Fill the form, we are preserving balija surnames and their history.

విజయనగరం రాజ్యము బంధువులు అన్నయ్యగారి బలిజ వంశీయులు

కడప జిల్లాలో ప్రఖ్యాతికెక్కిన అన్నయ్యగారి వంశీయులు పూర్వం పెనుగొండపాలకవర్గానికి చెందినవారు. వీరి పూర్వీకుడు శ్రీ కృష్ణదేవరాయలువారికి వరసకు అన్నయ్య అవ్వడంతో ఈతనిని రాయలవారు అన్నయ్యగారు అని గౌరవంగా పిలిచేవారు. అప్పటినుండి వీరివంశీయులుగా అన్నయ్యగారి వంశీయులని విజయనగర సంస్థానమున ప్రసిద్ధులైనారు. ఈ వంశములో యెందరో ప్రసిద్ధులు వీరబలిజ క్షత్రియులుగా వర్ధిల్లినారు.


శాసనము : శా.శ. 1528 (కీ.శ. 1606) నాటి శాసనమున శ్రీ వీరవెంటపతి దేవరాయలు పెనుగొండ పాలకులగానున్నప్పుడు విజయనగరం వద్ద మల్లియవనంకు చెందిన కవరై (బలిజ) కులజులగు లాలగనాయకుని కుమారుడుగు అన్నయ్యగారి అనుమయ్యగారు కాంజీవరంలోని దేవునకు (వరదరాజస్వామి) 365 బంగారు హుణలు సంవత్సరములోని 365 రోజులకు 9 మరియు పెద్ద పుట్టెడు బియ్యము దేవుని నైవేద్యాలకు మరియు దేవాలయ సేవకులకు ఖర్చులు దానంచేసెను. (ఇన్క్రిప్షన్సు ఎట్ కాంజీవరం పేజి 71, ఎకానమినేషన్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ మెంకంజీ మాన్యుస్క్రిప్టు విలియం టేలర్ 1838) లో వ్రాశారు.

అన్నయ్యగారి కృష్ణప్ప 

అన్నయ్య గారి వంశీయులు ('ANNAYAGARI VAMSHAM") అనంతపురం జిల్లా పెనుగొండ సంస్థానాదీశులు రాజబంధువులు బలిజ క్షత్రియవంశం. వారి రాజబంధువుల వారసుడే మన అన్నయ్య గారి ముగ్గురాళ్ల క్రిష్ణప్ప గారు, వీరి తండ్రి పేరు నరసప్ప రాయలు (వీరిది గోరంట్ల గ్రామం) పెనుగొండలో జరిగిన కొన్ని సంఘటనలలో కిష్టప్ప గారి తల్లిదండ్రులు చిన్న తనములోనే చనిపోయిన కారణంగా వారి “దాసి” పెంచింది. వారు విరగంరాజుపల్లె గ్రామం (పెనుగొండ దగ్గర చేరారు క్రిష్ణప్ప గారు చదువుకొనే రోజులలో బ్రిటిషు తెల్ల దొరలతో పరిచయము కలగడం వలన ఆయన ఇంగ్లీషులో అనర్ఘళంగా మాట్లాడటం అలవాటయింది. ఆ పరిచయము వలననే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ వారికెంతో సహాయం చేశారు. ప్రతిఫలంగా క్రిష్ణప్ప గారిని పెనుగొండ ప్రాంత ఇరిగేషన్ డైరెక్టరుగా నియమించారు.


క్రీ॥శ॥ 1890 సం॥లో కిష్టప్ప గారు మూడువేల ఎకరాలలో కలబందను పెంచి లండన్ నుండి యంత్రాలు దిగుమతి చేసుకొని కలబందనార ఉత్పత్తి చేసి కలబంద ఎక్స్పోర్ట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. అప్పట్లో ఆయనను 'మిషన్' కిష్టప్పగా పిలిచారు.

1881లో కడప జిల్లాలోని బైరటీస్ గనులు దేశములోనే గాక ప్రపంచములోనే ప్రసిద్ధి పొందాయి. అటువంటి ప్రసిద్ధి చెందిన గనుల త్రవ్వకానికి 1918లో శ్రీకారము చుట్టి ఆస్బెస్టాస్ మినిరల్ పౌడర్ను విదేశాలకు ఎగుమతి చేసి గనుల రారాజుగా ఖ్యాతి వహించిన మహానీయుడు, మన ముగ్గురాళ్ల క్రిష్టప్పగారు బైరటీస్ గనులలో ముగ్గురాళ్లను త్రవ్వించి వాటిని యంత్రాలతో పౌడరు (ముగ్గుగా మార్చి) కడప జిల్లా గనుల పరిశ్రమ కేంద్రంగా వెలుగొందేలా చేసినందు వలననే క్రిష్టప్పగారి పేరు ముందు ముగ్గురాళ్ల వచ్చి చేరింది. ఆనాటి నుండే ఆయన ముగ్గురాళ్ల క్రిష్టప్పగా చిరకీర్తినిపొందారు. తర్వాత అనంతపురం, కడప జిల్లాలో దాదాపు పదివేల ఎకరముల వరకు స్వంత భూములుండేవి. రెండు టన్నులు బంగారము ఉండి గవర్నమెంటు ఆరు లక్షల పన్ను చెల్లించేవారు.

