Fill the form, we are preserving balija surnames and their history.

రాజనాల కాళేశ్వరావు నాయుడు

తెలుగు సినిమా పరిశ్రమ నుండి హాలీవుడ్ లో నటించిన మొట్ట మొదటి వ్యక్తి.

కంటి చూపుతో హీరోల డైలాగ్ మాటవరసకు తప్పించి నిజానికి అంత శక్తివంతమైన చూపు కానేకాదు. కానీ నిజంగానే కంటిచూపుతో ప్రేక్షకులను భయపెట్టిన సినీనటుడు, విలన్ రాజనాల. తెలుగు సినీరంగంలో రెండు దశాబ్దాలపాటు విలన్ అంటే రాజనాల.రాజనాల చేస్తేనే విలనీ పండుతుందన్నంతగా పాత్ర లను పోషించిన విలక్షణ నటుడు. నెల్లూరు జిల్లా కావలిలో పుట్టిపెరిగిన రాజనాల విలన్గా తెలుసుకానీ ఆయన ఒక విద్యాధికుడని, పుస్తక ప్రియుడని, విశేష మైన పరిజ్ఞానం న్యూమరాలజీ, ఆస్ట్రాలజీలో పరిజ్ఞానం కలవాడని చాలామందికి తెలియదు.స్వాతంత్య్రం రాకముందే ఉత్తరాదికి వెళ్ళి ఎమ్.ఎ. ఇంగ్లీషు చేసి వచ్చినవారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా నాటకాలమీద మక్కువ చంపుకోలేదు. ఇంగ్లీషు నాట కాలు వేసేవారు.షేక్స్పియర్ నాటకాలలోని పాత్రల డైలాగ్లు కంఠస్థంవచ్చు. యవ్వనంలో నేర్చుకున్న ఆ ఇంగ్లీష్ డైలాగ్లను మరణశయ్య మీదనున్నప్పుడు కూడా మరచి పోకుండా చెప్పిన జ్ఞాపకశక్తి రాజ నాలది.రెవిన్యూ ఇన్ స్పెక్టర్ ఉద్యో గం వదిలి మద్రాసుకు చేరిన రాజనాల ఒకటి రెండు సంవత్స రాలు కష్టపడినతర్వాత తెలుగు సినీరంగ దర్శక పితామహుడు హెచ్.ఎమ్.రెడ్డి దృష్టిలో పడడంచే 1952లో 'ప్రతిజ్ఞ' సినిమాలో ప్రతినాయక పాత్రతో తెరమీద కనిపించారు రాజనాల. నాటినుండి పౌరాణిక, చారి త్రాత్మక, సాంఘిక సినిమాలు ఏవయినా అందులో విలన్పత్ర రాజనాలదే. ఎన్టీఆర్, ఎ.ఎన్నార్, కాంతారావుల సినిమా లలో విలన్ గా పోటీపడి నటించేవారు.విలన్ గా వికటాట్టహాసం చేసి భయపెట్టటమే కాదు, విలనీలో హాస్యం జతపరచి మెప్పించటం రాజనాలకే చెల్లింది. రాజనాల పాటలు పాడేవారు. మంచి సాహిత్యప్రియుడు. సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లో తనకంటూ వ్యక్తిగతంగా సాహిత్య గ్రంథాల లైబ్రరీ కలిగిన నటుడు రాజనాల ఒక్కడే. 20 లక్షల ఖరీదుచేసే పుస్తకాలను ఆయన ఇంటిలో 1960ల్లో పెట్టుకున్నారంటే ఆయనకున్న ఆసక్తి ఎటు వంటిదో అర్థంచేసుకోవచ్చు. సినీరంగంలో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో రాజనాల భార్య 1969లో చనిపోయింది. అది రాజనాలకి ఊహించని షాక్.ఆ షాక్ నుండి కోలుకునేందుకు కొంతకాలం పట్టింది. ఆ సమయంలో రాజనాల ధరించిన పాత్రలు మనసుపెట్టి నటించటంలేదేమో అనిపించేదట. ఐనా రాజనాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. కానీ 1980ల తర్వాత సినిమాలలో వచ్చిన మార్పు రాజనాలకు అవకాశాల్ని తగ్గించాయి. విలనీకి అర్థం మారింది. రాజనాల ధరించిన భారీ డైలాగులు, భయానక నవ్వుల స్థానంలో తడి గుడ్డతో తేలికగా గొంతు కలు కోసే సుతిమెత్తని విలనీ వచ్చింది. పౌరాణిక, జానపద సినిమాలకు డిమాండ్ పోయింది. రాజనాల ఆ కాలంలో తిరిగి స్టేజ్ని ఆశ్రయించారు.బాలనాగమ్మ వంటి నాటకాన్ని ప్రదర్శిస్తూ రాష్ట్రంలో తిరిగారు. 1984లో తన 28 ఏళ్ళ కొడుకు మరణం రాజనాల లోకాన్ని తలకిందులు చేసింది. తగ్గిన సినిమా అవకాశాలు ఆర్థికంగా దెబ్బ తీస్తే, కొడుకు మరణం మానసిక ఇబ్బందిని తెచ్చింది. సినీరంగంలో కొత్త దర్శకుల రాక, పాతతరం నటు లను పక్కన పెట్టేలా చేసింది.తన ఆస్తులను అమ్ముకున్నారు. అదే ఆదాయమైంది. ఈలోగా తెలుగు సినీపరిశ్రమ హైదరాబాద్ కి తరలి వెళ్ళిపోయింది. అరకొర అవకాశాలే రాజనాలకు దక్క టంతో ఆయన వేషాలకోసం వెంటపడాల్సివచ్చింది. 