విశాలాంధ్ర తొలి డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత పసల సూర్యచంద్రరావు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. అలంపురం, ఆ తరువాత తాడేపల్లిగూడెం శాసనసభా నియోజకవర్గాల నుంచి 1950-1960 సంవత్సరాల మధ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పసల ఆ తర్వాత శాసనమండలికి కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులకు సన్నిహితుడిగా ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన వారు పసల సూర్యచంద్రరావు