Fill the form, we are preserving balija surnames and their history.

Raghupathi Venkaiah Naidu - Father Of South Indian Cinema

ఆయన ఆంధ్రులలో వ్రప్ర ధమ ప్రదర్శకుడు. తొలి స్టూడియో యజమాని మొదటి చిత్ర నిర్మాత. ఈ 'ఫస్టులు' చాలు మనం ఆయనను ఎటా తలుచుకోవడానికి.



రఘుపతి వెంకయ్యగారు 1869లో బందరులో జన్మించారు. వీరి తండ్రిగారు సుబేదారు అప్పయ్యనాయుడుగారు తల్లి శేషమ్మ. ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజాన్ని ఆదర్శవంతంగా ప్రచారం చేసిన బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు వెంకయ్యగారి అన్నగారు. ఈ అన్నదమ్ములకు ఏడేళ్ళ వారది వుంది. సుబేదార్ అప్పయ్యనాయుడుగారి పటాలం తరచుగా వివిధ నగరాలకు బదిలీ అవుతూ వుండేది. అందుచేత వారి సంతానం కూడా భారతదేశంలోని వివిధ నగరాలలో విద్యాభ్యాసం చేయవలసి వచ్చింది. వెంకటరత్నంగారు విద్యా రంగాన్ని ఎన్నుకొంటే వెంకయ్యగారు ఛాయాగ్రహణాన్ని అభిమానించి ఫొటోగ్రాఫర్ వృత్తిని చేపట్టారు.
వెంకయ్యగారు మద్రాసులో ఫోటోగ్రాఫర్గా స్థిరపడ్డారు. మౌంటురోడ్డులో వారి స్టూడియో వుండేది. వ్యాపారం చాలా లాభసాటిగా సాగింది. ఇతర ఛాయాగ్రహకులలాగే వెంకయ్యగారు కూడా సైలెంట్ చిత్రాల ఆవిర్భావాన్ని, ఆకర్షణలనూ గమనించారు. 1896లో మొట్టమొదటిసారిగా మన దేశంలో సైలెంట్ చిత్రాల ప్రదర్శన ప్రారంభమైంది. ఆ మలి సంవత్సరం మద్రాసులో ప్రదర్శనలు జరిగాయి. 1900 సంవత్సరంలో మద్రాసులో మొదటి సినిమాహాలు నిర్మాణం జరిగింది.

సినిమాహాలుల నిర్మాణం

దక్షిణ భారతంలో పర్యటనం చేసి సిలోన్, బర్మా దేశాలలో కూడా వెంకయ్యగారు తమ డేరా సినిమాను తిప్పారు. 1912 కి మద్రాసుకు తిరిగి వచ్చారు. డేరా సినిమాలకన్నా పక్కా సినిమాహాళ్ళ ఆవశ్యకతను గుర్తించారు. మద్రాసులో 1913 లో "గెయిటీ ” థియేటర్నూ, 1914 లో “క్రౌన్” థియేటర్ నూ, 1915 లో “గ్లోబ్” థియేటర్ నూ థియేటర్నూ, మొదటి రెండు హాళ్ళూ ఆ నిర్మించారు. పేరుతోనే నేటికీ మద్రాసులో వున్నాయి. “గ్లోబ్” పేరు మాత్రం రాక్సీగా మారింది. ఈ సినిమా హాళ్ళ నిర్మాణానికి వెంకయ్యగారు చాలా ఖర్చు పెట్టారు. అప్పటికే భారత దేశంలో చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. “దాదా సాహెబ్ ఫాల్కే"గారి “హరిశ్చంద్ర” (1913) దేశంలో ఎందరినో ప్రభావితులను చేసింది. వెంకయ్యగారు కూడా చిత్ర నిర్మాణంలో దిగుదామను కొన్నారు. అందుకోసం పరిపూర్ణమైన శిక్షణ పొందిన వ్యక్తి కావాలి. విదే శాల స్థాయికి ఏ మాత్రం తీసిపోని సాంకేతిక నైపుణ్యం కావాలి. తమ అబ్బాయి ప్రకాశాన్ని విదేశాలకు పంపి ఆయనకు చిత్ర నిర్మాణ కౌశలాన్ని నేర్పించాలనుకొన్నారు. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు అయినాసకే దానికి సిద్ధపడ్డారు. అయితే దురదృష్టవశాత్తు ప్రధమ ప్రపంచ సంగ్రామం అడ్డు వచ్చింది. యుద్ధం ముగిసిన వెంటనే ప్రకాశాన్ని ఇంగ్లండ్ పంపించారు.

