పగడాల బలిజలుకూడ బలిజ శాఖవారే! వీరికీ నామము గలుగుటకు కారణం ముఖ్యముగా పగడాల వ్యాపారము చేసి జీవించుట వలననే కలిగినదని స్పష్టముగ తెలియుచున్నది. బలిజలు పూర్వము విదేశా నుండి ఓడలపై తేబడిన నవ రత్నములలో ప్రత్యేకముగా పగడాలు తీసుకొని ఆంధ్రదేశ మున, యితర రాష్ట్ర రాజధాని నగరములందు తిరిగి వ్యాపా రము చేయచుండిరని చరిత్రకారుల వలన తెలియుచున్నది పగడాలబలిజలుపి శేషముగా నెల్లూరుజిల్లా కుల్లూరునందును తదితర ప్రాంతమందును గలరు. వీరికి శెట్టిఅను పట్టపు పేరు గలదు. ఇటీవల కొందరు నాయుడని కూడ వ్యవహరింపబడు చున్నారు.