19 వ శతాబ్దపు అంత్యభాగంలో కాకినాడలో ఉండిన తత్వకర్త ఎడ్ల రామదాసు. బ్రహ్మంగారి తత్వాల తర్వాత ఎడ్ల రామదాసుగారి తత్త్వాలకు బహుళ ప్రచారం ఉన్నది. 119 కీర్తనలతో సంఖ్యతారకామనస్కయోగం బనెడు సుజ్ఞానచంద్రిక' అను గ్రంథమును ఎడ్ల రామదాసుగారు తాను జీవించి ఉండగానే స్వయముగా వ్రాసికొన్న పీఠికతో సహా ముద్రింపించాడు. విజయనగర సంస్థాన సమీపమునగల కలవచర్ల గ్రామంలో ఎడ్ల అచ్చయ్యగారికి మహా లక్ష్మమ్మకూ కుమారుడై జన్మించిన యితడు అక్షరాభ్యాసమైన వెనుక 12 ఏళ్ళ ప్రాయంలో వాస్తవ్యుడైనాడు. అక్కడ మంతెన వెంకటాచార్యులను వేదాంత గురువువద్ద ఉపదేశం పొంది, సాంఖ్య, తారక, అమనస్క రాజయో గాది భావములు బోధశాలియైనాడు. ఇతడు తన పీఠికలో తానే వ్రాసికొన్న ప్రకారం “తాను, విద్యావిహీనుడైనా, సద్గురు కృపను వచో రచనయందును, కవిత్వమందును ఒక ధోరణి కలిగి కొన్ని కీర్తనలను మరికొన్ని తత్వాలను గద్య పద్యాలతో, సకల జనుల కాహ్లాదకరంబగునటుల సులభ శైలిని” రచించాడు.
ఈ సుజ్ఞాన చంద్రికతోపాటు, ఎడ్ల రామదాసుగారి శిష్యులు కొందరు తాము రచించిన తత్త్వాలనుకూడా చేర్చి, ఎడ్ల రామదాసు చరిత్ర అను పేరుతో 3 ప్రకటించారు. అది యిప్పుడు ప్రచారంలో ఉన్నది. ఈ గ్రంథంలో తత్వాలు తరచించిన ఇతర భక్తులు బూచి అప్పలదాసు, చిట్టూరి నారాయణదాసు, విత్తనాల కొండయ్యదాసు, వెంకటదాసు, బోని అప్పలదాసు, బోని గరవయ్యదాసు, మామిడి అప్పలదాసు, కంచుమ రియల్ల యదాసు నాగన్న అనువారు.సుజ్ఞాన చంద్రికను ఎడ్ల రామదాసు తన జీవిత చరిత్రంగానే రచించాడు" హరికథా కథన ధోరణిలోని తొహరాలతో ఉత్తమ పురుషైకవచనంలో ఆత్మకథా కథన పద్ధతిని చొప్పించినాడు.