విజయనగర మహాసామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని రాజ్యాలుగా విభజించి పరిపాలించేవారు.
ఈ రాజ్యాలలో మరలా పరిపాలన కోసం చిన్నచిన్న ప్రాంతాలుగా విభజించి పరిపాలన చేసేవారు.
అటువంటి రాజ్యాలలో తమిళనాడులో మదురై కేంద్రంగా "పాండ్య రాజ్యం", తంజావూరు కేంద్రంగా "చోళ రాజ్యం", చెంజి కేంద్రంగా "తుండీర రాజ్యం" ఉండేవి.
వీటిపై విజయనగర సామ్రాట్టులనుండి గొప్ప గొప్ప సేనా నాయక హోదాలు పొందిన బలిజ కులస్తులు అధికారాలు చేజిక్కించుకునేను. వీటికి కృష్ణదేవరాయల కాలంలో వారి రాజబంధువులు, సర్వ సైన్యాధ్యక్షులు, అగర్బ శ్రీమంతుడు గొప్ప వ్యాపార కుటుంబీకుడు బలిజవర్ణం కాశ్యప గోత్రికుడు అయిన శ్రీ శ్రీ శ్రీ గరికెపాటి నాగమనాయనిగారు సొంత సైన్యాలు కలిగి, కప్పాలు వసూలుచేసుకునే అధికారం కలిగి ఉండేవారు. ఈతని కుమారుడు శ్రీశ్రీశ్రీ విశ్వనాధ నాయనిగారు పాండ్య చోళ రాజ్యాలకు రాజుగా సింహాసనం అధిష్టించి ఈ రాజ్యాలను చాల జనరంజకంగా పరిపాలన చేసెను. మదురై బలిజ నాయక రాజులకు దక్షిణ సింహాసనాధీశులని విజయనగర మహాసామ్రాజ్యంలో చాల గొప్పగౌరవం ఉన్నది. ఆ రాజ్యంలో ఎన్నో దేవాలయాలు, చెరువులు అభివృద్ధి చేసెను. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న భాగాలుగా రాజ్యాన్ని విభజించెను. ఒక్కొక్క భాగానికి ఒక్కో పాలకుణ్ణి నియమించెను. వాటినే పాళయాలు అనేవారు. వాటి పాలకులను పాళెగార్ అనేవారు. ఈ పాలెగార్లగా గవరబలిజ నాయకర్లు, తొట్టియన్ రాజకంబళ గొల్ల నాయకర్లు, మారవర్ నాయకర్లు, ఏకిలి నాయకర్లు, కమ్మ నాయకర్లు, పల్లి నాయకర్లు, వంటి కులాలవారు ఉండేవారు. ((స్వతంత్ర పోరాట కాలం నాటికి పాంచాలకురిచి పాలెగార్ అయిన వీరపాండ్య కట్టబొమ్మన "తొట్టియన్ రాజకంబళ గొల్ల నాయకర్" కులస్తుడు, వీరితో బలిజ రాజ వంశ కులస్తులకు ఎట్టి వైవాహిక సంబంధాలూ లేవు)).
వీళ్లల్లో బలిజ కులస్తులకు మాత్రమే విజయనగర, మదురై, తంజావూరు, జింజి, కండి, చంద్రగిరి, పెనుగొండ, రాయదుర్గం, బేలూరు, హొసూరుభాగలూరు, కేలడీ కోటబలిజ వంశాలతో సంబంధాలు ఉండేవి. ఇతర కులస్తులతో బలిజవారికి వైవాహిక సంబంధాలు ఉండేవి కావు.
బలిజ కులస్తులైన మధుర నాయక రాజ బంధువులెవరూ పాలెగాళ్లుగా ఉండడానికి ఇష్టత చూపేవాళ్లు కాదు. ఎందుకంటే విజయనగరంలో వారి సామజిక హోదా, అంతస్తు చాల గొప్పగా ఉండేది, చాలామంది ధనికులు, నానాదేశాలలో అంతర్జాతీయ వ్యాపారాలు చేసేవారు. ఒక్కొక్క కుటుంబానికి సొంత సైన్యాలు ఉండేవి. రాజ బంధువులుగా హోదాను అనుభవిస్తూ ఉండేవారు. రాజ్యాలనుండి కప్పాలను వసూలు చేసుకునే అధికారం కలిగి ఉండేవారు. మదురై రాజ్యంలో రాజ్యాధీశులైన విశ్వనాధ నాయనిగారి కుటుంబం తరువాత అంతటి పేరు సంపాదించింది వారి బంధువులైన బలిజ కులస్తులు వడగరై సంస్థాన వంశీయులు శ్రీ శ్రీ శ్రీ రామభద్ర నాయనిగారి వంశం. వీరు 72 పాలయాలపైన అధికారి, సర్వ సైన్యాధ్యక్షుడు గ ఉండేవారు. రాజబంధువులైన మరో బలిజ వంశం సముఖం వెంకటకృష్ణప్ప నాయనిగారి వంశీయులు, మరో బలిజ వంశం కాండీ రాజ్యాన్ని ఏలినవారు. మరో బలిజ వంశం తంజావూరును ఏలినవారు, మరో బలిజ వంశం జింజిని పరిపాలించిన వంశం. మరో బలిజ వంశం క్రిష్ణగిరి పరిపాలించిన వంశం. వీరు కాకుండా మాదూరు, ఏరియేడు అని మరో రెండు పాళయాలు బలిజ నాయకుల పాలనలో ఉండేవి. మిగతా బలిజ కులస్తులందరూ రాజ బంధువులుగా సైన్యాధిపతులుగా ఉండేవారు. 200 వంశాలుగా ఉన్న కోటబలిజ కులస్తులు అని చెప్పుకునే బలిజ కులస్తులను తప్పితే మరో కులం వాళ్ళను పెళ్లిళ్లు చేసుకోవడం అనేది లేదు. బలిజ కులం పేరు తప్పితే అప్పటికి మరో కులం పేరు బలిజ కులస్తులకు లేదు