Fill the form, we are preserving balija surnames and their history.

పెరిక బలిజ / Perika Balija

పెరిక బలిజలు, తెలుగు దేశము నందు మరియు భారతదేశమంతా ఉన్నారు.వీరిని "పురగిరిక్షత్రియులు" అని అంటారు. వీరు సైనికాధికారులుగా, వ్యాపారులుగా ఉన్నారు. వ్యవసాయము కూడా చేస్తారు.త్రేతాయుగములో పరశురాముడు, కార్తవీరార్జునుడు తన తండ్రియైన జమదగ్నిని చంపినాడనే కోపంతో కార్త్య వీర్యార్జునుడిని అతని కుమారులను చంపి, క్షత్రియుడన్న వాడినల్లా చంపుతానని ప్రతిన భూని భూమండల మంతా ఇరవై ఒక్కసార్లు తిరిగిన సందర్భములో రాజులుగా, క్షత్రియ (వీరబలిజ) బలిజలుగా ఉన్న పెరిక బలిజలు, అంతఃపురము వదలి బయపడి అడవులకు, కొండ ప్రాంతములకెళ్లి తలదాచుకున్నారు. అందువలన వీరిని పురగిరి క్షత్రియులన్నారు. పురము అంటే అంతఃపురమని పట్టణమని, గిరి అనగా కొండ అని అందువలన వీరు పురగిరి క్షత్రియులయ్యారు పూర్వకాలమున వీరు వ్యాపారము చేసెడివారు. ఎద్దులపైన, ఎద్దుల బండ్లమీద వస్తువులను నింపి గొప్ప బిడారు (కొన్ని గంత ఎద్దుల సమూహము) లుగా తీసుకొని వచ్చి వాటిని సంతలలో విక్రయించేవారు. ఈ విధముగా రైళ్లు, లారీలు, వచ్చే కాలము వరకు జరుగుతుండేది. పెరిక అనగా గోనె (గోతము) మూట. ఈ గోనె మూటలు వేసుకొని ఎద్దుల బండ్ల మీద గ్రామాలు, పట్టణాలు, సంతలలో వ్యాపారము చేయువారిని పెరిక బలిజలు అన్నారు. వారిలో వ్యవసాయము చేయువారిని పెరిక కాపులు అని పెరికలని పిలిచారు.

తూ॥గో॥ జిల్లా నార్త్ వల్లూరు జమీందారులు బొమ్మ దేవరవారు పూర్వము 18 వ॥ శతాబ్దములో కొన్ని లక్షల ఎద్దుల బిడారులు కలిగి యుండెడి వారు. అప్పటి నిజాం సంస్థానానికి టిప్పుసుల్తాన్ (శ్రీరంగ పట్టణము) కు జరిగిన యుద్ధమునకు బొమ్మ దేవరనాగన్న నాయుడు గారిని నైజాం సంస్థానాదీశులు తమ పక్షమున సైనిక సామాగ్రి గొంపోవుటకై "ఎద్దుల బిడారులు” సహాయము కోరిరి అందులకు నాగన్న నాయుడుగారు ఒప్పుకొని తమ బిడారులతోనేగి, శ్రీరంగపట్టణమును ముట్టడించడానికి తక్కిన సేనతోబాటు వెళ్ళిరి. అందులో విజయం సాధించిన నైజాం వారు ఎంతో డబ్బు యిచ్చిరి, తర్వాత ఇనాముగా జమీందారి భూములిచ్చిరి. తర్వాత వారు జమీందారులైరి. తోటవల్లూరు, పంగెడి గూడెం జమీందారులు వారే, వీరి భూములు గోదావరి జిల్లా నుండి సికింద్రాబాద్ వరకు ఉండేవని చెప్పేవారు. ఈ రీతిగా గోనెలలలో సరుకులు నింపుకొని వ్యాపారము చేయు వీరబలిజలలే పెరిక బలిజలు వారిలో వ్యవసాయము చేయువారు.

త కాంచన రాశి బండులంబెఱికల మోపులం గొలది పెట్టంగ 

బెక్కగు బారువుల్ జనుల్ 

వెలుగు పడంగ ఖేచరులు వెక్కస 

మందగ శత్రు కోటికిన్

వెఱపొనరించు వార్త పృదివిన్ బరగన్ 

నడిపించె భూవరా !

(మహాభారతం - అశ్వమేధయాగం - 3 ఆ)


ఈ విధంగా పెరిక బలిజలు మహా భారతములో ధర్మరాజు అశ్వమేధ యాగ కాలము నాటికి ఉన్నారు. వీరిలో “మలిశెట్టి" వారికి పద్దెనిమిది కులముల వారిపై అధికారము వహించి కులముల తప్పొప్పుల తీర్పులు చెప్పే అధికారము కలిగి యున్నారు - వీరికి రావు, నాయుడు, శెట్టి, రాజు, వర్మ బిరుదులు కలిగియున్నారు.

త్రిపురాంతక శాసనం : క్రీ॥శ॥ 1245 నాటి కాకతీయ గణపతి దేవుని కాలములో త్రిపురాంతక పట్టణములో ఆలయానికి చెందిన పెరికలు మోసే 300 ఎద్దులపైన సుంకాన్ని పరిహరించడం జరిగింది. అద్దె ఎడ్ల యజమానులైన కాపులను పెరికవారు అన్నీ ఎద్దులను పెరిక ఎడ్లనీ పలిచేవారు. ఈ దానం చేసిన వారు రాజు గారి సర్వాధికారి అయిన పోచన ప్రెగ్గడ గణపయ ఆలయానికి సంబంధించిన సరుకులను ఈ ఎడ్లు ఉచితంగానే మోసేవి. ఈ ఎడ్ల కాపులు తమ ఎడ్లను ఇతర వ్యాపారులకు అద్దెకివ్వడం ద్వారా పొట్ట పోసుకునేవారు. దీనిని బట్టి పెరికవారు ఆనాడు వాణిజ్య పట్టణాలలో రవాణా వ్యాపారం పై జీవించేవారని తెలుస్తుంది.

