రాయదుర్గం ఎలా మొదలయ్యింది
తరువాత కాలంలో భూపతి రాయని వారసులే రాయదుర్గం పాలించారు , 1565 లో తల్లికోట యుద్ధం జరిగేవరకు కూడా విజయనగర రాజులతో పక్కపక్కనే ఉంటూ యుధాలు చేసారు. తల్లికోట యుద్ధంలో పరాజయం కావడంతో ఎవరికివారు చల్లా చదురు అయ్యి వేరు వేరు ప్రాంతాలకు తరలిపోయారు.
ఈ గంగరగోళం సమయంలో బోయలు మళ్ళి రాయదుర్గంని ఆక్రమించుకుని వాళ్లలో ఒకరిని రాజుని చెయ్యాలని నిర్ణయించుకుంటారు అందుకు విరలింగన్న నాయక్ ను వాళ్ళ నాయకుడిగా నియమించుకున్నారు వీర లింగన్న నాయకుడి వారసులే కొన్ని సంవత్సరాలువరకు రాయదుర్గంని ఏలారు.
చివరి రాజైన బొమ్మల్లా నాయక్ ని వెర్రి బొమ్మల్లా అనే వారు ఎందుకంటే ఇతని పాలనలో ప్రజలను ముప్పతిప్పలు పెట్టేవాడు. ...... 1
పెనుకొండపాలకులు : పెద్ద కోనేటి నాయడు
చంద్రగిరి పాలకుల వద్ద సర్వ సైన్యాధ్యక్షులుగా మన్నెలు పొందిన ' వానరసి ' అనే బలిజ కుటుంబీకుల వారసుడైన పెద్ద కోనేటి నాయనింగారు స్వయానా 1630 నుండి 1642 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి అరవీటి వేంకటపతి రాయలు గారి అల్లుడు. పెద్ద కోనేటి నాయుడు గారి భార్య పేరు ఉద్లంబ.అరవీటి వేంకటపతి రాయలు అల్లుడైన పెద్ద కోనేటి నాయకుడి సాహసాలకు మెచ్చిన అరవీటి వేంకటపతి రాయలవారు కోనేటి నాయకుడిని దళవాయి అనే బిరుదుతో సత్కరించి పెనుకొండ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు.ఇలా 1635 లో పెద్ద కోనేటి నాయుడు పెనుకొండకు రాజు అవుతాడు.
1........ 1652 లో బీజాపూర్ సుల్తానువారు పెనుకొండరాజ్యాన్ని స్వాధీనంచేసుకుని దానికి బదులుగా అనంతపురం జిల్లాలో ఉన్న కుందుర్పి రాజ్యాన్ని బదులుగా ఇస్తారు.ఇలా పెద్ద కోనేటి నాయడు కుందుర్పిలో రాజ్యం చేస్తుండగా , రాయదుర్గం పాలిస్తున్న వెర్రి బొమ్మల్లా పోరుని తట్టుకోలేక అక్కడున్న ప్రజలు, మంత్రులు పెద్ద కోనేటి నాయకుడిని సహాయం కోరుతారు.కోనేటి నాయకుడు ఆ వెర్రిబొమ్మల్ల నాయకున్ని సంహరించి 1661 లో రాయదుర్గ పరిపాలన మొదలు పెట్టెను.
