1952లో జరిగిన మొదటి లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నాయకురాలు దుర్గాబాయి దేశముఖ్ గారిని ఓడించి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు.
నల్లా రెడ్డి నాయుడు గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా ఈదరాడ గ్రామంలో సంపన్న జమీందారుల కుటుంబంలో జన్మించారు.నాయుడు గారు మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో డిగ్రీ , పూణే లోని ఫెర్గ్యుసన్ కళాశాలలో న్యాయ శాస్త్రంలో ఎల్.ఎల్.బి పూర్తి చేశారు.
నాయుడు గారు న్యాయవాది గా కాకినాడ లో ప్రాక్టీసు ప్రారంభించారు, వీరి బంధువు కుర్మా రెడ్డి నాయుడు గారు మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా వ్యవహరించడమే కాకుండా జస్టీస్ పార్టీ లో కీలకమైన నాయకులు. జయప్రకాష్ నారాయణ్ గారి ఆలోచనలకు ప్రభావితుడై ఆయన స్థాపించిన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జయప్రకాష్ నారాయణ్ , లోహియా గార్లు స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీలో చేరిన వీరి ఆంధ్ర ప్రాంతానికి నాయకత్వం వహించారు, 1952లో జరిగిన మొదటి లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నాయకురాలు దుర్గాబాయి దేశముఖ్ గారిని ఓడించి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. జయప్రకాష్ నారాయణ్ గారు క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగిన తరువాత కాంగ్రెసు పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా పార్టీలో కీలకమైన నాయకుడి గా వ్యవహరిస్తూ వచ్చారు.
1952లో రాజమండ్రి నుంచి ఎన్నికయ్యి లోక్ సభకి ప్రాతినిధ్యం వహించిన వీరు సభలో పార్టీ విప్ గా పనిచేశారు.అమలాపురం పురపాలక సంఘం అధ్యక్షుడు గా అమలాపురం అభివృద్ధి కి కృషి చేశారు.
ELECTION RESULTS