భారత సంతతి వైద్యుడికి మరో గొప్ప అవకాశం… సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తి తిరిగి నియామకం
Murthy was born in Huddersfield, Yorkshire to immigrants from Karnataka, India. He is the grandson of the late H C Narayana Murthy, the former director of Mysore Sugar Company, and son of Florida-based Dr H N Lakshminarasimha Murthy and Myetraie Murthy. In 1978, the family crossed the Atlantic to Newfoundland, where his father worked as a district medical officer. When he was three years old, the family relocated to Miami and his parents established their medical practice.
Murthy was raised and completed his early education in Miami, graduating as valedictorian from Miami Palmetto Senior High School in 1994. He then attended college at Harvard University and graduated magna cum laude in 1997 with a bachelor of arts in biochemical sciences.In 2003, Murthy earned an MD from Yale School of Medicineand an MBA from Yale School of Management, where he received The Paul & Daisy Soros Fellowships for New Americans. During his time at Yale, Murthy helped start "The Healer's Art" - a four-week long elective in which medical students discuss critical topics such as what it means to serve as a healer, how to cope with losing a patient, and how to prevent physician burnout.This course - available at only Yale and UCSF at the time - is now offered by over 70 medical schools across the United States.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపు కోసం భారతీయ సంతతి వ్యక్తులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే, పలువురు భారతీయ సంతతి వ్యక్తులకు శ్వేతసౌధంలో కీలక పదవులు దక్కుతున్నాయి. భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులను అప్పగించనున్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యాక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుండగా.. ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగాను ఇటీవలే నియమించారు. ఇక, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంతోపాటు కరోనాతో సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా బైడన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం వైట్ హౌస్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ మెంబర్‌గా ఉన్న ఆంథోనీ ఫౌచీతో ఈ కొత్త బృందం మొదటిసారి వచ్చే గురువారం సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యమైన చర్చ జరిగే అవకాశం ఉంది. మహమ్మారిని అరికట్టే బాధ్యతలు స్వీకరించిన కొత్త సభ్యులతో సమగ్ర చర్చలు జరపాలని భావిస్తున్నట్లు ఫౌచీ మీడియాతో వ్యాఖ్యానించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీస్ అండ్ ఇన్ఫక్టియస్ డిసీజెస్ డైరెక్టర్ అయిన ఫౌచీ.. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్‌లో అత్యున్నత స్థాయి సభ్యుడిగా కొనసాగుతున్నారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించే విషయంలో చాలాసార్లు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌తో ఆయన విభేదించారు.
ఒబామా హయాంలో సర్జన్ జనరల్‌గా సేవలందించిన వివేక్ మూర్తి.. తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. దీంతో తాజాగా కోవిడ్-19 రెస్పాన్స్ టీమ్‌లో ఆయనకు బైడెన్ చోటు కల్పించాడు. యూఎస్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే అక్కడ 2,00,000 కొత్త కేసులు నమోదయ్యాయి. చికిత్స కోసం లక్షమంది హాస్పిటళ్లలో చేరుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కొత్త బృందం పనిచేయాల్సి ఉందని బైడెన్ తెలిపారు.