- జన్మ స్ధలం :- BANDARU ( Machilipatnam )
- తల్లి పేరు :- దుర్గమ్మ
- తండ్రి పేరు :- సూరిశెట్టి సీతారామస్వామి
- కులం :- NAIDU
- మరణించిన తేదీ :- MAY – 22 – 1981
బాల్యం
కృష్ణాజిల్లా బందరు(మచిలీపట్టణం) సమీపంలోని చింతగుంటపాలెంలో బలిజ నాయుడు కుటుంభంలో సూరిశెట్టిఆంజనేయులు జన్మించారు
తండ్రి పేరు :- సూరిశెట్టి సీతారామస్వామి తల్లి పేరు :- దుర్గమ్మ
ఈ దంపతులకు 5 – అబ్బాయిలు , 4- అమ్మాయిలు
1) నరసింహ స్వామి
2) వెంకటరత్నం
3)సీతారామస్వామి
4) మాధవరావు
5)ఆంజనేయులు
చదువు
సూరిశెట్టి ఆంజనేయులు గారు మచిలీపట్టణం ఆంధ్ర జాతీయ కళాశాలలో క్రి||శే చిత్రకళానిధి శ్రీ విరంగి వెంకట శాస్త్రి గారి వద్ద చిత్రలేఖనం నందు శిక్షణ పొంది , చిత్తూర్ జిల్లా చెన్నూరు గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు.
ఆంధ్ర రాష్ట్రము ఏర్పడిన వేల
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రము నుండి విడిపోయి ఆంధ్రరాష్ట్రము ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రరాజముద్రికను రూపొందిచే నిమిత్తంలో దాదాపు మూడువందల మందికిపైగా పంపిన ముద్రికల్లో శ్రీ సూరిశెట్టిస్పంజినేయులు గారు రూపొందించిన రాజముద్రిక నమూనాను ఎంపిక చేసారు.
ఆంజనేయులు గారి కుడిచేతిని కోతులు దానిచేనకరణంగా నరాలు(నరములు) పనిచేయక పోగా ఎడుమ చేతితోనేరాజముద్రను రూపొందించారు.
1953 సంవత్సరం , అప్పటి రాజధాని కుర్నూల్లోనే మంత్రి మండలి తీర్మానంలో ఆకర్షణీయంగా ఉన్న ఈ రాజ ముద్రికనుఎంపిక చేసినట్లు.1953 డిసెంబర్ 3 వ తేదీనా అధికారికంగా ప్రకటించారు.
రాజముద్ర వివరణ
1953 కర్నూల్ రాజధానిగాతర్వాత 1956 హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడగా ఆంజనేయులు రూపొందించిన రాజముద్రితనే ప్రభుత్వంఅంగీకరించింది.
2014 లో ఏర్పడిన నవ్యఆంధ్ర ప్రభుత్వం అంగీకరించింది . తెలంగాణ ప్రభుత్వం అదే రాజముద్రకు మధ్యలో “చార్మినార్”ను చేర్చి తెలంగాణ ప్రభుత్వం సూరిశెట్టి రూపొందించిన రాజముద్రను ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము క్రి||శే జలగం వెంగల్ రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆంజనేయులు గారిని సన్మానించి అయన చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు.రెండు ఎకరాలు 75 సెంట్లు(2.75 acres)పంట పొలము వారి గ్రామములోని ప్రభుత్యము వారు ఇచ్చారు.
గాంధీ ఫాలోవర్
సూరిశెట్టి ఆంజనేయులు గారు బ్రహ్మచారి , వారి అన్నగారైన సూరిశెట్టి నరసింహస్వామి గారి ఇంట్లో ఉండేవారు.ఆయనసిమెంటుతో విగ్రహాలు తయవారు చేసేవారు , ఎక్కువగా గాంధీగారి విగ్రహాలు తయారుచేసే వారు.అందుకే ఆంజనేయులు గారిని “గాంధీ” అని కూడా పిలిచేవారు.
తుది శ్వాస
ఆంజనేయులు గారు 1981 సం|| మే-22 న తుది శ్వాస విడిచారు , అన్నగారైన నరసింహస్వామి గారే అంత్యక్రియలునిర్వహించారు.