Fill the form, we are preserving balija surnames and their history.

Marotrao Shambshio Kannamwar - 2nd CM of Maharastra

 

మన దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు పని చేసారు. ఆయన మద్రాస్ గవర్నర్గా కూడా పని చేసారు. నేటి తరం యువతకు ఆయన గురించి పూర్తిగా తెలియదు. అదే విధంగా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మహారాష్ట్ర కు రెండవ ముఖ్యమంత్రిగా మారోతిరావ్ సాంబశివో కన్నమ్వార్ పని చేసారు. వీరు గుంటూరు జిల్లా కాపు కులానికి చెందిన వారు.

1850లో మారీతిరావ్ సాంబశివో కన్నమ్వార్ పూర్వీకులు గుంటూరు జిల్లా నుండి నాగ్పూర్కు వలస వెళ్ళారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వీరి వంశానికి చెందిన వారు. 1900లో నాగ్పూర్లో జన్మించిన కన్నమ్వార్ బిఎ., ఎల్ఎల్చి చదివారు. గాంధీ మహాత్ముని పిలుపు మేరకు 1925లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగ్పూర్, సావోలి పట్టణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షునిగా పని చేసి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పని చేసారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా 8 నెలలు జైలు శిక్షను అనుభవించారు. నాగ్పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేసారు. ఆ కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ప్రధాన అనుచరునిగా ఉండేవారు.

గాంధీ బోధనలకు మహారాష్ట్ర ప్రజలకు వివరించేవారు. ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తెలుగులో మంచి దిట్ట. ఈ కారణంగా పండిట్ జవహర్లాల్ నె హ్రూతో మంచి పరిచయం ఏర్పడింది. సావోలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. నాగ్పూర్ అసెంబ్లీ నుండి ఒక పర్యాయం ఎన్నికయ్యారు. 1957, 1960, 1962 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన శాశనసభ్యునిగా ఎన్నికయ్యారు. వైబి చవాన్ ముఖ్యమంత్రిగా పని చేసిన అనంతరం ఆయనను నెహ్రూ ముఖ్యమంత్రిగా నియమించారు. నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఎంపిక కావడంలో అప్పటి మహారాష్ట్ర గవర్నర్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ హస్తం ఉంది.

కన్నమ్ వార్ ముఖ్యమంత్రి కాగానే నిరుపేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే ఆంధ్ర ప్రాంతం నుండి కాపులు, బలిజలు మహారాష్ట్ర కు వెళ్లి స్థిర పడ్డారు. స్వతహాగా న్యాయవాది అయిన తన వద్దకు వచ్చే ఆంధ్ర కాపులు, బలిజలకు సేవలు అందించేవారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చారు. కాపు ఏకధికార యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. రూ.5 లక్షలతో నిధిని ఏర్పాటు చేసారు. దీనితో పాటు జాతీయ రక్షణ నిధి, పత్తి పంట పథకం అనే మూడు పధకాలనుఆయన ప్రవేశపెట్టారు. ఈ మూడు పథకాలు అప్పట్లో మహారాష్ట్రలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. మహారాష్ట్ర - గుజరాత్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినపుడు ఎంతో కీలకంగా పని చేసారు. 368 రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా పని చేసారు. 1962 నవంబరు 20న ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1963 నవంబరు 24న ఆయన ముఖ్యమంత్రిగా తన కార్యాలయంలో కన్ను మూసారు. కన్నమ్వార్ మృతి పట్ల నాటి ప్రధాని పండిట్ నెహ్రూ, గవర్నర్ విజయలక్ష్మి పండిట్, రాష్ట్రపతి రాధాకృష్ణన్ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు.మహారాష్ట్రకు ఇప్పటి వరకూ 20 మంది ముఖ్యమంత్రులుగా పని చేసారు.

వీరిలో 12 మంది మరాఠీలు, నలుగురు నాన్ మరాఠీలు ఆరుగురు ఉన్నా ఈ ఆరుగురిలో కన్నమ్వార్ ఒకరు. | మృతి చెందిన తరువాత రాష్ట్రంలో పది రోజులు సంతాపాన్ని ప్రకటించారు. నాగ్పూర్ విధానసభలో ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ముంబూలో విక్టోరిల్ ఈస్ట్లో కాలనీకు ఆయన పేరు పెట్టారు. నాగ్పూర్లో ఆయన పేరిట ఒక ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసారు.



2 Comments

  1. His ancestors aren't from Guntur but from Karimnagar district. Veeri intiperu 'kanna' kadhu kannam.
    Kanna lakshmi narayana garu veeriki bhandhuvulu ani meeku evaru cheppinaru?

    ReplyDelete
  2. Naku kuda doubt undi , edho article lo vaste just copy paste chesanu chala matter oksari revise cheyyali...

    ReplyDelete
Previous Post Next Post