Fill the form, we are preserving balija surnames and their history.

Kamisetty - yanam political family

KAMISETTY FAMILY TREE

POLITICAL HISTORY

1880 లో ఫ్రెంచి ప్రభుత్వం డిక్రీ ద్వారా స్థానిక పరిపాలన కొరకు మున్సిపాలిటీలను ఏర్పాటుచేసింది. ఆ విధంగా 1880 మార్చి, 12 న యానాం మున్సిపాలిటి పన్నెండు వార్డులతో ఏర్పడింది. 1880 - మార్చి లో జరిగిన యానాం ప్రథమ మున్సిపల్ ఎన్నికలలో బెజవాడ బాపనయ్యనాయుడు విజయ ఢంకా మోగించారు.

బెజవాడ బాపనయ్యనాయుడు అశేషప్రజల అభిమానం చూరగొన్నప్పటికీ, ఆయనకు 25 సంవత్సరములు నిండని కారణంగా మేయర్ పదవికి అనర్హుడంటూ ప్రత్యర్థులైన కామిశెట్టి పేరమనాయుడు చేసిన అభియోగాలు ఋజువు కావటంతో ఆయన ఎన్నిక చెల్లదంటూ యానాం కోర్టు తీర్పుచెప్పింది.యానాంలో మరలా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.1881 నుంచి కామిశెట్టి పేరమనాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వీరి కుమార్డు కామిశెట్టి వేణుగోపాలరావునాయుడు 1922 ఎలక్షన్లలో స్థానిక మండలి మెంబరుగా ఎన్నికయ్యారు.1931 - లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు మేయర్ పదవిని దక్కించుకొన్నారు 1940 గోపాల్ రావు నాయుడు గారే మేయర్ గా చేసారు.

శ్రీశ్రీ కామిశెట్టి పరశురామవరప్రసాదరావు నాయుడు గారు శ్రీకామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు, కమలాలయ దంపతుల కుమారుడు శ్రీ కామిశెట్టిపరసురామ వరప్రసాదరావు నాయుడు గారు అక్టోబరు 2వ తేది 1921లో యానాం గ్రామంలో జన్మించినారు. ఆయన విద్యార్హత కాలేజీ ఫ్రాన్సెయ్, పుదుచ్చేరిలో ఫ్రెంచ్ బ్రెవెత్ చదివినారు, శ్రీ కామిశెట్టి పరశురామవరప్రసాదరావునాయుడు గారికి శ్రీమతి సావిత్రి గారితో వివాహం జరిగినది. వారికి ఒక కుమారుడు, ఇరువురు కుమార్తెలు జన్మించినారు. ఈయన 1943 సంవత్సరంలో రాజకీయ ప్రవేశం చేసినారు. 1946లో యానాం మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నుకోబడినారు. 1947 మరియు 1948 సంవత్సరంలలో యానాం మున్సిపల్ మేయరుగా ఎన్నుకోబడినారు. 1948వ సంవత్సరం "ఫ్రెంచ్ కలోనియల్” పరిపాలన నుండి విముక్తి కొరకు పోరాటం సాగించినారు. 1946 నుండి 1954 వరకు ఫ్రెంచి వారి నుండి యానాం విముక్తిపొందే సమయంలో అడ్మినిస్ట్రేటీవ్ కౌన్సిల్లో ఒక మెంబరుగా పనిచేసినారు. 1963వ సంవత్సరం. నుండి 1989 వరకు యానాం శాసన సభ్యులుగా పనిచేసినారు. 1963 నుండి1964 వరకు మరియు 1972 నుండి 1974 వరకు పాండిచ్చేరి అసెంబ్లీ ఉపసభాపతిగా బాధ్యతలు నిర్వర్తించినారు. 1985 నుండి 1989వ సంవత్సరం వరకు పాండిచ్చేరి అసెంబ్లీ సభాపతి (స్పీకర్)గా బాధ్యతలు నిర్వర్తిస్తూ 1989 జనవరి 19న పరమపదించారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడుగా, వివాద రహితుడుగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.



యానాం అసెంబ్లీకి ఇప్పటి వరకూ 15 సార్లు ఎన్నికలు జరిగాయి.మొదట ఏడు దఫాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడికే ఇక్కడ విజయం దక్కడం విశేషం.1963లో ఆయన భార్య కామిశెట్టి సావిత్రి కూడా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.


kamisetty savithri ( wife of k.prashurama vara prasadaRao Naidu )




GALLERY

Post a Comment

Previous Post Next Post