దళవాయి వేంకటపతి నాయడు
పెద్ద కోనేటి నాయుడు తరువాత అతని కుమారుడు వేంకటపతి నాయుడు సింహాసనం అధిష్టించారు.ఇతని భార్య పేరు లక్షమాంబ.వేంకటపతి నాయుడుగారికి దళవాయి పెద్ద తిమ్మప్ప , వేంకటపతి నాయడు అనే కుమారులు జన్మించెను.ఇతను 1670 - 1700 వరకు రాయదుర్గం పాలించి రాజ్యం చిన్న కుమారుడి చేతిలో పెట్టి కుమారులుకి పిన్న వయసు ఉండంగానే తండ్రి వేంకటపతి నాయుడు మరణిస్తాడు.రాజ్యం చేయడానికి చిన్న కుమారుడైన పెద్ద తిమ్మప్పకు అంత వయసు లేనందున బాధ్యతలు అన్ని తల్లి లక్షమాంబ చేతుల్లోకి తీసుకుంది.ఈమె పాలనలో చిటల్దుర్గ్ పాలెగాండ్రు పలుసార్లు దాడులుచేసాడు అయిన సరే ఈమె ఆ దాడులకు ఏమాత్రం చెలించలేదు ఆమె ఆ దాడులను ఒంటి చేత్తో తరిమికొట్టింది. పెద్ద తిమ్మప్ప 1700 - 1723 వరకు రాజ్యం చేసి 1732 లో కాలం చేస్తారు. ఆ తరువాత రాజ్య బాధ్యతలు ఇతని అన్నగారైన వేంకటపతి నాయుడు తీసుకుంటాడు.
వేంకటపతి నాయుడుకి ఐదుగురు కుమారులు కోనేటి నాయుడు , రాజ గోపాల నాయుడు , తిమ్మప్ప నాయుడు , .వేంకటపతి నాయుడు, కస్తూరి నాయుడు , రఘు నాయుడు. ఒక కుమార్తె నిక్కజమ్మ.వీరిలో కస్తూరి నాయుడు ఆత్మహత్య చేస్కుని మరణించారు
ఇలా వేంకటపతి నాయుడు 1723 - 1746 వరకు పాలించి పెద్ద కుమారుడైన కోనేటి నాయుడుకి రాజ్య బాధ్యతలు అప్పజెపుతాడు.
కోనేటి నాయుడు
1746 లో రాజాదుర్గానికి రాజైన ఈ కోనేటి నాయుడు బెద్నూర్ పాలెగార్ మరియా హర్పనహళ్లి పాలెగారు తో కలిసి వీళ్ళ పూర్వీకుల కాలం నుండి ఎన్నో ముప్పు తిప్పలు పెడుతున్న చిటల్దుర్గ్ పాలెగారుని హతమారుస్తారు. రాజ సింహాసనం కోసం సొంత తమ్ముళ్లే కోనేటి నాయుడిని 1753 లో హతమార్చారు తరువాత రాజ గోపాల నాయుడు రాజ సింహాసనం అధిష్టించి1753 -1756 వరకు పాలిస్తాడు. అతని తమ్ముడైన తిమ్మప్ప నాయుడు 1756 - 1777 వరకు రాయదుర్గం పాలించాడు.తరువాత రాజ గోపాల నాయుడు కుమారుడైన వేంకటపతి నాయుడు చేతికి సింహాసనం దక్కింది.ఇతను 1777 - 1787 వరకు రాయదుర్గం పాలించాడు.ఇతనికి తిమ్మప్పన్న అనే కుమారుడు.
1787 లో టిప్పు సుల్తాన్ రాయదుర్గం రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని వేంకటపతి నాయుడ్ని అతని భార్యని, మొత్తం బంధువులందరిని శ్రీరంగపట్నం జైలులో బంధించాడు.వేంకటపతి నాయుడు జీవితాంతం అక్కడే బందీగా ఉండి చివరకు అక్కడే 1791లో మరణించారు.
వేంకటపతి నాయుడు మరణం తరువాత వానరసి కుటుంభ రాజ్య పాలన ముగిసింది.1799 టిప్పు సుల్తాన్ మరణించడంతో శ్రీరంగపట్టణంలో బందీలుగా ఉన్న రాయదుర్గం పాలకుల వర్గం విడుదలయ్యారు.
ఇందులో కోనేటి నాయుడు కుమార్తె అయిన నిక్కజమ్మ కుమారుడు యీసబాతుల రాజగోపాల్ నాయుడు మరల రాయదుర్గం తిరిగివచ్చి మునుపటి మర్యాదలతో రాయదుర్గం పాలిస్తుండగా నిజామువారు సైన్యముతో వచ్చి రాజగోపాల్ నాయుడిని బందించి హైదరాబాదుకి తీసుకుపోయారు.
తరువాత రాయదుర్గం బ్రిటిషు వారి వశమయ్యింది.