కోట రామస్వామి నాయుడు
భారతదేశ టెన్నీస్ చరిత్రలో ప్రప్రథమంగా డేవిస్ కప్ పోటీలలో భారత జట్టు తరపున పాల్గొన్న ప్రప్రథమ ఆంధ్రుడు శ్రీ కోట రామస్వామి నాయుడు గారి జననం 16 జూన్, 1896.
శ్రీ రామస్వామి తాతగారి హయాంలోనే మద్రాసు వెళ్ళి స్థిరపడ్డారు. ఈయన తండ్రిగారు బుచ్చిబాబునాయుడు. వీరి అన్నదమ్ములు అయిదుగురిలో పెద్దవారు వీరు. వీరి కుటుంబంలో అందరూ క్రీడాకారులు కావడం విశేషం. మద్రాసు, మైలాపూర్ లోని 'లడ్ హౌస్' క్రీడల నిలయం. 20 ఎకరాల విస్తీర్ణం కల యింటి ఆవరణలో రెండు టెన్నీస్ కోర్టులు, క్రికెట్ పిచ్ ఉండేవి. వీరి యింట్లో ఎన్నో గుర్రాలు ఉండేవి. బుచ్చిబాబు నాయుడుగారు రోజూ ఉదయం గుర్రపు స్వారీ చేసేవారు. రెండు టెన్నీస్ కోర్టులలో ఒక కోర్టును స్త్రీలకు కేటాయించారు. టెన్నీస్ ఆడేందుకు విదేశీయులు కూడా వెళ్ళేవారు. టెన్నీస్, క్రికెట్ ఆటలకు కావలసిన క్రీడా సామగ్రిని వీరే తెప్పించేవారు. కొన్ని విదేశాల నుండి కూడా తెప్పించారు. పిల్లలందరూ యింట్లోనే చదువుకోవాలి, ఆడుకోవాలి. టెన్నీస్, క్రికెట్ క్రీడలలో శిక్షణ యిప్పించేవారు.
బుచ్చిబాబు సోదరులు మరికొందరు కలసి మద్రాసు క్రికెట్ అసోసియేషన్ను స్థాపించారు. మద్రాసు యునైటెడ్ క్లబ్ (M.U.C)ను కూడా స్థాపించారు. ప్రముఖ క్రికెటర్ రంజీగారు మద్రాసు వచ్చినపుడు, వారిని ఆహ్వానించి యమ్.యు.సి.లో ఆడించారు. 1908 వ సంవత్సరం యూరోపియన్లు, భారతీయుల జట్ల మధ్య క్రికెట్ పోటీను బుచ్చిబాబు గారు ఏర్పాటు చేశారు. ఆ పోటీ జరిగిన కొద్ది రోజులకే బుచ్చిబాబుగారు స్వర్గస్తులైనారు. ఆ దిగులుతోనే బుచ్చిబాబుగారి భార్య కూడ మూడు మాసాలకే భర్తను చేరుకున్నారు. అప్పటివరకు ఆ వంశంలోనివారికి మంచి చెడు కూడా తెలియదు. అప్పటికి కోట రామస్వామి గారికి 12 సంవత్సరాలు. తాతగారికి దత్తత వెళ్ళారు. పిల్లలు ఎవ్వరికీ 'లజ్ హౌస్' తప్ప బయట ప్రపంచం తెలియదు.
తండ్రి, పిన తండ్రులు టెన్నీస్ ఆడుతుంటే, వెనుక నిలబడి బంతులు అందించేవారు. వారు ఆడి కూర్చున్న తర్వాత, తండ్రిగారి టెన్నీస్ రాకెట్ తీసుకొని బంతులు కొట్టేవారు. పిల్లవాని ఆసక్తికి తండ్రి సంతోషించారు. ఆ విధంగా ఇంటి కాంపౌండ్లోనే ఉన్న టెన్నీస్ కోర్టులో టెన్నీస్ క్రీడకు నాంది పలికింది. తల్లితండ్రుల మరణానంతరం సోదరులతో కలిసి 1909 వ సంవత్సరం వెస్లీ కళాశాల హైస్కూల్లో చేరారు. పాఠశాలలో చదువుతోపాటు క్రికెట్, హాకీ, టెన్నీస్ క్రీడలలో మంచి నైపుణ్యం చూపారు. 1909 అంతర్ పాఠశాలల క్రికెట్ పోటీలలో ప్రప్రధమంగా ఒక పోటీలో రామస్వామి గారు ఒక్కరే 132 పరుగులు చేశారు!
