డా॥ ముత్యాల గోవిందరాజులునాయుడు(Balija naidu) , సరోజనీనాయుడు(brahmin) దంపతులకు బలిజ కులములో 1900 మే నెల 2వ తేదిన హైద్రాబాద్లో జన్మించారు. విదేశాలలో ఉన్నత విద్యలు అభ్యసించారు. 1921లో నేషనల్ కాంగ్రెసుపార్టీలో చేరారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమైనందు వలన చిన్ననాటి నుండి దేశభక్తి ఆమెకు పుట్టుకతోనే అబ్బింది. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో చేరి 1942లో | జైలుశిక్ష అనుభవించారు. 1942లో హైద్రాబాద్ నగరంలో నైజాం నవాబు విధించిన నిషేధాలను ఎదిరించి గాంధీ జయంతి ఘనంగా నిర్వహించింది. తెలంగాణా భూస్వాముల ఆగడాలను ఎదిరించిన రైతాంగ పోరాటాన్ని గురించి గాంధీగారికి నివేదిక పంపించింది. ఆ జన్మాంతరం బ్రహ్మచారిగానే ఉంది వివాహము చేసుకోలేదు. స్వాతంత్య్రానంతరము పశ్చిమబెంగాల్ గవర్నరుగా 1957 నవంబరు నుండి 1967 జూన్ వరకు పని చేసింది. ఇండియారెడ్ క్రాస్సంస్థలో 1971 నుండి 1972 వరకు డి పని చేశారు. 1950 లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1962 లో పద్మభూషణ్ పురస్కారముతో కేంద్రప్రభుత్వం సత్కరించింది. 1975 మే 2వతేది "ఢిల్లీ" రాజధానిలో స్వర్గస్థులైనారు.
హైద్రాబాద్ నడిఒడ్డున "గోల్డెన్ త్రెషోల్స్" (బంగారు వాకిలి) వారి స్వంత " ఇంటిని 1975 సం॥లో కేంద్ర విశ్వవిద్యాలయమునకు ఇచ్చారు. డార్జిలింగ్ కర పద్మజానాయుడు పేరుతో "హిమాలయన్ జూలాజికల్ పార్కు" ఉంది అది ఆమె చనిపోయిన తర్వాత ఏర్పాటు చేశారు. పద్మజానాయుడు సోదరుడు ముత్యాల జయసూర్య నాయుడు (1901-1964) స్వాతంత్రోద్యమంలో భాగంగా 1921సం॥ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు డా॥ జయసూర్యను -" ముంబయిలోని గ్రాండ్ మెడికల్ కాలేజి నుండి బహిష్కరించారు. 1931 సం||లో ఇరు. వందేమాతరం ఉద్యమం, హైద్రాబాద్ 1943సం॥ లో జరిగిన ఆంధ్రమహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షునిగా డా॥యమ్.జయసూర్యనాయుడు ఎన్నికయినారు. ౦గా సరోజనీ నాయుడు తను వ్రాసిన ఒక కవితలో జయసూర్యను గురించి ఒకచోట "స్వాతంత్ర సూర్యుడు" అని ప్రస్థావించారు.