దూది బలిజలు , ఈ నామము వీరికి గలుగుటకు కారణం బలిజలు దూది సంబంధమైన వ్యాపారము చేయుటవలన దూది బలిజ లని పిలవబడుచున్నారు. దూది ఉత్పత్తి చేయుట దూది విక్రయించుట వీరి వృత్తి అయివుండును. రానురాను వ్యవ సాయమే ప్రధానవృత్తిగ పెట్టుకొని జీవించుట వలన నేడు ఈ బలిజశాఖవారిని గోదావరిజిల్లాలో కాపలని వ్యవహ రిస్తున్నారు. వీరిలో కొందరు ఉద్యోగులుగాను వర్తకులు గాను నున్నారు. దూదిబలిజలు ఉభయ గోదావరిజిల్లాలోను, విశాఖపట్టణం జిల్లాలోను విశేషంగా వున్నారు. ఒరిస్సాలో కూడగలరు. వీరినామాంతమున నాయుడని బిరుదు చేర్చు కొని పిలవబడుచున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దూది బలిజలు మంచి వున్నతస్థితిలో వున్నారు. వీరు సాంఘిక కట్టుబాటులు గలిగి, ధర్మబుద్ధి, ఆధ్యాత్మిక చింత పరోప కారము మొదలగు సుగుణములు గలిగియున్నారు. వీరి పూర్వికులు రత్నవ్యాపారముకూడ చేసియుందురు. అందు వల్ల కొన్ని కుటుంబాల వారు రత్న బలిజలని చెప్పుకొ నెదరు.
ఆధ్యాత్మిక విద్యలో - వేదాంతవిద్యలో ఆరితేరిన వారు పూజనీయు శ్రీ ఓంకారస్వాములు వారు. వీరువిశాఖ పట్టణం కళాశాలలో F.A. పరీక్షలో ఉత్తీర్ణులై హిమా లయమున తపస్సు చేసి అమెరికా వంటి దూర దేశములు పర్య టించి ఆంధ్ర దేశమున అన్నపరమునకు కొంతదూరమున తోటపల్లి కొండలవద్ద శాంతి ఆశ్రమము నిర్మించి అచట నుండి అశేష ప్రజానీకానికి జ్ఞానోపదేశము. ఆధ్యాత్మిక బోధనలు జేయుచున్నారు. ప్రపంచ ప్రజలకు శాంతి సందేశ ములుకూడ అంద జేయుచున్నారు. వీరు శాంతి ఆశ్రమములో అనాధ బాలబాలికలను పోషిస్తు విద్యగరుపుటకు పాఠశాల, వ్యాధి నివారణకు వైద్యశాల, గ్రంథాలయము, ముద్రణా” లయము నిర్మించి తెలుగులో 'శాంతి' 'Peace' అను మాసపత్రికలు నడుపుచున్నారు ఇంగ్లీషులో: జన్మ పేరు శ్రీ మలిశెట్టి వెంకటరావుగారు. కాకినాడదగ్గర నొక పల్లెటూరిలో జన్మించిరి. ఈయన ఉత్తర దేశములో సంచ రించుకాలమున ఈతని పేరేము అడుగ "ఓం" అను శబ్దము ఉచ్చరించుట చేత వీరికి అచ్చటవారు ఓంకారస్వామి యని పిలవడం ప్రారంభించిరి. అప్పటినుండి యిప్పటి వరకు ఓంకారస్వామి అనే పేరు సార్థకమై పోయినది. ఈతని బంధు వులు అమలాపురం తాలూకా పల్లంకుర్ర కందికుప్ప, దొంతుకుర్రు గ్రామాలలో ఉన్నారు. ఈతనుకూడ బలిజ శాఖకు చెందినవారు.