సవరం ఎల్లయ్య
అది 1325, అద్దంకిని రాజధానిగా చేసుకుని ప్రోలయ వేమా రెడ్డి, కొండవీటి రెడ్డి రాజ్యంస్ధాపించాడు.ఇలా కొండవీటి రాజ్యంలోని 7వ పాలకుడైన రాచవేమా రెడ్డి కాలానికి రాజ్యం మొత్తం కుదించిపోయింది, పైగా రాజ్యానికి వచ్చే ఆదాయం సరిపోవట్లేదు, అందువలన విచక్షణారహితంగా పన్నులు వేసాడు. అందులో పురిటి మంచం మీద పన్ను కోటలో ప్రజలు అందరూ వ్యతికరేకించారు, రాచవేమా రెడ్డి క్రూరత్వం పెరిగిపోయింది.
కోట ప్రాంతాల్లో ఉండే సవరం ఎల్లయ్య భార్య గర్భవతి అయ్యింది, రాజ భటులు పన్నులు కట్టమని వేధించారు, పన్ను సంగతి తెలుసుకున్న ఎల్లయ్య కోపంతో రగిలిపోయాడు, సవరం ఎల్లయ్య అనే వాడు వీర బలిజయోధుడు... రాచవేముడు పురిటి సుంకం విధిస్తే ఎల్లమ్మ గుడి వద్ద శెట్టి పెద్దలు పంచాయతి పెట్టారు... వీరబలింజ సమయాలకు రాజు ఏమీ అతీతుడు కాదు... పంచాయితీలో నీవు వేసిన పన్ను అక్రమమని దాన్ని తొలగించాలని రాచవేముడిని కోరారు దానికి రాచవేముడు అంగీకరించలేదు...నీవు పాలకుడిగా వుండడానికి అనర్హుడివి దిగిపో అన్నారు. దానికీ రాచవేముడు అంగీకరించలేదు... మీరందరూ నా ఆజ్ఞను పాటించాలి అన్నాడు...రాజు వర్గానికి వీరబలిజ పెద్దలకు మాటమాట పెరిగింది... ఘర్షణ మొదలైంది...వీరబలిజ యొధులు సైనికుల మెడలను సొరకాయలు తరిగినట్లు తరిగారు...సవరం ఎల్లయ్య రాచవేముడిని కటారితో పొడిచి..... ముత్యాలమ్మ గుడి దగ్గర వధించాడు....దాంతో కొందవీటి రెడ్డిరాజ్యం అంతరించింది...