బలిజ పుట్టుక పుట్టవలె బతాయి బుడ్డి కొట్టవలె

సామెత వివరణ :-


వివరణ : ఇండోనేషియా లో బాటవియా నగరం. దీన్ని మనవాళ్ళు వాడుకలో బతాయి అనేవాళ్ళు.  ఇది 16వ శతాబ్దంలో డచ్చి వారికి వ్యాపార కేంద్రంగా ఉండేది. అక్కడ అప్పటి రాజైన శ్రీ జయవికర్తా రాజు వీరికి వ్యాపారానికి అనుమతి ఇచ్చెను. అక్కడినుండి ఇండియా కు వ్యాపారం చేసేవాళ్లు. అప్పటి డచ్చివారి మద్యం చాలావిలువైనది. ఆనాడు సంపన్న వ్యాపారవర్గమైన బలిజకులస్తులు చాలా ధర చెల్లించి విలాసంతో సేవించేవారు. అది ఆనాటి వారి జీవన విధానం లో భాగంగా ఉండేది. మిగిలిన కులాల వాళ్లంతా తమ తాహతుకు తగ్గట్టు మన ఇండియాలో దొరికే నాటు సారాయి, కల్లు సేవించేవారు. సంపన్న బలిజ వ్యాపారులు ఎంతో విలాసంగా తాగే ఈ సీమ మద్యం ఒక్కసారన్నా తాగాలి అని మిగతా జనాలు అనుకునేవారు, కానీ వాళ్లకు స్తొమత సహకరించేది కాదు, అందుకే "పుడితే బలిజ పుట్టుక పుట్టాలి, బతాయి బుడ్డి కొట్టాలి" అని ఆశ పడుతూ ఉండేవారు. అది ఒక నానుడిగా మిగిలిపోయింది..... 

బలిజవారు ముక్యంగా వ్యాపారవర్గం అని నిరూపించేందుకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది 


Post a Comment

Previous Post Next Post