బాలారద్ కాళప్పనాయుడు గారి తండ్రిగారు గరిటిగారి వెంకటస్వామి నాయుడు. తల్లిగారు సిద్ధులు గారి జ్ఞానాంబ. వెంకటస్వామి నాయుడు గారి తండ్రిగారు గరిటిగారి వెంకటరాయలు, తల్లి కోలా ఆదిలక్ష్మి వీరు పద్దెనిమిదవ శతాబ్దము వారు. వీరందరూ వెంకటగిరి, నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. గంటిగారి వంశములో జన్మించిన కాళప్పనాయుడు బాలారధ్ వంశాధిపతి ఎలా అయ్యారు? అది ఒక అద్భుతగాధ.
వెంకటగిరి సంస్థానము ఆంధ్రదేశములో అతిపెద్ద సంస్థానము. ఉత్తరమున ఒంగోలు నుండి, దక్షిణమున సూళ్లూరుపేట, శ్రీహరికోట వరకు అతి విస్తీర్ణమైన రాజ్యమది. 13వ శతాబ్దములో కాకతీయ సామ్రాజ్య మహారాణి రుద్రమదేవి సైన్యాధిపతులలో ఒకరు వెలుగొడు (ఇప్పటి తెలంగాణాలో వున్నది) ప్రభువయినారు. కొన్ని తరాలు తరువాత వారు వెంకటగిరికి వలస వచ్చి రాజ్యమేర్పరుచుకున్నారు. ఎనిమిది వందల సంవత్సరాలుగా విరగని, తరగని 27వ తరము రాజాగారు శ్రీ వెలుగోటి సర్వజ కుమార యాచేంద్ర బహదూర్ వారి సంస్థానములో గరిటిగారి వెంకటస్వామి నాయుడు ఒక గొప్ప యోధుడు. మైసూరు సంస్థానములో పేరొందిన కుస్తీ పహిల్వాన్. రాఘవజెట్టిని జయించిన వీరుడితడు. కాళప్పనాయుడు చిన్న వయస్సు నుండే తండ్రి దగ్గర సకల అస్త్ర శస్త్ర విద్యలు అభ్యాసనలో ముందడుగు వేశారు. ఇరవై ఏళ్లకు కండలు తిరిగిన శరీరము, తెల్లటి ఛాయ, విశాలమైన ఛాతితో చూడటానికి రాజరీవితో వుండేవారు. వారు 23వ సంవత్సరాలవయస్సులోనే వివాహితులయినారు. వారి సహధర్మచారిణి పేరు మల్లెం అలివేలు మంగమ్మ..
1886 సంవత్సరం, నవంబరు మాసములో సత్తకాజాన్ అనే సుప్రసిద్ధ వీరుడు నైజాము దేశము నుండి వెంకటగిరి సంస్థాన సభకు వచ్చి తన్ను ఓడించు యోధుడు మీ రాజ్యములో వుంటే ముందుకు రమ్మని సవాలు విసిరాడు. అతను శూలము(బాల)తో యుద్ధము చేయుటలో ఆరితేరినవాడు. To "బాల" అనే బిరుదున్నది. అంతవరకు అతన్ని ఎదుర్కొని జయించిన యోధుడే లేదు. ఆరడుగులఎత్తు, భీముని లాంటి గట్టి శరీరముతో చూడటానికి ఒక బెబ్బులిలాగ వున్నాడతను. అతను విసిరిన సవాలులో షరతు ఏమిటంటే పోటీలో ఒక యోధుడి మరణమే ఇంకొక యోధుడి విజయము. ఇది.. ఆంగ్లభాషలో 'ఫైట్ టుది పినిష్ లేక ఫైట్ టు డెత్' అంటారు. రోమన్ సామ్రాజ్యంలో గ్లాడియేటరులు ఇలాంటి పోటీలలో పాల్గొనేవారు. సత్తర్ జాన్ విసిరిన సవాలుకు సభ అంతా నిశ్శబ్దమైపోయింది. ఈ భయంకరమైన మహాయోధుడితో తలపడితే మరణమే గతి అని అందరూ మనస్సులో అనుకుంటుంటే, 24 సంవత్సరాలయువకుడు కాళప్పనాయుడు అడుగు ముందుకు వేసి సత్తరాన్ను తాను ఎదుర్కొని పోరాడుతానని నిశ్చయంగా, నిర్భయంగా చెప్పాడు. సభలోని వారందరూ విస్మయము జెందారు. మహారాజు గారికి ఆశ్చర్యంతో కొన్ని నిముషాలు నోట మాట రాలేదు. భయంకరమైన సింహము నోటిలో తలపెట్టడానికి పూనుకున్నాడు ఈ చిన్నవాడు కాళప్ప అని అందరూ ముక్కున వేలు వేసుకున్నారు.
