బలిజ శెట్టి పెద్దల దాన శాసనం - శక సంవత్సరం 1223 (క్రీస్తు శకం 1301)
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ తాలూకా, రాజారం గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉన్న శాసనం
శక సంవత్సరం 1223 (క్రీస్తు శకం 1301) లో కాకతీయ ప్రతాప రుద్రదేవ మహారాజు పరిపాలిస్తున్నపుడు,
స్వస్తి సమస్త భువన విఖ్యాత 500 వీర శాసనాలు కలిగినవారు, అనేక గుణ గణాలంకృతులు,సత్య సౌచ చారు చరిత్రులు,నయ వినయ విపుల విజ్ఞాన, వీర బలంజిగ సమయ ధర్మ ప్రతిపాలితులైన
జైత్ర త్రిపురారిశెట్టి,
ఉబ్బేబల్లి బ్రహ్మిశెట్టి,
కారంపూడి గోపిశెట్టి,
పోతమశెట్టి,
గాములపాటి కామిశెట్టి,
పిడుగురాళ్ల పిన మారిశెట్టి,
కామిశెట్టి,
తాడూరి బసవిసెట్టి,
డొంగర సెంపిశెట్టి,
తాడుడబుసి నాగిశెట్టి,
కందిపాటి చెవిశెట్టి,
మొరపనూతుల మురారి,
పెరుమాడి దాశెట్టి,
కొబ్బూరి అనిసెట్టి,
ఇప్పలపల్లి మూడిశెట్టి,
అమరాది బొప్పిశెట్టి,
అనవనిశెట్టి,
గుండుగంటి పురమిశెట్టి,
భూతపురేల చోడయ,
జిడ్డు బోతుమశెట్టి,
రాజపురము గొనిశెట్టి,
వంటి బలిజశెట్టి వ్యాపార ప్రముఖులు అందరూ కలిసి రాజపురం మూలస్థాన శ్రీ మల్నాథ దేవర ముఖమండపం నందు సమావేశమై
శ్రీపర్వత నాధునికి,
శివదేవునికి,
గుప్తమహేశ్వరదేవరకు,
ఏలేశ్వర దేవరకు,
పేరూరి సోమనాధునికి,
పిడుగురాళ్ల త్రిపురాంతక దేవరకు,
రాజపురం మూలస్థాన మల్నాదునికి,
మిండ గోపీనాధునికి,
గణపేశ్వర దేవరకు,
సెల మల్లినాదునికి,
అలువాల గోపీనాధునికి,
గ్రబ్బట చెన్నకేశవ పెరుమాళ్ళుకు,
రాజపురం పురాతులకు,
మైలార దేవరకు,
గణపురం మైలారదేవరకు,
దేసి గంగాదేవికి,
వంటి అనేక ప్రాంతాలలో ఉన్న దేవాలయాల అంగ రంగ వైభోగాలకు పన్నులు దానాలు ఇస్తూ ఈ శాసనం వేయించెను.