'మంగమ్మగారి మనవడు', 'ఆగ్రహం', 'ఆహుతి', 'శత్రువు', 'అమ్మోరు', 'ముద్దుల మావయ్య', 'మా ఆవిడ కలెక్టర్', 'పెళ్లి', 'దొంగాట', 'అంజి', 'దేవీపుత్రుడు', 'దేవి', 'దేవుళ్లు' 'అరుంధతి' గుర్తింపు పొందిన ఆయన చిత్రాల్లో కొన్ని.
నటులు అర్జున్, భానుచందర్, సుమన్, జీవితలను ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2012లో ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.
ఆయన దర్శకతం వహించిన చివరి చిత్రం నాగహరువు. దీన్ని 2016లో కన్నడంలో తీశారు.1984లో వచ్చిన మంగమ్మ గారి మనవడు సినిమాతో చరిత్ర సృష్టించాడు కోడి రామకృష్ణ.
అదే ఆయన సంతకం
కోడి రామకృష్ణ సెట్లోకి వస్తే తలకు రుమాలు కట్టుకునే వాడు. అది ఆయన ట్రేడ్‌మార్క్‌గా స్థిరపడిపోయింది. ’’తలకు తెల్లటి బ్యాండు కట్టుకోవడం నాకు సెంటిమెంట్’’ అని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
నటుడిగానూ ఆయన రాణించారు. 'దొంగాట', 'ఆస్తి మూరెడు ఆశ బారెడు', 'అత్తగారూ స్వాగతం', 'ఇంటి దొంగ', 'మూడిళ్ల ముచ్చట' చిత్రాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను అలరించారు.
తన సినిమాల్లో సెంటిమెంట్‌ను బాగా పండిస్తారని పేరు తెచ్చుకున్న కోడి రామకృష్ణ చాలా కాలం గ్యాప్ తర్వాత భక్తి, గ్రాఫిక్స్‌ను మేళవిస్తూ అమ్మోరు చిత్రంతో కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఆ తర్వాత అదే పంథాలో వచ్చిన దేవి, అరుంధతి చిత్రాలు ఆయనకు మరింత గుర్తింపును తీసుకొచ్చాయి.
దర్శకుడు దాసరి నారాయణరావుతో కోడి రామకృష్ణ