అప్పట్లో ఈస్టిండియా కంపెనీ “అస్బెస్టాస్ మినిరల్" వ్యాపారము చేసేవారు. అయితే మినరల్ తయారి వారికి అంతుపట్టేది కాదు. ఒక యిల్లాలు ఇంటిముందు ముగ్గువేస్తుంటే కిష్టప్ప చూడడం తటస్థించింది. ఆ ముగ్గు పౌడర్ ఎలా వచ్చిందో ఆలోచించారు. అటు తర్వాత అప్పటి కలెక్టర్ “పిళ్ళే” ను కలసి ముగ్గురాళ్ల త్రవ్వకానికి అనుమతి కోరారు. ఈస్టిండియా కంపెనీ చేయలేనిపని మీరు చెయగలరా అని అడిగి అతనికి లీజుకిచ్చారు. బాలారిష్టలను ఆధిగమిస్తూ బైరటీస్ గనుల త్రవ్వకం శీఘ్రతరం చేసి పదేళ్ళలో ముగ్గురాళ్ల వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చేశాడు. క్రిష్ణప్పగారి విజయాన్ని డాక్టర్ కింగ్ లండన్ తన “జియాలాజికల్ సర్వే ఆఫ్ మెమోరీస్ ఆఫ్ ఇండియా” గ్రంధములో “క్రిస్టోటైన్ గ్రేడ్ ఆస్ బెస్టాస్ బెస్ట్ ఇన్ వరల్డ్" అని అభివర్ణించారు.

అలాగే ఆస్బెస్టాస్ మినరల్ను విదేశాలకు ఎగుమతి చేసిన ప్రధమ వ్యక్తిగా బ్రిటీష్ ప్రభుత్వము గుర్తించి “పయనీర్ ఆఫ్ మైనింగ్ ఫీల్డ్" (గనుల రంగంలో రారాజు) అనే పతకాన్ని బహూకరించి గౌరవించింది. 1926 సం॥ పశ్చిమ బెంగాల్ (కలకత్తా) లో (ఎ. కిష్టప్ప పౌండర్ ఆఫ్ దిస్ మినరల్స్) అవార్డు పత్రికలలో ప్రసంశించారు. అనంతపురం, పులివెందుల ప్రాంతములో 1400 ఎకరాలు అటు తర్వాత వెయ్యి ఎకరాలు కొని బైరటీస్ గనులలో ముగ్గుపొడి రూపంలో తెల్ల బంగారాన్ని పండించారు. ముగ్గురాయి పౌడరును "బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, తదితర దేశాలకు ఎగుమతి చేసి అంతర్జాతీయ ఖ్యాతి నార్జించారు.

కడపలో ఆయన భవంతి చుట్టూ కాంపౌండ్ దాదాపు ఇరవై ఎకరాలు ఆయన గుర్రపు స్వారి, కర్రసాము, చేసేవారు ఆయన వద్ద జాతి గుర్రాలుండేవి వాటి ఆలనా పాలనా చూడడానికి ‘టిప్పు సుల్తాన్' అనే వ్యక్తి చూస్తూ, ఆయన ప్రయాణానికి గుర్రపు బండి సిద్ధం చేసేవాడు. ఒక రోజు కిష్టప్ప గారు లేని సమయములో కిర్రు చెప్పులేసుకొని టిప్పు సాహెబ్ వెలుతుండగా ఆ చెప్పుల శబ్దము సహించలేని కలెక్టర్ 'టిప్పు'ను అరెస్టు చేసి పులివెందుల జైలులో వేశాడు తర్వాత విషయం తెలిసిన కిష్టప్ప గారు కలెక్టరును సంప్రదించి విడుదల చేయించాడు. దీనిని బట్టి బ్రిటీష్ వారి వద్ద ఎంత పలుకుబడి ఉoదో అర్థంచేసుకోవచ్చు. క్రిష్టప్ప గొప్ప హంటర్ కూడా, ఆయన మన జంతువును మాత్రమే వేటాడేవాడు, అంటే అతని పౌరుషం ఎంత గొప్పదో అర్థమౌతుంది.

