ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కీశేశ్రీ రొక్కం రామమూర్తిదొర గారు 20 వ ఏటనే మహత్మగాంధి దేశస్వాతంత్ర్యఉద్యమ పిలుపుతో విజయనగరం మహరాజాకాలేజీలో ఇంటర్మీడియట్చదువు కి స్వస్తి చేప్పి ఉద్యమం లో అడుగు పెట్టిన గొప్ప దేశ భక్తుడు శ్రీ రొక్కం రామమూర్తి దొర గారు.దండకారరణ్యం అట్టడుగు ప్రాంతం శ్రీకాకుళం జిల్లా"కురుడు" గ్రామంలో "తెలగదొర"ల (TELAGA) కుటుంబము అయిన రొక్కంవెంకన్నదొర,అప్పమ్మలకు 1900 సం..లో రామమూర్తి దొర జన్మించారు.
స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖద్దరు ధరించి తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను సహితంనిరాకరించి ప్రజాసేవలో అంకితం అయిన గొప్ప ఆదర్శవాది.
1941 సం..లో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని నాలుగు నెలలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించారు.అనేకఉద్యమలలో గాంధీజీ గారి పిలుపు మేరకు నాయకత్వం వహించి జైలు శిక్ష ననుభవించారు.దేశ స్వాతంత్ర్యానంతరంమద్రాసు రాజధాని గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్... తమిళనాడు శాసనసభకు టెక్కలి నియోజకవర్గము నుంచితొలిశాసనసభ్యునిగా ఎన్నిక అయినారు. సభాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్ని జిల్లా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిసమస్యపరిష్కారం అయ్యెంతవరకు పోరాటం చేసేవారు. ప్రజల కొసం "దొర"గారు చేస్తున్న కార్యక్రమాలను చూసినకామరాజు నాడారు,ప్రకాశం పంతులు గార్లు ఎంతగానో ప్రశంచించేవారు.మూడు దశాబ్దాల పాటు ఎన్నో ప్రజాహితకార్యక్రమాలను చేపట్టి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడిన్నారు.వినోబాబావే భూదానోద్యమంలో పాల్గొన్నితన స్వంత భూమిని విరాళం గా పేదలుకు పంచి పేదవర్గాల అభివృద్ధికి పాటుబడ్డారు.గాంధేయవాదిగా సామాజికసేవలకు అంకితమై హరిజనోద్ధరణకు, హరిజన సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి అంటరానితనం రూపుమాపేందుకువిశేషకృషి సల్పారు.కురుడు సహకార సంస్థ ప్రెసిడెంటుగా,జిల్లా సహకార బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ గా,ఆముదాలవలససహకార చక్కెర డైరెక్టర్ గా రైతుల ఆర్దిక అభివృద్ధి కి పలుకార్యక్రమాలు చేపట్టారు. కురుడు గ్రామంలో తన ఐదు ఎకరాలభూమిని హైస్కూలు స్థాపనకు విరాళంగా యిచ్చి విద్యావ్యాప్తికి కృషి చేసి ఎంతో మందికి ఉపాది అవకాశాలుకలుగచేశారు.రామమూర్తి దొర నిస్వార్థ జీవనాన్ని, ఆదర్శజీవితాన్ని గడిపి ఎనలేని కీర్తిని గడించారు
Ramurthy Dora s/o Venkanna Dora
Reference - https://archive.org/details/whoiswho_1950/page/90/mode/2up?q=bobbili+dora