గంధం సీతారామాంజనేయులు
గంధం సీతారామాంజనేయులు గుంటూరు జిల్లాల్లా పెదనందిపాడు సమీపంలో పుసులగ్రామం లోని స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబం నుంచి వచ్చిన వీరు ఉద్యోగరీత్యా ధవళేశ్వరం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో పనిచేసి ఖద్దరు గుమాస్తాగా పేరు గాంచారు. అనంతరం కొవ్విడి లింగరాజు గారి గోదావరి పత్రికలో ఎకౌంటెంట్ గా చేరి ఆ పత్రిక మూసివేతతో ఆ రంగం పట్ల అనురక్తి కలిగి 1956లో రాజమండ్రి సమాచారమ్ పేరిట స్థానిక దినపత్రికను స్థాపించి 1987లో కీర్తిశేషులు అయ్యేవరకూ సంపాదకునిగా పట్టణ సమస్యలను ప్రస్పుటంగా అధికారులు దృష్టిలో పెట్టిన పరిష్కారానికి కృషి చేశారు. భారతదేశ చిన్నపత్రికలలో అసమాన ఖ్యాతిని సాధించిన తొలి స్థానిక పత్రికగా 'ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా' వారి ప్రశంసలు అందుకుంది. భారత ప్రధాని రాజీవ్ గాంధీ చేతులు మీదుగా వారి తదనంతరం మరణాంతరం పురస్కారం పత్రికా సంపాదక బాధ్యతలు చేపట్టిన వారి తనయుడు శ్రీ గంధం నాగ సుబ్రహ్మణ్యం అందుకున్నారు. మూడు దశాబ్దాల పాటు గోదావరి గట్టు శ్రద్ధానంద ఘాట్ సమీపంలో మైదవోలు వారి వీధిలో సమాచారమ్ తన ప్రస్థానాన్ని కొనసాగించినందున నగరానికే ప్రతిష్ఠాత్మకంగా భావించే గోదావరి గట్టును " గంధం సీతారామాంజనేయులు ఘాట్"గా కౌన్సిల్ తీర్మానాన్ని 1988లో చేసారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికలకు ఇచ్చే మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారం అందించింది. రూ. లక్ష నగదు ప్రదానం చేసింది. ఇక స్థానిక సేవా సంస్థలు సమాచారమ్ పత్రిక ప్రతిభాపాటవాలను ప్రశంసించి సీతారామాంజనేయులు కృషిని గుర్తించి అవార్డులను ప్రదానం చేశారు. ఇక నగరానికి ఏ ప్రముఖ వ్యక్తి వచ్చినా సమాచారమ్ కార్యాలయం సందర్శించేవారు. లూరు