను విడనాడ లేదు. ఆఖరి క్షణం వరకు ఆ సంస్థను అంటి పెట్టుకున్నారు. ప్లాటుఫారాలు ఎక్కి ఉపన్యా సాలు యివ్వడం మానివేసినా రిక్షా బండి ఎక్కి కోనేరు సెంటర్ కూడలిలో వందలాది మందిని చేర్చి "యదార్థపాత కాంగ్రేసు" ఆంటూ నాటి ఆశయాలను వివరించి ఆనర్ధకంగా. గంగా
బ్రిటిషు పాలనలో కార్మికులు తమ హకులను పొగొట్టుకున్నారు. శ్రీ తోట నరసయ్య కార్మిక హక్కులను తిరిగి సంపాదించుకొనుటకు ఉమ్మడి మదరాసు రాష్ట్ర మోటారు వర్కర్ల యూనియన్లు ప్రస్తితి కేరళ గవర్నరు శ్రీ వి. వి. గిరి అధ్యక్షులుగా.
శ్రీ తోట నరసయ్య ఉపాధ్యక్షులుగా వ్యవహరించి కార్మికుల సమస్యలను పరిష్కరించారు.కృష్ణాజిల్లాలో అనేక కార్మిక సంఘాలను మొట్ట మొదటగా ఏర్పాటు చేసి కార్మికోద్యమ నిర్మాత అయినారు.ఆచార్య రంగాను బందరు తీసుకువచ్చి. శ్రీ నరసయ్య దంపతులు వారి నివాస గృహంలో వారికి వీరపూజ చేసి తిలకం దిద్దారు. కత్తిని బహూకరించారు.
శ్రీ తోటనరసయ్య, వారి భార్య మాధవమ్మ, సోదరుడు భాస్కరరావు, కుమారుడు కృష్ణ బిపిన్ చంద్రపాల్ కలసి హరిజనోద్యరణకు గ్రామ సీమలు కాలినడకలో పర్యటించి వారిని హిందూ మతం. హిందూ సంస్కృతిని విడనాడ వద్ద), పారిశుద్ధ్యం అలవరచుకోవాలని హితవులు చెప్పే స్త్రీల నుదుట తిలకం దిద్ది ప్రచారం చేశారు ఆంధ్రరాష్ట్రలోని అన్ని గ్రామాలు. మద్రాసు రాష్ట్రంలోని కొన్ని గ్రామాలు పాదయాత్ర చేసి హరిజనోధరణ ప్రచారం చేశారు.వారి బిడ్డలకు కృష్ణబిపిన్ చంద్రపాల్, బోసుబాబు, వల్లభాయ్ పటేల్. స్వరాజ్యగీత లక్ష్మీకుమారి అనే పేర్లు పెట్టుకొని వృద్ధ ఆదర్శ మూర్తులను గౌరవించుకున్నారు.ప్రవాహంన ఉపన్యాసం ఇచ్చేవారు.
రాష్ట్ర మంత్రులు, కాంగ్రెసు పెద్దలుఅందరు వస్తే వారిని చూడకుండా వెళ్ళేవారు కాదు. శ్రీ సంజీవరెడ్డి బందరు ఎప్పుడు వచ్చినా "జైలులో గురువుగారూ" అని సందోధించి వారి యిట్లో కాసేపు గడిపేవారు.దేశం కోసం, భారత జాతి స్వతంత్రం కోసం జాతీయోద్యమాలలో పాల్గొని ప్రాణాలను లెక్కచేయక అనేక సేవలు చేసిన శ్రీ తోటనరసయ్య గారి కుటుంబానికి ఆంధ్ర ప్రజలు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. ఆ మహనీయునికి ఇదే నా శ్రద్ధాంజలి.
OTHER SOURCES