శ్రీ కందుల వీర రాఘవ స్వామి నాయుడు త్యాగశీలి నిష్కళంక దేశ భక్తుడు శ్రీ కందుల వీరరాఘవస్వామ నాయుడు 1907 లో బారిష్టరీ చదవడానికి లండన్ వెళ్లారు. అక్కడ ప్రముఖ విప్లవకారుడు వీరవినాయక సావర్కార్, తదితర విప్లవకారులతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి భారతదేశ విముక్తికి గాంధీజీ అహింసా సిద్ధాంతమే శరణ్యమని నమ్మి కాంగ్రెస్లో చేరి అన్ని వుద్యమాలలోనూ అగ్రగామిగా నిలబడి జైళ్లపాలై బ్రిటీష్ వారి నెదిరించారు. పెద్దాపురంలో జరిగిన లాఠీ చార్జిలో తీవ్రంగా గాయపడ్డారు. రాజమండ్రిమునిసిపాలిటీకి మూడు సార్లు చైర్మన్ గా ఎన్నికైనారు. శ్రీ బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి వచ్చినపుడు శ్రీ నాయుడు మునిసిపాలిటీ తరఫున పౌర సన్మానం చేసి గౌరవించారు. తన 1 ఆస్తిలో చాలా భాగాన్ని కాంగ్రెస్కు చెందాలని వీలు నామా రాశారు. 1945 లో కీర్తి శేషులైనారు. ఈనాడు నల్లమందు సందుగా పిలువబడేరోడ్డుకి కె.వి.ఆర్.స్వామి నాయుడు రోడ్డు అని వారి పేరు పెట్టి ప్రజలు గౌరవించారు.
1908లో శ్రీ కందుల వీర రాఘవస్వామినాయుడు, శ్రీ మామిడిదేవేంద్రుడూ అన్నయువకులు రాజమండ్రినుండి ఇంగ్లండ్ చదువుల నిమిత్తం వెళ్లారు. అక్కడ ఇండియా సోసైటి అనే విప్లవసంఘ కార్యాలయంలో మకాం పెట్టారు. అక్కడ వినాయక సావర్కార్ తదితర విప్లవవీరులతో సంబంధాలు పెట్టుకున్నారు.
రాజముండ్రి మునిసిపల్ బిల్డింగ్ మీద భారతదేశపు జాతీయ జండా ఎగురవేసిన మొట్ట మొదటి వ్యక్తి.
4 ఏప్రిల్ 1921 న గాంధీగారు రాజమండ్రి విచ్చేసినప్పుడు అక్కడ జరిగిన సభలో బారిష్టర్ kvr స్వామి నాయుడు గారు అతని న్యాయవాది వృత్తిని వదులుకొని దేశం కోసం పోరాడిన గొప్ప త్యాగి , ధైర్యశాలి.