క్రీ॥శ॥ 1680 నాటి లేపాక్షి, తామ్రశాసనంలో పేర్కొన్న అష్టాదశవర్ణాల్లో పరికలెత్తువారుగా వీరిని పేర్కొనడం జరిగింది. వాణిజ్య సరుకులు రవాణా చేసే వృత్తిని అవలంభించిన ఈ పెరిక వారు కాపులు తప్ప వేరే కులము వారు కాదు. వారి మీద వృత్తి, ఆస్థి పన్నులవంటి పన్నులుండేవి. ఈ శాసనములో వాటికి పరిహారమిచ్చారు. పోచన ప్రెగ్గడ గణపయ్య, సుంకరి పదవిలో నియమించారు. సుంకరి పదవిలో ఉన్న పోచన ప్రెగ్గడ గణపయ్య, పెరికకాపు కులస్థుడు ఆలయానికి కావలసిన సరుకులు అన్నియు ఉచితంగా వీరు రవాణా చేసేవారు. క్రీ॥శ॥ 1247 అమ్మకపు వస్తువులుగా పేర్కొంది. కాకతీయులు గ్రంధం 230 పేజి రచయిత కీ॥శే॥ పి.వి. పరబ్రహ్మశాస్త్రి గారు.

"బలిజ కుల చరిత్ర" కంటే నారాయణ దేశాయి గారు 20 శతాబ్దం మొదట్లో రాసిన గ్రంధం. ఇందులో వివిధ పేర్లతో పిలువబడుతున్న బలిజ శాఖల పేర్లు ఇచ్చారు. గమనించండి.



ఇక రెండు 1901 మద్రాస్ ప్రెసిడెన్సీ సెన్సస్ రిపోర్ట్ లో బలిజ కులంలో గాజులు అమ్మే వారికి గాజుల అని, ఉప్పు అమ్మే వారిని పెరికె అని రాశారు గమనించాండి. 



ఇక మూడు 1886 లో అచ్చయిన కర్నూలు మాన్యువల్ లో బలిజ కులాల మధ్యన పెరిక బలిజ అని స్పష్టంగా పేర్కొన్నారు గమనించ గలరు.



ఇక నాలుగు 1968 లో అనంతరామన్ కమీషన్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో 1891 తమను ప్రత్యేక కులం గా గుర్తించాలని కోరినట్లు రాశారు. అంతే కాకుండా పెరిక కులం బలిజ, మరియు కవరై కులాలకు ఉపకులమని స్పష్టం చేశారు. అంతే కాకుండా అప్పటి జనాభా లెక్కల ప్రకారం చదువుకున్న వారి శాతం సంతృప్తి కరంగా లేదని రాశారు. వీరి అభివృద్ధికి ఏమేమి చర్యలు తీసుకోవాలో దిగువన సిఫారసు చేశారు. గమనించండి.



ఇక ఐదు... పెరిక కులం గురించి పరిశోధించి "చరిత్ర వాహినిలో పెరిక కులం" అని కానుగంటి మధుకర్ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఏమని రాశారొ గమనించండి.




  "పెరిక బలిజ" కులస్తులు బలిజ కులస్తులే.... ఈ విషయం తెలియని చాలామంది రెండూ వేరు వేరు కులాలుగా పరిగణిస్తూ వారి మధ్య ప్రఛ్చన్న స్పర్థలను రేకెత్తిస్తున్నారు. చరిత్ర తెలియని చాలామంది మిడి మిడి జ్ఞానంతో కేవలం తమకు మాత్రం బంధుత్వాలు లేవనే కారణంతో పెరిక బలిజ కులస్తులకు రిజర్వేషన్లు అందకుండా అడ్డు పడుతున్నారు. అలాంటి వ్యక్తులు అనాలోచితంగా ప్రభుత్వాధికారులకు ఫిర్యాదులు చేయడంతో రాయలసీమ ప్రాంతంలో అనేకమంది "పెరిక బలిజ" విద్యార్థులు కులధృవీకరణ పత్రాలు అందక ఫీజు రీఎంబర్స్ మెంట్ అందక కాలేజీ చదువులు మానుకున్న సంఘటనలు చాలా వున్నాయి. 

1970 వరకు అగ్రకులాలలో వున్న పెరిక బలిజలు 1970 తరువాత బి.సి-బి జాబితాలో చేర్చబడ్డారు. 
తమ కుల సంఘాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు "పెరికె" "పెరికె(పురగిరి క్షత్రియ)" సంఘాలుగా మాత్రమే రాసుకుంటున్నారు. 

6 Comments

  1. Simhavalokanam🦁🦁🦁..

    ReplyDelete
  2. Anta scene led Perika caste first nundi bc-b A not oc

    ReplyDelete
    Replies
    1. Show A proof for perika caste caste is OC before 1970

      Delete
    2. OC ina BC ina society ki contribution chala chesaru bro from medival time
      First madras family
      Vizag eminent family
      Vullur zamindars
      Godey zamindars
      Berri thimappa developed Chennai city

      Delete
  3. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వటం లేదండి తిరుపతి జిల్లా లో ఏం చేస్తే ఇస్తారో తెలియజేస్తారా?

    ReplyDelete
Previous Post Next Post