1983,84ల్లో రాజనాల చేసిన ఒక్క సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఆరేళ్ళలో ఆయన కనిపించింది తొమ్మిది సినిమాలలోనే. అది కూడా ప్రధాన విలన్ పాత్రలు కావు. కొత్తతరం హీరోలను రాజనాలవంటి విలన్కి ఎదురుగా నిలబెడితే తేలిపోయే ప్రమాదముం దని దర్శకులు, నిర్మాతలకు తెలుసు.సినీరంగం సినీవారసుల చేతుల్లోకి చేరిన తర్వాత వారిస్థాయికి తగిన విలన్లు, క్యారెక్టర్ యాక్టర్లనే ఎంపిక చేసుకోవటం మొదలైంది. మద్రాసులో కూర్చుంటే అవకాశాలు రావని చివరికి 1991లో రాజనాల తన మకాం హైదరాబాద్ కి మార్చుకున్నారు.అయితే షూటింగుల్లో శ్రమపడేందుకు వీలులేనం తగా డయాబెటిస్ బాధిస్తోంది. అయినా ఓపికచేసుకుని స్టూడియోలో షూటింగ్లకు వెళ్ళేవారు. 1984లో 'హలో బ్రదర్' సినిమాలో కుర్రవిలని ్క పక్కన బుల్లివిలన్ గా కనపడిన రాజనాలను చూసి 'ఔరా' సినిమాలోకం ఎంత మారిపోయిందనుకున్నారు అభిమానులు. ఒకటి రెండురోజుల షూటింగ్కు మించివుండని పాత్రలే వస్తున్నాయి. 1995లో అరకులోయలో ఔట్ డోర్ షూటింగ్ అంటే వెళ్ళారు. ఆ షూటింగ్ సమ యంలో రాజనాల కాలుకు గాయమైంది.ఒంట్లో ఉన్న షుగర్ జబ్బు ఆ దెబ్బను మాననియ్య లేదు. ఈలోగా గాంగ్రిస్ మొదలై కాలు తియ్యకపోతే ప్రాణానికి గండమన్నారు. అలా ఒకనాటి వెండితెర విలన్కి కాలు తొలగించగా జీవితం మంచానికి పరి మితమైంది. హైదరాబాద్లోని యల్లారెడ్డిగూడలోని అపార్ట్మెంట్స్ అంటే అంత ఖరీదైనవి కావు.ఇంట్లో మిగిలినవి తాను సినీరంగంలో ఉం డగా అందుకున్న షీల్డులు, వాటి వెనకున్న జ్ఞాపకాలు, అభిమానులు, సినీరంగంలోని ఒకనాటి పరిచయస్థులు అందించే సహాయంతో జీవిం చాల్సిన పరిస్థితి. ఒకనాటి పెద్ద బంగళా, పొడవు కార్లు, సంపద అంతా కనిపించకుండాపోయాయి. తాను బ్రతికిన నాటి బ్రతుకు, ఆనాటి సినీవైభవాన్నితలచుకుంటూ జీవించటం మొదలు పెట్టారు. ఎవరు కదిలించినా తన ప్రస్తుత జీవితం ఎంత దీనంగా గడు స్తున్నదో వివరించేవారు. ఒకరకంగా వాళ్ళు, వీళ్ళు విదిలించే దానిమీద బత కాల్సిన బ్రతుకైందనే బాధ రాజనాలది. కాలు తీసివేయటంతో సినిమా పాత్రల ఆశ పూర్తిగా పోయింది.రాజనాల గతంలో నేర్చుకున్న న్యూమరాలజీ,ఆస్ట్రా లజీని ఆశ్రయించాల్సివచ్చింది. ఆ యా శాస్త్రాలలో రాజనాలకు ఉన్న పరిజ్ఞానానికి గుర్తింపుగా 'దైవజ్ఞరత్న' బిరుదు కూడా ఇచ్చారు. చివరికి ఆ పాత పరిజ్ఞానాన్ని గుర్తుపెట్టుకుని అడిగినవారికి జాతకాలు చెపుతూ,వారిచ్చిన కొద్దిపాటి డబ్బుల్తో జీవితం వెళ్ళబుచ్చారు. కాలు తీసేసినతరువాత ఆ వార్తతెలిసిన సినీ ప్రము ఖులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సహా యమే రాజనాలకు ఆధారమైంది. కాలులేకున్నా చక్రాల బండిమీద కూర్చుని చేసే పాత్రలన్నా దక్కవా అను కున్నారు. కాని అవికూడా రాలేదు.ఒకనాటి బంగళా, కార్లు, తోట అన్నీ అమ్ముకుని, తన గురించి కాక ఇతరుల గురించి ఆలోచించి ఇలా అయ్యాను... మీరు మాత్రం అలా అవకండి అంటూ తనదగ్గరికి వచ్చినవారికి చెప్పేవారు రాజనాల. కూతురుదగ్గరకని మద్రాసువెళ్ళిన రాజనాల తిరిగి ప్రాణాలతో ఆంధ్రులమధ్యకు రాలేదు. మద్రాసు విజయ హాస్పిటల్లో 1998 మే 21న కన్నుమూశారు.ఆంజనేయ ఉపాసకుడైన రాజనాలమాత్రం 'అంతా.ఆయన లీల' అంటూ మనోబలం ప్రదర్శించేవారు. చివరికి ఆయన ప్రాణం హనుమత్ జయంతినాడే పోయింది. తెలుగు సినీవిలనీకి రాజఠీవి తెచ్చిన రాజనాల కడజీవితం కష్టాలపాలవటానికి విధిని నిందించాలా! ఆదాయం ఉన్నరోజుల్లో భవిష్యత్తు గురించి ఆలోచిం చని రాజనాల భోళాతనాన్ని తప్పుపట్టాలా!

Post a Comment

Previous Post Next Post