ఆయన షిర్డిసాయి భక్తుడు దక్షణ భారతదేశములోనే మొట్టమొదట సాయిబాబా దేవాలయము నిర్మించి ధన్యులయ్యారు. వెయ్యి సంవత్సరముల చరిత్ర గల “గుడిపల్లి” లో సజ్జగుంట రంగనాథ స్వామి దేవాలయానికి 150 ఎకరాల భూమి కేటాయించి పునరుద్ధరణ చేశారు. పేద విద్యార్థులనెందరినో చదివించారు. అలా చదివిన వారిలో నేడు ఏ.ఎ.ఎస్. ఐ.పి.ఎస్. హెూదాగల వారు కూడా ఉన్నారు. ఆయన వద్ద పనిచేసిన కుటుంబాలు, వ్యాపార, రాజకీయ రంగాలలో చాలా ఉన్నతస్థాయికెదిగారు ఒంటిమిట్ట దేవాలయాలకు, సత్రములకు దానమిచ్చారు. అన్నయ్య గారి ముగ్గురాళ్ళ కిష్టప్ప గారి కాంపౌండులో ఆనాడు, విదేశీకార్లు,ఫోర్డ్, ఆస్టిన్, ప్లేమత్, డాడ్జ్ క్రిష్ర్ మరియు జింకలు, దుప్పులు, నెమళ్లు, పావురాళు జాతి కోళ్లు, ముర్రాజాతి గేదెలు, మేలు జాతి పందెపు ఎద్దులు, గోవులు, కళకళలాడుతూ స్వర్గములా తెలుగు దనము ఉట్టిపడేలా ఉండేది. మొత్తం పనివారు పదివేల మంది ఉ ండేవారు. ఈ నాటికి వారి కుటుంబములలో క్షత్రియ సాంప్రదాయములైన యజ్ఞోపవీతము (జంద్యము) ధరిస్తారు. రాజరాజేశ్వరి పూజ (గాయత్రి మంత్రం) ఉ పనయనం అఖండజ్యోతి, శ్రీచక్రం, వివాహ సమయములో బంగారము, వెండి, నూలు, జంద్యములు, ధరిస్తారు.ప్రతి మాసము, ప్రతి సంవత్సరము పితృదేవతలకు సంతర్పణ జరుపుతూనే ఉ ది. అన్నయ్యగారి (ముగ్గురాళ్ల) క్రిష్టప్ప గారు 1975 ఆగష్టు 18వ తేదీన స్వర్గస్తులయ్యారు. వీరు మోటుకాళ్లు శైవమతం, జనకుల గోత్రం, ఇప్పటికి ఇద్దరు బ్రాహ్మణులు సాయిబాబా గుడిలోనూ వారి కుటుంబాలలో పూజలు నిర్వహిస్తూ ఉ న్నారు.

ఆనాడు వీరి సంస్థలలో పని చేసిన ఉద్యోగులు లీజుదారుల వారసులు ఈనాడు కొందరు మాజీ ముఖ్యమంత్రిగా యం.పి.లుగా జిల్లా పరిషత్ ఛైర్మెన్లుగా రాష్ట్ర మంత్రులుగా ప్రముఖ వ్యాపారులుగా అభివృద్ధి చెందారు.

1) అన్నయ్యగారి క్రిష్ణప్పగారి రెండవ కుమారుడు తిమ్మప్పగారి భార్య లలితాదేవి గారు కోలార్ జిల్లా, 'బెల్లంబరి' జాగీర్దార్ శ్రీ సి. హెచ్. హనుమంతప్పగారి కుమార్తె వీరు (కోలార్ బంగారు గనుల లీజుదారులు) లలితాదేవి గారి కుమారుడు సాయిప్రతాప్ గారు రాజంపేట యం.పి.గా 6 సార్లు, 1 సారి కేంద్ర ఉక్కుగనుల సహాయ మంత్రిగా చేశారు.

2) క్రిష్టప్పగారి మూడవ కుమారుడు రంగనాథం గారి భార్య రుక్ష్మిణమ్మ గారి మేనమామ శ్రీ ఎమ్.బి. శ్రీనివాసులనాయుడు (బెంగుళూరు) ఈనాడు బొంబాయి రాజ్కపూర్ స్టూడియో (ఆర్.కె. స్టూడియో) ఆనాడు వారిదె, బి.ఎమ్.యస్. ఇంజనీరింగ్ కాలేజి, లా కళాశాల, ప్రజామాత ప్రింటింగ్ ప్రెస్, బి.ఎం.యస్. మహిళా కాలేజి, మైసూర్ శాండిల్ సోప్ నిర్మాతలు వారే మైసూర్ మహారాజవారు వీరికి స్నేహితులు, ఒక సారి ఇన్కంట్యాక్స్ అధికారులు వీరి ఇంటిని సోదాచేయుటకు రాగా 60 సూట్కేసుల డబ్బు, బంగారము, మహారాజా ఇంటికి పంపగా అవి కాళీ సూట్కేసులు అని జవాబు చెప్పారు. బంధువర్గము : ఎమ్.యస్. రామయ్యగారు (బెంగుళూరు) డి.కె. ఆదికేశవులు నాయుడు (మాజీ యం.పి. చిత్తూర్) పెరియాకులం, వడుగరై సంస్థానాదీశులు, ముత్యాల జనార్థన నాయుడుగారు (రాజమండ్రి) పేరాబత్తులవారు, పందిటి వారు, గంగిరెడ్డివారు, గౌరావారు, పెనుగొండవారు, అను ఇండ్లపేరు గలవారు.


Post a Comment

Previous Post Next Post