Fill the form, we are preserving balija surnames and their history.

Gonugunta Balija ( గోనుగుంట బలిజ )

 గోనుగుంట బలిజవారు అంటే భారతదేశం అంతా తరతరాలుగా ముత్యాలు, పగడాలు, కెంపులు, రత్నాలు, వజ్రాలు ఇలా నవరత్న వ్యాపారాలలో విశేష ఖ్యాతి నార్జించిన వారు. భారతదేశం అంతా వ్యాపారాలు చేసేవారు కాబట్టి వీరికి చాలా భాషలు వచ్చేవి. దానితో వీరు మాట్లాడుకునేటప్పుడు తమ మాటలు ఇతరులకు అర్ధం కాకూడదని అనుకున్నప్పుడు, ఇతరులకు తెలియని మిశ్రమ భాషలలో రహస్య భాషలలో మాట్లాడుకునేవారని తెలుస్తుంది. గోనుగుంట ప్రాంతం ఒకప్పుడు గొప్ప గొప్ప బలిజ వ్యాపారుల భవనాలతో వైభవాలతో అష్టైశ్వర్యాలు అనుభవించింది.


గోనుగుంట బలిజవారివి ఓరుగంటి కాకతీయ వంశ మూలాలుగా పెద్దలు చెప్పుకుంటారు.
కాకతీయులకు పారంపర్యముగా " సింధు కటక బళ్ళాళరాయ తల గొండు గండ" వంటి వీర బిరుదులు ఉండేవని, కాకతీయ సామ్రాజ్యం అంతమైనాక వారి వంశ పరంపరలలోని
"కాకతీయ" రాజ వంశ వారసులు పాకనాడు ప్రాంతంలోని (నేటి ప్రకాశం జిల్లా) "గోనుగుంట" లో స్థిరపడి "రత్నాల వ్యాపారస్తులుగా" మారి వ్యాపారాలు చేస్తూ బలిజలుగా మారి ఉన్నట్టు తరతరాలుగా వివరం తెలిసిన పెద్దల ద్వారా తెలిసే విషయం. పాకనాడు రాజ్యంలో గోనుగుంటలో స్థిరపడి అంతర్జాతీయ వ్యాపారాలు చేసేవారని, " సింధు కటక బళ్ళాళరాయ తల గొండు గండ" వంటి బిరుదులూ పరంపరగా కలిగి గొప్ప గొప్ప వీర యోధులుగా, వ్యాపారులుగా ఉంటూ ఉండేవారని, వీరి పరంపరలలో 14వ శతాబ్దంలో కొందరు కర్ణాటకలోని బల్లాల రాజ వంశీయులవద్ద మంత్రులుగా ఉండేవారని, వారిలో మల్లప్ప ఒడయార్ గారిని ఆరాజు చంపినందుకు, ప్రతీకారంగా ఆమె భార్య గోనుగుంట బలిజవారి ఆడపడచు అయిన "ఉమ్మక్కమ్మ" ప్రతీకారం తీర్చుకున్నట్టూ, ఆమె గోనుగుంటలోనే "సతీ సహగమనం" చేసుకున్నట్టూ బలిజ పెద్దలు నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. నాటి రాచరిక వారసత్వ లక్షణాలు ఈనాటికీ ఈ "గోనుగుంట బలిజవారి"లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి

ఉమ్మక్కమ్మ

ఈ గోనుగుంట బలిజవారే "పాకనాటి బలిజవారు" అని కూడా పిలువబడేవారు. ఈ "పాకనాడు" ప్రాంతమే ఒక్కొక్కప్పుడు "కమ్మనాడు" అనికూడా పిలువబడేది. అందువలన ఈ కమ్మనాడు లో వున్న ఈ బలిజవారు "కమ్మ బలిజవారు" అని కూడా పిలువబడేవారు. (ఇదేవిధంగా కమ్మనాటిలో స్థిరపడిన బ్రాహ్మణులు "కమ్మ బ్రాహ్మణులు", కోమట్లు "కమ్మ కోమట్లు", కాపులు "కమ్మ కాపులు" అనీ ఇలా పిలువబడినట్టు తెలుస్తుంది). ఈ ప్రాంతాలు కొండవీటి రెడ్డి రాజ్యంలో ఉన్నప్పుడు వీరు "కొండవీటి బలిజవారు" అని కూడా పిలువబడినారు. 

గౌరీ సంతతిగా, గౌరీ పుత్రులుగా, గవరైలుగా, క్వారైలుగా, బలిజలుగా, ఐన్నూరు వారిగా ఉండిన కాకతీయ వంశ వారసులు, "అత్యరికేందు కులజులు" అని పిలువబడి "దుర్జయ" వంశీయులుగా, "చంద్ర" వంశీయులుగా, "సూర్య" వంశీయులుగా చరిత్ర ప్రసిద్దిగాంచిన వీరి పురాణ చరిత్ర "ప్రతాపరుద్ర చరిత్ర", "గౌరీపుత్ర చరిత్ర" లో తరతరాలుగా నిక్షిప్తం చేయబడి ఒకతరం నుండి ఒకతరం కు అందించుకుంటూ వస్తున్నారు. "కాకతీయులు" గౌరీ పుత్రులు, అత్యర్కేంద్ర కులస్తులుగా సూర్య చంద్ర వంశాలకు మిన్నయైన కులానికి చెందినవారు అని చెప్పుకున్నారని, మేము అదే చెప్పుకుంటూ ఉంటామని "గోనుగుంట బలిజ"వారి పెద్దలు చెప్పే మాట.

వాటిని ఎందరో ఆధునిక చరిత్రకారులూ పరిశోధించడం తమ రచనలలో పేర్కొనుచు వస్తుండడం జరిగింది.
గౌరీపుత్రుల ప్రాచీన చరిత్ర గ్రంధాలలో ఒకటైన "దౌర్వాసే దేవీ పురాణము"లో ఎన్నో వివరాలు పేర్కొనబడెను. ఇందుకు సంబందించిన గాధ శ్రీ కంటే నారాయణదేశాయి గారు 1950 లో ముద్రించిన "బలిజ కుల చరిత్ర"లో పొందుపరిచినారు. 1962లో ముద్రించబడిన "కాకతి ప్రోలరాజు" అనే వేదుల సూర్యనారాయణ శర్మ గారి రచనలోనూ పేర్కొనబడెను. వాటినే 1986లో "రాణి రుద్రమదేవి చరిత్ర"లో పొందుపరచడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post