ఒక పర్యాయం అంతర్ కళాశాలల పోటీలలో వెస్లీ కళాశాల జట్టులో రామస్వామి గారిని ఎంపిక చేశారు. రోజుల్లో పాఠశాల విద్యార్థులు కూడా కళాశాల పోటీలలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ ఏ కళాశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ' ఆ ఆ అనుబంధమై ఉండాలి. రామస్వామిగారు వెస్లీ కళాశాల పాఠశాలలో చదువుతున్నారు. కాబట్టి వెస్లీ కళాశాలకు ఆ అర్హత లభించింది. 'పెన్నిక్విక్ ట్రోఫీ' అంతర ఆనాటి ప్రముఖ జట్టు అయిన కళాశాలల తుది పోటీలలో ఇంజనీరింగ్ కళాశాల జట్టును వెస్లీ కళాశాల ఢీ కొన్నది. ఇంజనీరింగ్ కళాశాల 250 పరుగులు చేసింది. వెస్లీ జట్టు తొమ్మిది వికెట్లకు 50 పరుగులు మాత్రమే చేసింది. అంతా ఇంజనీరింగ్ కళాశాల గెలుస్తుందని భావించారు.
చివరగా రామస్వామిగారు బ్యాటింగ్కు వచ్చారు. వారికి తోడు నీరోజి ఉన్నారు. ఆయనను అవుటు కాకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి, రామస్వామి విజృంభించారు. ఎంత మంది బౌలర్లు మారినా వారిని అవుటు చేయలేక పోయారు. రామస్వామి గారు 188 పరుగులు చేసి అవుటు కాకుండా విజయం చేబట్టి ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేశారు. నీరోజి గారు 28 పరుగులు చేశారు. వెస్లీ కళాశాలలో వున్నంత కాలం అనేక విజయాలకు కారకులైనారు.
1914 వ సంవత్సరం ప్రెసిడెన్సీ కళాశాలకు రామస్వామిగారు వీరు క్రికెట్ మారారు. ఆ కళాశాలలో 1918 సంవత్సరం వరకు అంతర్ కళాశాల పోటీలలో విజయాలు సాధించడానికి కారకులైనారు. పోటీలలో ఉన్నంత కాలం ప్రేక్షకులు 'సిక్సర్' కొట్టాలని కోరేవారు.
1919 వ సంవత్సరం ఉన్నత విద్యకై కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరడం జరిగింది. మొదట్లో క్రీడారంగంలో ప్రవేశం లభించలేదు. రామస్వామిగారు క్రికెట్, టెన్నీస్ క్రీడాకారులని కొంతమంది భారతీయులకు మాత్రం తెలుసు. హైదరాబాదుకు చెందిన మహమ్మద్ హుస్సేన్, మరియు అలహాబాద్కు చెందిన యస్. 3. రుద్ర గార్లతో బాగా స్నేహం ఏర్పడింది. అప్పటికే టెన్నీస్లో 'హాఫ్ బ్లూ' పొందిన సీనియర్ ఆటగాడు సుందరదాస్ మంచి పేరులో ఉన్నారు. ఆయనతో పోటీ చేయాలని రామస్వామి గారికి కోరిక కల్గింది. అతి కష్టం మీద ఒక పెట్టు అంగీకరించారాయన. ఆ సెట్టు రామస్వామి గెలుపొందారు. దాంతో సుందరదాస్ అవమానంగా భావించి మూడు సెట్లు ఆడా లన్నారు. రామస్వామి ఒప్పుకొన్నారు. రెండవ సెట్ కూడా రామస్వామి గారు గెలిచారు. వెంటనే అయిదు సెట్ల మ్యాచ్ అన్నారు. రామస్వామి గారు సరేనని చెప్పి మూడవ సెట్టు కూడా గెలిచారు. ఏడు సెట్ల మ్యాచ్ అన్నారు. దాంట్లోకూడా నాల్గవ సెట్టు సుందరదాస్ ఓడిపోయారు.
