అయ్యావళీ వీర బలిజ సమయం అనే గొప్ప నానాదేశాల బలిజ వ్యాపారుల కుటుంబాలకు చెందిన పెనుగొండ లేపాక్షి నంది లక్కిశెట్టి గారి కుమారులు విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇరువరు గొప్ప వ్యక్తులు కృష్ణదేవరాయల, అచ్యుతదేవరాయల ప్రతినిధులుగ లేపాక్షి వైపు ప్రాంతమును ఏలినారు.
ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని క్రీ. శ 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలములో అంతరంగికునిగా కోశాధికారిగా వున్న విరూపణ్ణ నాయకుడు కట్టించాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు తప్పుడు పద్దతిలో చేరవేసారు. ఇతడు రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపడుతున్నాడని తెలియజేసెను. దీంతో విరూపణ్ణ నాయక ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు, ఇందువల్లనే ఆలయ నిర్మాణము మూడింట ఒక వంతు ఆగిపోవడము అంటారు.
విరూపణ్ణ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారములగల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు కాలగర్భమున కలసిపోయనవని అంటారు. ప్రాకారం గోడులు ఎత్తేనవిగా ఉన్నాయ. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనములు మలచారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు అనేకమంది అయ్యావళి బలిజ శెట్టి వ్యాపారాలు చేసిన భూదానము గురిచిన వివరాలు తెలుస్తాయి.
పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తున, పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది.
ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహము ఉంది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడుతారు . వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని ఛూపులు నేరుగా ఊరి మీద పదకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక.లేపాక్షి ఒక మంచి దర్షనీయ ప్రదేశం. అక్కడ కొలువైఉన్న వీరబద్రస్వామి చాలా మహిమ కలవాడు.