బల్జీల కులదైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్యసన్నిధి. |
చరిత్రకారుల పరిశీలనల రీత్యా, బలిజ శెట్టి జాతి ప్రజలు ఈ గ్రామం నుంచి రాష్టమంతా వ్యాపించినట్లు భావిసున్నారు. కళింగ దేశంలో బలిజవారికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా కొన్ని వందల సంవత్సరాలనుండి బలిజిపేట ఉన్నది. తరతరాలుగా సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు, ధాన్యాలు, చింతపండు, తాళ్లు, దూది, ఆయుధాలు, నవరత్నాలు, ఏనుగులు, గుర్రాలు వంటివి శ్రీలంక, బర్మా, కాశ్మిరు, కాశీ, కర్ణాటక, గోలకొండ, చంద్రగిరి, విజయనగర, మలయాళ, తమిళనాడు, సింగపూరు వంటి స్వదేశ, పరదేశ, నానాదేశాలలోనూ సరుకులు రవాణాచేసి వాణిజ్యం చేస్తుండేవారు. పూర్వం వైశ్య వర్ణం గా గుర్తింపు కలిగి వాణిజ వైశ్యులు అని చెప్పబడేవారు. వణిజులే రానురాను బలిజలుగా మారింది. కుల పురాణ గ్రంధాలలో వ్రాయబడినది. మిరియాల, బండి, కూనిశెట్టి, ముత్యాల, పోలిశెట్టి, సింగంశెట్టి, బత్తుల, మద్దాల, చిమటా, గుమ్మళ్ల, మైగాపుల, గోపిశెట్టి, పగడాల, అల్లంశెట్టి, ఆకుల, ఆత్మకూరు, బాలుమూరి, అనిశెట్టి, బావిశెట్టి, చలవాది, దండు, దేవరశెట్టి, ఏనుగుల, కేతినీడి, తూము, అంగజాల, దంగుడుబియ్యం, గవర, వలవల, మారిశెట్టి, దేశంశెట్టి, రెడ్నం, చెలంకూరి, కటకంశెట్టి, పుప్పాల, మలిశెట్టి, నరహరిశెట్టి, నాగిరెడ్డి, డేగల, నల్లం, సూరిశెట్టి, పత్తి, గంధం, తిరుమలశెట్టి, కోలా, చోడిశెట్టి, మచ్చా, గునిశెట్టి, తెలగనీడి, కండి, గణపతి, కొత్తపల్లి, కత్తి, రాజనాల, గాజుల, ఉద్దండం, బరిగెడ, ఎర్రంశెట్టి, మద్దంశెట్టి, ఆదిమూలం, బండారు, యండమూరి, పసుపులేటి, పోతురెడ్డి, బలిజరెడ్డి, వెలిదే, ముప్పిడి, బైరిశెట్టి, ఇందుగుల, కమ్మిలి, తోట, ఆనాల, మహదాసు, బయ్యవరపు, చింతలపూడి వంటి బలిజశెట్టి కుటుంబాలు బొబ్బిలి వద్ద ఉండే ఈ బలిజపేటలో ఉంటూ రాష్ట్రమంతా బొబ్బిలి బలిజలని కళింగబలిజలని పేరుగడించారు. వీరిలో చాలామంది గొప్పగొప్ప వీరులు ఉన్నారు. 15వ శతాబ్దములో విజయనగర సామ్రాట్టు శ్రీ కృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలలో కూడా వచ్చిన చాలామంది బలిజ వీరులను ఇక్కడే నిలిపేను. కొందరు 17వ శతాబ్దంలో జరిగిన బొబ్బిలి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందడం బలిజవీరుల వీరత్వానికి నిదర్శనం. బలిజవీరుల పేరుమీద పాత బొబ్బిలి కోటనందు ఒక బురుజుకు బలిజవారి బురుజు అని పేరుండేదని ఇప్పటికి పెద్దలు తెలుపుకోవడం ఉన్నది. వీరు తమకే అర్ధమయ్యే ప్రత్యేక భాషలో మాట్లాడుకునేవారు. ఈ బలిజశెట్టి కుటుంబాలవారు కులవృత్తి వ్యాపారములు చేసుకొనుచు ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, బర్మా, సింగపూర్ వంటి ప్రాంతాలకు చేరినారు. గౌరీదేవిని కులదైవంగా ఆరాధించడం గలదు, గణపతి, తిరుపతి వేంకటేశ్వరస్వామిని ఆరాధించడం గలదు. వీరి వివాహపద్దతులు కూడా స్థానికులకన్నా కొన్ని వైవిధ్యమైన పద్దతులలో ఉంటాయి.