రామస్వామి గారి మిత్రులందరూ ఆనంద పరవశులై టెన్నీస్ క్రీడలో ప్రోత్సాహం యిచ్చారు. 1920 టెన్నీస్ సీజన్ ప్రారంభమయింది.
సీజన్ లో జరిగిన అనేక టెన్నీస్ పోటీలలో సులభంగా విజయాలు సాధించారు. సీజన్ ముగింపు సమయంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఓపెన్ టెన్నీస్ సింగిల్సు పోటీలను నిర్వహించారు. అందులో కూడా రామస్వామిగారు విజయం సాధించి, 'డో పార్తీకప్'ను చేపట్టారు. అందుకుగాను వారికి 'హాఫ్ - బ్లూ' యిచ్చారు. 'కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం జట్టులో ఎన్నికైనారు. జట్టు నాయకులు బైన్స్. ఆ జట్టులో సుందరదాస్, మెక్ లు కూడా ఉన్నారు. ఆ జట్టులో - చివరి సంవత్సరంలో వున్నారు కాబట్టి రామస్వామి గారికి డబుల్స్ పోటీలలో పాల్గొనే అవకాశం లభింపచేశారు.
1921 వ సం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయము రామస్వామి గారిని పూర్తి 'బ్లూ'తో సత్కరించి, విశ్వవిద్యాలయ టెన్నీస్ జట్టులో ఎంపిక చేసి, బెల్జియమ్, హాలెండ్ లో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీలకు పంపించారు. వీరి ప్రతిభను గుర్తించి, నాడ్వెల్లో లో జరిగిన ఓపెన్ టెన్నీస్ పోటీలకు ఆహ్వానించారు. ఈ పోటీలలో సింగిల్సు, డబుల్స్ లో తుది పోటీకు, మిక్స్డ్ డబుల్సులో సెమీ ఫైనల్కు చేరుకున్నారు.
ఒకరోజు ముందుగా పోటీ నిర్వాహకులు అన్ని పోటీలు ఒకే రోజు జరపనున్నట్లు తెలియజేశారు. రామస్వామి గారికి అది అగ్నిపరీక్ష! ఉదయం 10-30 గం. మిక్సెడ్ డబుల్స్ సెమీఫైనల్. అందులో ఓడిపోయారు. వెంటనే 1-30 గం. సింగిల్సు తుది పోటీ. ఇందులో హాలెండ్ ఛాంపియన్ అయిన ఒన్-డెర్-ఫిన్తో ఢీ కొన్నారు. రామస్వామిగారు అతి కష్టం మీద అయిదు సెట్లు ఆడి ఓడించారు, ఆ పోటీ అయిన వెంటనే అరగంట విరామం ఇచ్చి డబుల్సు పోటీను ఏర్పాటు చేశారు. రామస్వామి గారి జంట హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ యస్. యమ్. హాదీ.
ఈ పోటీ హాలెండ్ ఛాంపియన్లు అయిన బిన్- లెగునె, కాస్టర్ డైక్ లతో జరిగింది. ఆట ప్రారంభంలోనే రామస్వామిగారు పరిస్థితి బాగా లేదని హాదీ గారికి తెలియచేసుకున్నారు. పోదీగారు రామస్వామి గారికి అభయం ఇచ్చారు. పోటీ హోరా హోరీ అయిదు సెట్లు సాగింది. అంతిమ విజయం రామస్వామి, హాదీ గార్లకు లభించింది. రామస్వామి గారికి పట్టరాని ఆనందం కల్గింది. ఒకేరోజు మూడు పోటీలలో పాల్గొన్న రామస్వామి గారికి మూడు రోజులు భోజనం, నిద్ర లేకుండా పోయాయి.
