Fill the form, we are preserving balija surnames and their history.

కార్టూన్ పితామహుడు - తలిశెట్టి రామారావు

FATHER OF TELUGU CARTOON’S
తెలుగులో మొదటి కార్టూనిస్టు తలిశెట్టి రామారావు యొక్క కార్టూన్


తలిశెట్టి రామారావు (1896 - 1947) తొలి తెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు). ఇతని కార్టూన్లు భారతి పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. ఇతన్ని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు.

తలిశెట్టి రామావారు 1896 మే 20న రామానుజమ్మ, సీయయ్య దంపతులకు జయపురంలో జన్మించాడు. గిడుగు రామమూర్తి పంతులు కుమారుడు గిడుగు సీతాపతి వద్ద శిష్యరికం చేశాడు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. జీవనం కోసం తల్లితో కలిసి దర్జీపని చేశాడు. ఆ తరువాత కార్టూన్లు గీయటంలో ఈ వృత్తి లోని అనుభవం కూడా దోహదం చేసింది. ఉన్నత విద్య జయపురంలోనూ, ఆ తరువాత పర్లాకిమిడి, ఆ తరువాత విజయనగరంలో బి.ఏ చదివాడు. ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగిపోయి, ఆ తరువాత జయంపురం రాజా వారి సహాయంతో మద్రాసులో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం పార్వతీపురంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. మద్రాసులో ఉన్నప్పుడే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు భారతి, ఆంధ్రపత్రిక పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కార్టూన్ శకానికి నాంది పలికాడు. కార్టూన్ పితామహుడు - తలిశెట్టి రామారావు.తలిశెట్టి రామారావు (1906 - 1960) తొలి తెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు). ఇతని కార్టూన్లు భారతి పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. ఇతన్ని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు.


ARTICLE IN SAKSHI NEWS PAPER


ARTICLE 2

ARTICLE ON HIS DEATH DAY

GALLERY










Post a Comment

Previous Post Next Post