పోటీ దినము నిశ్చయించబడింది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి జనము తండోపతండాలుగా బయలుదేరి వచ్చారు. ఈ పోటీ చూడటానికి వచ్చినవారిలో వెంకటగిరి కుమార రాజావారు శ్రీ రాజగోపాలయాచేంద బహదూర్ గారు. బొబ్బిలి మహారాజా గారు. పిఠాపురం యువరాజా గారు, జైత్ లు రాజా గారు, చలికేని రా. నూజువీడు రాజా గారు వున్నారు. ఈ పోటీలో కాళప్ప నాయుడు మూడడుగుల పొడుగాటి కర్రను తన అస్త్రముగా ఎన్నుకున్నారు. సత్తర్జాన్ తొమ్మిది అడుగులపొడుగాటి శూలముతో పోటీలో ముందుకు ఉరకలి వేస్తూ, మదపుటేనుగులా భయంకరమైన అరుపులతో కాళప్ప నాయుడు పైబడ్డాడు. ఇద్దరు వీరులూ అతి సామర్థ్యముతో యుద్ధము చేయసాగారు. సత్తర్ జాన్ శూలము. కాళప్పనాయుడి కర్ర ఈ రెండూ ప్రాణము పోసిన మహాసర్పాలుగా మారి బుసలు కొత్తూ తలపడినట్లు చూపరులకు అనిపించింది. ఇద్దరు యోధులు శ్రీవారి వారి నైపుణ్యము. ధైర్యము మెరుపులాంటి వేగముతో అందరినీ ముగ్ధులను గావించిరి. చాలాసేపు జరిగిందీ యుద్ధము. సత్తర్జాన్. ఇక లాభం లేదని, విజృంభించి, నలుదిక్కులదద్దరిల్లేలా అరుస్తూ, తన శూలాన్ని కాళప్పనాయుడి గుండెకు గురిచూసి ముందుకు ఉరికాడు. ఒక్క క్షణంలో కాళప్పనాయుడి ప్రాణము పోయేది. కానీ పోలేదు. కాళప్పనాయుడు మెరుపులాగ ప్రక్కకు జరిగి ఆ శూలాన్ని పట్టుకొని తన చంకనడుమున గట్టిగా బిగించి, ఎడమ చేతితో ఆ శూలాన్ని పట్టి సత్తర్ జాన్ ను ముందుకు లాగి, తన కుడిచేతిలో పట్టుకున్న కర్రను పైకెత్తి సత్తర్జాన్ తలను రెండు ముక్కలు గావించడానికి సిద్ధముగానుండెను. అప్పుడు సత్తర్జాన్ శరణాగతి వేడుకుంటూ తన ఓటమిని ఒప్పుకున్నాడు. ఆనాడు వెంకటగిరి రాజ్య ప్రజలంతా. ఒక ఉత్సవంగా జరుపుకున్నారు. మహారాజావారు రాజబంధువులు కాళప్పనాయుడి గారిని బంగారు, వెండి బహుమానాలతో సత్కరించి ధైర్యసాహసాలలో అభిమన్యునితో పోల్చారు. బాలా అంటే శూలము. ఆ బాలను రద్దు చేసిన వీరుడని కాళప్పనాయుడుకు బాలారథ్ అని బిరుదు నొసంగినారు. ఆనాటి నుండి గరిటిగారి కాళప్పనాయుడును బాలారథ్ కాళప్పనాయుడని పిలువసాగారు.
కాళప్పనాయుడు, ఆయన సోదరుడు రామనాథం నాయుడు పోలో అనే ఆటలో అశ్వారోహణలో ఆరితేరినవారు. వీరిరువురు పేరు మోసిన వెంకటగిరి పోలో టీముకు ఆణిముత్యాలు. వీరు ఇంగ్లాండు దేశమునకు 1905 సం॥లో వెళ్లి అక్కడ ఎన్నో పోటీలలో విజయము గావించి స్వదేశానికి తిరిగివచ్చారు. కాళప్పనాయుడు తనకు సంక్రమించిన తండ్రి ఆస్తిని బాబా మందిరం కట్టడానికి ఇచ్చివేశారు. ఈ మందిర ఉత్తరపు గోడ మీద ఇప్పటికీ ఒక శిలాశాసనములో కాళప్పనాయుడు గారి వీరోచితమును గురించి చెక్కియున్నారు. కాళప్పనాయుడు గారి సమాధి వారి మామిడితోటలో ఇప్పటికీ వున్నది. ఆ సమాధిపై బంగారు అక్షరాలతో వారి జనన మరణ విశేషాలు ఒక శిలాఫలకము మీద చెక్కిఉన్నారు.