భారత లాన్ టెన్నీస్ సంస్థ దృష్టి రామస్వామిగారి మీద పడింది. 1922 వ సం|| ఆయన గారిని భారతదేశం పిలిపించి, డేవిస్ కప్ పోటీలలో పాల్గొన నున్న భారత్ జట్టులో ఎంపిక చేసినట్లు తెలియజేశారు. జట్టు యితర సభ్యులు డా. ఎ. హెచ్. ఫిజి, ఆయన సోదరుడు ఏ. ఏ. ఫీజి. ప్రప్రధమంగా బ్రిస్టల్లో జరిగిన పోటీలో భారత జట్లు రుమేనియాను ఓడించింది. రెండవ పోటీ బెకెన్ హోమ్లో స్పెయిన్లో జరిగింది. ఆ రోజుల్లో ప్రపంచ టెన్నీస్ రంగంలో ప్రతిష్టాకరమైన జట్టు స్పెయిన్తో ఓటమి సంభవించింది. ఇందులో రామస్వామి, డా. ఫిజి గారలు డబుల్సు పోటీలలో మాత్రం విజయం సాధించారు.
1922 లో భారతదేశం నుండి తిరిగి వెళ్ళగానే, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ టెన్నీస్ జట్లలో ఎంపిక అయి, ఇంగ్లండ్ విశ్వవిద్యాలయంతో పోటీ చేశారు. అదే సంవత్సరం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల జంట జట్టు అమెరికా వెళ్ళవలసి వచ్చింది. నల్లజాతి వాళ్ళను పంపడం యిష్టం లేక రామస్వామి గారిని ఎంపిక చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న జట్టు నాయకులు బి. విలియమ్స్ గారు మాత్రం జట్టులో రామస్వామి గారు ఉండాలని పట్టు పట్టారు. విశ్వవిద్యాలయ అధికారులు ఏమీ చేయలేక రామస్వామి గారిని కూడా పంపించారు. చివరి సంవత్సరం విశ్వవిద్యాలయ అధికారులకు తెలియకుండా ఇంగ్లండ్ లో జరిగిన ఒకానొక పెద్ద టెన్నీస్ పోటీలలో పాల్గొన్నారు. విషయం గోప్యంగా ఈ ఉండాలని పేరు ఏ. రాబిట్గా మార్చుకున్నారు. ఆ టోర్నమెంట్ గెలవగానే పత్రికల వారు క్వీన్ క్లబ్లో టోర్నమెంటు విజేత 'ఏ రాబిట్ అని పిలవబడే రామస్వామి' అని గుట్టును బహిర్గతం చేశారు. డబుల్సులో సి. హెచ్. కింగ్స్ జంటగా విజయం సాధించారు.
జనవరి 1924 న భారతదేశం వచ్చారు. అక్టోబరు 1924 న మద్రాసు వ్యవసాయ డిపార్టుమెంట్లో అధికారిగా నియమితులైనారు. ప్రప్రధమంగా మద్రాసులోనే నియమించారు. ఉద్యోగ రీత్యా నెలకు 15, 20 రోజులు పల్లెలకు వెళ్ళవలసి వచ్చింది. రామస్వామి గారి పైఅధికారికి క్రీడలంటే గిట్టవు. ఉద్యోగానికి న్యాయం చేయాలనే అధికారి. అటువంటి అధికారి మద్రాసులో జరిగిన ఒక టెన్నీస్ పోటీని ప్రేక్షకులలో నిలబడి చూసారు. కొద్ది మాసాలలో దక్షిణ ఆర్కాట్లోని తిండి వనంకు బదిలీ అయ్యారు. కొంతమంది అధికారులతో కలసి సరదాగా దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళారు. తలవని తలంపుగా ఒక తుపాకి తూటా రామస్వామిగారి కుడి చేతి మణికట్టుపైన తగిలింది. ఆ తూటా శబ్దం ఎక్కడి నుండి వచ్చిందా? అని చూసారే కాని, తమకు తగిలిందని తెలుసుకోలేక పోయారు.
అది అనుకోకుండా జరిగిన సంఘటన, రామస్వామి గారిని వెంటనే మద్రాసు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో డా. రంగాచారి వెంటనే శ్రద్ధ తీసుకొని, ఆందోళన పడవలసిన అవసరం లేదని తెలియజేశారు. సంవత్సరం తర్వాత చెయ్యి స్వాధీనంలోకి వచ్చింది. బాగా నయమయిన తర్వాత రామస్వామి గారిని బళ్ళారి బదిలీ చేశారు. గారి రామస్వామి స్వంత జట్టు అయిన మద్రాసు యునైటెడ్ క్లబ్లో బొంబాయి, పూనాలలో కొన్ని క్రికెట్ పోటీలలో పాల్గొన్నారు. ప్రతి పోటీలోనూ 50 పరుగులు తక్కువ కాకుండా చేసి పేరు సంపాదించారు.