ఇంగ్లండ్లోని 'బార్కర్స్ మోషన్ పిక్చర్ స్టుడియో'లో ప్రకాశం గారు విద్య నేర్చుకొందామకొనున్నారు. ప్రవేశం అంత సులభంగా లేదు. మొదట ఆ స్టుడియోలో ఆయన దొరక "సూపర్"గా పని చేయవలసి వచ్చింది. అంటే మాటావలుకూ ఏమీలేవి నటుడిగా అన్నమాట. ఇవాళ అటువంటి నటుణ్ణి “ఎక్” అంటాం. ప్రకాశంగారు ఎక్ నటుడిగా *కొండరికి పరిచయం అయ్యాక నిర్మాతల దృష్టిలో వడ్డారు. ఫోటోగ్రఫీ, డైరెక్షన్ సినేరియో రచన మొదలైన వాటిలో శిక్షణ కావాలన్నారు. నిర్మా తలు ముడుపు చెల్లించుకోమన్నారు. అయిదు వందల పౌండ్లు చెల్లించి ప్రకాశంగారు అవి నేర్చుకున్నారు. (నేటి మారకం రేటు ఆరువేల రూపా యలన్న మాట!)ఇంగ్లండ్లో సాంకేతిక విద్యను ఒక ఏడాదిలో అభ్యసించి ప్రకా శంగారు ఫ్రాన్సు, ఇటలీ దేశాలకు వెళ్ళారు. పాఠే స్టూడియోలో పని తీరును ఒక నెల రోజులపాటు గమనించారు. చిత్ర నిర్మాణశాఖలన్నింటిలోనూ కావలసిన పరిజ్ఞానాన్ని సాధించారు. 1920 లో స్వదేశానికి తిరిగి వచ్చారు.

చిత్ర నిర్మాణం


కుమారుడు ప్రవీణుడై ఇంటికిరాగానే వెంకయ్యగారు చిత్రనిర్మాణానికి ఉద్యుక్తులయ్యారు. “స్టార్ ఆఫ్ ది ఈస్టు ఫిలిం కంపెనీ” ని స్థాపించారు. అన్ని హంగులతోనూ, విదేశాలలోని ఏ స్టూడియోకు తీసిపోని విధంగా లక్షరూపాయల వ్యయంతో గ్లోబ్ థియేటర్ అవరణలో ఒక స్టూడియోను నిర్మించారు. సూర్యకాంతిని వాడుకొనడానికి వీలుగా గాజు పైకప్పు ఏర్పాటు చేశారు. కెమెరా, లేబరేటరీ వగైరాలు సమకూర్చుకొన్నారు. కంపెనీ సిబ్బందిలో ఏబై మంది నటీనటులుండేవారు. చిత్రనిర్మాణశాఖలో నెలసరి రెండువేల ఐదువందల రూపాయలు చిల్లర ఖర్చులుండేవి. విదేశ చిత్రాలతో పోటీ చేయాలన్న సంకల్పంతో అన్నీ భారీఎత్తున ప్లానుచేశారు.

పన్నెండు వేల రూపాయలవ్యయంతో "భీష్మ ప్రతిజ్ఞ” అనే ఒక చిత్రాన్ని ప్రారంభించారు. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టారు. నటీనటు లకు ప్రకాశంగారు డ్రైవింగ్ ఇచ్చారు. స్టేజి నాటకాల నటనకూ, సినిమా నటనకూ చాలా తేడావుందని ప్రకాశంగారు తొలిరోజుల్లోనే గ్రహించారు.ఎనిమిదివేల అడుగులలో భీష్మ ప్రతిజ్ఞను 1921 లో పూర్తి చేశారు. పన్నెండువేల రూపాయలు ఖర్చు అయింది. ఒక్క ఏడాదిలో చీష్మ ప్రతిజ్ఞ ఆరవైవేల రూపాయలను ఆర్జించింది. ఇదే తెలుగువాడు దీవికి మొదటిసారిగా నిర్మించిన చిత్రం. ఇదే తెలుగువాడు ప్రప్రధమంగా దర్శకత్వం వహించిన చిత్రం.

భీష్మ ప్రతిజ్ఞ సాధించిన విజయాల ఉత్సాహంతో వెంకయ్యగారు ఇతర చిత్రాలను నిర్మించారు. ప్రకాశంగారు వాటిని డైరెక్టుచేశారు. గజేంద్ర మోక్షం, భ క్తనందనార్, సముద్రమధనం, మోహనీ అవతారం, తారం, కోవలన్ అనే పౌరాణిక, ఐతిహాసిక చిత్రాలేకాక 'పేజిగర్ల్' అనే సాంఘిక చిత్రాన్ని కూడా ప్రకాశంగారు డైరెక్టు చేశారు. ప్రకాశంగారి శిక్ష ణలో సి. పుల్లయ్యగారూ, వై.వి. రావుగారు చిత్రనిర్మాణ రహస్యాలను నేర్చుకొన్నారు.ఒక నాలుగేళ్ళపాటు స్టూడియో చురుకుగా సాగింది. అయితే కలకు మించిన అప్పులూ, నడ్డి విరిచిన వడ్డీలు, సరిగ్గాలేని విర్వహణ, సిబ్బంది చేసిన దోపిడీలు అన్నీ కలసి వెంకయ్యగారిని దివాలా తీయించాయి. ఆయన కట్టిన మూడు థియేటర్లు వరుల చేతికిపోయాయి. స్టూడియో మూల బడింది. వెంకయ్యగారి వ్యాపారానికి కోర్టు ఒక రిసీవర్ని నియమించింది. పద్దెనిమిది వేలు విలువచేసే మిషన్లను మాత్రం రిసీవరు ఎఫ్. హెచ్. విల్సన్ కొన్నాళ్ళు అమ్మకుండా అద్దెకిస్తూ వచ్చాడు. చివరకు వాటివికూడా విడివిడిగా అమ్మివేయవలసి వచ్చింది.

