DUNNA VEERASWAMY NAIDU
కర్తవ్య నిర్వహణలో వీరాస్వామి చూపిన ప్రతిభకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా 1906 అసిస్టెంట్ ఇంజనీర్ నియమించింది. ఈ పదవిలో ఉన్నప్పుడు బెజవాడలో ఆంపిల్ హాస్పిటల్, తమ్మిలేరు వంతెన, జంగారెడ్డిగూడెం సమీపంలో ఎర్రకాలువ వంతెన, బుడమేరు వంతెన మొదలగు కట్టడాలను నిర్మింపచేసి నెంబర్ వన్ ఇంజనీర్ గా పేరు గడించారు.
వాస్తుశిల్ప కళారీతుల్లో పాశ్చాత్య నైపుణ్యాన్ని గడించి ఆంధ్రదేశంలో కంచుకోటల్లాంటి భవనాలు, ఆనకట్టలను కట్టించి గొప్ప ఇంజనీర్ కీర్తి ప్రతిష్టలుపొందిన దున్నా వీరస్వామి నాయుడు నాగపూర్ సమీపంలోని జాలాలో 16 సంవత్సరంలో జన్మించారు. వీరస్వామి తండ్రి పిచ్చయ్య బ్రిటిష్సైన్యంలోని 42వ రెజిమెంట్ సర్వేయర్గా పనిచేశారు. నాగపూర్, జాలా మొదలగు ప్రాంతాల మీదుగా సర్వే చేస్తూ ఉద్యోగ ధర్మం నెరవేరుస్తూనేస్వర్గస్తులైనారు. పిచ్చయ్య గారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు జన్మించారు. వీరిలో పెద్దవాడు మన దున్నా వీరాస్వామి నాయుడు. బాల్యంలోనే తాతగాని స్వస్థలమైన బందరు వచ్చి విద్యాభ్యాసం అక్కడే పూర్తిచేశారు.
బందరు నోబుల్ కళాశాలలో చదువు కునే సమయంలోనే గుంపిని నారాయణ స్వామి నాయుడు దగ్గర డ్రాప్ట్మెన్ గా శిక్షణ పొంది అటు తర్వాతపరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.1885 లో పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో డ్రాఫ్ట్స్ మెన్గా ఉద్యోగంలో చేరి రెండున్నర సంవత్సరాలు నెల్లూరు, గుడివాడలలోపనిచేశారు. అనంతరం యస్.జి.ఎస్. రైల్వే యం అండ్ యస్ యమ్ రైల్వేలో పనిచేసి వివిధ కట్టడాలను, వంతెనలను నిర్మింపజేసి అధికారులుప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగం చేస్తూనే 'సర్వేయింగ్ లెవెలింగ్ మొదలగు పరీక్షలలో ప్రథమ ర్యాంకులో ఉత్తీర్ణు లయ్యారు. 1890లో లోకల్ ఫండ్డిపార్ట్మెంట్ హెడ్ డ్రాఫ్ట్మెన్గా చేరి మూడవ తరగతి ఓవర్శీయర్గా పదోన్నతి పొంది ఆరు సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించారు. కర్తవ్య నిర్వహణలోచూపిన ప్రతిభకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా వీరాస్వామిని 1906 అసిస్టెంట్ ఇంజనీర్ గా నియ మించింది. ఈ పదవిలో ఉన్నప్పుడుబెజవాడలో అంపిల్ హాస్పిటల్, తమ్మిలేరు వంతెన, జంగారెడ్డిగూడెం సమీపంలో ఎర్రకాలువ వంతెన, బుడమేరు వంతెన మొదలగు కట్టడాలనునిర్మింపచేసి నెంబర్ వన్ ఇంజనీర్గా పేరు గడించారు.