వీరి ప్రతిభ ఫలితంగా బొంబాయి హిందువుల జట్టులో ఎంపిక అయి, ప్రతి సంవత్సరం జరిగే చతుర్ముఖ పోటీలలో పాల్గొన్నారు. వీరు పాల్గొన్న జట్టుకు విజయం లభించింది. 1928 వ సంవత్సరం వివాహమయింది. అదే సంవత్సరం వీరిని గుంటూరు బదిలీ చేశారు. ఆ రోజుల్లో గుంటూరు టెన్నీస్ క్రీడకు ప్రసిద్ధి. అనేక మంది అంతర్జాతీయ ఖ్యాతి గడించిన క్రీడాకారులు ఉండేవారు. 1932 లో ఢిల్లీలో జరిగిన అంతర్ ప్రాంతీయ పోటీలలో పాల్గొన్న జట్టు నాయకులు రామస్వామి. వారి జట్టుకే విజయం లభించింది. ఆ జట్టులో వీరితో పాటు టి.టి. బాలగోపాల్, యన్. కృష్ణస్వామి, యన్. వెంకట్రావు పాల్గొన్నారు. డబుల్సులో వీరికి జంట యన్. కృష్ణస్వామి.
ఆ తర్వాత కలకత్తా, అలహాబాద్, బొంబాయి, లాహోర్ మున్నగు ప్రాంతాలలో జరిగిన అనేక టెన్నీస్ పోటీలలో పాల్గొని విజయాలు సాధించారు. సెలవు నుండి "తిరిగి రాగానే రామస్వామి గారిని కుద్దలూరు (దక్షిణ ఆర్కాట్) కు బదిలీ చేశారు. అక్కడా క్రికెట్ క్రీడకు ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని పోటీలలో మద్రాసు జట్టుకు నాయకత్వం వహించారు. మద్రాసుకు విచ్చేసిన ఆస్ట్రేలియా జట్టుతో ఆడారు. 1936లో బ్రిటన్ లో 'విజ్జీ' నాయకత్వాన పర్యటించిన భారతజట్టు సభ్యులు.
అప్పుడు వారి వయస్సు 40 సంవత్సరాలు. ఇంత పెద్ద వయస్సులో మరే భారతీయుడు టెస్ట్ క్రికెట్ రంగంలో ప్రవేశించలేదు. చివరిసారిగా 1940 వ సంవత్సరం మద్రాసు ప్రెసిడెన్సీ పోటీలలో పాల్గొని, 105 పరుగులు చేశారు. క్రీడా రంగం నుండి క్రీడాకారునిగా విరమిస్తున్నట్లు ప్రకటన చేశారు. కానీ బలవంతంగా మద్రాసు క్రికెట్ జట్టులో ఎంపిక చేసి రంజీ ట్రోఫీ పోటీలకు దింపారు. ఆ పోటీలలో చెయ్యలేకపొయ్యారు. అదే ఆ క్రీడాకారుని రిటైర్మెంట్. న్యాయం
ప్రభుత్వ సర్వీస్ నుండి రిటైర్ అయిన తర్వాత, 1951 నుండి 59 వరకు క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్ల ఎంపిక సభ్యులుగా వ్యవహరించారు. 1952-53 లో వెస్ట్ ఇండీస్ పర్యటించిన భారత క్రికెట్ జట్టుకు మేనేజరు. 1955 నుండి భారత బాల్ బ్యాడ్ మింటన్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఉండి, బాల్ బ్యాడ్ మింటన్ క్రీడాభివృద్ధికి పాటుపడ్డారు.
89 సంవత్సరాల వయస్సులో కూడా ప్రతి రోజు ఉదయం కొంత దూరం నడిచి వెళ్ళి వస్తుండేవారు. 13 అక్టోబరు, 1985 వ తేదీన మామూలుగా బయటకు వెళ్ళినవారు తిరిగి రాలేదు. అంతర్యం ఏమిటో సృష్టికర్తకే తెలియాలి.