Fill the form, we are preserving balija surnames and their history.

మొంగం నరసయ్య దొర

చింతపల్లి గ్రామంపూసపాటిరేగ మండలంవిజయనగరం జిల్లాలో1905లో చిన్నయ్య దొరఎరకమ్మ దంపతులకునరసయ్య దొర ( TELAGAజన్మించారు,  ఏడుగురు కుమారులుఒక కుమార్తెజన్మించగావారిలో రెండవ కుమారుడు నరసయ్య దొరఅప్పటికి నరసయ్య  తండ్రి చెన్నయ్య దొరకువ్యవసాయం చేస్తూజీవించేవారు గ్రామంలో పెద్ద రైతు గా ఉండేవారునరసయ్య దొర కంటే పెద్ద వారైనా అప్పలరాములు దొర కొన్నాళ్ళకుస్వర్గస్తులయ్యారు.


 తర్వాత కుటుంబ బాధ్యత అంతా నరసింహందొర గారే బాధ్యత వహించారు

నరసయ్య దొర మిగిలిన ఐదుగురు అన్నదమ్ముల తో ఉమ్మడి కుటుంబం గా కుటుంబాన్ని అన్నదమ్ములను అభివృద్ధిచేస్తూ కుటుంబ ఆస్తుల పెంచుకోంటూ వచ్చారుబ్రిటిష్ వారి కాలంలో వినోబాబావే తో భూదాన ఉద్యమం లో పాల్గొనిపాదయాత్ర చేశారు,, 

చుట్టుపక్కల గ్రామాల్లో పెద్దరికం వహిస్తూతగవులు తీర్చేవారు.అటు కొమ్మూరు అప్పుడు దొర కుటుంబీకుల తోనూవిజయనగరం మహారాజు పి.వి.జి.రాజు గారితోనూ సన్నిహిత సంబంధాలు కలిగి వుండేవారు విధంగా చింతపల్లిదొరలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తూసుమారు 14 వందల ఎకరాల భూస్వాములయ్యారు.కోనాడఫిర్కాకేంద్రంగా తీరప్రాంత మత్స్యకారుల తోసన్నిహిత సంబంధాలు కలిగిమత్స్యకారుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలుచేశారుమత్స్యకారుల వేటలో వచ్చిన చేపలు చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు మత్స్యకారమహిళలనుచుట్టుపక్కల గ్రామాల రైతులు చేపలు లాక్కొని అల్లరి చేసేవారు. విషయంలో నరసయ్య దొర అన్నదమ్ములుకలిసి చుట్టుపక్కల గ్రామాల తో చాలా తగువులు పడ్డారు.అందుకే మత్స్యకారులకు దొరలు అంటే చాలా గౌరవంకలిగింది.చింతపల్లి గ్రామంలో నరసయ్య దొర మాటకు వేదవాక్కునరసయ్య దొర ఎవరిని నియమిస్తే వారే సర్పంచ్అయ్యేవారు.అన్నదమ్ములు కూడా నరసింహదొర మాటకు ఎదురు చెప్పలేదుచింతపల్లి గ్రామం రైతులు అంతా కూడారైతు సంఘాల ఏర్పాటు చేసి

 మొత్తం పండిన పంట అంతా సమానంగా పంచుకునే పరిస్థితి చేశారుఉమ్మడి వ్యవసాయం,దున్నేవాడిదే భూమిపండించే వాడే ఆసామిఅనే నినాదంతో,400 ఎకరాల భూమిని షెడ్యూల్ కులాల వారికి పంచి పెట్టారు

విజయనగరం మహారాజా పి.వి.జి.రాజు గారి సహకారంతో మాన్సస్ కొబ్బరితోట అభివృద్ధి చేస్తూకొబ్బరి మొక్కలను పెంచి  చుట్టు పక్కల ప్రాంతంలో రైతులకు ఉచితంగా కొబ్బరి మొక్కలు ఇచ్చి కొబ్బరి తోటలు అభివృద్ధి చేశారు.

కొబ్బరి మొక్కలు ఆనాడు పంచిన అందువలన ప్రస్తుతము  ప్రాంతంలో కొబ్బరి తోటలు విరివిగా పెరుగుతున్నాయి .విధంగా చింతపల్లి దొరల ఒక వెలుగు వెలుగుతున్నపుడు . తల్లి ఎరకమ్మ  మరణించింది.తల్లి మరణంతో కలత చెందిననరసయ్య దొర మరియు అన్నదమ్ములు తల్లికి గుడి కట్టియాత్రను ప్రారంభించారు.ఉత్తరాంధ్రలో చాలా గొప్ప యాత్రజరిపించారు, 15 ఎకరాల్లో నాలుగు దిక్కుల వేదికను ఏర్పాటుచేసి ప్రసిద్ధిచెందిన రంగస్థల కళాకారులను  యాత్రలోభాగంగా సాంస్కృతిక కార్యక్రమంలోఈలపాట రఘురామయ్యకలియుగ కృష్ణుడు  పీసపాటి  నరసింహమూర్తి,సినిమానటులు పేకేటి శివరాంలీలారాణి బాపినీడుచింతామణి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రికలియుగ రాముడు అమరాపు సత్యంగారు,కలియుగ సత్యహరిశ్చంద్రుడు కె.నాగేశ్వరరావుసుశీల.అదేవిధంగా బుర్రకథ పితామహుడు నాజర్రావుపట్నాయక్,రాఘవకుమార్కుమ్మరి మాస్టారు బుర్రకథను ఎన్నోసార్లు చింతపల్లి యాత్రలొ వారి కార్యక్రమాలునిర్వహించారు.

నరసయ్య దొర సంగిడిరాళ్లు ఎత్తడంలో దిట్ట.