1927 -28లో ప్రభుత్వం “ఇండియన్ సినిమాటోగ్రఫీ” పైన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ముందు రఘుపతి ప్రకాశంగారు, రిసీ వరు విల్సన్ గారూ చివర్న వెంకయ్యగారు చాలా వివరంగా సాక్ష్య మిచ్చారు. తమ తండ్రిగారు దివాలా తీయడానికి బహుళ తమ ఆశయాలు Cత్యాశలు కావడమే కారణమని ప్రకాశంగారుచెప్పారు. స్వంత స్టూడియోను కొంతకాలం నడిపి స్వతంత్రంగా చిత్ర నిర్మాణం చేసిన తనకు ఇంకొకరి కింద వనిచేయడం నామోషీ అని ప్రకాశంగారు ఈ సాక్ష్యంలో చెప్పారు.

వెంకయ్యగారు తమ సాక్ష్యంలో చిత్ర నిర్మాణ వ్యయం గురించి తాము అంతగా పట్టించుకోలేదన్నారు. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో, ఎగ్జిబిషన్ రంగంలో మదన్ థియేటర్స్ వారికి గుత్తాధిపత్యం వుండేది. వివిధ నగరాలలోని థియేటర్ల వారికి తమ చిత్రాల ప్రదర్శన సౌకర్యాలు కలిగించకుండా వాళ్ళు నష్టపోతున్న తరుణంలో వారి థియేట ర్లను మదనా వారు కబళించేవారని లోకులు అనుకొనేవారు. వెంకయ్యగారి థియేటర్లను కూడా మదన్ కైవశం చేసుకొన్నారు. అయినా వాళ్ళవట్ల వెంకయ్యగారికి ద్వేషంలేదు. సదభిప్రాయాన్నే తమ సాక్ష్యంలో తెలియ జేశారు. తమ దివాలా లావాదేవీలలో ప్రకాశంగారిని ఇరికించలేదు. తామొ క్కరే ఆ బాధ్యతను వహించారు.

తండ్రి దివాలా తీసినా ప్రకాశంగారు డీలా పడలేదు. తమిళ చలన చిత్ర పితామహుడు ఎ. నారాయణన్ గారితో కలిసి కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ వారి చిత్రాలకు ఛాయాగ్రాహకునిగానో, డైరెక్టరుగానో పనిచేశారు. టాకీ యుగంలో కూడా చిత్రాలు తీశారు. కన్నాంబ నటించిన 'చండిక' చిత్రానికి ప్రకాశంగారే దర్శకులు. అప్పటికి ఆయన తన పేరును ఆర్. ప్రకాష్ మార్చుకొన్నారు.వెంకయ్యగారు 1941లో చనిపోయారు. ప్రకాశంగారు 19565 పోయారు. వారి కడపటి చిత్రం 'మాయపిల్ల'. మన తెలుగు పత్రికలూ, సినిమా సావనీర్లు మొదలైన వాటిని శ్రద్ధగా, ఓపికతో తిరగేస్తే ఎన్నెన్నో విశేషాలు ఈ తండ్రీ కొడుకుల గురించి తెలిసే అవకాశాలు వున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమకు పునాదులు వేసిన ఈ తండ్రీ కొడుకుల చరిత్రను రాసుకొనే బాధ్యత తెలుగువాళ్ళకుంది.


2 Comments

  1. yerramsetty krishna veni mirjapuram zamindaarini.ime ntr,svr,ghantasala ku cinema lo toli avakasam ichina producer.studio owner.nati.imenu marachi povadam daarunam.ame vari studio lo aneka cenemaalu tiisi aneka mandi kalaakaarulaku life ichaaru.

    ReplyDelete
  2. Dear Admin of Balija Mahanadu... Garu..Namaste. congratulations for your good effort in compiling history. It is better to give your contact mail or number so that people will contact you to share info. Infact want to contact you. You can mail me as early as possible.
    Pl do mail me your contact details. Tq.
    jayadeva.aj@gmail.com

    ReplyDelete
Previous Post Next Post