ఓడలపై విదేశవర్తకము చేయు బలిజలు కొందరు ప్రత్యేకముగా రత్నవ్యాపారము చేయుటవలన వీరికీ నామము గలిగినది. ఓడలలో ప్రయాణము జేసి విదేశాల నుండి కొని తేబడిన సరకులు స్వదేశములో దిగుమతి చేయుటవల్లను ఓడలు నడిపి నావికావృత్తి అవలంబించే బలిజలను ఓడబలిజ లని పిలువబడగా - ఓడల నుండి దిగుమతియైన సరకులలో ప్రత్యేకముగా రత్న వ్యాపారము చేయు బలిజలకు రత్న బలిజ యసు నామము గలిగినది.
గోదావరి జిల్లాలో దూది బలిజలు కొందరు రత్నబలిజల మని చెప్పుకొనడము గలదు. బహుశ వీరి పూర్వికులు రత్న వ్యాపారము జేసి వున్నందువల్ల ఆ వ్యాపారమును బట్టికొన్ని కుటుంబముల వారిని రత్నబలిజలని సహజముగా పినడము యేర్పడియుండును. బలిజవంశీయులు యేవృత్తి అనుసరిస్తే ఆవృత్తి పేరు వారికి సార్థకమై వంశపరంపరగా నిలిచిపోతుంది. శ్రీకాకుళం, విశాఖపట్టణం, కూ॥ గోదావరిజిల్లాల్లో ఒక్వేర్గము వారికి ఓడ బలిజలు... రత్న బలిజలు అని ఈ రెండు నామములు వాడుకలో గలవు.