 సంగిడిరాళ్లు పందాలుఎడ్ల బళ్ళ పందాలు

 సైకిల్ పందాలు పోటీలు పెట్టి బహుమతులను అందజేశారు

అలాగే ప్రముఖ కళాకారులందరూ సన్మానించారు,, 

 విధంగా చింతపల్లి యాత్ర దిగ్విజయంగా గత 75 సంవత్సరాల నుండి ఇప్పటికీ కొనసాగుతోంది

చింతపల్లి   లైట్ హౌస్ :-

 లైట్ హౌస్ 1903లో బ్రిటిష్ వారు నిర్మించారు,, లైట్ హౌస్ నిర్మించిన తరువాత చుట్టు పక్కల ప్రాంతానికి స్థానికరైతులనుపశువులను రాకుండాకేసులు పెట్టే వారు,అటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారితో పోరాడి బ్రిటిష్ వారికి మంచినీళ్లు పాలు కాయగూరలుచేపలు వెళ్ళకుండా ఆపు చేయించారు.అప్పుడు బ్రిటిష్ వారు నరసయ్యదొర కు క్షమాపణ చెప్పిరాజీ పడ్డారు

 విధంగా నరసయ్య దొర పలుకుబడిగౌరవం చూసి కొంతమంది చుట్టుపక్కల రైతులకుఈర్ష్య,పగ ప్రతీకారంఏర్పడ్డాయి.నరసయ్య దొరను చంపేయాలని ఉద్దేశంతోఎన్నోసార్లు ఆయన ప్రయాణంలో మార్గమధ్యంలో దాడులుజరిగాయి

అప్పటినుండి రక్షణ కోసంఅప్పటి కలెక్టర్ తో మాట్లాడితుపాకీ లైసెన్సులు తీసుకున్నారు,, 

 ప్రాంతంలో  ఎక్కడ   తగువు తీర్చాలన్న చింతపల్లి దొరలే తీర్చాలి అనే ఒక నమ్మకం ఏర్పడిందిఅటు భీమునిపట్నంనుండి ఇటు రాజాం వరకుఎన్నో తగువులకు తీర్పులు చెప్పేవారు,


అదేవిధంగా 1946లో లంకలపల్లి పాలెం గ్రామంలో ఇరువర్గాలు తగు పడినప్పుడు నరసయ్య దొర ఆధ్వర్యంలోఅన్నదమ్ములు అందరూ కలిసి  తగవు తీర్చడానికి లంకలపల్లి పాలెం వెళ్లారు

 తగువు తీర్పులో  ఒక వర్గం వారు చింతపల్లి దొరల తీర్పు వినలేదు తిరిగి ఎదురు దాడి చేశారు

కొమ్మూరు ఎల్లప్ప అనే ఆసామి నరసయ్య దొరను నరికి వేయడానికికత్తితో దాడి చేశాడు ఆవెంటనే నరసయ్య దొర చిన్నతమ్ముడువెంకట్రావు దొర తుపాకీతో  కొమ్మూరు ఎల్లప్ప ను కాల్చినప్పుడు

 ఐదుగురు సభ్యులు తుపాకీ కాల్పుల్లో మరణించారు.పోలీసులు చింతపల్లి దొరలను అరెస్టు చేసి తీసుకు పోయారుచింతపల్లి ప్రజలందరూ కూడబలుకుకొని దొరలను విడిపించడానికి ఖర్చుచేశారు.భీమిలి జైల్లో దొరలు ఉన్నప్పుడునరసయ్య దొర రాత్రులు సైకిల్ మీద సముద్రతీరమార్గంలో వచ్చిఎక్కడ వ్యవహారాలు చక్కబెట్టుకుని వెళ్ళిపోయేవారు.కేసులో ప్రముఖ లాయర్ మాధవరావు నాయుడు గారుకోర్టులో వాదించి చింతపల్లి దొరలను శిక్షలు పడకుండా కేసు కొట్టివేయించారు. కేసులో విపరీతంగా ఖర్చయింది

సిరిమాను పండుగ:-

చింతపల్లి గ్రామదేవత సామలమ్మ అమ్మవారుచింతపల్లి దొరల ఆడపడుచుగా వెలసింది

మత్స్యకారులు వలలో చిన్నరాయి రూపంలో కొమర వారి ఇంట్లో సామలఅమ్మ తల్లి పుట్టినట్లు మొంగం  వారిఆడపడుచుగా  అమ్మవారికి గుడి కట్టి మ్రొక్కులు చెల్లించేవారు

 నరసయ్య దొర తండ్రిచెన్నయ్య దొర సిరిమాను అధిరోహించే వారు,అదేవిధంగా మత్స్యకారుల నుండి కొమర అపన్నరెండోసారి అధిరోహించి

 విధంగా  పండగ లో ఇద్దరు పూజారులు సిరిమాను అధిరోహించడం ఒక ప్రత్యేకత ఇప్పటికీ పండుగ ఘనంగాజరుగుతోందిచుట్టుపక్కల గ్రామాలు ఉత్తరాంధ్రలో చాలా జనం  పండుగకు వస్తారు. విధంగా చింతపల్లి  దొరలమొంగం  వారి కుటుంబం అభివృద్ధి చెందింది 

ప్రస్తుతం కుటుంబంలో డాక్టర్లు లాయర్లుబ్యాంక్ ఆఫీసర్లుటీచర్స్పారిశ్రామికవేత్తలు,వ్యాపారులు

 గానూ సుమారు 300 మంది కుటుంబాలు అభివృద్ధి చెందారువిదేశాల్లో కూడా  కుటుంబ సభ్యులు స్థిరపడ్డారు.

Post a Comment

Previous Post Next Post